క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday, 9 September 2012

వైకాపా కాంగ్రెస్లో విలీనం అవుతుందా?


విజయమ్మను పిటిఐ ప్రతినిథి మీ పార్టి కాంగ్రెస్లో విలీనం అవుతుందా? పొత్తులు పెట్టుకుంటుందా ? అని ప్రశ్నిస్తే అందుకు విజయమ్మ "కాలమే నిర్ణయిస్తుంది" అని చెప్పారట.

అన్నింటికన్నా బలీయం కాలం. కాలం ఒక బస్ కండక్టరును సూపర్ స్టార్ చేస్తుంది. ఆ కాలమే ఒక మెగా స్టారును జోకర్ చెస్తుంది.

కాలమే ఒక పావలా విలేకరిని ఒక టివి చానల్ కు యజమాని చేస్తుంది. ఆ కాలమే ఎన్.టి.ఆర్ అంతటి యుగపురుషుడ్ని పొట్టన పెట్టుకున్న రామోజిరావుకు పుత్రశోకాన్నిస్తుంది.

మనం కేవలం మానవులం. కాలం చేతిలో కీలు బొమ్మలం. దేవుని మీద అతని సృష్ఠి మీద గౌరవమున్న ఎవరైనా కాలదర్మం తెలిసిన ఎవరైనా ఈ మాటే చెబుతారు.

ఆరు నూరైనా అంటూ చేంతాడంత డైలాగులు దంచడం తెలుగు తెరమీద హీరోలకు సరిపోతుందేమో గాని దైనందిన జీవితంలో ఇటువంటి మాటలు మనలను నాస్తికులుగా - అహంకారులుగానే చిత్రీకరిస్తాయి.

కలవడం కల్ల - పొత్తు ఉండదు అని రెండు ముక్కలు చెప్పడం పెద్ద పనేం కాదు. కాని విజయమ్మ ఆస్తికురాలు - ఎ ట్రూ క్రిస్టియన్ - కాలదర్మం తెలిసిన స్త్ర్రీ - ఆ కాలదర్మం కారణంగానే చెట్టంత మనిషిని పోగొట్టుకుని - ఎదిగిన బిడ్డను జైలు పాలు చేసుకుని నిస్సహాయురాలిగా - దేవుడ్నే నమ్ముకుని ఉన్న అభల.

ఆవిడ మనసులో కలవాలి -పొత్తు పెట్టుకోవాలి అనే ఉద్దేశం ఉండి ఉంటే కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పి ఉండేది.ఆమె మనస్సులో కాంగ్రెస్ పార్టి అంటే గొంతు దాక యావగింపుంది. అందుకే ఆమె అలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు.

ఉండదు -ఉండ బోదు అన్న భావాన్ని కాస్త సబ్యతతో నాజూగ్గా చెప్పింది. ఈ ఒక్క ముక్కను పట్టుకుని ఇంత రాద్దాంతం చేస్తున్నారంటే - చేస్తున్నవారికి ఇంకేమి దొరకలేదన్న మట - విజయమ్మ నాయకత్వంలో విమర్శనాత్మకంగా ఇంకే అంశం కనబడలేదన్న మాట.

పోని.. సాంబార్ గారు మీరేమంటారు ? అని నన్నడిగితే నేను ఒకే మాట చెబుతా.." (రాష్ఠ్ర్ర్ర) కాంగ్రెస్ వచ్చి మా పార్టిలో విలీనమవ్వడం మాత్రం ఖాయం "

2 comments:

  1. nijame, paapamu chesina paapulu aa devuni che sikshinchapa baduduru, ani YSR family nu choosthe ardham ayindi le.

    maharaani laa unde YS Vijayalakshmi palace nu vadili rodla pai badadam, puthruni kashtaalu choosi sokinchadam. ilaa choosthunte, mogudini, kodukuni control cheyananduku aameku devudu vidhinchina siksha ani ardham avuthondi.

    ReplyDelete
  2. manakenduku cheththa raajakeeyaalu, jagan party ku bye cheppu. jagan jail ku vellaaka raashtram prasaantham gaa undi.

    ReplyDelete