మనకు ఎవడినన్నా నచ్చకుంటే అతను లేనప్పుడు అతనిని "శనిగాడు" అంటాం. ఎవరికన్నా కష్ఠాలే వస్తుంటే "పాపం.. అతనిని శని పట్టి పీడిస్తున్నాడంటాం. మన దైనందిన జీవితంలో శని పేరును ప్రస్తావించలేక పోతున్నాం. తొమ్మిది గ్రహాలున్నప్పటికి శనికున్న ప్రాభల్యం మరే గ్రహానికీ లేదు. అట్ ది సేమ్ టైమ్ శని గురించిన అపోహలు కూడ ఎక్కువే. ఆ అపోహలను తొలగించి శని గొప్పతనాన్ని మీకు తెలియ చెయ్యాలనే ఈ టపా.
మొదట ప్రాథమిక సమాచారాలు కొన్నింటి చూద్దాం:
1.శని మీ రాశికి 3,6,10,11 రాశుల్లో సంచరిస్తే మేలు చేస్తాడు.
ఇతర రాశుల్లో సంచరిస్తేనే పీడిస్తాడు
2, మొత్తం 12 రాశులున్నాయి. శని ఒక్కో రాశిలోను రెండున్నర సం.లు సంచరిస్తాడు. - 12X2 1/2 ముప్పై సంవత్సరాల్లో (ఒక రౌండ్) శని ఒక జాతకునికి అనుకూలంగా ఉండేది జస్ట్ పది సం.లేనన్నమాట. తక్కిన ఇరవై సం.లు ప్రతికూలుడే.-
3.అలాగే శని ఒక రాశిలో తానున్నప్పుడు 4/12 రాశులవారికే మేలు చేస్తాడు. తక్కిన 8/12 రాశుల వారికి కీడు చేస్తాడనుకోవచ్చు. అంటే మెజారిటి జాతకులు శని పీడనలోనే ఉంటారు. ( అందుకేనేమో జ్యోతిష్కులెప్పుడూ బిసిగా ఉంటారు)
4.శని ఒక రాశి నుండి మరో రాశికి మారేందుకు 6 నెలలు పూర్వమే కవుంట్ డౌన్ మొదలవుతుంది. కాని తన ద్వితీయ భాగంలోనే( 1 1/4 +1 1/4) విజృంబిస్తాడు.
5.నదుల అనుసంథానం, జలయజ్నం వంటి బౄహత్తర పథకల పట్ల ఆసక్తి కనబరచాలన్నా , రూపొందించాలన్నా , అమలు చెయ్యాలన్నా శని భలం ఎంతో ముఖ్యం.ఓర్పు,ఓపిక,త్యాగం,నిస్వార్థాలతో పూనుకుంటే కాని నదుల అనుసంథానం, జలయగ్నం వంటి పథకాలు అమలు కావు.
6. శని ఆసనద్వారానికి కారకుడు. ఆసనమన్నది టూవీలరుకు సైలెన్సర్ వంటిది. సైలెన్సరుకు ఒక నిమ్మకాయో,టెన్నిస్ బాలో పెట్టేస్తే చాలు బండి స్టార్ట్ కాదు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మానవుడి బతుకు కూడ అంతే. మలబద్దకం,నీళ్ళ విరేచనం,వాయు ఉపద్రవంతో మొదలయ్యి అకాల భోజనం,అకాల నిద్ర వరకు ప్రాకి చివరికి మూలం, నరాల బలహీనత వరకు వస్తుంది.
శని పట్టుకుంటే 7.5 సం.లు పీడిస్తాడని అదని ఇదని ఎన్నో అపోహలు మీలో ఉన్నాయి.
వ్యవసాయరంగానికి అధిపతి శనియే. అంతే కాదు చాలా ఆలస్యంగా ఫలితం ఇవ్వగల ఏ వ్యాపారం,రంగం,పని, ప్రయత్నాలకు శనియే అధిపతి. శని భలం ఉన్నవారే లాంగ్ టెర్మ్ ప్రోజెక్టుల్లో దిగుతారు, సాధిస్తారు. ఇతరులు ఏవో చిన్నా , చితకా విషయాలకు పరిమితం అయిపోతారు.
