క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday 22 October 2017

ఎకానమి పేకేజి

భారత దేశంలోని రాష్ఠ్ర ప్రభుత్వాలు -ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల పై భారం మోపక అర్థికంగా పుంజుకోవడానికి నేను కూర్చిన మార్గాలను ఎకానమి పేకేజ్ పేరిట చంద్రబాబాకు పంపుతూనే ఉన్నా స్పందనైతే లేదు.

1.ప్రభుత్వ ఉద్యోగులు అందరు అనర్హులు కారు . అందుకని ప్రతి ఒక్కరు అర్హులు కూడ కారు .అందుకే గత 10 సం.ల్లో రాజకీయ -ఆర్థిక-సామాజిక -విద్యా రంగాల్లో ఇటీవల చోటు చేసుకున్న మార్పుల పై వీరికి ఒక వ్రాత పరీక్ష నిర్వహించాలి .అలానే మెడికల్ ఫిట్నెస్ పరీక్ష జరపాలి. ముఖ్యంగా ప్రపంచీకరణ -ప్రైవేటి కరణ కారణంగా మారుతున్న ప్రభుత్వ పాత్రను -వారికి నూరి పొయ్యాలి. వారి జీత బత్యాలు ఖజాణా నుండి రావని – వారు చొరవ తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం రాబట్టాలన్న సంగతిని వారికి అర్థమయ్యేలా చేసి -ప్రజలతో ఎలా మొసలుకోవాలో నేర్పే సైకో మెట్రి కౌన్సిలింగ్ ఇచ్చి -దాని పై కూడ ఒక పరీక్ష నిర్వహించాలి .ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారే కొన సాగించ బడాలి .తప్పిన వారికి గోల్డెన్ షేక్ హ్యేండ్ ఇవ్వాలి .
వీరి వారసుల్లో అర్హులైన వారుంటే వారికి అవకాశం కల్పించ వచ్చు (అయితే పై తెలిపిన అన్ని పరీక్షల్లోను ఉత్తీర్ణులైతే)
2.అయితే పై తెలిపిన పాయింట్ పై జీ.ఓ విడుదల కాగానే ప్రభుత్వ ఉధ్యోగులంతా సమ్మెలో దిగే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే ప్రస్తుత ఖాళీలు – సమ్మె కాలంలో అత్యవసర సర్వీసులుకు అవసరమైన ఉధ్యోగాలను “టెండర్” పద్దతిలో పూరించి సిద్దంగా ఉండాలి .
3.ఇటీవల చదువులు పూర్తి చేసి ( ఈ కాల పరిమితి 2 ఏళ్ళకు మీంచకూడదు ) నిరుధ్యోగులుగా ఉన్న యువతను కన్సాలిడేటడ్ పే క్రింద అబ్జర్వర్లుగా అప్పాయింట్ చేసుకోవాలి . వీరిని జంబ్లింగ్ పద్దతిలో ప్రభుత్వ కార్యాలయలాను /వాటి పని తీరు / ప్రజల ఇబ్బందులను అబ్జర్వ్ చేసి రిపోర్ట్ ఇచ్చే విదంగా వినియోగించాలి. ఈ ఉధ్యోగ కాల పరిమితి 11 నెలలకు మించ రాదు .
4.ప్రజల్లో 18 నుండి 35 వయస్సులోపు అవివాహితులుగా ఉన్న ప్రతి ఒక్కరికి పోలీస్ ట్రెయినింగ్ ఇప్పించాలి .(డైవర్సీలు /విడోయర్లు కూడ అర్హులే). వీరిని స్టాండ్ బైలో పెట్టి అవసరమైన చోట /అవసరమైన సమయంలో వాడుకోవాలి .
5. సర్వేల పేరుతో ప్రభుత్వ దనాన్ని వెచ్చించడం అనవసరం. నిర్ణీత ఫార్మెట్లో ప్రజలే స్వచ్చందంగా తమ వివరాలను అందించే విదంగా చెయ్యొచ్చు .
