క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday 2 September 2012

వై.ఎస్ వర్దంతి సభ :మనసు విప్పిన సి.కె









ఈ రోజు డా.వై.ఎస్ వర్దంతి సభలో చిత్తూరు ఎం.ఎల్.ఏ సి.కె బాబు మనసు విప్పి మాట్లాడారు. సి.కె అంటేనే సంచలనం. వై.ఎస్ మరణానంతరం చిత్తూరులో జరిగిన రెండు వర్దంతి సభల్లోను పాల్గొనక రాజదానికే పరిమితమైన సి.కె ఈ రోజు 3 వ వర్దంతి సభలో మాత్రం పాల్గొనడం విశేషం.

మరీ శనివారమే విజయమ్మ -జగన్ ఫ్లెక్సిలు ఏర్పాటు చేసిన వాహనంలో సి.కె అభిమానులు ఊరంతా తిరిగి వర్దంతి సభను జయప్రదం చెయ్యాలని ప్రజలకు విజ్నప్తి చెయ్యడం పెద్ద సంచలనం సృష్ఠించింది.

దీంతో సి.కె ఇడుపులపాయ భయలు దేరుతున్నారని - విజయమ్మ సమక్షంలో జగన్ పార్టి తీర్థం పుచ్చుకుంటారని పుకార్లు షికార్లు చేసాయి.

స్థానిక కట్టమంచిలో స్వయంగా సి.కె నిర్మించిన షిర్డి సాయి మందిరం వద్దనుండి ర్యేలి బయలు దేరింది. సె.కె స్వయాన ఎన్ఫీల్ద్ బుల్లెట్ పై ర్యాలిలో పాల్గొనడం విశేషం.

రెడ్డిగుంట చెక్ పోస్టు కూడలిలో ఇది వరకే తాము ( సి.కె ) ఏర్పాటు చేసిన డా.వై.ఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సి.కె మైకు చేత పట్టి తమ ప్రసంగం మొదలు పెట్టారు.

డా.వై.ఎస్ తో తమకున్న ఆత్మీయతను ప్రజలతో పంచుకున్నారు. తమకు అక్కా చెల్లెళ్ళు -భంధువులంటూ ఎవరూ లేరని -ఉన్నవారంతా దూరమయ్యారని ప్రజలే తమ భంధువులన్నారు.
వై.ఎస్ ప్రజలకు చేసిన మంచి పనులను అందరూ చెప్పుకోవాలన్నారు.పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వై.ఎస్ను స్మరించుకోవాలన్నారు.వై.ఎస్. కుటుంబానికి బాసటగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు

ఎందరు ముఖ్యమంత్రులొచ్చినా ఎవరూ చిత్తూరును పట్టించుకున్న పాపాన పోలేదని ఒక్క వై.ఎస్ ఆర్ చొరవతోనే చిత్తూరు జిల్లా అభివృద్ది చెందిందన్నారు

ఇక వర్దంతి సభ ఏర్పాటు తమ వ్యక్తిగతమని . తనను ఎవరూ నియంత్రించలేరని -తమ చిటికిన వ్రేలును సైతం కదిలించలేరన్నారు.

ఈ కార్యక్రమాల్లో ఎంతో చొరవ చూపుతూ చక్రం తిప్పిన సి.కె సతీమణి లావణ్య డాక్టరేట్ కోసం వై.ఎస్.పరిపాలన పై రిసెర్చ్ చేస్తున్నారన్నది కొసమెరపు.


5 comments:

  1. Andhra jyothi RK ante sanchalanam, uchcha...uchcha poyaalsinde evadainaa

    ReplyDelete
  2. vaallatho kalisi vooranthaa thirigithe, biryani potlam, saaraa packet gittubaatu ayinattundi neeku. aa effect nee raatha lo kanabaduthondi.

    ReplyDelete
  3. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో కొనసాగి ఉంటే తాను కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణల వలె జైలులో ఉండి ఉండేవాడినని మాజీ మంత్రి మాగంటి బాబు ఆదివారం అన్నారు.
    మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పిన పనులన్నీ చేసి ఉంటే చంచల్‌గూడ జైలులో చిప్పకూడు తినవలసి వచ్చేదని అన్నారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్థనపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ప్రస్తుతం విపత్కర పరిస్థితులు ఎదుర్కోనడానికి కారణం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతి కుంభకోణాలేనని ఆరోపించారు.
    అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి మంత్రులను పావులుగా వాడుకున్నారని విమర్శించారు.

    ReplyDelete
  4. This is Siva . You said that JAGAN will release by or on SEP05. what happend to it ? any update ? Jaataka chakram vesi mari cheppavuga .. pedda jaatakaalu cheptadanta .. idena meeru cheppe jaatakam ..

    ReplyDelete
  5. CK Babu thama party loki raavadam jagan party loni konthamandiki ishtam leka addupulla vesthunnaaranta..., nijamenaa...?

    ReplyDelete