క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Wednesday, 1 December 2010

చంద్రబాబు భాటలో కొత్త సి.ఎం

(నేరాల అదుపుకు నేను పంపిన సలహాల పై హోమ్ శాఖ స్పందన ఇది - బొమ్మను  పెద్దది  చేసి చూడడానికి దానిపై క్లిక్ చేసి కంట్రోల్ ప్లస్ నొక్కండి. నేరాల అదుపుకు నేనిచ్చిన సలహాలు ఈ టపా చివర కాపి పేస్ట్ చేసా. వీటి పై మీ అభిప్రాయాలను తెలపండి)
మన ప్రభుత్వ యంత్రాంగం ఎలా పని చేస్తుందో, మన పాలకుల సెక్రట్రీలు, పాలుక వ్యక్తిగత కార్యదర్శులు ఎలా పని చేస్తారో తెలుసుకోవడానికి  నా ,నా కుటుంభ సభ్యుల ఆయా పూట భోజనాలను సైతం ఒడ్డి పెద్ద జూదమే ఆడి తెలుసుకున్న వాడ్ని.  వీరికి మనం పంపే ఉత్తరాలు ఎలా ఉంటాయంటే భావిలో వేసిన  భండలా ఉంటాయి.

కొందరు మహా మేధావుల్లా చిక్కడు దొరకడు టైపులో ఒక రెడి మేడ్ రిప్లై ఇస్తుంటారు.

స్పెక్ట్రం కేటాయింపు మీద సుభ్రమణ్యం స్వామి పంపిన లేఖకు ప్రథాని కార్యాలయం ఇటువంటి రిప్లై ఇచ్చే సుప్రీంలో చీవాట్లు తింది. మరీ 16 నెలల తరువాత. కాని నేను సి.ఎం కార్యాలయం,స్పీకర్ కార్యాలయం నా ప్రాజక్టు మీద స్పందించడం లేదని హై కోర్టు,సుప్రీమ్ కోర్టు న్యాయ మూర్తులకు లేఖల పరంపర వ్రాసాను. పదహారేండ్లైనా ఇందాక స్పందన లేదు.  కాని వీరు ప్రదాని కార్యాలయాన్ని తప్పు పడతారు. అంతా మన ఖర్మ..

అంతే కాదు చాలాకాలం తమ పృష్ఠాల క్రింద పెట్టుకుని ఉండి ఎవడన్నా కరడు కట్టిన కెలుకుడు గాళ్ళవలే
నిరాటకంగా కెలికితే వీరి స్పందన ఎలా ఉంటుందంటే "సాఫీగా మరో ప్రతి కోరుతారంతే"

ఇటీలవల మన కొత్త సి.ఎం తన భాల్య స్నేహితుడు ఇచ్చిన ఎస్.ఎమ్.ఎస్ కు వెంటనే స్పందించి వెళ్ళి కలిసినట్టు వార్తలొచ్చాయి. శచివాలయ ఉధ్యోగులకు మీరు ప్రజల పట్ల సెన్సిటివ్గా ఉంటే నేను మీ పట్ల సెన్సిటివ్గా ఉంటా అన్నారట.

సలహాదారులను సాగనంపటం, పేషీ అధికారులను మార్చడం ఇవన్ని ఆరంభ శూరత్వాలే. బ్రిటీషువారు ఏర్పరచి వెళ్ళిన యంత్రాంగం అలానే కొనసాగుతూంది. దీనిని భూజు దులప దలచినా సి.ఎం పని గోవిందే. ఎన్.టి.ఆర్ ఇలానే కస్త భూజు దులుపుతామని దిగి చెయ్యి కాల్చుకున్నారు.

నన్నడిగితే ఎలాగో ఏది మరేది లేదు.ఏది తీరేది లేదు. కనీశం ఈ పతివ్రత మాటలు చెప్పకుంటే కనీశం ప్రజల్లో వ్యతిరేకతన్నా కాస్త తక్కువగా ఉంటుంది.

చంద్రబాబు కూడ ఇలానే మాది చేతల ప్రభుత్వం ( అంటే ఎన్.టి.ఆర్ ది మాటల ప్రభుత్వమని దీనర్థం), పోస్టు కార్డు వ్రాస్తే స్పందిస్తా, ప్రజలతో ముఖ్యమంత్రి అంటూ మాటలు దొబ్బటంతోనే తొందరగా ఇంటికి పోయాడు.

