
ఇదేమిటి అడల్ట్ జోకులు వ్రాసిన అతను, వ్యభిచారానికి చట్టబద్దత కల్పించలని కోరిన అతను ,హనుమన్న గురించి వ్రాయడమా ఇదేమిటి విడ్డూరం అని మీకు అనిపించొచ్చు. కాని నేటి నా స్థాయికి, మన:స్థైర్యానికి హనుమన్నే కారకుడు.
విద్యుత్ ఒక్కటే. అది ఫ్యేన్లో ప్రవేశిస్తే గాలిని, హీటర్లో వేడిని,కూలర్లో చల్లదనాన్ని ఇస్తుంది. అలానే ఈ సృష్ఠిలో ఉన్నది ఒకే పవర్. అది రక రకాలుగా తనను తాను ప్రదర్శించుకుంటుంది. అంతేగాని అవి వేర్వేరు శక్తులు కావు. ఈ మాట నాకు అనుభవంలోకి వచ్చినా హనుమన్న విషయంలో మాత్రం అతన్ని ప్రత్యెకించి చూడాలన్నదే నా ఆతృత. ఇది మూర్ఖత్వమే కూడ కావచ్చు.
ఆస్తికులు రెచ్చి పోమంటే ఒక్క మాట మీరు ఎంత పి.హెచ్.డి చేసి ఉన్నా మీ బడి పంతుల్ని చూస్తే మీలో కలుగుతుందే అదో రకమైన అహ్లాదమైన భావం ...అదే నాకు హనుమన్న పైనా కలుగుతుంటుంది.
ఇప్పటికి నేను ఎన్నో శక్తులకు వ్యతిరేకంగా పోరాడాను. పోరాడుతున్నాను. ఇంకెంత కాలం పోరాడతానో తెలీదు. (స్థూలమైనవే కాక -సూక్ష్మ శక్తులతో సైతం). నా పక్షాన నిలబడ్డది మాత్రం కేవలం హనుమన్నే. నా టీన్ ఏజ్ లో కేవలం నా కామవాంచను కట్టిడి చెయ్యడం కోసం హనుమన్న చెంత చేరాను. కాని ఆయన అంచెలంచులుగా అన్ని వాంచలనుండి నన్ను విముక్తుడ్ని చేసాడు. ఇప్పటికీ నాకున్న వాంచంతా ఒక్కటే అది పది మందికి మేలు జరగాలన్న వాంచే. వయస్సు మీద పడుతుంటే మనమేమి పొడవలేమన్న నిర్వేదం చోటు చేసుకుంటే ఆ వాంచ హుష్ కాకి అయిపోతుందేమో?
అవును.. ఇతను ఉన్నట్టుండి ఆంజనేయ స్వామి పురాణం అందుకున్నాడేమిటబ్బా అని మధన పడకండి. నేను దాదాపుగా 1991 To 2007 బ్రెడ్ హంటర్ గానే బతికిని వాడ్ని.( మద్య మద్యలో ఒకట్రెండు నెలలు మినహాయించి)
ఎంత డబ్బొచ్చినా ఒకే రోజున సెటిల్ మెంట్స్ చేసి ఖాళి చేసుకునే వాడ్ని. ఏ రోజుకా రోజు ప్లాన్ చేసుకునే వాడ్ని.అదే అసలైన ఆస్తికమన్నది నా పిచ్చి. కాని అదేమో తెలీదు కాని ఈ మద్య వద్దంటే డబ్బు. డబ్బు వస్తే మంచిదే గాని..
స్వతా:గా నేను అర్జునుడంతటి వాడ్ని ( యాభై శాతం) ఆయన అనుక్కున్నప్పుడు నిద్రించి -అనుకున్నప్పుడు మెల్కోగలడట. కాని నేను 24 గంటలనుండి 48గంటలదాక ఏ శ్రమా ,ఇన్ కన్వీనెన్స్ లేక మేల్కోని ఉండగలిగిన వాడ్ని.అదేం ఖర్మో తెలీదు కాని ఈ మద్య నిద్ర భలే భాగా పట్టేస్తుంది.
