క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label Yoga. Show all posts
Showing posts with label Yoga. Show all posts

Monday, 4 January 2010

మీలో ఉన్నది ఒకె శక్తి

నేనో మంచి వక్తనని అందరూ కొనియాడుతున్నారు
నా రచనా సమార్థ్యాన్ని పలువ్రురు రచయితలే మెచ్చారు
అయినా ఏం లాభం?

నేను చెప్ప దలచిన విషయాన్ని
ఈ సామాజంలో పేరుకు పోయిన
విషానికి విరుగుడుగా నేను కనుగొన్న కటిక సత్యాన్ని
ఎన్ని వేల పంక్తులు వ్రాసినా
పంచ లేక పోతున్నాను

అందుకు కావల్సిన శిల్పాన్ని ఎన్నుకోలేక పోతున్నాను
పుట్టుకతో వృద్దులై ఉన్న యువతరానికి కాయకల్పంలా
ఉపయోగ పడగల సత్యాన్ని అందించ లేక పోతున్నాను

నా మనస్సు ఈ  నా సమకాలీనులను క్యేనిబల్స్ గా ( నరమాంశ బక్షకులుగా ) చూస్తుంది
వీరిని మరల మానవులుగా మలచాలంటే నేను ముందుగా క్యేనిబల్గా మారాలి
అప్పుడే వీరికి నా బాష అర్థం అవుతుంది

వీరికి అర్థమయ్యే బాషలు రెండే ఒకటి హింస రెండు డబ్బు

వీరు మానవత్వాన్ని చంపి తమలోని సృజణాత్మకతను చంపి
నాలుగు రాళ్ళు ప్రోగేసుకుని తల బిరుసుతో ఉన్నారు
వీరి తల దన్ని తలకెక్కిన వీరి అహంకారాన్ని దించాలంటే
వీరితో నేను దురుసుగానే ప్రవర్తించాలి
ఒరేయి !
మీరు ఎక్కడనుండి వచ్చారో
నేనూ అక్కడనుండే వచ్చాను
మీరు అక్కడితో అనుసంధానాన్ని పూర్తిగా కోల్పోయేరు
నేనూ మీలా కొంత కాలం మీలా రెచ్చి పోయినా
 పునరావృతం చేసుకో కలిగాను ఆ అనుసంథానాన్ని
అక్కడి అనుసంథానానికి మీ శరీరాలే ఆడ్డని అపోహ పడ్డారు
దానిని రాల్చడానికి చంపడం లేదా చావడాన్నే మార్గాలుగా ఎన్నుకున్నారు
ఆరణ్యము వదలి ఈ జనారణ్యంలోకి రావడముతో మరణం దూరమైంది
హత్య నేరమైంది
దీంతో మీరు వీర్య స్కలన సమయాన కలిగే
బ్లాక్ అవుట్ అనే బుల్లి మరణముతో సంతృప్తి చెందడం
మొదలు పెట్టారు
సభ్య్తత ,సంస్కారం పేరుతో సెక్సును దాదాపుగా
నిషేదించుకున్నారు
దీంతో సెక్సులో కొత్త కొత్త ప్రయోగాలకు దిగవలసిన వయస్సులో
హస్త ప్రయోగానికే పరిమితమయ్యేరు
యవ్వనమంతా కరిగి పోయాక
సెక్సువల్ అర్జి మీ మర్మాంగముండి
తలకెక్కింది
కార్యాచరణ అసాధ్యం కావడంతో సెక్సుకు ప్రత్యామ్నాయం వెతికారు అదే డబ్బు
దీంతో డబ్బు జబ్బుకు గురయ్యేరు
డబ్బుతో యోణికి ,పురుషాంగానికి పని కల్పించే  వీలు లేక
వాటికి దగ్గరగా ఉన్న ఆసన ద్వారాలక్ అదే గొట్టానికి
ముఖద్వారమైన నోటికి కల్పిస్తూ చచ్చి పోతున్నారు
సాటి మనుషులను చంపేస్తున్నారు
ఎక్కడనుండే  వచ్చారో అక్కడితో అనుసంథానం కావడానికి
అడ్డం మీ శరీరాలు కావని
మీ అహం ఒక్కటే అందుకు అడ్డని ఎలా నిరూపించగలను
మీరు జననము నుండి నోటికి,మల ద్వారానికి ఎంతగా పని కల్పించినా సెక్సువల్ ఆర్గాజం (భావ ప్రాప్తి) కలగదని ఎలా వివరించను
మీలో ఉన్నది ఒకె శక్తి అని
అది ఊర్ద్వ ముఖంగా పయణిస్తే యోగమని
అధోముఖంగా పయణిస్త్తే కేవలం బుల్లి మరణాన్ని ఇస్తుందని మీకెలా విశదీకరించను
ఈ ప్రపంచ ప్రజలెల్లరు
సచ్చితానంద స్వరూపుడైన ఆ పరమాత్ముని సంతానాలని ప్రతి ఒక్కరు
భాల్యం,యవ్వనం మరియు వృద్యాప్యాల్లో సైతం ఆనందాన్ని పొందగలరని
ఎలా గుర్తు చెయ్యగలను