క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label Chandrababu. Show all posts
Showing posts with label Chandrababu. Show all posts

Sunday, 22 October 2017

ఎకానమి పేకేజి

భారత దేశంలోని రాష్ఠ్ర ప్రభుత్వాలు -ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల పై భారం మోపక అర్థికంగా పుంజుకోవడానికి నేను కూర్చిన మార్గాలను ఎకానమి పేకేజ్ పేరిట చంద్రబాబాకు పంపుతూనే ఉన్నా స్పందనైతే లేదు.

1.ప్రభుత్వ ఉద్యోగులు అందరు అనర్హులు కారు . అందుకని ప్రతి ఒక్కరు అర్హులు కూడ కారు .అందుకే గత 10 సం.ల్లో రాజకీయ -ఆర్థిక-సామాజిక -విద్యా రంగాల్లో ఇటీవల చోటు చేసుకున్న మార్పుల పై వీరికి ఒక వ్రాత పరీక్ష నిర్వహించాలి .అలానే మెడికల్ ఫిట్నెస్ పరీక్ష జరపాలి. ముఖ్యంగా ప్రపంచీకరణ -ప్రైవేటి కరణ కారణంగా మారుతున్న ప్రభుత్వ పాత్రను -వారికి నూరి పొయ్యాలి. వారి జీత బత్యాలు ఖజాణా నుండి రావని – వారు చొరవ తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం రాబట్టాలన్న సంగతిని వారికి అర్థమయ్యేలా చేసి -ప్రజలతో ఎలా మొసలుకోవాలో నేర్పే సైకో మెట్రి కౌన్సిలింగ్ ఇచ్చి -దాని పై కూడ ఒక పరీక్ష నిర్వహించాలి .ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారే కొన సాగించ బడాలి .తప్పిన వారికి గోల్డెన్ షేక్ హ్యేండ్ ఇవ్వాలి .
వీరి వారసుల్లో అర్హులైన వారుంటే వారికి అవకాశం కల్పించ వచ్చు (అయితే పై తెలిపిన అన్ని పరీక్షల్లోను ఉత్తీర్ణులైతే)
2.అయితే పై తెలిపిన పాయింట్ పై జీ.ఓ విడుదల కాగానే ప్రభుత్వ ఉధ్యోగులంతా సమ్మెలో దిగే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే ప్రస్తుత ఖాళీలు – సమ్మె కాలంలో అత్యవసర సర్వీసులుకు అవసరమైన ఉధ్యోగాలను “టెండర్” పద్దతిలో పూరించి సిద్దంగా ఉండాలి .
3.ఇటీవల చదువులు పూర్తి చేసి ( ఈ కాల పరిమితి 2 ఏళ్ళకు మీంచకూడదు ) నిరుధ్యోగులుగా ఉన్న యువతను కన్సాలిడేటడ్ పే క్రింద అబ్జర్వర్లుగా అప్పాయింట్ చేసుకోవాలి . వీరిని జంబ్లింగ్ పద్దతిలో ప్రభుత్వ కార్యాలయలాను /వాటి పని తీరు / ప్రజల ఇబ్బందులను అబ్జర్వ్ చేసి రిపోర్ట్ ఇచ్చే విదంగా వినియోగించాలి. ఈ ఉధ్యోగ కాల పరిమితి 11 నెలలకు మించ రాదు .
4.ప్రజల్లో 18 నుండి 35 వయస్సులోపు అవివాహితులుగా ఉన్న ప్రతి ఒక్కరికి పోలీస్ ట్రెయినింగ్ ఇప్పించాలి .(డైవర్సీలు /విడోయర్లు కూడ అర్హులే). వీరిని స్టాండ్ బైలో పెట్టి అవసరమైన చోట /అవసరమైన సమయంలో వాడుకోవాలి .
5. సర్వేల పేరుతో ప్రభుత్వ దనాన్ని వెచ్చించడం అనవసరం. నిర్ణీత ఫార్మెట్లో ప్రజలే స్వచ్చందంగా తమ వివరాలను అందించే విదంగా చెయ్యొచ్చు .
ఆన్లైన్ అయితే బెస్ట్ . అయితే తాము తెలిపిన వివరాలన్ని సరైనవి అని నిర్ధారిస్తూ అఫిడవిట్ జతపరచేలా చూడాలి.
తప్పుడు సమాచారమిచ్చిన వారిని శిక్షిస్తామని విరివిగా ప్రచారం చెయ్యాలి. ఆతరువాత
రేండంగా క్రాస్ చెక్ చేసి తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని శిక్షించవచ్చు
6.ప్రభుత్వ ప్రకటనలు (యాడ్స్) ప్రభుత్వ పత్రికలోనే (ఆంద్రప్రదేశ్?) ప్రచురితం కావాలి .ముందుగా సతరు పత్రికను “దిన పత్రికగా అప్డేట్ చేయాలి . సతరు పత్రికకు ప్రముఖ పాత్రికేయులు ఒక్కొక్కరు ఒక్కో దినం ఎడిటర్ షిప్ వహించేలా చెయ్యాలి.
