క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Thursday, 1 October 2009

వై.ఎస్.జగన్ గారికి భహిరంగ లేఖ

అయ్యా !
మీ తండ్రి గారు బ్రతికున్నంత కాలం తోక ముడుచుకుని ఉన్న నాయకులంతా (నక్కలంతా) ఆయన గారు మరణించారన్న దైర్యంతో కూతలిడుతున్నారని మీరు గాని , మీ మీద అభిమానం ఉన్నవారు గాని అనుకుంటుంటారు. కాని నిజానికి యాంటి కాంగ్రెస్ వారమైనప్పటికి కేవలం వై.ఎస్. వ్యక్తిత్వం వలన కాంగ్రెస్ పార్టి దుస్సాంప్రదాయాన్ని జీర్ణించుకున్న నా బోటివారు ఇక ఎందరెందరున్నారో. వారికంతా తెలుసు.

వై.ఎస్. ముఖ్యమంత్రి అయిన (తొలిసారి) కొత్తలోనే సోనియా అమ్మవారు సి.ఎం.ను మారుస్తే ఎలా ఉంటుందని సర్వే కూడ చేపట్టారు. సర్వేలో ఒక ప్రాంతీయ పార్టి పుడుతుందని మళ్ళీ వై.ఎస్సే సి.ఎం అవుతారని తేలింది. దీంతో సోనియా అమ్మవారు తోక ముడిచారు. (వివరాలకు 2004 సం. ఆంథ్రప్రభ దినపత్రిక సంచికలు చూడండి)

ఆతరువాత ఎలాగన్నా నాన్నగారిని భలహీన పరచాలని కుట్రలు పన్నుతూనే వచ్చారు. అమెరికాతో అణు ఒప్పందం చేసి కమ్యూనిస్టులను దూరం చేసిందెవరు. దళిత క్రైస్తవులకు, మైనారిటిలకు రిజర్వేషన్ విషయమై వెనుకడుగు వేసిందెవ్వరు తెలంగాణా ఇస్తామని "సరైన సమయంలో సరైన నిర్ణయం" అంటూ నాన్చి వేసి టి.ఆర్.ఎస్ ను దూరం చేసిందెవరు ? ఎస్.సి.వర్గీకరణ బిల్లు విషయమై ఎమ్.ఆర్.పి.ఎస్.ను దూరం చేసిందెవరు ? కుమారుడు చచ్చినా సరే కోడలు తాళి తెగాలనుకుందట ఒకావిడ ..అలా పార్టి బలహీణపడినా సరే వై.ఎస్.భలహీణ పడాలని పావులు కదిపింది అదిష్ఠాన వర్గమే. వై.ఎస్.మాటకు ఎదురులేదని ప్రచారం ఉన్నప్పటికి కేవలం ఒక మాజి ఎం.పి. డి.కె.ఆదికేశవులు విషయంలోనే వై.ఎస్.ను భంగ పరచారు. ఏకంగా రాహుల్ గాంది చేత తీర్థం పుచ్చుకున్నారాయన. ఇక జిల్లాలో గాని, రాష్ఠ్రంలోగాని వై.ఎస్.పరువు ఏంకావాలని ఒక్క సెకండన్నా ఆలోచించని ఆదిష్ఠానానికి మీరు ఎన్నిసార్లు విధేయత చాటినా వృధాయే !

వీరి కుట్రలనంతా ఎదురీది కదా వై.ఎస్. సి.ఎం అయ్యారు. నల్లకాలువ సంతాప సభలో సోనియా/కాంగ్రెస్ పేరెల్త్తక మంచి చెక్ పెట్టారు. ఎక్కడో ఎవడో సోనియా భొమ్మ చించేస్తే ఇక్కడ గొంతు చించుకున్న ముసలి నక్కల హోరుకు మీరు బెదరి ప్రకటనలు చెయ్యడం మరీ మంచితనం అనిపించుకోదు.

పైగా ఈ సారి కాంగ్రెస్ గట్టెక్కింది కేవలం ఒక్క శాతం ఓట్లతోనే . సాక్షి దిన పత్రిక రీడర్స్ ఎంత ? సాక్షి టి.వి ప్రేక్షకులెంత ? మీరే గాని ఈ రెండింటిని నెలకొలపకుండా ఉండి ఉంటే ఇక్కడి ఆంథ్ర జ్యోతి, ఈనాడు పత్రికల కలలు పండి పోయేవి. కాంగ్రెస్ ఓటమి చవి చూసి ఉండేది. ఈ విజయం వై.ఎస్. కృషి ఫలమే కాదు. మీ కృషి ఫలం కూడాని. రాజ్యాధికారం మీ హక్కు.
పోరాడితేనే అధికారం వస్తుంది. విధేయత చాటుకుంటుంటే అవతలి వారు దానిని చేత కాని తనంగా పరిగణించే అవకాశం ఉంది.

నేను గత సెప్టెంబరు 14 నే మీకు ఉత్తరం వ్రాసాను . వెంటనే మీ తాలూకు ఎం.ఎల్.ఏ లతో వెళ్ళి గవర్నరును కలవమని , ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరమని . కాని నా సలహా అమలు కాలేదు. ఇప్పటికన్నా మించి పోయిందేమి లేదు. మీ తాలుకు ఎం.ఎల్.ఏ లు రాజినామా చేద్దామనడం సిగ్గు చేటు. వేరు కుంపటి పెట్టండి. లేదా పెట్టేలా షో చూపండి. ఆదిష్థానమే మిమ్మల్ని సస్పెండ్ చేసేలా చూడండి.

ప్రజలు వై.ఎస్.వెంట /అదే మీ వెంట ఉన్నారు. ఇప్పటి ఎం.ఎల్.ఏలు మళ్ళీ ఎం.ఎల్.ఏ లు కావాలంటే మళ్ళీ ప్రజల వద్దకేకదా రావల్సింది కాబట్టి క్రమేణా వారే మీ చెంతకు చేరుతారు.
గుడ్ లక్ !

0 comments:

Post a Comment