నేనూ మీ అందరిలా ఈ సృష్టికి కేంద్ర బిందువుని నేనే అన్న భ్రమతో, అహం తో బ్రతికిన వాడినే. గత జన్మలోని సాధన ఫలితంగా ఈ జన్మలో నాకు అందిన సూచనలను అందుకుని పాటించిన ఫలితంగా మరణానికి ఏక్షణమైనా కరచాలనం చేసే స్థితికి ఎదిగాను.అవును మరణాన్ని ఎదుర్కోవడానికి నేర్చుకోవడమే జీవిత ధ్యేయమై ఉండాలి. ఎంత బతుకు బతికినా చావడం ఖాయం. మరి ఆ చావును ఎదుర్కొనే సత్తా లేక ఏం బతికినా ఏముంటుంది గర్వకారణం?
మనమందరం ఎప్పుడో ఏదో రూపంలో కలిసే ఉన్నాం. ఒక మహా విశ్ఫోటం కారణంగా చెదిరిపోయాం. మళ్ళి కలవాలని తపిస్తున్నాం. ఆ కలయకకు మన శరీరాలే అడ్డమని అపోహ పడుతున్నాం. శారీరికంగా కలావాలని ప్రయత్నిస్తాం అసే సెక్స్. లేదా మన శరీరాలను వదిలించుకోవడానికి హత్యలు,ఆత్మ హత్యలకు పాల్పదుతున్నం. ఒక్కసారిగా హత్య,ఆత్మ హత్య దైర్యం చాలనివారం వాయిదాల్లో ప్రయత్నిస్తున్నాం. లేదా చావడానికి/చంపడానికి ప్రత్యామ్నాయాలు వెతుకుంటున్నాం. అవే డబ్బు,సెక్స్,అధికారం,కీర్తికాంక్ష. ఇంతకీ మనం కలవడానికి అడ్డం ఈ శరీరాలు కావు. మన అహమే, మన స్వార్థమే. అహాన్ని త్యజిస్తాం,. స్వార్థం వీడూఅం. మనమందరం ఒక్క తల్లి బిడ్డలమే . కలిసి ఉంటే కలదు సుఖము. కలిసి వచ్చును అద్రుష్ఠము