క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Wednesday 24 February 2010

ఎన్.టి.ఆర్ , వై.ఎస్ లేని లోటు జగన్ తో పూడ్చబడనుందా?

కాలం ఎన్.టి.ఆర్ లేని లోటును  వై.ఎస్ తో పూడ్చినట్టే , వారిరువురు లేని లోటును  జగన్ తో పూడ్చనుందా అన్న ఆశాకిరణం నాలో మెరుస్తుంది. ఇదేమిటి అసంబంధ పోలికలని నామీద రెచ్చి పోవడానికి ఎందరో సిద్ద పడతారు. అది వారి కర్మ. కాల గమనాన్ని పరిశీలించడానికి, అంచనా వెయ్యడానికి నాకున్న అర్హతలు మూడు. ఒకటి: నేను జ్యోతిష్కుడను, రెండు : ఏమాత్రం అహమో, తర్కమో, తనా,పరా బేదమో లేక పేదవాని పక్షాన ఆలోచించే ఒక గానొక   నేత కోసం  నిరీక్షించే .. పచ్చిగా చెప్పాలంటే కలలు కనే  కలల మనిషిని, కలం మనిషిని. కవిని. మూడు: గతంలో నా అంచనా వంద శాతం మెటీరియలైజ్ అయ్యింది.

భవిష్యత్తులోకి తొంగి చూసే వినూతన శక్తి  కొందరు కవులకు ఎలా  సంక్రమించిందో, వారి మాటలు ఎలా నిజమయ్యాయో నేను నిరూపించ గలను. నేను నా టీనేజి వయస్సులో ఎన్.టి.ఆర్ ని కేవలం ఒక నటుడిగా చూసిన మాట వాస్తవం. అప్పట్లో నా మనస్తత్వం ఎంత జులాయిదంటే "కొండ వీటి సింహం" సినిమాలో ఎన్.టి.అర్ పోషించిన  ఎస్.పి  చౌదరి పాత్రను సైతం  జీర్ణించుకోలేక  పోయాను. ఆ సినిమాలో మోహన్ బాబు దరించిన "రవి" పాత్రలోనే నన్ను నేను ఐడెంటిఫై చేయ గలిగాను.

కాని కాల క్రమంలో  ఎన్.టి.ఆర్ లోని పట్టుదల,ఆత్మ విశ్వాసం, ముక్కు సూటితనం గురించిన వృత్తాంతాలను  సాటి అభిమానులు  వివరిస్తుంటే విని విని ( అప్పట్లో ఇంతగా తెలుగులో ప్రవేశాం ఉండేది కాదు. /నేను తమిళుడనన్న సంగతి మరో సారి గుర్తు చేస్తున్నాను) ఎన్.టి.ఆర్ పట్ల నాకున్న అభిప్రాయం ఎంతగానో మారింది. అతను కేవలం నటుడు కాదని, వయో భారాన్ని,తన ఆర్థిక పరి పుష్ఠతను అధిగమించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడమే కాక అందుకు కట్టుబడి పని చేసే పోరాట ఫటిమ గలవాడని గ్రహించ గలిగాను. రాజకీయాలను నేను జనతా పీరియడ్ నుండే గమనిస్తున్నవాడ్ని. అప్పటో నా వయస్సు చాలా చిన్నదైనా, చాలా విషయాలు నాకర్థం కాకపోయినా రోజూ న్యూస్ పేపర్స్ ఫాలో అయ్యే వాడ్ని. యాంటి కాంగ్రెస్ వాదిగా మలచ బడిన వాడ్ని.

సరే ఫ్లాష్ బ్యాకులు ఇప్పుడెందుకు గాని ఎన్.టి.ఆర్ వచ్చాడు. రాష్ఠ్ర రాజకీయాల పై చెరగని ముద్ర వేసాడు.
"సమాజమే దేవాలయం. పేద ప్రజలే నా దేవుళ్ళు"అన్న స్లోగన్ తో దేశానికే ఆదర్శ ప్రాయమయ్యాడు. మానవీయ కోణంలో ఆలోచించి ఎన్నో సాహసోపేత నిర్ణాయాలు తీసుకుని అమలు చేసాడు. పెద్ద పెద్ద సముద్రాలను సునాయాసంగా దాటుకొచ్చిన నావ పిల్ల కాలువతో చిక్కుకున్నట్టు చంద్ర బాబు వెన్నుపోటుతో ఎన్.టి.ఆర్ కథ ..సారి చరిత్ర ముగిసింది. అయినా ఆయన ఏమాత్రం జంకు,భొంకు లేక రాజి లేని పోరాటాన్ని కొనసాగించిన మాట చరితార్థకం.