రాత్రిలో భోజనం మానేసి గంజి తాగడం మొదలు పెట్టా. ఊహూ. టిఫన్ ప్రిఫెర్ చేసా. ఊహూ. మద్యాహ్నాల్లో గంట నిద్ర పోతే ఒక రాత్రి పూర్తిగా హుషారుగా గడిపెయ్యగల వాడ్ని.
ఈ ప్రపంచమే నన్ను చెత్త నా కొడుకని దుమ్మెత్తి పోసిన రోజుల్లో సైతం నా మీద నాకు ఎంతో గౌరవం ఉండేది. కాని ఈ ఒక్క విషయంలో నా మిద గౌరవం సైతం తగ్గి పోతూంది. 1986 నుండి నేటిదాక నాకొచ్చిన రోగమంటూ చూస్తే ఒకటి లేదా రెండే .వాటిలో ఒక దానిని సంపూర్ణంగా నయం చేసుకో కలిగాను.మరోదానికి విది లేని పరిస్థితిలో రోజుకి అర్ద రూపాయి ఔషదం సేవిస్తున్నాను.
ఇవన్ని ఆంజనేయ స్వామి సలవేనని నా విశ్వాసం. సంజీవిణి వేరు తెచ్చినవాడు కదా. ఈ మద్య కాస్త అతి విశ్వాసం కారణంగా మెడలో దరించే అన్ని డాలర్లు తీసి వేసి శ్రీచక్రం మరియు మెక్కా మసీదు డాలరు మాత్రం దరిస్తూ వచ్చాను.
మద్యలో లగ్నాత్ అష్థమ కుజునికి ఆగమనం కారణంగా చిన్న విపత్తుకు గురై హడలెత్తి పోయి అన్నీ దరించడం మొదలు పెట్టాను. నేను తీసేసిన అన్నింటిలో ఆంజనేయస్వామి డాలర్ కూడ ఉందన్న మాట.
నేనెంతటి విశ్వాస ఘాతకుడ్నో నాకర్థమైంది. స్వామి టూ ఇన్ వన్. ఇటు చూస్తే భక్తుడు (రామ భక్తుడు) అటు చూస్తే దేవుడు. దేవుళ్ళకు గల మహిమలన్ని గలవాడు. కాని తనే ఒక భక్తుడు కావడంతో భక్తులకు ఉన్న ఇబ్బందులన్ని ఎరింగినవాడు.
కేవలం నిద్ర అనే మాయ నన్ను కప్పేస్తుంటే స్వామిని దయచూడమని కోరటానికే ఈ టపా వ్రాసాను. భూత,ప్రేత,పిశాచాదుల పీడనల నుండి, ఏ దేవుడూ రక్షించ లేని అష్థమ శని పీడననుండి సైతం కాపాడ గల స్వామి ఆంజనేయస్వామి. ( ప్రస్తుతం అష్ఠమ శని కుంభ రాశివారికి జరుగుతున్నది) అంతేకాదు ప్రాణ హాని ఉన్న వారికి అభయం ఇవ్వగలిగేది ఈ స్వామి ఒక్కడే.
అటువంటిది కేవలం ఈ నిద్ర మత్తును తొలగించలేడా? స్వామి కృపను కోరువారు జపించండి :
ఓం శ్రీ ఆంజనేయాయ మహా భలాయ శ్రీ హనుమతే స్వాహా
ఓం హరి మర్కఠ మర్కఠాయ స్వాహ
లేదా జపించండి రాం రాం రాం రాం . ఎక్క్డడ రామ నామం వనిస్తే అక్కడ ప్రత్యక్షమవుటాడు జై హనుమాన్.
#%^Y!#^($%#^%@#$%&^*&^8
ReplyDelete