క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday 19 February 2010

బ్లాగు ద్వారా పది రోజుల్లో రూ.1,075 ఆదాయం

అవును నా తమిళ బ్లాగుకు యాడ్స్ ఫార్ ఇండియన్స్ సంస్థ యాడ్స్ ఇవ్వడంతో పాటు కేవలం పది రోజుల్లో నా బ్యాంకు ఖాతాకి రూ.1,075 బదిలీ చేసింది. ఖచ్చితంగా ఇది విజయగాదే కాబట్టి మీరూ చదివి ఆనందించటమే కాక పది రాళ్ళు సంపాదించటానికి ప్రయత్నిస్తారనే ఈ టపా వ్రాస్తున్నాను. నిజానికి నేను 2000 సం. జూలైలోనే బ్లాగడం మొదలు పెట్టాను. అయితే పెద్దగా పాఠకులను ఆకర్షించలేక పోయాను. 2009 నవంబరుదాక నా బ్లాగును సందర్శించిన వారి సంఖ్య కేవలం 2006 మాత్రమే/

2008 నవంబరులో తెలుగులో బ్లాగడం మొదలు పెట్టి ఇక్కడ వెన్నుపోటుకు గురై తమిళ బ్లాగ్ ప్రపంచం వైపు తొంగి చూడటంతో అతి తక్కువ వ్యవధిలో నా బ్లాగుకు 9 నెలల్లో లక్ష హిట్స్ వచ్చాయి. ఇందుకు కారణం తమిళంలోని అసంఖ్యాక అగ్రిగేటర్స్ ఉన్నారు. పైగా తెలుగు బ్లాగ్ ప్రపంచంలా ఒక కులం వారి పెత్తనం అక్కడ నడవడం లేదు. ఎంతో లిబరల్ గా ఉన్నారు. అయినప్పటికి తమిళంలోను బోనీ కాని బ్లాగులు కోకొల్లలున్నాయనుకొండి.

కాని నా బ్లాగు ఎలాగో కోలుకుని లక్ష హిట్స్ కొట్టేయడం నిజంగా నాకెంతో ఆనందాన్నిచ్చింది. తెలుగులో కూడ నా బ్లాగు అతి తక్కువ కాలంలో పుంజుకున్నా బ్రాహ్మణుల కులాహంకారం మరియు కుట్రకు నేను బలయ్యాను. 2008 నవంబరు నుండి 2009 మేకెల్లా 20 వేల హిట్స్ సాధించ కలిగాను. ఎన్నికల వేడి కారణంగానో నా అసలు స్వరూపం తెలీకో ( బ్రాహ్మణ వ్యతిరేకి) నన్నాదరించారు .

ఇంతకీ నా బ్రాహ్మణ వ్యతిరేకత ఎలా భయిట పడిందంటే ఎన్నికలకు పూర్వం నేను జ్యోతిష్య రీత్యా లెక్కలేసి ప్రజా రాజ్యం మట్టి కరుస్తుంది. కాస్త సీట్ల సంఖ్య తగ్గినా వై.ఎస్. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని సూచించి ఉన్నాను. నా లెక్క కరెక్టని తేలింది. అప్పుడు ఎవరో "ఎన్నికల ఫలితాన్ని ముందుగా తెలిపితే కరెక్టుగా తెలిపిన వారికి కోటి రూపాయలిస్తామని జన విజ్నాన వేదిక వారు ప్రకటించారు కదా.. మీరెందుకు వారికి తెలుప లేదని " కమెంటు రూపంగా అడిగారు.

నేను "అయ్యా! మన దేశాన నెలకొన్న వర్ణాశ్రమ ధర్మం కారణంగా ,కులవ్యవస్థ కారణంగా జ్యోతిష్యం ఒకె కులానికి గుత్తాస్తిగా ఉండె. అన్యుల దండ యాత్ర సమయాన వారి విద్యలకు విలువ లేక పోవడం తో వారు సహజసిద్దంగా తమకున్న తెలివి తేటలతో పర బాషను నేర్చుకుని దుబాశిలుగా మారారు. విద్యను చెత్త కుండి పాలు చేసేరు. నావంటి శూద్రులము చెత్తకుండినుండి శేఖరించవలసి వచ్చింది. ముందు వెనుకా లేని పావలా తెలుగు నవలను సైతం అర్థం చేసుకోలేక పోతారుగా. మరి చిందరవందరగా మాకు దొరికిన జ్యోతిష్య శాస్త్రా)న్ని మాత్రము మేమెలా పూర్తిగా అర్థం చేసుకోగలం. మరీ అఫిషియల్ గా ఎలా ప్రకటించ గలమని వ్రాసాను.అంతే నేను విలన్ అయ్యాను. బాపలందరూ నా పై దండ యాత్ర చేసేరు. ఆ ఒక్క వారం రోజుల్లో వందలాది హిట్స్ పెరిగాయి. ఉన్నట్టుండీ వారికి జ్నానోదయమైనట్టుంది. అనవసరంగా నా బ్లాగును ఫోకస్ చేసేస్తున్నామని. వారికి వారు కమ్యూనికేట్ చేసుకుని స్తబ్దుగా ఉండి పోయారు. దీంతో నా బ్లాగు బోసి పోయింది

