క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday, 11 March 2011

ఈ నెల 19న చంద్రుడు భూమికి దగ్గరగా ..


గురుజి ఆదేశం మెరకు ఈ టపా వ్రాస్తున్నా. ఈ నెల 19న చంద్రుడు భూమికి దగ్గరగా ..రానుందని నానా రాద్దాంతం చేస్తున్నారు. కొందరైతే సందిట్లో సడేమియా అంటూ ఇదే ప్రళయానికి నాంది అని బెంబేలెత్తిస్తున్నారు. ఈ వార్త పై స్పందించడానికి ముందు చిన్న మాట చెబుతాను.

అస్ట్ర్రాలజికి అస్త్త్రానమికి చాలా తేడాలున్నవి. జ్యోతిష్కుని పాత్ర చాలా చిన్నది. పైగా నా బోటి నేటి తరం జ్యోతిష్కులకు బిల్డింగ్ స్త్త్రాంగ్ - బేస్ మెంట్ వీక్. పైగా ఈ విద్య ఒకే కులం వారి గుత్తలో ఉండి వారి చేత త్యజించ బడి ప్రస్తుతం మిగిలింది శకలాలే. వాటినే మేము నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాం.

చంద్రునికి సముద్రానికి ఉన్న లింక్ సుప్రసిద్దం. ( పున్నమి నాడు అలలు ఎగిసి పడతాయి). మనిషి శరీరంలోని వాటర్ కంటెంట్ 70 శాతం పై మాటే. ఈ వాటర్ కంటెంట్ యొక్క కెమికల్ కాంబినేషన్ సముద్రపు నీటిలోని కెమికల్ కాంబినేషన్ ఒకటే అని ఇప్పటికే రుజువైంది.చంద్రుడు భూమికి చేరువగా రావడం వలన సముద్రం, సముద్ర తీరం పై దాని ప్రభావం ఖచ్చితంగా ఉండొచ్చు . నేను కాదనను. చంద్రుడు మనో కారకుడు (మనస్సు) ఊపిరితిత్తులు,మూత్ర పిండాలను ప్రభావించ గలవాడు. కాబట్టి ఈ రుగ్మతలతో ఉన్నవారికి ఇబ్బంది కాస్త ఎక్కువ కావచ్చు. అలానే మనోరోగములతో ఉన్నవారికి ఇబ్బంది పెరుగ వచ్చు. ఇది కేవలం నా ఊహ మాత్రమే. కర్కాటక రాశి వారికి ఈయన రాశి నాదుడు కనుక వీరి పై, చంద్రుడు ఆ రోజు సింహ కన్య రాశుల్లో ఉంటాడు కాబట్టి ఆ రాశుల వారి పై ప్రభావం చూపొచ్చు.

సర్ ఐసక్ న్యూటన్ అమావాశ్య,పౌర్ణములు ఆదివారం రోజున వచ్చి ఆరోజున చంద్ర, సూర్య గ్రహణాలు జరిగితే ఇబ్బంది అని చెప్పినట్టు ఎక్కడో చదివాను. అది ఇప్పుడు గుర్తుకొస్తుంది. బ్రహ్మంగారి కాలజ్నానాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించాను . ఇప్పటికీ నమ్ముతున్నాను.కాని ఆ శ్లోకాల అర్థం పరమార్థం తెలిసిన వారు ఎవరు? విప్పి చెప్పగలవారెవరు? ఎవరికి వారు చెరో లెక్కేసి 2008 కి ప్రళయమని కోడై కూసేరు .ఏమైంది? అంతా తుస్సుమంది. ఇది బ్రహ్మంగారి పొరభాటని నేను భావించడం లే. వ్యాఖ్యాన కర్తల తప్పిదమే ఆయ్యుంటుంది.


ప్రస్తుతం లోని కొన్ని విషయాల పై నా వ్యాఖ్యలు ఇక్కడ అందిస్తున్నాను.

// 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా భూమికి దగ్గరగా రానున్నాడు చందమామ.// అని పేర్కొన్నారు.

ఇరవై ఏళ్ళకు ముందు జరిగిన సంఘఠనేగా? అప్పట్లో జరగనిది ఇప్పట్లో ఏమీ జరుగుతుంది?

// ఆ రోజున భూమికి, చంద్రుడికి మధ్య దూరం 2,21,556 మైళ్లకు తగ్గుతుంది. ఎప్పుడూ ఉండే దూరంతో పోలిస్తే ఇది 17 వేల కిలోమీటర్లు తక్కువ.//
2,21,556 మైళ్లతో పోల్చుకుంటే 17 వేల కిలోమీటర్లు తగ్గడం అంటే చాలా చాలా తక్కువేగా? ..

//కానీ అది చేయబోయే పనే కొంపలు ముంచేలా ఉంది. చంద్రుడు, భూమికి ఇలా దగ్గరగా రావడం వల్ల అగ్ని పర్వతాలు బద్దలవుతాయి. సునామీలు విరుచుకుపడతాయి. భూకంపాలు సంభవిస్తాయి. వైపరీత్యాలు వచ్చిపడతాయి ఇంతకుముందు కూడా ఇంతే. 1955, 1974, 1992, 2005 లో కూడా ఇదే పరిస్థితి. అప్పుడూ ఇలాంటి సమస్యలే వచ్చాయి//
ఈ సృష్ఠిలో ఒక క్రమం ఉంది.లయ ఉంది. కొన్ని సంఘఠనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. ఇప్పట్లో మీడియా పుణ్యమా అంటూ అందరం తెలుసుకో కలుగుతున్నాం.చర్చించుకో కలుగుతున్నాం. అంతే తేడా. అప్పట్లోను భూమి చెక్కు చెదరలేదు. ఇప్పటికీ చెదరదనే భావిస్తున్నాను.
// కొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల మరీ విపరీతాలు చోటు చేసుకోవని... అవన్నీ అనవసర భయాలని కొట్టిపారేస్తున్నారు//

శాస్త్ర్ర వేత్తల మాటలే నిజమేమోననిపిస్తూంది..

//కాకపోతే... సముద్ర ఆటుపోట్లలో తేడా ఉండొచ్చని అంటున్నారు. అంతకుముందు చంద్రుడు ఎన్నోసార్లు భూమికి దగ్గరగా వచ్చినా ఒక్కసారే సునామీ వచ్చిందని చెబుతున్నారు.//

ఈ మాట నేను అంగీకరిస్తున్నాను.

2 comments:

  1. ఇంకా 19 రాకుండానే హవాయీ ద్వీపంలో అనుకోకుండా అగ్ని పర్వతం బద్దలయింది,జపాను లో భూకంపం మరియు సునామీ లిబియాలో పోరాటం మనకు దగ్గరలో హైదరాబాద్ లో ఉమ్మడి విగ్రహ విధ్వంసన. ఇవన్నీ అనుకోకుండా జరిగినవి. ఇంకా ఎన్ని జరుగుతాయో చంద్రుడు మళ్ళా తన చోటుకి చేరేలోగా.

    ReplyDelete
  2. ఎస్.లక్కిరాజు గారు,
    ముందు వెనుక జరిగేవాటిని సైతం "ఖాతాలో"వేసుకుంటే ఎలా? చూద్దాం 19 న ఏం జరుగుతుందో?

    ReplyDelete