ఆన్లైన్ అయితే బెస్ట్ . అయితే తాము తెలిపిన వివరాలన్ని సరైనవి అని నిర్ధారిస్తూ అఫిడవిట్ జతపరచేలా చూడాలి.
తప్పుడు సమాచారమిచ్చిన వారిని శిక్షిస్తామని విరివిగా ప్రచారం చెయ్యాలి. ఆతరువాత
రేండంగా క్రాస్ చెక్ చేసి తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని శిక్షించవచ్చు
6.ప్రభుత్వ ప్రకటనలు (యాడ్స్) ప్రభుత్వ పత్రికలోనే (ఆంద్రప్రదేశ్?) ప్రచురితం కావాలి .ముందుగా సతరు పత్రికను “దిన పత్రికగా అప్డేట్ చేయాలి . సతరు పత్రికకు ప్రముఖ పాత్రికేయులు ఒక్కొక్కరు ఒక్కో దినం ఎడిటర్ షిప్ వహించేలా చెయ్యాలి.
7.ప్రభుత్వ భవనాలను టైం షేర్ పద్దతిలోకి మార్చాలి . ప్రైవేటు సంస్థలు సైతం తగిన బాడుగలు/అడ్వాన్సులు /బ్యాంక్ గ్యారంటితో వాడుకునేలా చూడాలి
8.అంతకు ముందుగా సతరు భవనాలను తగిన గాలి వెలుతురు వచ్చేలా రీ మోడల్ చెయ్యాలి ( విద్యుత్ వినియోగం తగ్గడానికి) తామే ముందుకొచ్చి రీ మోడల్ చేసుకునే ప్రైవేటు సంస్థలకు ప్రాధన్యత ఇవ్వాలి.
9.ఇంతటితో ఆగక సతరు భవంతుల నుండి అదనపు ఆదాయం రాబట్ట డానికి అవసరమైన చర్యలు చేపట్టాలి . షాపింగ్ కాంప్లెక్స్ ,పవన విద్యుత్, బయోగ్యాస్,ఫలవంతమైన చెట్లు నాటడం,
10.కాలం చెల్లిన భవనాలైతే కూల దోసి కొంత భవంతులు కట్టుకుని -అందులో తమ కార్యకలాపాలను టైం షేర్ పద్దతిలో నడుపుకోవడానికి ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలను ఐడెంటి ఫై చేసి అవకాశం ఇవ్వాలి .
11.ముఖ్యంగా ప్రభుత్వ రవాణా సంస్థకు స్వంతమైన బస్ స్టాండులను గ్రౌండ్ ఫ్లోర్లో బస్ స్టాండు – ఫర్స్ట్ ఫ్లోర్లో షాపింగ్ కాంప్లెక్స్ కలిగి ఉండేలా నిర్మించే ప్రైవేటు సంస్థలకు అవకాశం ఇవ్వొచ్చు
12.వారానికి ఒక దినాన్ని కాలుష్య వ్యతిరేక దినంగా ప్రకటించి ఆ రోజున రైళ్ళు /బస్సులు/అత్యవసర సర్వీసులను మినహాయించి ఫోర్ /టూ వీలర్స్ లను నిషేదించవచ్చు .సైకిళ్ పై ట్యాక్స్ మినహాయింపు .యాబై శాతం రాయితీ
13.పోలీసు శాఖ సహా అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రజలు ఇచ్చే వినతులను 10 రూ.బాండ్ పేపర్లోనే ఇవ్వాలని రూల్ పెట్టొచ్చు. అయితే 15 రోజుల్లోపు చర్యలు తీసుకుని తీరాలి . (తప్పుడు వినతి/ఫిర్యాదు చేసిన వారికి రూ.500 దాక అపరాధం విధించవచ్చు .
14.పాంచాయితీ నుండి శాసన సభ మీటింగ్ హాలు దాక పని లేని రోజుల్లో ప్రైవేటు వారికి అద్దెకు ఇవ్వొచ్చు
15.స్వంత వాహణం మరీ ఫోర్ వీలర్ కలిగి ఉండడం పెళ్ళి మార్కెట్ నుండి సమాజంలో ఒక గౌరవ చిహ్నంగా మారింది. ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థను ప్రపంచ స్థాయిలోకి మార్చ కలిగితే స్వంత వాహణం కలిగి ఉండడం అన్నది “ఎకానమి” తెలియని తనంగా మారుతుంది.
అయితే ఈ పనికి కావల్సిన నిదులు ఎల సమకూర్చగలమని ప్రశ్నిస్తారు . సంస్థ ఉధ్యోగులు /పూర్వోద్యూగులు ,ప్రయాణికులు సభ్యులుగా ఒక కో ఆపరేటివ్ సొసైటి ఫార్మ్ చేసి ప్రతి సభ్యుడు కొంత సొమ్మును అందులో డిపాజిట్ చేసేలా చెయ్యాలి. ఆ సొసైటి రవాణా సంస్థకు అప్పు ఇచ్చేలా చోడొచ్చు . దీంతో “సంస్థ” నాది అనే భావన కలుగుతుంది.తప్పులు దొర్లినప్పుడు ప్రతి ఒక్కరు చొరవ చూపి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు.
16.ప్రభుత్వ వాహణాలను గ్లోబల్ టెండర్ పిలిచి అమ్మి వెయ్యాలి . గ్లోబల్ టెండర్ ద్వారా కి.మీ కి ఇంత అని కుదుర్చుకోవచ్చు .
17.రోజుకి 24 గంటలు అలర్టుగా ఉండవలసిన శాఖలు తప్ప ప్రతి కార్యాలయం ఉ.6.30 నుండి మద్యాహ్నం 2 దాక వాస్తవంగా పని చేస్తే చాలు .( అయితే ఏ ఉధ్యోగి తన సీటు నుండి కదిలే ప్రసక్తి ఉండ కూడదు) ప్రతి కార్యాలయంలోను సిసి టివి కేమరాలు అమర్చి -పౌరులు ఏ ఒక్కరైనా చూసేలా నెట్ కాస్టింగ్ చెయ్యాలి.
18.శాస్త్ర ప్రకారం ఆస్తుల విక్రయం -కొనుగోలు చేయ కూడని నెలల్లో జరిగే రెజిస్ట్రేషన్ల పై తగిన రాయితీ
19.బిల్డర్స్ తమ టర్నోవర్లో కనీశం 10 శాతమైనా పేదప్రజలకు పనికొచ్చే ఇళ్ళు /షాపింగ్ కాంప్లెక్సులు నిర్మించేలా చూడొచ్చు .
20.ముస్లీమ్లు ఏ ఊరికి వెళ్ళినా అక్కడి మసీదులో బస చేసే వీలుంటుంది. ఆ విదంగా ఏ ప్రభుత్వ ఉధ్యోగి అయినా ఏ ఊరికి వెళ్ళినా (ప్రభుత్వ కార్యార్థం) ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయంలోనైనా (మాత్రమే) బస చేసే ఏర్పాటు.
21.దినపత్రికల్లో సగం పేజికన్నా ఎక్కువ యాడ్లు ఇచ్చే సంస్థలకు /వ్యక్తులకు ప్రత్యేక పన్ను
22. ఇళ్ళను అద్దెకు ఇచ్చే వారు స్వీకరించే అడ్వాన్సు పైకం ప్రభుత్వ పొదుపు పత్రంగా మాత్రమే ఉండాలి .
23.లైసెన్సులు /సర్టిఫికేట్ల జారిలో అర్జెంట్ /ఆర్డినరి అంటూ కేటగిరిస్ పెట్టాలి .అర్జెంట్ కేటగిరి వారికి అదనపు రుసుము వర్తింప చెయ్యాలి .