7.ప్రభుత్వ భవనాలను టైం షేర్ పద్దతిలోకి మార్చాలి . ప్రైవేటు సంస్థలు సైతం తగిన బాడుగలు/అడ్వాన్సులు /బ్యాంక్ గ్యారంటితో వాడుకునేలా చూడాలి
8.అంతకు ముందుగా సతరు భవనాలను తగిన గాలి వెలుతురు వచ్చేలా రీ మోడల్ చెయ్యాలి ( విద్యుత్ వినియోగం తగ్గడానికి) తామే ముందుకొచ్చి రీ మోడల్ చేసుకునే ప్రైవేటు సంస్థలకు ప్రాధన్యత ఇవ్వాలి.
9.ఇంతటితో ఆగక సతరు భవంతుల నుండి అదనపు ఆదాయం రాబట్ట డానికి అవసరమైన చర్యలు చేపట్టాలి . షాపింగ్ కాంప్లెక్స్ ,పవన విద్యుత్, బయోగ్యాస్,ఫలవంతమైన చెట్లు నాటడం,
10.కాలం చెల్లిన భవనాలైతే కూల దోసి కొంత భవంతులు కట్టుకుని -అందులో తమ కార్యకలాపాలను టైం షేర్ పద్దతిలో నడుపుకోవడానికి ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలను ఐడెంటి ఫై చేసి అవకాశం ఇవ్వాలి .
11.ముఖ్యంగా ప్రభుత్వ రవాణా సంస్థకు స్వంతమైన బస్ స్టాండులను గ్రౌండ్ ఫ్లోర్లో బస్ స్టాండు – ఫర్స్ట్ ఫ్లోర్లో షాపింగ్ కాంప్లెక్స్ కలిగి ఉండేలా నిర్మించే ప్రైవేటు సంస్థలకు అవకాశం ఇవ్వొచ్చు
12.వారానికి ఒక దినాన్ని కాలుష్య వ్యతిరేక దినంగా ప్రకటించి ఆ రోజున రైళ్ళు /బస్సులు/అత్యవసర సర్వీసులను మినహాయించి ఫోర్ /టూ వీలర్స్ లను నిషేదించవచ్చు .సైకిళ్ పై ట్యాక్స్ మినహాయింపు .యాబై శాతం రాయితీ
13.పోలీసు శాఖ సహా అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రజలు ఇచ్చే వినతులను 10 రూ.బాండ్ పేపర్లోనే ఇవ్వాలని రూల్ పెట్టొచ్చు. అయితే 15 రోజుల్లోపు చర్యలు తీసుకుని తీరాలి . (తప్పుడు వినతి/ఫిర్యాదు చేసిన వారికి రూ.500 దాక అపరాధం విధించవచ్చు .
14.పాంచాయితీ నుండి శాసన సభ మీటింగ్ హాలు దాక పని లేని రోజుల్లో ప్రైవేటు వారికి అద్దెకు ఇవ్వొచ్చు
15.స్వంత వాహణం మరీ ఫోర్ వీలర్ కలిగి ఉండడం పెళ్ళి మార్కెట్ నుండి సమాజంలో ఒక గౌరవ చిహ్నంగా మారింది. ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థను ప్రపంచ స్థాయిలోకి మార్చ కలిగితే స్వంత వాహణం కలిగి ఉండడం అన్నది “ఎకానమి” తెలియని తనంగా మారుతుంది.
అయితే ఈ పనికి కావల్సిన నిదులు ఎల సమకూర్చగలమని ప్రశ్నిస్తారు . సంస్థ ఉధ్యోగులు /పూర్వోద్యూగులు ,ప్రయాణికులు సభ్యులుగా ఒక కో ఆపరేటివ్ సొసైటి ఫార్మ్ చేసి ప్రతి సభ్యుడు కొంత సొమ్మును అందులో డిపాజిట్ చేసేలా చెయ్యాలి. ఆ సొసైటి రవాణా సంస్థకు అప్పు ఇచ్చేలా చోడొచ్చు . దీంతో “సంస్థ” నాది అనే భావన కలుగుతుంది.తప్పులు దొర్లినప్పుడు ప్రతి ఒక్కరు చొరవ చూపి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు.
16.ప్రభుత్వ వాహణాలను గ్లోబల్ టెండర్ పిలిచి అమ్మి వెయ్యాలి . గ్లోబల్ టెండర్ ద్వారా కి.మీ కి ఇంత అని కుదుర్చుకోవచ్చు .
17.రోజుకి 24 గంటలు అలర్టుగా ఉండవలసిన శాఖలు తప్ప ప్రతి కార్యాలయం ఉ.6.30 నుండి మద్యాహ్నం 2 దాక వాస్తవంగా పని చేస్తే చాలు .( అయితే ఏ ఉధ్యోగి తన సీటు నుండి కదిలే ప్రసక్తి ఉండ కూడదు) ప్రతి కార్యాలయంలోను సిసి టివి కేమరాలు అమర్చి -పౌరులు ఏ ఒక్కరైనా చూసేలా నెట్ కాస్టింగ్ చెయ్యాలి.
18.శాస్త్ర ప్రకారం ఆస్తుల విక్రయం -కొనుగోలు చేయ కూడని నెలల్లో జరిగే రెజిస్ట్రేషన్ల పై తగిన రాయితీ
19.బిల్డర్స్ తమ టర్నోవర్లో కనీశం 10 శాతమైనా పేదప్రజలకు పనికొచ్చే ఇళ్ళు /షాపింగ్ కాంప్లెక్సులు నిర్మించేలా చూడొచ్చు .
20.ముస్లీమ్లు ఏ ఊరికి వెళ్ళినా అక్కడి మసీదులో బస చేసే వీలుంటుంది. ఆ విదంగా ఏ ప్రభుత్వ ఉధ్యోగి అయినా ఏ ఊరికి వెళ్ళినా (ప్రభుత్వ కార్యార్థం) ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయంలోనైనా (మాత్రమే) బస చేసే ఏర్పాటు.
21.దినపత్రికల్లో సగం పేజికన్నా ఎక్కువ యాడ్లు ఇచ్చే సంస్థలకు /వ్యక్తులకు ప్రత్యేక పన్ను
22. ఇళ్ళను అద్దెకు ఇచ్చే వారు స్వీకరించే అడ్వాన్సు పైకం ప్రభుత్వ పొదుపు పత్రంగా మాత్రమే ఉండాలి .
23.లైసెన్సులు /సర్టిఫికేట్ల జారిలో అర్జెంట్ /ఆర్డినరి అంటూ కేటగిరిస్ పెట్టాలి .అర్జెంట్ కేటగిరి వారికి అదనపు రుసుము వర్తింప చెయ్యాలి .
24.కాలుష్యాన్ని వెదజల్లే సంస్థలకు -ఆ కాలుష్యాన్ని బ్యేలెన్స్ చెయ్యడానికి ఎన్ని చెట్లు నాటాలో -అందుకు ఎంత మెరకు ఖర్చవుతుందో లెక్కించి వసూలు చెయ్యాలి (శాస్వత పరిష్కారం అమలయ్యేదాక)
25.అవివాహితులు ,డివోర్సీలు ,విడోయర్లు ,దంపత్య జీవితానికి అనర్హులుగా ఉన్న జీవిత భాగస్వామి కలిగిన వారిని ఐడెంటి ఫై చేసి వీరు తమ ఖాళి సమయాల్లో కలిసి సంఘ సేవ చేసేలా ప్లాన్ రూపొందించాలి .
26.ప్రతి చిన్న ఊరికి ఒక కమ్యూనిటి హాల్ -బాడుగ + విద్యుత్ చార్జీలు రూ .1000 కి మించ రాదు .మెయింటెనెన్స్ ఆయా ప్రాంతాల డ్వాక్రా గ్రూపులకు ఇవ్వాలి .
27.కలిసి జీవించ కోరేవారికి తాత్కాలిక రెజిస్ట్రేషన్
28.వంద మందికి మించి భోజనం చేసే మెస్/హోటల్ /కళ్యాణ మండపాలు /కాలేజ్ హాస్టల్సులో బయో గ్యాస్ యూనిట్ తప్పని సరి .
29.వాణిజ్య పన్నుల వసూలును ఆయా ప్రాంతాల వ్యాపారుల సంఘాలకు అప్ప గించాలి. (సంఘం బ్యాంక్ గ్యారంటి ఇవ్వాలి ) గతంలోని వసూలుకంటే కనీశం 25% అదనంగా టార్గెట్ పెట్టాలి .ఐదేళ్ళకు ఒక సారి రెనీవల్ చేసుకోవచ్చు.
30.రోగ నివారణ,రోగ నియంత్రణ, చికిత్స, నేరాల నివారణ/అదుపు, మానవ సంభంధాలు ,లైంగిక జీవితం, గర్బ నివారణ వంటి విషయాలను ఆసక్తి కరంగా చిత్రీకరించే షార్ట్ ఫిలింస్ పోటీలను ప్రతి సం. నిర్వహించాలి .వీటిని లోకల్ కేబుళ్ళు /సినిమా హాళ్ళు తప్పక ప్రదర్శించేలా చూడాలి ( ఇంటర్నెట్లో పెట్టడం అనివార్యం)
44.ప్రభుత్వ ఉధ్యోగులకు యూనిఫార్మ్ ,(సాంప్రదాయిక /చేనేత వస్త్రాలు ) ఆఫీసుల్లో ఏ గదికి /చాంబరుకి చక్క తలుపులు ఉండకూడదు .ఒన్లి గ్లాస్ డోర్స్.
45.సెక్స్ వర్కర్స్ కి తగిన కౌన్సిలింగ్ ( లైంగిక వ్యాదులు /వ్యాధి నివారణల పై) ఇచ్చి వర్క్ పర్మిట్
46.ముఖ్యంగా పౌరులు జీవనోపాది -తద్వారా తగినంత నెలసరి ఆదాయం పొందేలా చూడాలి . ఇందుకు గాను రాష్ఠ్ర వ్యాప్తంగా మేన్ పవర్ డేటా బ్యాంక్ ఏర్పాటు చేసి -కొంత రుసుము చెల్లిస్తే అందుబాటులో వచ్చేలా చెయ్యాలి .గ్రామ ఉపాది పథకం లాగా నగర ఉపాది పథకం అమలు చెయ్యాలి . ఉధ్యోగ అవకాశం ఉన్న రంగాల్లో అర్హులైన వారు తగు శిక్షణ పొందేలా విరివిగా -నిరంతర ప్రక్రియగా ఒక ప్లాన్ అమలు చెయ్యాలి ( ఇప్పట్లోలాగా తూ తూ మంత్రంగా కాదు )

Tuesday, 10 July 2012

చంద్ర బాబంటే నాకెందుకింత మంట?


చంద్ర బాబంటే నాకెందుకింత మంట?

నా టపాలు చదివేవారిలో తరచూ తలెత్తే ప్రశ్న ఇదే ! కొందరైతె నేను రెడ్డి కులస్తుడని అపోహ పడి కమెంట్స్ వేస్తుంటారు. కాని నేను హిందూ -ముదలియార్ కులస్తుడను ( వై.ఎస్. పుణ్యమా అంటూ బి.సి జాబితాలో చేరిన కులాల్లో ఇదీ ఒకటి)

చంద్రబాబు -అతని కార్యాలయం -నాకు చేసిన అన్యాయానికి బూతులు తిట్టాలి. పొరభాటుగా నేను రచయితను కాబట్టి ఆ పని చెయ్యలేక పోతున్నాను.

చంద్ర బాబంటే నాకెందుకింత మంట అనడానికి మచ్చుకు ఒకటి చెబుతాను. చంద్రబాబు సి.ఎంగా ఉన్నప్పుడు " ఇది ప్రజల ప్రభుత్వం. మీరూ సలహాలివ్వండి..పాటిస్తాం. తప్పులు జరిగితే ఫిర్యాదు చెయ్యండి.చర్యలు తీసుకుంటాం . పోస్టు కార్డు వ్రాస్తే స్పందిస్తా" అని ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తుంటే ..1997 నవంబరునుండి దేశ,రాష్ఠ్ర్ర,ఆర్.టి.సి,తిరుమల అభివృద్దిల కోసం యాక్షన్ ప్లాన్న్స్ రూపొందించి పంపాను.

దీని పై చంద్రబాబు సి.ఎం గా ఉన్నప్పుడు అతని కార్యాలయం స్పందించడానికి ఐదు సం.లు పట్టాయి. మరీ ఇందుకు గాను నేను పది,ఇరవైలుగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఉత్తరాలు ,మెయిల్స్,ఆర్.పి.లు ,ఫ్యాక్సులు ఇవ్వాల్సి వచ్చింది.

ఇంతకీ వారెందుకు దిగి వచ్చి సమాదానం ఇచ్చారో తెలుసా?

"మీది సర్వీసు చార్జీల ప్రభుత్వం కదా ప్రజల ఉత్తరాల పై స్పందించడానికి కూడ సర్వీసు చార్జి అమలు చేస్తున్నారేమో ఈ పది రూ.ఎం.ఓ స్వీకరించి నాకు సమాదానం ఇవ్వండి అంటూ ఎం.ఓ పంపాను. సిగ్గు లేకుండా ఆ పది రూపాయలు స్వీకరించారు.

అయినా సమాదానం లేదు. చివరికి నేను వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి ఆ వార్త నాటి వార్త దిన పత్రిక మెయిన్ ఎడిషన్లో వస్తే పరువు కోసం దాట వేత సమాదానం ఇచ్చేరు. ఐదు సం.ల నిర్విరామ రిమైండర్లు,ఫిర్యాదుల అనంతరం వారు పంపిన ఉత్తరం యొక్క స్కాన్ చూసారు కదా?

ఇక బాబును చూస్తే -అతని మాటలు వింటే నాకెక్కడ కాలుతుందో మీరే చెప్పండి

గమనిక: మద్యలో ఎన్నో మలుపులు -అందులో ఒకటి నాడు వై.ఎస్. సి.ఎల్.పి నేతగా ఉండగా అతనికి నేనువ్రాసిన పోస్టు కార్డు పై సి.ఎల్.పి కార్యాలయం స్పందించడం. ఎవరైనా కోరితే ఈ విషయంలో బాబు -అతని కార్యాలయం ఆడిన దొంగాటలన్నింటిని వ్రాస్తా. ఎన్.టి.ఆర్ భవన్ నుండి బెదిరింపు కాల్ రావడం సైతం

Friday, 15 October 2010

ఎన్.టి.ఆర్ నాకు ఉధ్యోగం ఇమ్మన్నాడోచ్ !

నేను ఎన్.టి.ఆర్ ను కీర్తిస్తుంటే చాలా మంది నన్ను కమ్మ కులస్తునిగా  ఊహించుకుంటారు. వీరభ్ర్హహ్మేంద్ర స్వామిని పూజిస్తే స్వర్ణ కారుడ్నని భావిస్తారు,వైఎస్. ను కీర్తిస్తే రెడ్డి కులస్తుడ్ని అనుకుంటారు. కాని నేను తమిళ ముదలియార్ కులస్తుడ్ని. రాష్ఠ్ర్ర) విభజనకు పూర్వం మా కులం బి.సి జాబితాలో ఉండేది .కాని ఎందుకో తొలగించ బడింది. వై.ఎస్.  మాకులాన్ని బి.సి. జాబితాలో పునరుద్దరించాడన్నది ఇక్కడ అప్రస్తుతమైనా చెప్పక తప్పడం లేదు.