వై.ఎస్. ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పలేదుగాని ఒకసారి పది అంశాలతో ఒక మెయిల్ పంపితే పది అంశాలు వెంటనే ప్రకటించి అమలు కూడ చేసాడు (ఒక్క మద్యపాన నిషేదం మినహాయించి). పాపం కిరణ్ గారికి ఈ విషయాలు తెలీవనుకుంటా.

ఇప్పటి సి.ఎం.స్పీకర్గా ఉండగానే గొప్పగా ప్రకటించారు ప్రజలు తమ సమస్యలను తన దృష్ఠికి తెస్తే పొడుస్తానని. వెంటనే  అప్పట్లో మా నియోజకవర్గానికి సంభందించి అరవై అంశలాతో ఒక ఉత్తరం కొరియర్ ద్వారా పంపాను . ఈ రోజుదాకా దాని పై స్పందన లేదు . దానిని బ్లాగులో పోస్టు కూడ చేసాను.

స్పీకర్ పోస్టు అన్నది రిటైర్డ్ వ్యక్తులు చేసే పోస్టు.అందులో ఉండి కూడ స్పందించని సి.ఎం. ఇప్పుడు ఎస్.ఎమ్.ఎస్ ల పై స్పందిస్తాడంటే ఇది డ్రామా కాక మరేమి?

చంద్రబాబు కూడ చెప్పేవారు "ఇది ప్రజల ప్రభుత్వం -ప్రజలు కూడ సలహాలివ్వాలి -తప్పులు జరిగితే ఫిర్యాదులు చెయ్యాలి. సలహాలు పాటిస్తాం.ఫిర్యాదుల పై చర్యలు తీసుకుంటాం -పోస్టు కార్డు వ్రాస్తే స్పందిస్తాం"

ఏం పొడిచారు? ఏమి లేదు.. తిరుగు టపా ఖర్చుకు పది రూపాయల ఎం.ఓ పంపితే దానిని సైతం సి.ఎం కార్యాలయం స్వీకరించి తగులుకుంది. నేను వినియోగదారుల ఫోరమ్లో కేసు పెడితే విధి లేక "మీ సలహాలను తగిన రీతిలో వాడుకుంటామని" రిప్లై ఇవ్వవలసి వచ్చింది.

నూతన్ దంపతులను ఎవరన్నా శతమానం భవతి అని ఆశీర్వదిస్తారు ( అర గంటలో పెళ్ళి కొడుకు  గుండె పోటుతో చని పోవచ్చు- పెళ్ళి కూతురు లేచి పోవచ్చు అది వేరే కథ)

కాని ఈ నూతన మంత్రి వర్గం వంద రోజులు దాటితే అదే గిన్నెస్ రికార్డు.

గమనిక:
నేరాలను వారించేందుకంటూ డజన్ల కొద్ది సలహాలు హోం శాఖకు పంపాను.వెంటనే పొడుస్తామని మెయిల్ కూడ పంపేరు. కాని ఈ రోజుదాకా ఏమీ పొడవలేదు.. చేతకాదని తెలిసి తెలిసి గొప్పలెందుకు అన్నదే నా చికాకుకు కారణం

నేరాల అదుపుకు నేనిచ్చిన సలహాలు:

నేరాలు జరిగాక నేరస్తులను పట్టి శిక్షించడం కన్నా నేరాల అదుపుకే అత్యధిక ప్రాధన్యత ఇవ్వాలి.
*సమాజంలో ఏ ఒకరైనా నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నాయి. నేరాలలో ముఖ్య పాత్ర పోషించేవి అద్దె గదులు,వాహణాలు,సెల్ ఫోన్స్ . కాబట్టి గది అద్దెకు తీసుకోవాలన్నా ,వాహణం కొనాలన్నా,సెల్ ఫోన్ కొనాలన్నా హ్యాండ్ ప్రింట్స్ అవసరమని చట్టం తేవాలి.
*పోలీసు స్టేషన్ లలో బాధితులకు న్యాయం జరిగేట్లుంటే కేసులు లేవు,అప్పీళ్ళు లేవు.పంచాయితీలు లేవు. అవి ముదిరి /వికటించి జరిగే హత్యలూ ఉండవు,ఆత్మ హత్యలు ఉండవు. కాబట్టి సంబందిత స్టేషన్ ఎస్.ఐ. జిల్లాజడ్జి పర్యవేక్షణలో సమస్యలను రాజి చేసే ఏర్పాటు చెయ్యాలి.
*పోలీసు స్టేషన్స్ లో విజిటర్స్ బుక్ ఉండాలి.అందులో సంతకం చెయ్యనిదే ఐ.జి అయినా సరే హోం శాఖా మంత్రి అయినా సరే లోనికి వెళ్ళే ప్రసక్తి ఉండకూడదు.
*స్టేషన్ ఫోనుకి,ఎస్.ఐ.మరియు సిబ్బంది ఫోన్లకు వచ్చే ఇన్కమింగ్ ,అవుట్గోయింగ్ కాల్స్ వివరాలు ప్రతి నెలా నమోదయ్యే ఏర్పాతు చెయ్యాలి
*పాత నేరస్తుల డేటాను వెబ్ సైటులో పొందుపరచాలి. వారికి (వారు కోరితే) ఉపాది కల్పించే ప్రయత్నం చెయ్యాలి. వారి మోవ్ మెంట్స్ మీద నిరంతర నిఘా ఉండాలి. వారు వలస వెళ్ళినప్పుడు ఆ సమాచారాన్ని అన్ని స్టేషన్స్ కి పంపాలి.
*ముఖ్యంగా ప్రతి స్టేషన్ లోను 3 సెట్స్ ఆఫ్ సిబ్బంది ఉండాలి. షిఫ్ట్ సిస్టమ్ ఉండాలి. ప్రతి పని లిఖిత పూర్వకంగా పారదర్శకంగా జరిగేట్లు తదుపరి షిఫ్ట్ లో వచ్చే అధికారి లేదా సిబ్బంది ఎటువంటి ఇబ్బంది లేక విచారణ, చర్యలు కొనసాగించే విదంగా ఉండాలి.
*నూతన వధూవరుల సమాచారాలు వెనువెంటనే సంబందిత స్టేషన్స్ కు చేరే ఏర్పాటు ఉండాలి. (వారి ఫోటోస్, హ్యాండ్ ప్రింట్స్)
*అలాగే పోలీసుల బీట్లో తారాసపడే ప్రేమికుల సమాచారమ్ కూడ పొందుపరచబడి ఉండాలి.( వారి ఫోటోస్, హ్యాండ్ ప్రింట్స్)
*ఆస్తి పంపకం జరిగిన/జరగాల్సిన సోదరులు,భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారు,చిరుధ్యోగులు,నిరుధ్యోగులు,మూత బడ్డ ఫ్యేక్టరిల కార్మికుల సమాచారాలు కూడ 24 గంటలు స్టేషన్ కంప్యూటర్ లో అందుభాటులో ఉండాలి. ప్రతి స్టేషన్ లోను ఇంటర్ నెట్ సౌఖర్యం ఉండాలి. ప్రతి స్టేషన్ కు ఇ మెయిల్ ఐడి ఉండాలి. వారానికొకదినం ఆయా ఎస్.ఐ.లు తమ పరిదిలోని ఏరియాలో పర్యటించాలి .ప్రజలను వాకబు చెయ్యాలి.నెలకొక దినమన్నా ఆన్ లైన్ లో ఉండి యువతతో చాట్ చెయ్యాలి.