శని భలం ఎవరికి ఉంటుంది ?:
8 వతేది ,లేదా 17,26 తేదీలో పుట్టిన వారికి, శనికి సంభంధించిన పుష్యమి,అనురాధా,ఉత్తరాభాధ్రా నక్షత్రాల్లో పుట్టిన వారికి మకర,కుంభ రాశి/లగ్నం వారికి శని మితృడుగా ఉన్న వృషభం, మిథునం, కన్యా,తుల, రాశులవారికి ప్రాధమికంగా శని భలం ఉన్నట్టే. అలాగే పుట్టిన తేది,నెల,సం. సంఖ్యలను కూడి ఏక సంఖ్య చేసినప్పుడు 8 వచ్చినా శని భలం ఉన్నట్టే
శని భలం ఉన్నవారి లక్షణాలు:
అందం,అలంకరణ, డబ్బు, డాబు,దుబారాల పై దౄష్ఠి పెట్టరు. చాలా పొదుపుగా ఉంటారు( శని భలం లేని వారు దుబారా చేసి , దివాళా తీసి ఆ తరువాత పీనాసులుగా తయారవుతారు.వ్యవసాయం, గ్రనైట్స్,పరిశ్రమలు వీరిని మరింత ఆకర్షిస్తాయి. వీరు విధి వ్రాతను విశ్వసిస్తారు. హస్త సాముద్రికంలో శని రేఖకు ఫేట్ లైన్ /విధి రేఖా అని కూడ ఒక పేరుంది. వీరి తీర్పులు నిర్మొహమాటంగా ఉంటాయి. సాధారణ సైనికునిగా చేరి కమేండరుగా, హోటల్ సర్వరు గా జీవితం ప్రారంభించి, ఫైవ్ స్టార్ హోటల్ యజమానిగా ఎదిగిన వారి జాతకంలో ఖచ్చితంగ శని భలం ఉండి తీరుతుంది. వీరు పై పై తళుకులకు లొంగరు. పర్పస్ సెర్వ్ కావడమే వీరికి ముఖ్యం. శని భలం ఉన్న జాతకులకు వచ్చిన చిక్కల్లా ఏమిటంటే వారి శరమ ఫలితం కేవలం వౄద్దాప్యంలోనె అందుతుంది.
శని పట్టడానికి ముందు:
తలకు దెబ్బ తగులును , ముఖాన జిడ్డు కారడం, తలలో తెల్ల వెంట్రుకలు రావడం, అంగహీణం ఏర్పడటం, ఒక స్త్రీ వలన (స్త్రీలకు ఒక పురుషుని వలన) సమస్య వచ్చును. పోలీసు స్టేషన్, కోర్టు ఆసుపత్రి , వల్లకాటికి వెళ్ళ వలసి వచ్చును, స్వతంత్ర జీవనం సాగించేవారికి ఉద్యోగం వచ్చును. అవివాహితులైన స్త్రీలకు వివాహమగును. ఇనుము వస్తువు కనబడకుండా పోయి నానా హైరానా పడాల్సి వస్తుంది. ఒక పని వాడు దొంగ తనం చేస్తాడు. త్రిప్పుట అలసట ఏర్పడును.
జీవిత భాగస్వామి/ప్రియురాలు/ప్రియుడు/వ్యాపార భాగస్వామితో తగాదా వచ్చును. స్థాన చలనం ఏర్పడును, తల్లి,ఇల్లు,వాహనం,విద్య సంభంధించి సమస్యలొచ్చును.
శని వీడి పోవడానికి ముందు:
పెద్దలెవరన్న ఇష్ఠపడి ఇనుము వస్తువులు బహుకరిస్తారు. సేవకుడు లభిస్తాడు. అవివాహితులైన పురుషులకు పెళ్ళి జరుగును. దూర దేశమునుండి శుభవార్త వచ్చును. మనోధైర్యం హెచ్చును. తోభుట్టువుల సహకారం లభించును. వారి పై పై చెయ్యి సాధిస్తురు. కంటి జబ్బు నయమగును. మాట నిలుపుకోవాలన్న తత్వం ఏర్పడును. స్వగ్రామం/స్వంత ఊరు చేరుతారు. పిల్లలతో సఖ్యత మెరుగు పడును, అవమానాలు,అపవాదులు తొలుగును, స్వంత వౄత్తి చేపట్టాలన్న ఆలోచన కలుగును
పరిహారం:
శని నూనె విత్తనాలకు కారకుడు కాబట్టి తలకు నూనె రాయండి, మంచి నూనెతో తలంటి స్నానం చెయ్యండి. దళితులకు ,వికలాంగులకు అన్నం పెట్టండి.ఇనుము దానం చెయ్యండి. వర్కర్స్ కి బక్షీస్ ఇవ్వండి. వీలుంటే కాకి డ్రెస్ వెయ్యండి లేదా సఫారి వేసుకొండి. లేదా మురికి,చినిగిన బట్టలు వెయ్యండి .ఉద్యోగం వచ్చును. అవివాహితులైన స్త్రీలకు వివాహమగును. ఇనుము వస్తువు కనబడకుండా పోయి నానా హైరానా పడాల్సి వస్తుంది. ఒక పని వాడు దొంగ తనం చేస్తాడు. త్రిప్పుట అలసట ఏర్పడును.
