1.రవి:
తండ్రి మీద ఆధార పడకండి.అతనికి వీలైనంత సర్వీస్ చెయ్యండి (ముఖ్యంగా శారీరకంగా) వెన్నెముకను చక్కగా తీర్చి దిద్దే వ్యాయామాలు, యోగాసనాలు నేర్చుకుని చెయ్యండి.ముఖ్యంగా కూర్చున్నా, పండుకొన్నా వెన్నెముక నిటారుగా ఉండేట్లు చూడండి. కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలు స్వీకరించండి ఉ.పాలు, గుడ్లు, మునగాకు. చిన్న చిన్న గుట్టలు ఎక్కండి.ఉదయం సాయంత్రం తక్కువ బట్టలతో సూర్య రశ్మి మీ శరీరం మీద పడేలా చేయండి.పెగ్గి, డాబు వద్దు. గుంపులో గోవిందా వెయ్యండి
2.చం:
తల్లి మీద ఆధార పడకండి.ఆమెకు వీలైనంత సర్వీస్ చెయ్యండి (ముఖ్యంగా శారీరకంగా). వేసవి కాలాల్లో సలవ పందిళ్ళు ఏర్పాటు చెయ్యండి. ద్రవ పదార్థ విక్రయం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధమున్న రంగాల్లో ఉంటే పై తొలగండి.ద్యానం చెయ్యండి. ( ఏదో ఒక దాని మీద దృష్ఠి పెట్టడం కాదు.మౌనంగా కూర్చుని ఆలోచనలను గమనించడం. ) కార్పోరేషన్ కొళాయికి మోటర్ భిగించి నీళ్ళు చోరి చెయ్యకండి.
3.కుజ:
మీరు ఇంటి యజమానులైతే రెట్టింతల కరెంట్ బిల్ వసూలు చెయ్యకండి.సోదరుల భాగాలు కొట్టెయ్యాలని చూడకండి. భూ ఆక్రమణకు పాల్పడకండి రౌడీలు, .పోలీసుల అండతో సామాన్యులను భాదల పాలు చెయ్యకండి. విద్యుత్ చౌర్యానికి పాల్పడకండి. ఇందనాలు, electrical,electronics వస్తువులు ఉచితంగా స్వీకరించడం వద్దు.
4.రాహు:
మందు పార్టీల పేరిట ఉచిత మద్యం స్వీకరించ వద్దు. సినిమాలకు ఓసి టిక్కెట్లకు ప్రాకులాడకండి.తండ్రి తరపు అవ్వా,తాతా ఉంటే వారికి చేతనైన సాయం చెయ్యండి. ఇతర భాషస్తులతో కలిసి మెలిసి ఉండండి. వారు సాయం కోరినప్పుడు చెయ్యండి. మీ చాయ మరీ నల్లగా ఉన్నా, ఊభకాయులైనా, మరీ బక్క చిక్కి ఉన్నా విదేశాల్లో చదువు,ఉద్యోగాలకు ప్రాకులాడకండి( ఈ లక్షణాలు మీకుంటే మీకు సర్ప దోషం ఉందని లెక్క) ఇటువంటి వారు పొగ,మందు,త్రాగడం, జూదం,లాటరి అలవాట్లుంటే ఎలాగైనా మానెయ్యండి. దుర్గను పూజించండి.పాము రూపంలో ఉన్న ఉంగరం ధరించండి
5.గురు:
ఇస్తున్నారుగా,వడ్డీ తక్కువేగా అని ఆప్పులకు ఎగపడకండి. అజీర్తి, ఆకలిలేమి సమస్యలుంటే వెంటనే సరి చేసుకొండి. బ్రాహ్మణుల జోలికి, పై అధికారుల జోలికి వెళ్ళకండి. మీరు ప్రభుత్వ ఉధ్యోగులైతే లంచాలు తీయకండి. ప్రభుత్వ వాహణాన్ని స్వప్రయోజనాలకు వాడకండి. ఆఫీసు స్టేష్నరి ఇంటికి తేకండి. వ్యాయామం తప్పక చెయ్యండి.లేదంటే అల్సరు, పెప్టిక్ అల్స్తరు, గుండే పోటుకు గురయ్యే అవకాశం ఉంది.