ఏమన్నానూ..ఆ.. నేను కమ్మకులస్తుడను కాను. నాకు మతపిచ్చి,కుల గజ్జి లేదంటే లేదు గురువా.. నా మనస్సు ఎవరిపై మొగ్గితే వారిని అభిమానిస్తుంటాను.  ఎన్.టి.ఆర్  నాకు ఉధ్యోగం ఇమ్మన్నాడన్నాను కదా అందుకు సంభంధించిన రెఫెరెన్స్ టు ది కాంటెక్స్ట్ చూసే ముందు ఎన్.టి.ఆర్ నన్నాశీర్వదించిన సన్నివేశాన్ని మీతో పంచుకుంటా.

అవును బాసూ.. నిజంగానే  ఎన్.టి.ఆర్ నన్నాశీర్వదించాడు. అదీ భారి భహిరంగ సభలో. రాజీవ్ "గలి గలి మే షోర్ హై రాజీవ్ గాంథి చోర్ హై " అని కీర్తించబడుతున్న సమయాన వచ్చిన ఎన్నికల ప్రచారానికంటూ చిత్తూరు కణ్ణన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభకు ఎన్.టి.ఆర్ వచ్చారు.

అంతకు పూర్వం అప్పట్లో తెలుగు యువతా ప్రచార కమిటి సభ్యునిగా " ఎన్.టి.ఆర్ వస్తున్నాడహో.." అంటూ వ్యేనెక్కి మైకు పట్టి ప్రకటిస్తూ  ఊరంతా తిరిగి  వచ్చాను . ఎన్.టి.ఆర్ రావటానికి ఆలశ్యమైంది. తుంపర్లు మొదలయ్యాయి. వెంటనే ఎవరో నాయకుడు నన్ను పిలిచి " ఏదన్నా మాట్లాడు.. జనం ఆగేట్లు చూడు "అన్నాడు.

మైకు పట్టుకున్న నేను " సోదర్లారా దేశమే బోఫర్శీ బోఫర్శని కోడై కూస్తుంది కదా. ఆ బోభర్స్ అంటే ఏమిటో అందమైన చందమామ కథలా చెబుతా" అని మొదలు పెట్టి కబుర్లు చెప్పడం మొదలు పెట్టాను.
నా మాటల్లో ప్రజలు, ప్రజల స్పందనతో నేను మై మరచి పోయాం.

సడెన్ గా ఎన్.టి.ఆర్ చైతన్య రథం మైదానంలోకి ప్రవేశించేసింది. మొదట తేరుకుంది నేనే. ప్రసంగాన్ని ఆ క్షణమే ఆపి "ఎన్.టి.ఆర్ జిందాబాద్ " అంటూ నినదించాను . వెంటనే ప్రజలందుకున్నారు. ( ఎన్.టి.ఆర్ ఎంట్రి తరువాత జనంలో ఎటువంటి రియాక్షన్ ఉంటుందో మళ్ళీ చెప్పాలా) ఎన్.టి.ఆర్ జనాన్ని చూసి అభివాదం చేస్తూ నా వైపు చూసారు. నేను రెండు చేతులు జోడించి నమస్కరించాను.

వెంటనే అభివాదం ఆపి నన్నాశీర్వదించారు. ఈ సన్నివేశాన్ని ఇప్పుడు తలచుకున్నా ఒళ్ళంతా పులకరిస్తుంది.

ఎన్.టి.ఆర్ నాకు ఉధ్యోగం ఇమ్మన్నాడోచ్:

1999 ఎన్నికలు పూర్తయ్యాయి. తె.దే.పా ఘన విజయం సాధించింది. ఎన్.టి,.ఆర్ సి.ఎం అయ్యేరు. ఆనందం ఆపుకోలేక  సచివాలయం చిరునామాకు ఒక ఉత్తరం పంపేను. వెంటనే ఎవరో సెక్రెట్రి సమాధానం పంపేరు.

అప్పట్లో మా నాన్న రిటైర్డ్ అయ్యి ఇంటికొచ్చేసారు. ( జిల్లా ఖజాణా అధికారిగా చేసారు) ప్రత్యుత్తరం సంగతి నేను చెప్పాను. ( ఆయన గారికి నేనంటే ఎప్పుడూ చిన్న చూపే - కాని నా మీద వల్ల మాలిన ప్రేమ కూడాను)

"ఒరేయి.. ఎన్.టి.ఆర్ సినిమా వాడు కదా.. నీ లాంటి వెర్రి వెంగళప్పల ఉత్తరానికి ప్రత్యుత్తరం పంపడానికే ఒక టీమ్ పెట్టుకొని ఉంటాడు. ఏదీ.. నీకో ఉధ్యోగం ఇమ్మని వ్రాయి.. ఇస్తాడేమో చూద్దాం " అన్నాడు.

నెలరోజులు రాద్దామా వద్దా అని తట పటాయింపు ( ఎన్.టి.ఆర్ నాకు దేవుడుతో సమానం - మరి ఆయన నుండి నిరాధారణ ఎదురైతే భాధేగా - చివరికి ధైర్యం చేసి " కులాంతర వివాహం తదితర అంశాలను ప్రస్తావించి చిన్న ఉధ్యోగం ఇప్పించాలని ఉత్తరం వ్రాసాను.