*ప్రతి స్టేషన్ పరిదిలోను యువజన సంఘాలు ఏర్పాటు చెయ్యాలి. వారు Hardy body,windy mind,holy soul కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలి.
*పోలీసుల పని భారాన్ని తగ్గించాలి. తర్కం లేని పొంతన లేని చట్టాలను ఎత్తి వెయ్యాలి. ఉ.పైరసి క్యేసట్స్,సి.డి ల వ్యవహారం. పైరసి సి.డి ల దరలకే ఒరిజినల్ సి.డి లు తయారు చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే కోళ్ళ పందెం,పేకాట వంటివి
ఇటువంటి షోకులున్నవారు “తమకు అందుకు తగ్గ ఆర్తిక స్థోమత ఉన్నదని,తమకు ప్రభుత్వ రాయితీలు,రుణాలు,రుణ మాఫీలు,ఉచిత వైద్యాలు అవసరమ్ లేదని ఒక అఫిడవిట్ ఇస్తే వారికి లైసెన్స్లులు ఇచ్చి పారెయ్యాలి. ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి వ్యభిచారానికి చట్ట బద్దత
*నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు,ఫ్యేక్షన్ ప్రాభల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం అత్యధిక ప్రాధన్యతతో మానవ వనరుల అభివ్రుద్దికి,ఉపాదికి చొరవ తీసుకోవాలి. జాతీయ బ్యాంకులు ఈ ప్రాంతాలను దత్తత తీసుకునే ఏర్పాటు చెయ్యాలి. బ్యాంకులు డైలి లోన్స్, మార్కెట్స్ లో ఉదయం పెట్టుబడి సమకూర్చి సాయంత్రం వడ్డితో వసూలు చేసుకునే వీలు కల్పించ వచ్చు. ఈ ప్రాంతాల్లోని యువతకు పోలీసు ఉధ్యోగాల్లో ప్రిఫెరన్స్ ఇవ్వవచ్చు. ( అన్ని స్టేషన్స్ కి 3 సెట్స్ ఆఫ్ సిబ్బంది అవసరమన్నాం కదా !)
*పోలీసు సిబ్బందికి తప్పనిసరి వైద్య,సైక్రియాట్రి పరీక్షలు నిర్వహించాలి. సమస్యలుంటే ఉచిత వైద్యం ,కౌన్సిలింగ్ ఏర్పాటు చెయ్యాలి
*అవివాహితులైయుండి మహిళలతో వ్యవహారం నడిపే స్థితిలోని ఉధ్యోగులు,టీచర్స్,లెక్చరర్స్,రోగిష్ఠి భార్య గల ఉధ్యోగులు,భార్యకు దూరంగా బ్రతుకుతున్న ఉధ్యోగుల వివరాలు శేకరించి వారి పై నిఘా ఉంచాలి. ఇటువంటి సమాచారాల సేకరణకు యువజనసంఘం వారి సహకారం తీసుకోవచ్చు.
*ముఖ్య నగరాల్లోని ప్రజలకు పోలీసులు గుర్తింపు కార్డులివ్వాలి. ప్రతి పౌరుని వివరాలు స్టేషన్ కంప్యూడర్లో ఉండాలి.