జీవిత భాగస్వామి/ప్రియురాలు/ప్రియుడు/వ్యాపార భాగస్వామితో తగాదా వచ్చును. స్థాన చలనం ఏర్పడును, తల్లి,ఇల్లు,వాహనం,విద్య సంభంధించి సమస్యలొచ్చును.
శని వీడి పోవడానికి ముందు:
పెద్దలెవరన్న ఇష్ఠపడి ఇనుము వస్తువులు బహుకరిస్తారు. సేవకుడు లభిస్తాడు. అవివాహితులైన పురుషులకు పెళ్ళి జరుగును. దూర దేశమునుండి శుభవార్త వచ్చును. మనోధైర్యం హెచ్చును. తోభుట్టువుల సహకారం లభించును. వారి పై పై చెయ్యి సాధిస్తురు. కంటి జబ్బు నయమగును. మాట నిలుపుకోవాలన్న తత్వం ఏర్పడును. స్వగ్రామం/స్వంత ఊరు చేరుతారు. పిల్లలతో సఖ్యత మెరుగు పడును, అవమానాలు,అపవాదులు తొలుగును, స్వంత వౄత్తి చేపట్టాలన్న ఆలోచన కలుగును
శని పడితేనే మంచిది:
అవును బాసు .. శని ఆయుష్కారకుడు కాబట్టి జాతకుడ్ని తన ఆదీనంలో ఉంచుకున్నంత కాలం ( ఏల్నాటి శని,శని దశ,శని భుక్తి జరుగునప్పుడు) స్వతంత్రించి జాతకుడికి మరణాన్ని ప్రసాదించడు. మరే మారకుని వీక్షణమన్నా కలిగితె గాని మరణం అసంభవం.
శని పడితే భలం పెరుగుతుంది:
అవును గురువా.. సు:ఖాలు మనుషుల్ని భలహీనపరుస్తాయి. బాధలే మనిషిలో దాగున్న శక్తి సామర్త్యాలను వెలికి తీయడంతో పాటు ఆయుష్షును పెంచుతాయి.
ప్రస్తావించలేక పోతున్నాం./pl correct it asప్రస్తావించలేకుండా
ReplyDeleteఉండలేక పోతున్నాం...
౨.satn not at all associated wth water nd hotel industry..u r wrongly written those two points...
గురువు గారూ,
ReplyDeleteమళ్ళీ మీరేనా ( విసుగుతో కాదు ..చనువుతో) . నేను హోటల్ రంగం శనికి సంభంధించిందని పేర్కినలేదు. ఏ రంగంలోనన్నా చిన్న స్థాయినుండి క్రమేణా ,అంచెలంచెలుగా ఎదిగే వారికి శని భలం తప్పని సరి అనే చెప్పి ఉన్నాను. వాటర్ గురించి అస్సల్ చెప్పలేదు. జలయజ్నాన్ని ప్రస్తావించింది అదో లంగ్ టెర్మ్ ప్రాజెక్ట్ అన్న దృక్పథంతోనే. ఇక ప్రూఫ్ రీడింగ్ భాగానే చేస్తున్నారు. కొంపదీసి మీరు తెలుగు ఉపాద్యాయులు కారు కదా?
చంద్రబాబునాయుడు తరచూ కోసరం అనే పథం వాడుతుంటారు. అది మరీ అసహ్యంగా ఉంది. కోసం అనొచ్చుగా ముచ్చటగా ఉంటుంది. ఈ విషయం బాబు గారికి నివేదిస్తారా?
ప్రస్తావించలేదుఅని