ఎన్.టి.ఆర్ బ్రతికి  ఉన్నంత కాలం వై.ఎస్.ను కేవలం  ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగానే చూడ గలిగాను. నా ఐడియల్ హి గా ఉన్న ఎన్.టి.ఆర్ ను కేవలం వెన్ను పోటుతో పొట్టన పెట్టుకున్న చంద్ర బాబు నా సైకలాజికల్ సెట్ అప్ లోనే ప్రకంపనలు పుట్టించాడు.ఎన్.టి.ఆర్ లేని లోటును ఎన్.టి.ఆర్ లక్షయాలు, ఆదర్శాలతో పూడ్చుకుని  చంద్ర బాబు పై ఆయన  మొదలు పెట్టిన యుద్దాన్ని స్వయంగా నేనే కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. నా యుద్దంలో లక్ష్మి పార్వతి మొదల్గొని, పాకాలలోని ఎల్.బి.ప్రభాకర్ దాక, హరి కృష్ణ మొదల్గొని చోటా మోటా తె.దే.పా నాయకుల దాక భాగస్వామ్యులు చేసుకోవాలని ప్రయత్నించానే తప్ప  వై.ఎస్.ఆర్ పై నా మనస్సు మొగ్గలేదు. కొంత కాలానికే నాకర్థమైంది. ఎన్.టి.ఆర్ చే స్థూలంగా లబ్ది పొందినవారు ఏ ఒక్కరూ ఆయన ఆదర్శాలకు నిలబడరని, ఎన్.టి.ఆర్ శతృ శేషాన్ని తీర్చుకునే సత్తువ,సత్తా వారికి లేదని. అందుకే ఒంటరి పోరాటం మొదలు పెట్టాను. ( ఈ వివరాలను నా ఈ బ్లాగులోనే సవివరంగా చూడగలరు)

కాని వై.ఎస్.ఆర్  ఎప్పుడైతే  పాద యాత్ర మొదలు పెట్టాడో అప్పుడాయనలో ఎన్.టి.ఆర్ లక్షణాలు ఉన్న మాట నాకు స్ఫురించింది. నా బుర్రలో వై.ఎస్.కోసం కొత్త ఖాతా తెరవబడింది. వై.ఎస్. కదలికలను నా మస్తిష్కం నమోదు చేసుకోవడం మొదలు పెట్టింది. వై.ఎస్. ఎన్నికల మ్యేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు ఎంతగానో మురిసి పోయాను.2004 ఎన్నికల్లో చిత్తురు నియోజిక వర్గంలో  "తె.దే.పా ను చిత్తుగా ఓడించండి" అంటూ వేలాది కరపత్రాలు ముద్రించి సోలోగా ప్రచారం చేసాను.

సాధారణంగా ఒక పార్టి అధికారం చేపడితే ,ఒక నేత పదవిని చేపడితే అతనిపై వ్యతిరేకత పెరుగుతుందే కాని ప్రజల్లో ప్రేమాభిమానాలు పెరగడం అరుదు. ఎన్.టి.ఆర్, వై.ఎస్ అర్ ల నడుమ స్థూలంగా ఎన్నో వ్యత్యాసాలుండొచ్చు. కాని వారిరువురి మద్యన భావ సారూప్యత ఉండటాన్ని మొదటి నుండే నేను గమనిస్తూ వచ్చాను. క్రమేనా నా మనస్సు వై.ఎస్ పట్ల మొగ్గింది. ఎన్.టి.ఆర్ ఎలా ముక్కు సూటి తనంతో ప్రజలకు దగ్గర కావాలన్న తపనతో నాయకులకు దూరమయ్యారో దాదాపుగా అదే పరిస్థితి వై.ఎస్. కు ఏర్పడటం మొదలైంది.

దినపత్రికల దాడి ఒక వైపు, ప్రతి పక్షాల దాడులు మరో వైపు, ఆదిష్ఠానం లోపాయకారి ఎత్తుగడలు మరో వైపు. ఎన్.టి.ఆర్ విషయంలో జరిగిన పొరభాటు వై.ఎస్. విషయంలో జరిగి పొరభాటుగా వై.ఎస్. ఓడిపోతే , ఎన్.టి.ఆర్ నమ్మిన మానవీయ రాజకీయాలకు తెర పడుతుంది. ఇక ఏ నాయకుడూ ఎన్.టి.ఆర్ బ్రాండ్ రాజకీయాలకు సాహసించడు అన్న హెష్వరిక  సూచి నాలో ఎగిరి పడింది. ఎన్.టి.ఆర్   పట్ల నాకున్న వర్ణనాతీత భక్తి ప్రపత్తులు వై.ఎస్. పట్ల కలగక పోయినా  ఆయన పరిపాలనా తీరు, ఆశ్రిత పక్ష పాతం, మానవీయ కోణం,వ్యవసాయ రంగం రైతులు , పేదలు,మహిళలు, మైనారిటిల పట్ల ఆయనకున్న చిత్త శుద్ది నన్నెంతగానో ఆకర్షించాయి. అందాక కేవలం జ్యోతిష్యం,ఆథ్యాత్మికాలకే పరిమితమై ఉన్న నా "పక్ష్ పత్రిక" ను ఒక చోటా సాక్షి దినపత్రిక చేసి వై.ఎస్. ఘనతను మా నియోజకవర్గ ప్రజలకు చాటడం మొదలు పెట్టాను. వై.ఎస్. రెండు రూపాయలకే కిలో భియ్యం పథకం అమలు చేయ్యడంతో ఎన్.టి.ఆర్ పట్ల నాకున్న పూజ్య భావం వై.ఎస్. పట్ల కలుగక పోయినా ఆరాధనా భావం మొదలైంది మాత్రం ఇక్కడే.

