క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday 12 November 2010

ఎన్.టి.ఆర్ భవన్ నుండి బెదిరింపు కాల్



ఇదేదో హిట్స్ పెంచుకోవడానికి పెట్టిన ఉత్తుత్తి శీర్షిక అనుకునేరు.. నిజంగానే వచ్చింది బాసూ.. ! ఎప్పుడు? అంటారు.. చెబుతా.. ఖచ్చితంగా నా ఆదర్శ పురుషుడైన ఎన్.టి.ఆర్ హయాంలో మాత్రం కాదు. మరో క్లూ ఇవ్వనా? చంద్రబాబుగారు ముఖ్యమంత్రివర్యులుగా ఉన్న రోజులైతే కావు. ఆ మాత్రం  సస్పెస్న్ లేకుంటే పోస్టు పండదుగా..

నవ భారత నిర్మాణార్థం నేనో పథకం రూపొందించడం దాని ప్రచారం మరియు అమలు నిమిత్తం 1997 నుండి 2004 దాకా ప్రయత్నించడం పెద్ద కథ. నా పథకంయొక్క ముఖ్యాంశం దేశంలోని పది కోట్ల మంది నిరుధ్యోగులతో ప్రత్యేక సైన్యం రూపొందించి నదుల అనుసందానం చేపట్టడమే.( చాలావరకు శాస్త్ర్రీయంగా రూపొందించానండోయి)

ఈ పథకాన్ని అప్పట్లో కేంద్రంలో సైతం చక్రం తిప్పుతున్న చంద్రబాబుకు పంపడం - ఫాలో అప్స్ - ఆరేళ్ళ లేఖాస్త్ర్రాలు - తిరుగు టపా ఖర్చునిమిత్తం రూ.పది ఎం.ఓ పంపడం - దానిని వారి కార్యాలయంవారు స్వీకరించడం - దానిని బేస్ చేసుకుని నేను వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టడం - ఈ వార్తను వార్తా పత్రికల ద్వారా తెలుసుకుని బాబు గారు " మీ సలహాలను తగిన రీతిలో వాడుకుంటామని" ఒక నంగనాచి ఉత్తరం పంపడం ఇవన్ని నాటి బ్లాగు పాఠకులతో పంచుకున్నవే.

ఇవన్ని బాబుగారి డాబు పరమోచ్చంలో ఉండగా  జరిగినవి. 2004 ఎన్నికల్లో బాబు చితికిల పడ్డారు.ప్రతిపక్ష నేతగా చిత్తూరు విచ్చేసారు. అప్పట్లో నేను విలేకరిగా ఉన్నాను. చిత్తూరు తె.దే.పా కార్యాలయంలో ప్రెస్ మీట్ కూడ ఏర్పాటు చేసి ఉన్నారు. అవకాశం దొరికితే బాబు గారికి నివేదించ వచ్చుగా అని ఒక వినతి పత్రం కూడ తయారు చేసుకున్నాను.

బాబుగారికి ప్రభుత్వాన్ని నడపడమే కాదు ప్రెస్ మీట్ నిర్వహించడం కూడ తెలీదని తెలిసి పోయింది. కేవలం విలేకరులు మాత్రమే పాల్గొనవలసిన సమావేశంలో పావలా తొట్టి నాయకులు సైతం వందల్లో గుమి కూడడంతో వి.ప అందివ్వలేదు.

రెండు మూడు నెలలతరువాత ఏదో సందర్భంలో సతరు వినతిపత్రం నా కంట పడింది. ఎలాగో సిద్దం చేసాం  కనీశం కొరియర్ ద్వారన్నా పంపితే పోలేదా అని  కవరు మీద ఎన్.టి.ఆర్ భవన్ చిరునామా వ్రాసాను.
ఇక నేపథ్యం వ్రాయాలిగా..

"అయ్యా! బకాసురుడు మీ కజిన్ బ్రదరో ఏమో తెలీదు గాని ..మీరు అధికారంలో ఉన్న రోజుల్లో మీ కార్యాలయంలోని చెత్త భుట్టలకంతా యమ ఆకలివేసేది. నేను పంపిన కాయితాలన్నింటిని తినేసేవి. ఇప్పుడు పరిస్థితిలో కాసింత మార్పు వచ్చుంటుంది కదా అని మీకీ ఉత్తరం పంపుతున్నా. ప్రెస్ మీట్లో బై హ్యేండ్ ఇవ్వాలనుకున్నాను. పరిస్థితి అనుకూలించక కొరియర్ ద్వారా పంపుతున్నా"నని  కవరింగ్ లెటర్ వ్రాసి పథకానికి జోదిమ్చి కొరియర్ ద్వారా పంపి వేసాను.

దీని పై స్పందనగానే ఎన్.టి.ఆర్ భవన్ అఫిషియల్ ల్యేండ్ నెంబరునుండి త్రెటెనింగ్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ సంభాషణ ఇలా సాగింది.

"ఎవరయ్యా నువ్వు?"

"ఇదేమండి  ? నేనెవర్నొ తెలియకనే  నాకు ఫోన్ చేసారా?"

"అదే మురుగేశనేనా?"

"అవునండి.. ఇంతకీ మీరెవరు? నన్ను ఏకవచనంలో సంభోధించే వారే అరుదు..కొంపదీసి మీరేమన్నా బాల్యంలో నాతో గోలీలాడుకోలేదుగా?"

"చంద్రబాబంటే ఎవరో తెలుసా?"

"ప్రపంచంలోని సవాలక్షా మాజి ముఖ్యమంత్రుల్లో ఒక్కరు.."

"ఆయనగారికి ఏం వ్రాయాలి ,ఎలా వ్రాయాలని తెలీదా నీకు"

"తెలిసింది కాబట్టేగా వ్రాసింది"

"ఏం తిక్క తిక్కగా ఉందా? దీని పర్యావసనం చాలా తీవ్రంగా ఉంటుంది.. టేక్ కేర్! "

" తిక్కా? కరెక్ట్ ! చాలా కరెక్టుగా చెప్పారు.. అసలే నేను తిక్క ముండాకొడుకుని.. మీ చంద్రబాబుగారి మూత్రం వైట్ పెట్రోల్ లాగా వెలిగి పోతున్న రోజుల్లోనే కోర్టుకు నడుచుకుంటూ వెళ్ళి కేసిచ్చి నడుచుకుంటూ ఇల్లు చేరినవాడ్ని.. మీరూ టేక్ కేరే"

(గమనిక: ఇది నిన్నా మొన్నా జరిగిందనుకొని గాబరా పడేరు.. ఈ సంఘఠణ 2007 లో జరిగిందనుకుంటా. కాల్ వచ్చి రాగానే వేడిగా ఒక టపా కూడ వ్రాసేసాను బాసు.. రేపు తెలుగు తమ్ముళ్ళు తమకు,తమ నాయకుడికి పరువుందన్న భ్రమతో పరువునష్ఠ దావా వేస్తే ఆధారాలుండాలిగా? )

2 comments:

  1. నమస్తే గురువుగారూ,
    ఏం చెయ్యను? ఇల్లు మారాల్సి వచ్చే.ఫోన్ షిఫ్టింగ కాలే. నెట్ కనెక్షన్ లేదాయె. చిన్న గ్యాప్ పడింది.

    మనల్ని జనం మరిచి పోవడమన్నది నతింగ్ బట్ చావు గురువుగారు.అందుకే ఈ అకాల టపా..

    ReplyDelete