క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Sunday, 2 January 2011
ఘంటశాల భగవద్గీతలో లోపాలు
భగవద్గీత పై నాకు ఎన్నో విమర్శలున్నాయి. వీటిని తమిళంలో ఏకంగా సీరియల్గానే వ్రాసి సంచలనం సృష్ఠించాను. కృష్టుడు ఎలా ఉంటాడని తెలియని వారు ఎన్.టి.ఆర్ ని చూసి కృష్టుడు ఇలానే ఉండి ఉంటాడని అనుకుంటుంటారు. ఇదే విదంగా ఘంటశాల నోటి మాటగా భగవద్గీత వింటుంటే కృష్ణుడి మాటలు ఇలానే ఉండి ఉండాలి అని అనిపిస్తుంది. ఇందులో ఏ తర్కానికి తావులేదు.
ఘంటశాల గొంతులో ఉన్న అదోరకమైన వర్ణనాతీతమైన దైవత్వం కేవలం కాలికో బైండు పుస్తకాల్లో భంధీగా ఉన్న ఆ శ్లోకాలకు రెక్కలు తొడిగిన మాట నిజమే. పండితుల రకరకాల ఉచ్చారణలతో నలిగిన ఆ శ్లోకాల ఉచ్చారణకు ఒక నిఘంటువుగా ఘంటశాల భగవద్గీత నిలిచింది.
ఉదయ పూర్వం చలిలీ మా రాములవారి గుడివీథి దాటి వెళ్తుంటే ఘంటశాల నోట ఆ శ్లోకాలు చెవి చేరుతుంటే నా కవి హృదయం ఈ భివియంతట శ్రీ కృష్ణుడ్ని ఊహించుకుని ఉర్రూతలూగేది. గీతలోని అహేతుకాలు, అవుట్ డేటడ్ డేటాలు అన్నీ నా బుర్రలోనుండి ఎగిరి పోయేవి.
ఇంతకీ లోపాలని శీర్షిక పెట్టి ఈ సొల్లేంటి అని మీరు విసుక్కుంటున్నారు కదా? పాయింటుకొస్తా!
నిజానికి నేను లేవనెత్తనున్న లోపానికి ఘంటశాల కారకులయ్యుండరని నా విశ్వాసం. గీత అన్నదే ఒక సంభాష్ణ. దానిని రికార్డు చెయ్యాలనుకున్నప్పుడు ఇద్దరు గాయకుల్ని ఏర్పాటు చేసి ఉండాలి.కృష్ణుడి పాత్రకు ఘంటశాల -అర్జునుని పాత్రకు మరో గాయకుడు.
అలాగే ఫలానా అద్యాయం ఫలానా శ్లోకాలు అన్న డేటాలను చెప్పడానికి మరో వ్యక్తి గొంతును వాడి ఉండాల్సింది.
ప్రస్తుతమున్న టెక్నాలజికి గీతను రీ రికార్డింగ్ చెయ్యడం చాలా తేలిక. ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఈ పని చెయ్యొచ్చు. అర్జునుని వాయిస్ కు ఎస్.పి వాయిస్ సరిగ్గా సరిపోతుంది. డేటాలు చెప్పడానికి మరో బిగినర్ ఎవరినన్నా వాడుకోవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)



మీ పోస్ట్ లోనే బోల్డన్ని అక్షర దోషాలు ఉన్నప్పుడు ఘంటసాల భగవద్గీతలో కొన్ని తప్పులు ఉండటం లో ఆశ్చర్యమేముంది? తప్పుగా అనుకోకండి మీరు చెప్పిన విషయం నేను అంగీకరిస్తున్నాను.కానీ గొప్ప గొప్ప పనుల్లో చిన్న చిన్న లోపాలు ఎంచడం సహేతుకం కాదేమో అని నా అభిప్రాయం. మనకు తెలిసిన గీత సంజయుడు దృతరాష్ట్రుడికి చెప్పినది (యుద్ధ రంగంలో ఏం జరుగుతోందో సంజయుడు తన జ్ఞాన చక్షువుతో చూసి దృతరాష్ట్రుడికి వివరిస్తాడు), ప్రత్యక్షంగా గీత విన్న అర్జునుడు, హనుమంతుడు(జండాపై కపిరాజు) దాన్ని ఇతరులకు చెప్పినట్టు భారతం లో లేదు. అందుకని ఇదంతా ఒకే వ్యక్తి చేత చదివించడంలో తప్పు లేదని నా అభిప్రాయం.నేను చెప్పిన దానిలో లోపాలుంటే మన్నించండి.
ReplyDeleteషంకి గారూ,
ReplyDeleteనేనైతే తమిళ సాంబారు గాడ్ని. నాకు తెలుగు నేర్పేటంత తెలుగు తెలిసిన వారెవ్వరు నాకు తగల్లేదు. లోపాలున్నవి అంగీకరిస్తున్నాను.
కాని నాదో వింత మనస్తత్వం ఏ పనిలోనైనా (మరీ అది గొప్ప పనైతే) దానికి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని ఉవ్విళ్ళురుతాను.
ఇంత భాద్యతాయుతమైన కమెంట్ వ్రాసి తీరా మన్నించమనడం ఏంది?
గీతపై నా విమర్శలను తెలుగులో వ్రాస్తే ఆప్పుడు భూతులు తిడతారేమో?
(మీరు కాదనుకుంటా -రాజేష్ వంటివారు)
బూతులు తిట్టడం ఎందుకండీ? మాతృభాష ను అమితంగా ప్రేమించే తమిళులు తెలుగు పట్ల ఇంత అభిమానం చూపుతున్నందుకు అభినందించాలి గానీ.
ReplyDeleteఆ శ్లోకాలు పుస్తకం లో వ్రాసిన వారు ఒకళ్ళు అయినప్పుడు పాడిన వారు కూడా ఒకళ్ళు అయితే తప్పులేదేమో. నా ఉద్దేశం లో నాటక ఫక్కీ గా ఇద్దరు పాడితే బాగుండదేమో అని అనిపిస్తుంది.కొత్త సంవత్సరం లో నా మొదటి వ్యాఖ్య "సాంబారుగాడు" లో పెట్టటం ఈ సంవత్సరం తేలిక గ గడిచి పోతుంది అని
ReplyDeleteఅనిపిస్తోంది. హాపీ న్యూ ఇయర్ టు యు.
రావు గారూ,
ReplyDeleteమీ రాకకు,మీ వ్యాఖ్యకు థ్యాంక్స్. నాతో అకీభవించినందుకు మరీ థ్యాంక్స్.
స్క్ర్రీన్ ప్లే కూడ ఒకరే వ్రాస్తారు.అందుకని సినిమా అంతట ఒకరే డవులాగులు దంచుతుంటే ఎలా ఉంటుంది?
తెలుగు అక్షరంతో " మ్ " కలిసినప్పుడు అది భీజం అవుతుంది. మరీ సం సాం అంతా సరస్వతీ భీజాలు.
కార్యజయాన్నివ్వడంలో సరస్వతి దేవి స్పెషలిస్టు.
శృతిని మాత్రం గమనిస్తే శాంభవి అమ్మవారి నామం. శంభో అంటే అది అయ్యవారి నామం. సాంబా అంటే అందులో ఇన్ని విశేషాలున్నాయి.
సాంబారుగాడు బ్లాగులో మీ తొలి (సం.లోని) వ్యాఖ్య పడిందంటే ఈ సం. లో మీకు మంచి మంచి మలుపులు సంభవం అన్నమాట
షంకి గారు,
ReplyDeleteమానవుడు గత అనుభవాల ఆధారంగానే ఆలోచిస్తాడు. నెనూ మానవుడ్నెగా.మీ ఔదార్యానికి మళ్ళీ థ్యాంక్స్
ఎంత కామెంట్ల కక్కుర్తైనా ఇంతలా చెత్త పోస్ట్ రాయాలా? అది ఏకపాత్రాభినయం లాంటిది అయ్యుంటుందిలే అని నీ పాసిన సాంబార్ బుర్రకెందుకు తట్టలేదు?
ReplyDelete