24.కాలుష్యాన్ని వెదజల్లే సంస్థలకు -ఆ కాలుష్యాన్ని బ్యేలెన్స్ చెయ్యడానికి ఎన్ని చెట్లు నాటాలో -అందుకు ఎంత మెరకు ఖర్చవుతుందో లెక్కించి వసూలు చెయ్యాలి (శాస్వత పరిష్కారం అమలయ్యేదాక)
25.అవివాహితులు ,డివోర్సీలు ,విడోయర్లు ,దంపత్య జీవితానికి అనర్హులుగా ఉన్న జీవిత భాగస్వామి కలిగిన వారిని ఐడెంటి ఫై చేసి వీరు తమ ఖాళి సమయాల్లో కలిసి సంఘ సేవ చేసేలా ప్లాన్ రూపొందించాలి .
26.ప్రతి చిన్న ఊరికి ఒక కమ్యూనిటి హాల్ -బాడుగ + విద్యుత్ చార్జీలు రూ .1000 కి మించ రాదు .మెయింటెనెన్స్ ఆయా ప్రాంతాల డ్వాక్రా గ్రూపులకు ఇవ్వాలి .
27.కలిసి జీవించ కోరేవారికి తాత్కాలిక రెజిస్ట్రేషన్
28.వంద మందికి మించి భోజనం చేసే మెస్/హోటల్ /కళ్యాణ మండపాలు /కాలేజ్ హాస్టల్సులో బయో గ్యాస్ యూనిట్ తప్పని సరి .
29.వాణిజ్య పన్నుల వసూలును ఆయా ప్రాంతాల వ్యాపారుల సంఘాలకు అప్ప గించాలి. (సంఘం బ్యాంక్ గ్యారంటి ఇవ్వాలి ) గతంలోని వసూలుకంటే కనీశం 25% అదనంగా టార్గెట్ పెట్టాలి .ఐదేళ్ళకు ఒక సారి రెనీవల్ చేసుకోవచ్చు.
30.రోగ నివారణ,రోగ నియంత్రణ, చికిత్స, నేరాల నివారణ/అదుపు, మానవ సంభంధాలు ,లైంగిక జీవితం, గర్బ నివారణ వంటి విషయాలను ఆసక్తి కరంగా చిత్రీకరించే షార్ట్ ఫిలింస్ పోటీలను ప్రతి సం. నిర్వహించాలి .వీటిని లోకల్ కేబుళ్ళు /సినిమా హాళ్ళు తప్పక ప్రదర్శించేలా చూడాలి ( ఇంటర్నెట్లో పెట్టడం అనివార్యం)
44.ప్రభుత్వ ఉధ్యోగులకు యూనిఫార్మ్ ,(సాంప్రదాయిక /చేనేత వస్త్రాలు ) ఆఫీసుల్లో ఏ గదికి /చాంబరుకి చక్క తలుపులు ఉండకూడదు .ఒన్లి గ్లాస్ డోర్స్.
45.సెక్స్ వర్కర్స్ కి తగిన కౌన్సిలింగ్ ( లైంగిక వ్యాదులు /వ్యాధి నివారణల పై) ఇచ్చి వర్క్ పర్మిట్
46.ముఖ్యంగా పౌరులు జీవనోపాది -తద్వారా తగినంత నెలసరి ఆదాయం పొందేలా చూడాలి . ఇందుకు గాను రాష్ఠ్ర వ్యాప్తంగా మేన్ పవర్ డేటా బ్యాంక్ ఏర్పాటు చేసి -కొంత రుసుము చెల్లిస్తే అందుబాటులో వచ్చేలా చెయ్యాలి .గ్రామ ఉపాది పథకం లాగా నగర ఉపాది పథకం అమలు చెయ్యాలి . ఉధ్యోగ అవకాశం ఉన్న రంగాల్లో అర్హులైన వారు తగు శిక్షణ పొందేలా విరివిగా -నిరంతర ప్రక్రియగా ఒక ప్లాన్ అమలు చెయ్యాలి ( ఇప్పట్లోలాగా తూ తూ మంత్రంగా కాదు )

0 comments:

Post a Comment