
వై.కా.పా అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి పై పాలక ,ప్రతి పక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే మాటల్లా కాక తూటాల్లో కనిపిస్తున్నాయి. ( కనిపిస్తున్నాయంతే ) వారి వ్యాఖ్యలను తిప్పి కొట్టడం ఒక్కో వై.ఎస్, జగన్ అభిమాని భాధ్యతగా భావిస్తాను. అందుకే ఈ పొలిటికల్ ఎన్కౌంటర్
లగడపాటి :
లగడపాటి రాజగోపాల్ ఈ రోజు జగన్ పై మరో చౌకబారు ఆరోపణ చేసారు. జగన్ వివాదస్పద సిని దర్శకుడు
వర్మను బెదిరించారన్నారు.
వర్మ రక్త చరిత్ర సినిమా తీస్తుంటే అందులో తన పాత్ర చూపిస్తే ఖబడ్దార్ అని జగన్ బెదిరించారని లగడపాటి అన్నారు. ఈ విషయాన్ని వర్మే తనతో స్వయంగా చెప్పారని అతనన్నారు.
ఫోన్ ద్వార బెదిరించడం నేరమే. ( అది నిజమైన పక్షంలో) ఒక నేరం తనకు తెలియ వచ్చినప్పుడు దానిని పోలీసు అధికారులకు తెలపడం ఒక ఎం.ఎల్.ఏగా - ఒక పౌరునిగా లగడపాటి భాధ్యత. మరి ఆరోజు ఎందుకు లగడపాటి ఆ పని చెయ్యలేదు.. నేరం లాగే నేరాన్ని దాచడం కూడ నేరమే.
రాజగోపాల్ ఏమి పిరికి పంద కాదు. ఆయన ఎంతటి సాహసవంతుడంటే తెలంగాణ వాదం రాజదానిని అగ్ని గుండంగా మార్చిన సందర్భంలో సైతం దూసుకెళ్ళిన వారు.
పాపం ఆయన గారికి ఏ అవసరం వచ్చిందో ఏమో? తనను తాను పిరికి పందగా - నేరాలను దాచే నేరస్తుడిగా చిత్రీకరించుకుంటున్నారు. ఐ పిటి అఫ్ లగడ పాటి !
* * *
జగన్ స్వాతి ముత్యంలో కమలహాసన్లా నటిస్తున్నారు - నాడు రేవంత్ రెడ్డి
జగన్ స్వాతి ముత్యంలో కమలహాసన్లా నటిస్తున్నారు - ఇటీవల లగడపాటి
కాంగ్రెస్ - తె.దే.పా కుమ్మక్కయ్యాయనడానికి ఇదీ ఒక ఆధారమే
వీరికి కొత్త వ్యాఖ్యలు చేసే స్థోమత కూడ లేక పోయిందా? లేక చంద్రబాబు పరి భాషలో చెప్పాలంటే "ప్రణాళికా బద్దంగా ముందుకు పోతున్నారా"
* * *
వై.ఎస్.మృతి - వై.ఎస్.కుటుంభ సభ్యుల పైనే అనుమానం : బొత్సా
( కారు కుంభకోణంతో దుమ్ము కొట్టుకు పోవల్సిన బొత్సాను వై.ఎస్. గట్టెక్కించినందుకు ఇది బొత్సా కృతజ్నతా సుమాంజలి)
ఈ కోవలో ఆలోచిస్తే ఇందిరమ్మ మరణంలో రాజీవ్ హస్తం -రాజీవ్ మరణంలో సోనియా హస్తం అని కూడ చెబుతారేమో?
* * *
సాక్షి టి.వి,పేపర్లో వై.ఎస్.బొమ్మ తొలగించాలి : కాంగ్రెస్
వై.ఎస్.ను ఈ నేల నుండే తొలగించారని ప్రజలు అనుకుంటున్నారు - దాంతో పోలుస్తే ఇదెంతా
వాయిదా తీరి పోయి ఇంటెన్సివ్ కేర్లో ఉన్న కాంగ్రెస్ పార్టిని భలోపేతం చేసి రెండు సార్లు అక్కడ ఇక్కడ పవర్లోకి తెచ్చినందుకు వీరిచ్చే ప్రతిఫలం ఇదే కాబోలు బలే ! బలే !!
* * *
సాక్షి కథనాలు పెయిడ్ ఆర్టికిల్స్ - వై.ఎస్.కాంగ్రెస్ అభ్యర్దుల ఖాతాలో జమ చెయ్యాలొ : కాంగ్రెస్
అంటే ఈనాడు, ఆంథ్రజ్యోతి బురద చల్లుడు కథనాల ఖర్చును ఎవరి ఖాతాలో జమ చెయ్యాలట?
NICE... KEEP GOOD WORK
ReplyDelete>ఈ కోవలో ఆలోచిస్తే ఇందిరమ్మ మరణంలో రాజీవ్ హస్తం -రాజీవ్ మరణంలో సోనియా హస్తం అని కూడ చెబుతారేమో?
ReplyDeleteఈ ఒక్క ముక్క తగిలించి మీ పోష్టులో యేమి చేసారు స్వామీ?
" రాజీవ్ మరణంలో సోనియా హస్తం " అని శీర్షిక పెట్టారు.
శీర్షికకు పోష్టుకు యేమీ సంబంధం లేదే!
ఎంత చవకబారు పని ఇది? ఏమీ బాగాలేదు ఇలా వ్రాయటం!