*అలాగే ఆ నగరాలను చీస్ చెయ్యాలి. నగరం లోపలికి కొత్తగా ప్రవేశించేవారికి స్థానికులు ఎవరైనా హామి ఇస్తే గాని అనుమతించ రాదు. పర్యాటకులైతే వారిని ఒకటికి రెండుసార్లు క్షున్నంగా పరిశోధించి,ఫోటో,హ్యాండ్ ప్రింట్ సేకరించాకే అనుమతించాలి.

*పోలీసు స్టేషన్స్,చెక్ పోస్టుల్లో పబ్లిక్ నుండి అబ్జర్వర్లను నియమించాలి. ఎవరు ఏ రోజు ఏ స్టేషన్ లేదా ఏ చెక్ పోస్టుకు అబ్జర్వర్ గా వెళ్ళనున్నారో అర గంట ముందుగాని వారికి తెలియ కూడదు.(జంబ్లింగ్ పద్దతి)
*పుణ్యక్షేత్రాల్లో పాత నేరస్తులు,వాంటేడ్ పెర్సన్స్ యొక్క హ్యేండ్ ప్రింట్స్ స్టోర్ అయిన కంప్యూటర్స్ ఏర్పాటు చెయ్యాలి. దాని ప్రక్కనే ఉన్న స్కేనర్ మీద హస్తం పెడితే ఆ హ్యేండ్ ప్రింట్స్ని కంప్యూటర్ రీడ్ చేసి సదరు హ్యాండే ప్రింట్ తన డేటా బేస్ లో ఉందో లేదో చెక్ చేసి ఉంటే బీప్ చెశి అప్రమత్తం చెయ్యాలి.
*కోర్టుల్లో సం.కంటే మించి ఎట్టి కారణం చేత కూడ కేసులు పెండింగ్ పడకుండా చట్ట సంస్కరణలుతేవాలి. సం.నికి మించి ఏదైన కేసు పెండింగ్ లో ఉంటే ఆ కేసు సమ్బందిత వాది,పరతి వాదులు వివరాలను సేకరించి వారి పై నిఘా ఉంచాలి.
*పోలీసు సిబ్బంది వివరాలను( రోగాలు,పరైవేట్ రుణాలు,ఒకరికంటే ఎక్కువ భార్యలు వంటి వివరాలతో సహా) సేకరించాలి. నేరాలకు ఉన్న అవకాశాలను ముందుగనే అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
*రియల్ ఎస్టేట్,గ్రానైట్స్ వంటి రంగాల్లో వారి వివరాలు కూడ తీసుకోవాలి.
*పోలీసు సిబ్బందికి,అతనికి కుటుంభ సబ్యులకు ఉచిత రవాణా,ఉచిత వైద్యం,ఉచిత గ్రుహం ఏర్పాటు చెయ్యాలి
*ఎఫ్.ఐ.ఆర్ వేసాక కేసు నడిపే భాధ్యతను మరో సంస్థకు అప్పగింఛాలి.
*జర్నలిస్టుల్లో చాలా మందికి తాము చట్టానికి అతీతులమన్న భ్రమ ఉంది. వీరి పై పలు సందర్భాల్లో ఫియాగులు వచ్చినప్పటికి వత్త్ళ్ళ కారణంగా అవి కోర్టుల ద్రుష్ఠికి వెళ్ళడం లేదు. కాబట్టి సిట్టింగ్ జడ్జి నేత్రుత్వంలో ఒక విచారణ కమిషన్ నియామకం జరగాలి. జర్నలిస్టులపై వచ్చిన ఫిర్యాదులు,కేసులన్ సమీక్షింఛి తగిన చర్యలు తీసుకోవాలి.

2 comments:

  1. chala bagundi murigesan garu,meeru ys abhimani,manchi jyotiskulu,mee analysation bagundi,

    kani danni sariga upayoginchandi,ani yenduku antunnano grahinchagalru,

    vignanam gal meeru, ys planalo gala lopalu yerugagalru,akrama sampadana, hatyalu ,maranakaanda,dopidi gurinchi telusukogalrani prarthana,

    abhimanm veru, vaastavam veru, idi yevarikaina okate,dayachesi meeru comon people ku upayogapadandi

    dayachesi alochinchandi,prstuta rajakiya nayakula rakshasa neeti ki(mee ys &famili,babu&co,bjp,trs) entamandi bdapadutunnaro,govt schemela valla baddakstulu ,taruvata bicchagallu ga marutaru,

    pl i hope you will understood

    raja,vijayawada

    ReplyDelete
    Replies
    1. అయ్యా !
      ఎన్.టి.ఆర్, వై.ఎస్.ఆర్,జగన్ వీరెవరు దేవుళ్ళు కారు. కాని ఆయా రోజులకి వారే బెటర్ చాయిస్ అయి కనిపింఛారు కాబట్టి నా వ్రాతలు ఇలా సాగుతున్నాయి.

      రామావతారం వేరు కృష్ణావతారం వేరు. కృష్ణుడు ఏక పత్ని వ్రతుడు ఎందుకు కాలేదంటే నేనేం చెప్పగలను. ఇవన్ని యుగధర్మాలు.

      పాత తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు ఎలా ఉండేవో వాటికన్నా చండాలంగా నేటి హీరో పాత్రలున్నాయి. దీనినే కాల దర్మం అంటారు

      కాని హీరో హీరోనేగా. లోపాలు ప్రతి పాలనలోను ఉంటాయి. మంచి చెడులను బేరేజు వేసుకుని మంచి ఎక్కువ ఉన్న పక్షాన్ని బలపరచాలి.

      మంచి చెడులను కలిపి ఫోకస్ చేస్తే మన రచనలు -భావాలు గజి బిజిగా తయారవుతాయి. రేపు జగన్ ముఖ్యమంత్రి అయితే -జగన్ పాలనలో లోపాలుంటే వాటిని సైతం ఎత్తి చూపుతూ టపాలు వ్రాస్తా.

      నా అంచనాలన్ని తారుమారై ఒక వేళ యుపిఏ థ్రీ ప్రభుత్వం మరింత భలంగా ఉంటే మాత్రం ఆ పని చెయ్యను.

      నేనేం చేసినా /వ్రాసినా అందులో ప్రజాహితమే ఉంటుంది. అర్థం చేసుకొండి

      Delete