మీరు బ్యాంకు, కోర్టు, తి.తి.దేవాస్థానం వంటి ధార్మిక సంస్థల్లో పని చేస్తుతున్నా,పుణ్య క్షేత్రాల్లో వ్యాపారాలు చేస్తున్నా అదనపు ఆదాయానికి, పై వరుంబడికి, అధిక లాభాలకు (కొల్ల కొట్టడం ) ఆతృత పడకండి.సంతానమే లేక పోవచ్చు, గర్భ శ్రావాలు జరుగొచ్చు. పిల్లలు నాశనమై పోతారు.ముఖ్యంగా వారికి పెళ్ళీళ్ళే కాక పోవచ్చు. లేదా విడాకులు తీసుకోవలసి రావచ్చు. (గురు - పుత్ర బౌత్ర కారకుడు,దన కారకుడు, కంకణ -పెళ్ళి- కారకుడు కనుక)
6.శని:
ఇనుము,ఆయిల్,గ్రానైట్స్, నూనె విత్తనాలు ,పాత వస్తువులు,నల్లగా ఉన్న వస్తువులు ఉచితంగాస్వీకరించ వద్దు. పనివారికి సక్రమంగా జీతాలివ్వండి. మీకు పనికి రాని పాత వస్తువులను వారికి ఉచితంగా ఇచ్చి వెయండి. దళితుల భూములు,సొమ్ముకు ఎగపడొద్దు. ఆఫీసు అటేండరుక్,ఆర్డర్లీలకు స్వంత పని చెప్పకండి. వికలాంగులు,పండు ముసళ్ళ పట్ల సౌమ్యంగా ప్రవర్తించండి. మలబద్దకాన్ని వారించుకొండి. టేబుల్ వర్క్ చేసేవారైతే వ్యాయామం తప్పక చెయ్యండి. లేకుంటే జైళ్ళ పాలవ్వడం,జరిమానాలు కట్టాల్సి రావడం, అవమానాల పాలవ్వడం, నెర్వస్ సిస్టమ్ బ్రేక్ డవున్ అవ్వడం కూడ జరగ వచ్చు.వంటకు మంచి నూనే వాడండి. మీ పూర్వీకులను (మరణించిన) స్మరించి దాన ధర్మాలు చెయ్యండి. ఇలా చెయ్యకుంటే ఆయుష్ భంగం కూడ కలుగ వచ్చు.
7.బుధ:
మేన మామ/పిల్లనిచ్చిన మామగారి మీద ఆధారపడకండి. మద్య వర్తిత్వంలో డబుల్ గ్యేమ్ ఆడకండి. మీరు విద్యా ,వైద్య సంస్థల్లో పని చేసేవారైతే మరీ జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ విద్యా సంస్థలో పని చేస్తూ ప్రైవేటు పాఠ శాల నడపడం, స్కూలు టైమ్ లో చీటిలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యడం, ట్యూషన్లు చెప్పడం మానెయ్యండి. పోస్టల్ డిపార్ట్ మెంట్ ఉధ్యోగి అయితే ఎమ్.ఓలు ఇచ్చినప్పుడు ,పండుగలొచ్చినప్పుడు బక్షీసులకు ప్రాకులాడకండి. లేకుంటే చర్మ వ్యాధులొస్తాయి, వృష్ణాలకు సంభందించిన రోగాలొస్తాయి. (వొరి భీజం?) మతిభ్రమణ కూడ కలుగ వచ్చు .జాయింట్లు దెబ్బ తింటాయి. ఆర్తరైటిస్ రావచ్చు.
8.కేతు:
ఇతర మతస్తుల పట్ల స్నేహంతో వ్యవహరించండి. ఇతర మత గ్రంథాలు చదవండి.దర్గా,చర్చీలకు వెళ్ళండి. సింపుల్ లైఫ్ లీడ్ చెయ్యండి. మీకు సంభంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకండి. లగ్జరీలు,కాస్మెటిక్స్ జోలికి వెళ్ళకండి.ద్యానం, యోగా నేర్చుకొండి. గుళ్ళకు పోతే ప్సెషల్ దర్శనాలకు ప్రాకులాడొద్దు. వీలుంటే ఒక రాత్రి బస చెయ్యండి. గది దొరికినా నేల మీదే పనుకొండి. రాహు క్రింద ఇచ్చిన విషయాలు కూడ గమనించి అవసరమైనవి పాటించండి
9.శుక్ర:
ఫర్నిచర్,వెహికిల్ అవాయిడ్ చెయ్యండి.వుల్వా బస్సులు, సూపర్ డీలక్సులు ఎక్కకండి. ఆపోజిట్ సెక్స్ వారితో దూరంగా మెలగండి. బ్రహ్మచర్యం పాటించండి ( ఒక్కో రతి/హస్తప్రయోగానంతరం కేవలం పదిహేను రోజులైనా నిష్ఠగా ఉండండి) కటిక నేల పై పడుకొండి. మ్యూజిక్,ఎఫ్.ఎమ్, టివి,డివిడి,చాట్, స్నేహితులతో భాతాకాని మానండి. లలితకళలకు సంభందించిన రంగంలో ఉంటే పై తొలగండి. ఉప్పు,చక్కిర తక్కువ వాడండి. రుచి కోసం కాక ఆకలి కోసం భోంచెయ్యండి. వెండి,కళాకాండాలు, పెయింట్స్ వంటివి ఉచితంగా స్వీకరించకండి
కలియుగ మురుగేశ హోరా శాస్త్రము /....వగైరా..వగైరా ..అన్నమాట.
ReplyDeleteఅయ్యా,
ReplyDeleteవగైరా వగైరా అంటే మీ ఉద్దేశం సెక్సాలజి, రతి మర్మాలు అనేగా. అవి లేకనే మీ ఆది శంకరాచార్యులనుండి నేటి జయేంద్ర సరస్వతి దాకా పుట్టారా ఏం ? ఏమీటో మీ చేదస్తం మరీ పెరిగిపోతుంది. నన్ను ర్యేగ్ చెయ్యాలనుకుంటే మాత్రం సాగదు. నేనేమి న్యూ కమర్ కాను. గతంలోనే సత్తా చాటినవాడ్ని