నేను బేసికల్గా ప్రజాస్వామ్య వాదిని. నా దృష్థిలోను జె.పి పై జరిగిన భౌతిక దాడి ముమ్మాటికీ తప్పే. కాని అందుకు దారి తీసిన సంగతులు ఏమిటన్నది ఈ దాడితో కనుమరుగై పోకూడదు. ఇది ప్రజా స్వామ్యం .అంటే ప్రజలే ప్రభువులు. అందరూ ఒక్కసారిగా అసెంబ్లీలో కూర్చో లేము కాబట్టి కొందరు ప్రతినిదులను ఎంపిక చేసి పంపుతాం . వారు మన ప్రతినిదులుగా వ్యవహరించాలి. మన భావాలను అక్కడ వినిపించాలి.
కాని జరిగిందేమిటి? జె.పి కేవలం ఒక బ్యూరాక్రెట్టే అయినా అతను కూడ ఒక ప్రతినిదే. అతను తన నియోజక వర్గమైన కూకట్ పల్లి ప్రజల భావాన్ని వెలిబుచ్చాలి. అక్కడి వారు తెలంగానా కావాలంటున్నారా? వద్దంటున్నారా? తెలుసుకుని వారి మాట ఏముందో ఆ మాటను అసెంబ్లీలో వినిపించాలి.
కాని అతనేదే తాను పెద్ద చోక్రెటీసు, అరిస్టాటిల్ అనే భ్రమలతో ప్రవర్తించారు.టీ.ఆర్.ఎస్. తెలంగాణ కోసమే పుట్టిన పార్టి.వారు దాని కోసం పట్టుపట్టడం సహజం. పార్టీలకు మరీ ప్రభుత్వంలో భాగస్వామ్యం లేని పార్టీలకు పెద్దగా భరువు భాద్యత ఉండాల్సిన పని లేదు. (అధికారంలో లేరు కాబట్టి - భరువు భాద్యతలను నెత్తిన పెట్టుకున్నా పొడిచేది ఏమి ఉండదు)
మరి కాంగ్రెస్ పార్టి ఇటు రాష్థ్ర్రంలోను -అటు కేంద్రంలోను అధికారంలో ఉంది. "తెలంగాణ రాష్ఠ్ర్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నాం" అని ప్రకటించి , ఏడాది అవుతున్నా అంటి ముట్టనట్టు ప్రవర్తించడం - ఆ ఊసే ఎత్తకుండా అసెంబ్లి సమావేశాలను కానిచ్చేయాలనుకోవడం క్రైమ్.
దానిని నిలదీయాలకున్న టి.ఆర్.ఎస్ ఎం.ఎల్.ఏల ఆతృత సహజమే. వారి చర్యల్లో తప్పుండొచ్చు కాని వారి పక్షాన న్యాయమే ఉంది. మరి న్యాయం కోసం వారు స్పందించారు (స్పందన తీరు తప్పై యుండొచ్చు) కాని జె.పి వంటి మాజి బ్యూరాక్రెట్ కేవలం ..కూకట్ పల్లికి ప్రాతినిద్యం వహిస్తున్న - ఒకే ఒక ఎం.ఎల్.ఏ కలిగి ఉన్న పార్టికి అద్యక్షుడు పెద్ద పోటుగాడు వలే నీతులు వల్లించడం
మరీ ఒక మాజీ పోలీసు అధికారి అయిన గవర్నరుకు వంతె పాడుతూ డవులాగులు దంచుతుంటే ఎవరికైనా కాలుద్ది. జరిగిన దాడులు నేరమే అయితే .. అందులో అక్యూస్డ్ వన్,టూ ,త్రీ అంటూ పోతే ఆ జాబితా ఇలా ఉంటుంది
సోనియా -చిదంబరం -కేంద్ర ప్రభుత్వం- కేంద్ర రాష్ఠ్ర్ర్ర కాంగ్రెస్ పార్టి నాయకత్వం - రాష్ఠ్ర్ర ప్రభుత్వం -సి.ఎమ్ - గవర్నరు -జె.పి ఈ పట్టికలో చిట్ట చివరన ఉన్నది టి ఆర్ ఎస్ ఎమ్.ఎల్.ఏలు.
అటువంటిది వారిని ఏదో పెద్ద నేరస్తుల్లా చిత్రీకరించడం తల లేని వారి పని.