 ఎన్.టి.ఆర్ వై.ఎస్ ల నడుమ ఎన్నో వ్యత్యాసాలుండొచ్చు, అఘాధాలుండొచ్చు. కాని సమైఖ్య వాదం, రాజకీయాల్లో మానవీయ కోణం, పట్టుదల, ఆత్మ విశ్వాసం, రాజీ లేని పోరు, ,వ్యవసాయ రంగం రైతులు , పేదలు,మహిళలు, మత సామరస్యత పట్ల వారికున్న చిత్త శుద్ది రాష్ఠ్ర) రాజకీయ చరిత్రలో  ఇరువురిని మహనీయులుగా నిలబెట్టింది.

వారు లేని లోటేమిటో ఇప్పటికే తేట తెల్లమైంది. మూర్తీభవించిన వ్యక్తిత్వంతో స్వతంత్ర ప్రవృత్తితో ఆంద్రుల ఆత్మ గౌరవాన్ని సంరక్షించి చాటిన వారెక్కడ. యూరినల్స్ కు ఎప్పుడు వెళ్తారని విలేకరులడిగినా కేంద్రానికి లేఖ వ్రాసాను, ఫోన్లో కూడా మాట్లాడాను అని సాగ దీసే ఇప్పటి రోశయ్య ఎక్కడ ?

ఎన్.టి.ఆర్ కైతే ఇది సునాయాస సుసాధ్య ప్రక్రియ ఆయన స్థాపించింది రాష్ఠ్ర) పార్టి కాబట్టి, ఆయనే వ్యవస్థాపక అద్యక్షుడు కాబట్టి. కాని వై.ఎస్. జాతీయ పార్టిలో ఉన్నప్పటికి కేవలం తమ చరిస్మాతో అదిష్థానం నోరు ముయ్యించి తమ స్వేచ్చను కాపాడుకున్నారు.

ఈ టపాలోని ఈ విషయాలను అంగీకరించే వారు సైతం వీరిరువురు లేని లోటును జగన్ పూడుస్తాడంటే మాత్రం విభేదించ వచ్చు. కారణం వై.ఎస్. మరణానంతరం జగన్ తొలూత  ప్రదర్శించిన అతి వినయం,విధేయత, ఆ తరువాత ప్రదర్శించిన అసహనమనే అంశాలే వారిని ఇలా విభేదింప చేస్తాయేమో. కాని ఒక్క ఎన్.టి.ఆర్ , వై.ఎస్. అనంతరం సమస్త రాష్ఠ్రా)నికి ప్రాతినిద్యం వహించే సత్తా ఉన్న నాయకుడు ఒక్క జగన్ తప్పా మరొక్కరు లేదు.

పైగా ఏప్రల్ మూడో వారంలో  చేపట్టనున్నట్టు జగన్ ప్రకటించిన రాష్ఠ్ర) పర్యటన అతనిలోని ఆత్మ విశ్వాసానికి ప్రతీక. ఎన్.టి.ఆర్ వైపు చూస్తే ఒక్క జూనియర్ ఎన్.టి.ఆర్ తప్పించి అందరు బాబు పంచన చేరి అతని మోచేతి నీరు త్రాగటానికే పరిమితమయ్యేరు. ఈ నేపథ్యంలో తన తండ్రి పేరునే కాదు ఎన్.టి.ఆర్ బ్రాండు రాజకియాలకు సైతం జగన్ ఒక్కడే అసలు సిసలైన వారసుడై ముందుకొస్తున్నాడు.

తెలుగు ప్రజలు చేసిన మేలు మరిచి పోయే రకం కాదు. ఎన్.టి.ఆర్  హయాంలో ఇందిరా గాంథి హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో సైతం తమ మేలు కోరిన ఎన్.టి.ఆర్ పక్షానే నిలబడి తమ విశ్వాసాన్ని చాటుకున్న మాటను ఒక సారి గుర్తుకు తెచ్చుకొండి.

ప్రజల నాడి డిల్లీ గలిల్లో గలీజు రాజకీయాలకే మొగ్గు చూపే ముసలి నక్కలకేం తెలుసు.  అక్కడ రాహుల్ అంత మంది అండ దండలతో ఏం సాధిస్తాడో చెప్పలేను గాని ఇక్కడ జగన్ మాత్రం తండ్రికి తగ్గ కొడుకుగా ఒంటి చేతితో కుట్రలను చిత్తు చేసి సి.ఎం.కావడం తధ్యం.

మే నెలలో కుంభమునుండి మీనానికి వచ్చి స్వక్షేత్రం పొంది సుస్తిర ప్రభుత్వాన్ని ఇవ్వాలి. అది ఒక్క జగన్ కే సాధ్యం.

0 comments:

Post a Comment