మీరు నమ్మితే నమ్మండి.. లేకుంటే మీ ఇష్ఠం. నాలుగు రోజులో మళ్ళీ సి.ఎం.కార్యాలయం నుండి ఉత్తరం.
కులాంతర వివాహం చేసుకున్నవారిలో విద్యార్హత ఉన్నవారు  ఓ.సి అయినా వారిని బి.సిగా గుర్తించే జీ.ఓ,
హౌసింగ్లో ఇవ్వ్వవలసిన రిజర్వేషన్, క్యేష్ రివార్డుకు దరకాస్తు చేసుకోవలసిన పద్దతి, సంభందిత ఫార్ములతో  కలెక్టరు వారికి అడ్రెస్ చేస్తూ ఉత్తరం వచ్చింది.

( ఆ ఉత్తరంతో జిల్లా యంత్రాంగం చేత పని చెయ్యించుకోలేక పోయినది వేరే కథా.. కాని వారానికి స్పందించే  యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్న  ఎన్.టి.ఆర్  పరిపాలనా దక్షుడా? లేక ఆరు సంవత్స్రరాలైతే కాని, మరీ పది రూ. ఎమ్.ఓ పంపి జిల్లా విణియోగదారుల ఫోరమ్లో ఫిర్యాదు చేస్తే కాని స్పందించిన చంద్రబాబు పరిపాలనా దక్షుడా.. మీరే నిర్ణయించుకొండి - చంద్ర బాబును నేను విమర్శిస్తే కొందరు నొచ్చుకోవచ్చు - కాని ఇటువంటి అనుభవాలు వందలకు పైగా ఉన్నాయి నాకు)

Tuesday, 20 July 2010

మహారాష్ఠ్ర్ర ప్రభుత్వాన్ని బతరఫ్ చెయ్యాలి

ఈ ముక్క ప్రతి తెలుగు వాని నోట రావాల్సిన రోజు ఇది. కాని పండుగ రోజూ పాత మొగుడే అన్నట్టుగా రాష్ఠ్ర్ర రాజకీయ వేత్తలు ప్రవర్తిస్తుండడం సిగ్గు చేటు. ముఖ్యంగా స్థానిక కాంగ్రెస్ నేతలు, సి.ఎం పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వస్తుంది.  చంద్రబాబు బాబ్లి ప్రాజక్టును సందర్శిస్తానని భయలు దేరారు. బాబ్లి ఉన్నది ఏ పాకిస్థాన్లోనో, చైనాలోనో లేదు. ఈ దేశం సరిహద్దులోపలే ఉంది.

కాని బాబ్లి వద్దకు తీసుకెళ్దామని మోసగించి అరెస్ట్ చేసారు. మహారాష్ఠ్ర్రలోని  దర్మాబాద్  ఐ.టి.ఐ ప్రాంగణంలో భందించ్చారు.
అక్కడి పరిస్థితి వింటుంటేనే రక్తం ఉడికి పోతుంది. పవర్ కట్, దోమల తాకిడి, త్రాగు నీరు,టాయిలెట్ సైతం లేక పోవడం ఇంతకీ చంద్రబాబు ఏదో లెటర్ ప్యేడ్ పార్టి నేత కాదు. ప్రతిపక్ష నాయకుడంటే ప్రోటకాల్ ప్రకారం సి.ఎం కు తదుపరి ప్రాముఖ్యత గల నేత.. కాని మహిళా ప్రజా ప్రతినిదులకు   సైతం  మినహాయింపు లేక ఇదే రోత.

వీరు వాదించుకున్నట్టు బాబ్లి నిర్మాణాలు చట్టపరమైనవే అయితే వాటిని చంద్రబాబు తదితరులు సందర్శిస్తే కొంపలు మునుగుతాయా? మహారాష్ఠ్ర్ర ప్రభుత్వ తీరు చూస్తే అవి అక్రమ నిర్మాణాలేనన్న భావన కలుగక మానదు.

చంద్రబాబు తదితరులను తొలూత రెండు రోజుల జుడిషియల్ కస్టడికి పంపారు. తదుపరి రిమాండును  పొడిగించి ఔరగాబాద్ జైల్కు తరలించాలని చూసేరు.తమ అరెస్టును  ఖండిస్తూ చంద్రబాబు భృందం నిరాహార దీక్ష చేపట్టి  నిరాహార దీక్షతో నీరసించి ఉన్నవారి పై స్త్ర్రీ  పురుషులన్న వివక్ష లేకుండా, ప్రజా ప్రతినిదుల అన్న మర్యాద లేకుండా పోలీసులు పైశాచికంగా దాడి చేసి, లాఠి చార్జి చేసి, రక్తపాతం సృష్ఠించడం అమానుషం, ఆఠవికం.  వారి లగ్గేజిలను భయిటకు విసిరేయడం, గన్ మేన్లను భయిటకు గెంటి వేసి దాడులకు పాల్పడటం ఇవన్ని చూస్తుంటే  టైమ్ మెషిన్ ద్వారా ఏ క్రీశ్తు పూర్వ కాలానికో వెళ్ళి పోయినట్టుందిగాని మరోలా అనిపించటం లేదు.