నా తెలుగు బ్లాగు అఖండ పాఠకాదారణ పొందక పోవడానికి ఇంకాకొన్ని కారణాలున్నాయి.

చంద్రబాబు హైటెక్ ముఖ్యమంత్రి అని పేరు గాంచారు కాని ఆయన హై టెక్కుతో ఐ.టి రంగానికి ఏం ఒరగ పెట్టారో తెలీదు కాని , బ్లాగ్లోకంలో చాలామంది చంద్రబాబు పట్ల కృతజ్నతా భావం కలిగి ఉన్నారు. నేను బాబు పై విమర్శలు గుప్పించటంతో వారు ఓర్వ లేక నా బ్లాగును దూరం పెట్టారు.

ఇక విధిలేని పరిస్థితిలో హిట్స్ పెంచుకోవటానికి కొన్ని చిట్కాలు వాడవలసి వచ్చింది. స్వాతి వంటి అందరు,అన్ని వయస్కుల వారు చదివే పత్రికల్లో డా.జి.సమరం / సరసమైన కథలు వంటి శీర్షికలు రావడంలో తప్పు లేదు గాని నేను వ్యభిచారానికి చట్ట బద్దత కల్పించాలని వ్రాస్తే అది బూతుగా పరిగణింప బడింది.

ఇంతకీ నేను ప్రధానంగా ఆథ్యాత్మిక వాదిని. మానవులు నెరవేరని ప్రాపంచిక కోరికలతో ఆథ్యాత్మికతలో అడుగు పెట్ట లేరని,పొరభాటుగా అడుగు పెట్టినా మళ్ళీ కోతి కొమ్మెక్కడానికి ఎంతో కాలం పట్టదని భావించాను. చట్ట బద్దమైన సెక్స్ అందుబాటులో ఉంటే గాని మానవులు సెక్సును గెలవలేరని భావించి అలా వ్రాసాను.

కాని మడి కట్టుకుని, నా బ్లాగు పై పని కట్టుకుని బూతు బూతు అని భూచి చూపించి ప్రముఖ అగ్రగేటర్స్ బ్లాగుల జాబితా నుండి నా బ్లాగును తొలగించ కలిగారు. నా పూర్వికులు తమిళ నాడుకు చెందిన వారైనప్పటికి, తమిళమే నా మాతృ బాష అయినప్పటికి , భోధనా బాష సైతం తమిళమే అయినప్పటికి కేవలం ఎన్.టి.ఆర్ సినిమా టైటిల్స్, ఆయన డైలాగుల ద్వారా తెలుగు నేర్చుకుని ఆంద్రప్రభ పత్రికా విలేకరిగా ,ఒక రచయితగా ఎదిగిన నన్ను ప్రోత్సహించడం మాని ఇలా వెన్ను పోటు పొడిచారు.

అయినా వారి వెన్ను పోటువలన నాకు మేలే జరిగింది. తమిళ బ్లాగ్ పై దృష్ఠి సారించాను. హిట్స్ 91 వేలున్నప్పుడే యాడ్స్ ఫార్ ఇండియన్స్ డాట్ కామ్ వారిని సంప్రదించాను. వారు నా సైట్ క్వాలిఫై చేసారు. ( 2010, ఫిబ్రవరి .ఒకటిన).

ప్రతి నెల పదవ తేదీన మీ ఖాతా పరిశీలిస్తారు. మీ ఖాతాలో కనిష్ఠంగా రూ.800/- జెనరేట్ అయ్యుంటే మీ ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేస్తారు. రూ.799.99 జెనరేట్ అయ్యున్నా మీరు మరో ముప్పై రోజులు వెయిట్ చెయ్యాల్సిందే. కాని ఎలాగో నా సైట్ ట్రాఫిక్ కారణంగా కేవలం పది రోజుల్లో రూ.1075 జెనరేట్ అయ్యింది.

