క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday 3 December 2010

జగన్ కొత్త పార్టి రూపు రేఖలు ఇలా ఉంటే మేలు

పార్టి ప్రాధన్యతలు:
*ప్రతి పౌరుని ఆత్మ గౌరవం, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో ఉపాది మరియు ఉధ్యోగవకాశం ప్రాణ రక్షణ - కూడు,గూడు,గుడ్డ, విద్య ఆరోగ్యానికి అత్యంత ప్రాధన్యత.

*తెలుగు నాట ఆశేష  ప్రజాభిమానాన్ని చొరగొన్న ఎన్.టి.ఆర్, వై.ఎస్.ఆర్ ఆదర్శాల అచరణకే మొగ్గు. సంక్షేమం అభివృద్దిల నడుమ బేరేజు

పార్టి రూపు రేఖలు:
పేరు : కాంగ్రెస్ వై.ఎస్.
జెండా: మువ్వన్నెల జెండా నడుమ వై.ఎస్. ఆర్

ప్రత్యేకతలు:

*అటు దేశ భక్తి, దేశ భద్రత, సమగ్ర దేశాభివృద్దికి కట్టుబడి ఉంటూ రాష్ఠ్ర్ర ఆత్మ గౌరవం, అభివృద్ది,సంక్షేమాలకై నిర్విరామ పోరు

* ప్రతి విషయంలోను  అంతర్గత ప్రజా స్వామ్యం -స్వేచ్చ

*పార్టికంటూ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెని. ప్రతి సభ్యునికి షేర్స్. సతరు కంపెని ఆద్వర్యంలో వెబ్ సైట్, టివి చానల్, దిన పత్రిక, ఒక ఎఫ్.ఎమ్. రేడియో చానల్

*ప్రతివారం పార్టి అద్యక్షునితో కార్యకర్తల ఇంటరాక్షన్ ( టి.వి చానల్ ద్వారా)

*సభ్యులకు ప్రత్యేక కరెస్పాండెన్స్ కోర్శు -అందులో నెగ్గితేనే యాక్టివ్ మెంబర్ షిప్. నిరక్షరాశ్య్లకు ఆడియో ,వీడియో లెసన్ ప్లాన్ -  ఓరల్ టెస్ట్. ( ముఖ్యాంశాలు: ప్రజాస్వామ్యం - నిర్వహణ -ప్రజా సంభందాలు - వై.ఎస్.ఆర్

*లీగల్ సెల్ పై ప్రత్యేక దృష్ఠి - సామాన్య కార్యకర్తకు చట్ట, న్యాయ  సాయం -అధ్యక్షుని ప్రత్యక్ష పర్యవేక్షణలో

*వివిద స్థాయిలో స్పోక్స్ మెన్ ( అధికార ప్రతినిదులు)


తెలంగాణ సమస్య :

ప్రత్యేక రాష్ఠ్ర్ర డిమాండు వెనుకున్న వాస్తవికతను గుర్తించటం.డిమాండుకున్న  కారణాలను (అసమానత) రూపు మాపేందుకు వంద రోజుల ప్రత్యేక ఆపరేషన్ చేపట్టడం . ఆపై తెలంగాణ ప్రజల మద్య వోటింగ్ నిర్వహించి ప్రజలు కోరుకుంటే తెలంగాణా లేకుంటే గోల్డెన్ తెలంగాణా

పరిపాలన చేపడితే (ఎన్నికల హామి) :

* జల యజ్నం పై సిటింగ్ జడ్జితో విచారణ కమిషన్ - ప్రత్యేక మంత్రిత్వ శాఖ - ప్రత్యేక సిబ్బంది - ఈ తరహా ప్రాజెక్టులు చే పట్టి సక్సెస్ అయిన దేశానికి చెందిన నిఫుణుల సాయం + పర్యవేక్షణ

*ప్రతి కుటుంభానికి ఒక సెల్ ఫోన్ ఉచితం (విత్ ఎఫ్.ఎమ్ రేడియో)  ప్రతి పట్ట బద్దునుకి ఒక కంప్యూటర్

*స్వచ్చంద బైండోవర్ ( స్టాంప్ పేపర్ పై డిక్లరేషన్ ఆధారంగా ఎటువంటి దర్యాప్తు లేకనే తక్షణం సంక్షేమ పథకాల వర్తింపు. మూడు నెలలలోపు విచారణ - నిర్ధారణ అనర్హులని తేలితే క్రిమినల్ చర్యలు.

*ప్రత్యేక రోగ నిరోధక ప్రాజక్ట్ - ఆరోగ్య శ్రీతో అనుసందానం

*రెండు రూపాయలకే బియ్యం పథకం క్రింద నెలకు ముప్పై కేజిల బియ్యం - అది వద్దన్న అర్హులకు పదిహేను కేజిల సన్న బియ్యం

*మందు బాబులకు ప్రత్యేక యూజర్ నెంబర్ - కిడ్ని -కాలేయం సంభంధ వ్యాధులకు ఇన్షియూరెన్స్ వర్తింపు - ప్రిమియం చెల్లింపు భాధ్యత లిక్కర్ తయారీ సంస్థలకు

*ప్రభుత్వ ఆసుపత్రుల పని తీరు పై సమీక్షాధికారం డిగ్రీ కళాశాల విద్యార్థులకు..

*స్వయం సహాయక బృంధాలకు మని సీక్రెట్స్ , సంపాదన మార్గాల పై ప్రత్యేక శిక్షణ

*సమిష్ఠి వ్యవసాయానికి ముందుకొచ్చే గ్రామాలను ప్రభుత్వం దత్తత్తు తీసుకోవడం - భూమి పై హక్కు మాత్రం రైతులకే

*ప్రభుత్వ ఉధ్యోగులకు డే టు ఇన్ఫర్మేషన్ పై టెస్ట్ పై పరీక్షలు. తప్పితే సగం జీతంతో శెలవులు - మళ్ళి పరీక్షలు- అందులోను తప్పితే గోల్డెన్ షేక్ హేండ్. వారికి శారీరక, మానసిక పరిశోదనలు -రుగ్మతలుంటే ఉచిత వైద్య సేవ .

*ఎస్.సి,ఎస్.టి, బి.సి కులస్తుల్లో వంశ వృక్షంలో లేదా కుటుంభంలో తొలి పట్ట బద్దునికి అత్యంత ప్రాధన్యత.

*ప్రతి శాఖలోను కంప్యూటరీకరణ - పారదర్శకత

(ఇంకా ఉంది)

2 comments: