
ఎందుకో నాకీ ఆశ కలిగింది. అడ్డమైన వారంతా హీరోలుగా హీరోలు తెరకెక్కేస్తున్నారు. ఒక హీరోకు కావల్సిన సర్వ లక్షణాలు గల జగన్ హీరోగా ఎందుకు చెయ్యకూడదు. ..మొఖంలో ముడతలు ఎక్కువై పోయి ,బొజ్జ పిరుదులు బలిసిపోతే రాజకీయ ప్రవేశం చేసి సి.ఎం అయిపోవాలనుకుంటే అది అత్యాశ.( నేనిక్కడ చిరంజీవిని మాత్రమే ప్రస్తావించడం లేదు తమిళనాడులో ఒక గుంపే ఉంది).అటువంటిది హీరోకు కావల్సిన ముఖ వర్చస్సు,వయస్సు అన్నీ ఉన్న జగన్ హీరోగా చేస్తే తప్పేంటి .పైగా కొత్త పార్టి -కొత్త సింబల్ ప్రజల్లోకి చొచ్చుకు పోవాలంటే ఇదే బెటర్ వే!
జగన్ చిటికేస్తే నిర్మాతలు క్యూలో నిలబడతారు. మరీ రొటీనుగా డూయట్లు, ఫైట్లు లేకుండా ఓ ఆదర్శప్రాయమైన సినిమా,మంచి సినిమా తీయొచ్చు. పత్రికలు చదవని వారు, మీడియాలో న్యూస్ చానల్స్ చూడని వారు లక్షల్లో ఉన్నారు. కొత్త పార్టి పేరు -సింబల్ వారిని సైతం చేరాలంటే ఇదే మంచి మార్గమేమో?
కొత్త పార్టి జెండా ఇలా ఉంటే బెటరేమో?
సాంబారుగారూ,
ReplyDeleteజగన్ గురించి మీరు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నట్లున్నారు....మీరభిమానించే NTR, YSRల స్థాయిలో. అతనికి అంత సీను లేదనుకుంటా. డబ్బు, మదం, ఆవేశం,సీఎమ్ కూర్చీపై కాంక్ష తప్ప అతని దగ్గర ఉన్న గొప్ప లక్షణాలేమిటో నాకైతే కనబడటంలేదు.
జగన్ నవ్వినా ఏడ్చినా మొహం ఒక లానే ఉంటుంది. అబ్బే ! సినిమాలలో హీరోగా కష్టం. విలన్ గా నైన కమెడియన్ గా నైన ట్రై చేస్తే మంచిది.
ReplyDeleteప్రజల నుంచి దోచుకున్న వేల కోట్లు ఉండగా హీరో గా రావడం పెద్ద కష్టమేమి కాదు లెండి.