మీరూ ప్రయత్నించండి.

4 comments:

  1. బ్లాగు ద్వారా డబ్బులు సంపాదించగలిగినందుకు ముందుగా మీకు అభినందనలు.

    ఇకపోతే, తెలుగు బ్లాగుల విషయానికొస్తే, మీ బ్లాగును కూడలి నుండి తొలగించడానికి కారణం మీరు రాసిన బూతు రాతలే కారణం. అంతేకాని, మీరు ఏవో ఒక పార్టీ గురించి రాశారనో, బ్రాహ్మల గురించి నెగెటివ్‌గా రాశారనో కాదు. కూడలి వరకు ఒక నియమం ఉంది. బూతురాతలు కానీ, శృంగార పరమైన విషయాల గురించి రాసే బ్లాగులను చేర్చకోకూడదని. మీరు మిగతా పొలిటికల్, ఆధ్యాత్మికత, జ్యోతిష్యం గురించి ఎంత రాసినా నియమాలేమీ లేవు. కావాలంటే మీరు మళ్ళీ కూడలి నిర్వాహకులను సంప్రదించొచ్చు. బూతు రాతలు రాయమంటే, మళ్ళీ మీ బ్లాగును చేర్చుకుంటారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు మీ బ్లాగును తొలగించరు. కేవలం ఇన్‌ఆక్టివ్‌గా ఉంచుతారు అంతే.

    శృంగారం ప్రతి మనిషి జీవితంలో కామన్ అయినప్పటికీ, కొన్ని విషయాలు కొన్ని చోట్ల చర్చిస్తే బాగుండదు. కొన్ని హద్దులుంటేనే మంచిది.


    ఇక్కడ తెలుగులో చాలామంది తాము రాసిన దానికి ఒక చిన్న కామెంట్ వస్తే చాలని ఆనందపడతారు అంతే. డబ్బులు గురించి పెద్దగా ఆలోచించరు గానీ, తమిళ బ్లాగుల విషయానికొద్దాం.

    తమిళంలో అన్ని హిట్లు మీకు వచ్చాయంటే, నాకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. మీరు రోజుకు ఎన్ని టపాలు రాశారో తెలియదు. నాకు తెలిసి బ్లాగులు మరియు బ్లాగరుల సంఖ్య తెలుగులోనే ఎక్కువ అనుకుంటున్నాను.


    మాకు కూడా ఒక తమిళ బ్లాగు ఉంది. దానిని ఏ అగ్రిగేటర్లో చేర్చాలో తెలియడం లేదు. మాకు ఆడ్స్ గట్రా వద్దుగానీ, మేము రాసిన విషయం పదిమందికీ చేరితే చాలు. కాస్త ఆ అగ్రిగేటర్లేవో మాక్కూడా చెబుతారా.

    ReplyDelete
  2. కాస్తంత మీ టెంప్లెట్ మార్చకూడదు. నలుపు బ్యాక్‌గ్రౌండ్ పైన తెలుపు అక్షరాలు చదవడానికి ఇబ్బందిగా ఉంది.

    ReplyDelete
  3. మీరు అన్నాన్ని సబబుగానే ఉన్నవి. అయితే మనిషి శరీరంలోని మర్మాంగం కూడ బూతేగా దానిని కోసి పారెయ్యవచ్చుగా. ఏం బూతండి .. బూతు బూతని భూచి చూపుతున్నారు గాని పురణాల్లో లేని భూతులా ? గుడి గోపురాల పై లేని బూతులా?
    మీరు ఒక సారి నా తమిళ బ్లాగు చూడండి ( www.kavithai07.blogspot.com అందులో Ad on అంటూ రెండు విడ్జెట్స్ ఉంటాయి. వాటి పైన క్లిక్ చేసి మీ బ్లాగులో పొందు పరచండి. మీరు కొత్త టపా వ్రాసినప్పుడల్లా ఈ విడ్జెట్ మీద క్లిక్ చేసి ఆయా సైట్స్ లో మీ టపాను యాడ్ చెయ్యండి

    బూతు బూతని గొంతు చించుకుంటారు. ఇప్పుడు బ్లాగులో ఉన్నవన్ని ఉత్తమమైన టపాలేనా?
    అసలు ఏది బూతని ఎవరండి డిజైడ్ చేసేది ? పాఠకుడు డిజైడ్ చెయ్యాలా పాఠకుడు చీ కొట్టాలా

    ReplyDelete
  4. Excellent sir..Tamil Maatru bhaasha yina telugu lo mee parignaaniki hats off cheptunnanu sir..

    ReplyDelete