చంద్రబాబు మహారాష్ఠ్ర్ర సరిహద్దులో అడుగు పెట్టిన క్షణం నుండి    అక్కడ జరిగిన అన్యాయాలు,అవమానాలన్నింటిని  తలతన్నే విదంగా ఈ దాడి జరిగింది. ఇంతటితో ఆగక వారిని భలవంతంగా బస్సుల్లో ఎక్కించి బ్రేక్ ఫాస్ట్ సైతం లేక మాడ్చి భలవంతంగా విమానం ఎక్కించారు.

కాంగ్రెస్ వారు చంద్రబాబును చాలా తక్కువ అంచనా వేసినట్టున్నారు. అట్టడుగు స్థాయినుండి  అంచెలంచలుగా ఎదిగిన వ్యక్తి. అధికారం కోల్పోయినా ఐదు సం.ల తరువాత కూడా నువ్వా నేనా స్థాయిలో గట్టి పోటిని ఇచ్చిన వ్యక్తి.  చంద్రబాబు దలచుకుంటే ఎంతటి చిన్న విషయాన్నైనా మాయల మరాటిలా జాతీయ స్థాయిలో హైలైట్ చెయ్యగల సమర్థుడు. అటువంటిది.. ప్రస్తుతం జరిగిన సంఘఠణ చిన్నా చితకా విషయం కాదు.

హైదరాబాద్ దిగ గానే వైద్య పరీక్షల నిమిత్తం క్యేర్ హాస్పిటల్ లో చేరడంతో బాబు వ్యూహం షురూ అయ్యింది. ఇక చూడండి !

చంద్రబాబు బృందం పై జరిగిన ఈ దాడి, వారికి జరిగిన అవమానాలకు వెనుకున్న సోనియా కుట్ర, రోశయ్య చేతగానితనం మద్య ప్రజాస్వామ్యం నలిగి సుజ్జు సుజ్జు అయ్యింది . ఈ పాశవిక చర్యను,ప్రజాస్వామ్య ఖూనిని ముక్త కంఠంతో ఖండించి మహారాష్ఠ్ర్ర ప్రభుత్వాన్ని బతరఫ్ చెయ్యాలి అని నినదించవలసిన మన రాష్ఠ్ర్ర రాజకీయ నాయకులు గోళ్ళు గిల్లుకుంటున్నారు.

అయితే సోమవారం తెలుగుదేశం చేపట్టిన బందుకు వై.ఎస్. సోదరుడు  వై.ఎస్. వివేకానంద రెడ్డి సంఘీ భావం వ్యక్తం చెయ్యడం ,మోహన్ బాబు దర్నాకు దిగడం, హర్షకుమార్  సంఘీభావం వ్యక్తం చెయ్యడం  కాసింత విశ్వాసం కలిస్తూంది. కాని పొన్నాల, సబీత ఇంద్రా రెడ్డి స్పందనలు చికాకు కల్గిస్తున్నాయి.

నాటి ఎన్.టి.ఆర్ మొన్నటి వై.ఎస్. నాయకత్వం లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వై.ఎస్. జీవించి ఉండగా తె.దే.పా ఎం.పి ల బృందం మహారాష్ఠ్ర్రకు వెళ్ళడం సేఫ్ గా తిరిగి రావడాన్ని , నేటి దుస్థితిని ఒకసారి బెరేజు వేసుకొండి.

ఎప్పుడో చని పోయిన వారి కుటుంభాలను పరామర్శిస్తా. ఓదారుస్తా అని పట్టు పట్టి ఓదార్పు యాత్ర చేపట్టిన జగన్ వెంటనే చంద్రబాబును కలిసి పరామర్శించవలసి ఉంది. వై.స్. ఉండి ఉంటే ఆయన ఇదే పని చేసేవారు (పరిస్థితి ఇంతగా దిగ జారేది కాదనుకొండి)

గమనిక: చంద్రబాబును నాకన్నా ఘోరంగా విమర్శించినవారెవరూ ఉండరు. కాని ఈ తరుణంలో చంద్రబాబు  కేవలం ఒక పార్టి అధినేత కాదు. మన రాష్ఠ్ర్ర మేలు కోరి కదం త్రొక్కిన చంద్రబాబు  మన వాడు. మనవారికి అన్యాయం జరిగినప్పుడు గళం విప్పకుండా ఉంటే మనం చచ్చిన శవాలతో సమానం.

Friday, 16 July 2010

శభాష్ ! చంద్ర బాబు !!


సి.ఎం గా  ఉన్నప్పుడు ఏం చేసారు? అప్పట్లో అల్మట్టి నిర్మాణం  విషయంలో ఏం చేసారు ? వంటి ప్రశ్నలన్ని అప్రస్తుతం. శుక్రవారం నాడు బాబ్లి ప్రాజక్టును సందర్శిస్తానని భయలు దేరడం ,అరెస్ట్ కావడం, ఎంతగా అవమానించినా భరించి కటిక నేల పై పడుకొని, పచ్చి గంగన్నా ముట్టకుండా జాగారం చేసినా పట్టిన పట్టు విడవకుండా నిలబడటంవంటి అంశాలను ప్రతి ఒక్కరు హర్షించాల్సిందే.  ప్రధానిని కలుద్దామన్నాం కదా అని రోశయ్య అంటున్నారు. 

సాంకేతికంగా చూస్తే  మన్మోహన్ సింగ్  ప్రధానియే కావచ్చు. కాని కేవలం ఎం.ఎల్.సి గా ఉన్నా కేవలం సోనియా ఆశిస్సులతో సి.ఎం అయిన రోశయ్యకు , రాజ్య సభ ఎం.పి గా ఉంటూ కేవలం సోనియా బినామిగా ప్రధాని పదవిలో కొనసాగిస్తున్న మన్మోహన్ సింగ్ గార్లకు మద్య ఎటువంటి తేడా లేదు. ప్రధానితో మాట్లాడం కేవలం కాలయాపన అవుతుందే కాని ఫలితం మాత్రం శూన్యమని ప్రతి ఒక్కరికి తెలుసు.

కాబట్టి చంద్రబాబు బస్సు యాత్ర ముమ్మాటికి సబబే. పైగా తె.దే.పా వారు  యాత్రలో పాల్గొనాలని అఖిల పక్షానికి పిలుపు కూడ ఇచ్చారు. అఖిల పక్షమంటే అందులో కాంగ్రెస్ కూడ మిళితమై ఉంది.పొరుగురాష్ఠ్ర్రం  వైరి దేశంలా ఓవర్ యాక్షన్ చేస్తుంటే  మనవారు అంతర్గత పొర పొచ్చలతో వ్యవహరించటం సిగ్గు చేటు.

నరసింహరావు ప్రధానిగా ఎంపికై నంద్యాల్లో ఎం.పి గా భరిలో దిగినప్పుడు ఎన్.టి .ఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుని తెలుగు గౌరవాన్ని నిలబెట్టారో అటువంటి నిర్ణయాన్ని రాష్ఠ్ర్రంలోని రాజకీయ పార్టీలు తీసుకోవాలి. మహారాష్ఠ్ర్ర ప్రభుత్వం యొక్క ఓవర్ యాక్షన్ ను ముక్త కంఠంతో ఖండించాలి. చంద్ర బాబుకు బాసటగా నిలబడాలి.

ఎన్.టి.ఆర్, వై.ఎస్. వంటి భలమైన నాయకత్వం రాష్ఠ్ర్రానికి లేకపోవడం ఈ రోజు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నువ్వా నేనా పంథాను వదలి మనం అన్న స్ఫూర్తితో పద్ద్దతి మార్చుకోవల్సి ఉంది. కనీశం యువతరానికి చెందిన  జగనన్నా ఈ సన్నివేశంలో తన వైవిద్యాన్ని చాటాల్సి ఉంది.

అయినా నదులన్నింటిని జాతీయం చేసేంతవరకు , నదుల అనుసందానం చేపట్టేంత వరకు  ఇటువంటి జల వివాదాలకు అంతే ఉండదు. నేను  2002 ఆగస్ట్ నెలలో  నా ఆపరేషన్ ఇండియా 2000 పథకంయొక్క ప్రతిని అఫిషియల్ గా పంపగా సెప్టెంబరు నెలలో(  తెదేపా సంస్థాగత దినం అనుకుంటా) "నదుల అనుసందానంతోనే దేశం శస్య శ్యామలమని" స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మాట నాటి ప్రముఖ పత్రికల్లో పతాక శీర్షికలుగా వెలుబడ్డాయి. ఎన్.టి.ఆర్ కూడ పార్లెమెంట్ ఎన్నికల్లో నేష్నల్ ఫ్రంట్ అధికారానికొస్తే నదుల అనుసందానం చేపడతామని ప్రకటించారు .( వారికి కూడ ఆపరేషన్ ఇండియా 2000 పథకం పంపడం జరిగింది)

వరద బాధితులు,కరవు బాధితుల్లా చంద్రబాబు బాధితులంటూ ఒక లిస్ట్ తయారు చేస్తే మొదటి పేజిలో నా పేరు ఉంటుంది. అంతగా నష్ఠ పోయిన వాడ్ని నేను. కాని వాటిని దలచి నేడు రాష్ఠ్ర్ర్ర ప్రయోజనాలకోసం కదం తొక్కి పొరుగు రాష్థ్ర్రంలో పరాభవానికి గురైన సందర్భంలో నోరు మూసుకోవడం కాని సొల్లు వాదనలు వినిపించడం కాని ధర్మం కాదు.

అందుకే రాష్ఠ్ర్ర ప్ర్జజలందరూ, పార్టీలన్ని ముక్త కంఠంతో మహారాష్థ్ర్ర ప్రభుత్వ వైఖరిని ఖండించాలి. బాబుకు అండగా నిలబడాలి.

Monday, 26 April 2010

రోశయ్యలో ఒక చంద్రబాబు

ఇది పై శీర్షికన నేను చేసిన ప్రసంగం. దయతో వినండి. పార్టీలతో పని లేదు.ఎప్పుడైతే వై.ఎస్. మరణించారో అప్పుడే సగం తెగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టారో పూర్తిగా తెగింది .ఇక నా మాటల్లో నిజాయితీ ఉందో వ్యక్తి పూజే ఉందో మీరే డిజైడ్ చెయ్యండి