క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label sterio. Show all posts
Showing posts with label sterio. Show all posts

Friday, 29 October 2010

శుక్రవారం బ్లాగ్లోకం పోకడ - నా వ్యాఖ్యలు

ఎవరిని కించ పరచాలని, వారి మనస్సు గాయ పరచాలని కాదు. ఎవరి లోకం వారిదై ఉన్న బ్లాగ్లోకంలో కనీసం నెనన్నా అన్ని లోకాల్లోకి తొంగి చూద్దామని ఒక తుత్తర

mirchbajji :: 'తల' లేకుంటే తలలు పగులుతాయ్: కేసీఆర్ (హైదరాబాద్)
ఈ దిక్కుమాలిన  ప్రకటన  చెయ్యడానికి ఎంతగా తల పగల కొట్టుకున్నాడెమో కేసిఆర్

Prabhava ప్రభవ :: కదిలించొద్దండి !
నిద్రా భంగం కలుగుతుందనా గురువుగారూ?

 హిమబిందువులు :: నా అద్దాల గోల -2
అద్దాలదేముంది గురువుగారూ.. ఉన్న మాటే అంటుంది (నా లాగా)

 తెలుగిల్లు :: 15 రోజుల్లో 32 ఆలయాల దర్శనo
పోన్లెండి అర్చకులకు ఉపాది కల్పించారు

 తురుపుముక్క :: క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 31
క్రాస్ రోడ్లో క్రాస్ వోర్డ్ వెరి గుడ్!

 ఆలోచనా తరంగాలు :: పది తలల సర్పం నిజమేనా?
ఉత్త అమాయకులండీ బాబూ.. ఒక్కో మస్తిష్కంలో వెయ్యి తలల నాగుంది

 24 గంటలు :: ఏం చేశారు గురూ...!
ఎవరైనా చేయడం మానేసి చాలాకాలం పట్టింది. నాటి రాజుల్లాగా టివీల్లో ఎవరో చేసేవి చూస్తూ ఉండిపోయాం

 AAKASA RAMANNA :: రాజీవ్ భజన ఇక చాలు!
రాజీవ్ భజన చేస్తే ఒరిగేదేముంది. ఇది సోనియా భజన.  అధికారం చేతిలో ఉండగా అవిడకసలు రాజీవ్ ముఖమన్నా గుర్తుంటుందా అని..

 ఇది నారద బ్లాగు. ఇక్కడ స్వేచ్చ బాగా ఎక్కువ. :: నేరం మాది కాదు
స్వేచ్చకు మించిన శిక్ష మరొకటి లేదు బాసు. అందుకే స్యేడిస్టయిన భగవంతుడు మనలను స్వేచ్చగా బతకమని వదిలాడు. కాని మనవారు తమ స్వేచ్చను బాబాలకు బాపలకు ఇచ్చి భానిసత్వాన్ని అనుభవిస్తున్నారు

 స్వప్న రాగలీన :: మా బాతుల మహా దర్జా
నాటి పావురాల వలే ఎం.ఎల్.ఏలకు మాత్రమే కొరియర్ సర్వీసు నడుపుతున్నాయా?

Rayraj Reviews :: ఈమాట, పొద్దు, ఎపీమీడియారాములు ఏం పీకుతుంటారు?
మంగళవారం,శుక్రవారం ఏమీ పీకరు బాసు!  బహుసా ఆదివారం వెళ్తారేమో సెలూన్కి

కోతికొమ్మచ్చి... :: రేపే చూడండి... జయప్రకాష్ రెడ్డి ‘ఏకపాత్ర నాటకం’ హైదరాబాద్ లో
హుం! బతుకు నాటకంలో ప్రజలు, ఉతుకుడు నాటకంలో పోలీసులు, దోచుడు నాటకంలో ప్రభువులు అంతా ఏక పాత్ర నాటకాలేగా

సీతారామ్‌కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు :: రోబో సినిమాలోని నీతి
సినిమాలో నీతి అయితే కనబడ లేదుగాని మొదటి రోజు టిక్కెట్లు వందలకమ్మిన వైనంలోమాత్రం కొట్టిచ్చినట్టు కనబడింది అవి నీతి

 అన్వేషి :: ఒక్క మిస్సడ్ కాల్ ప్లీజ్.....!!
ఏమైంది గురూ.. ఈ రోజే ఫుల్ టాక్ టైం వేసుకున్నారా?

భవాని మల్లాది :: What plan this weekend?
వీక్ ఎండ్ గురించి ఆలోచించే ఆలోచనే లేని weak End వారి స్థితి ఏమో ఎవరూ వ్రాయరే

 mirchbajji :: జగన్ అంటే ఇష్టమా..? ఎస్ అంటే ఫో... నో అంటే రా..!!
మీ రాజకీయం నాకర్థం కాలే ఇష్ఠమంటే రమ్మంటున్నారు ( కొంప దీసి ఉతకడానికి కాదు కదా?) నో అంటే రమ్మంటున్నారు ..చిన్న పార్టి ఏదైనా ఉంటుందా మరి

హరిసేవ :: అనామిక (హారం)
హుం.. అందరూ మాధవ సేవకే పరిమితమైతే మానవ సేవ నాయకులు చేస్తారనా?

రాతలు-కోతలు :: టర్కీ పవర్ పాలిటిక్స్……
అమ్మ బాబోయి ..డిల్లి గల్లిల్లోని  గలీజు రాజకీయాలకే ఒళ్ళంతా జెర్రీలు పాకినట్టుంది .ఇందులో టర్కీ వేరేనా

 శ్రీ-పదములు :: ఫొటో జవాబు
కట్టుకున్న భార్యను సైతం హింసించిన విక్రమ్ బయ్యా (మైక్రో ఫైనాన్స్ అధినేత) సోనియమ్మతో,రాహుల్ బయ్యాతో దిగిన ఫోటోలు జవాబులు కావా?

 '''నేస్తమ్... :: మనసా తుళ్ళి పడకే
ఏం.. మళ్ళీ పెట్రో దరలు పెంచుతారేంటి?

శ్రీ హనుమత్ విషయ సర్వస్వం :: శ్రీ పరాశర సంహిత - శ్రీ వానర గీతా - 3
నో కమెంట్స్ - హనుమన్న ముందు తోక తిప్పితే తోక కత్తిరిస్తాడేమో?

 ఆకలి :: చూడచక్కని విగ్రహం
అంటే డైటింగ్ చేసి చక్కని విగ్రహం పొందినట్టేనా? డైటింగ్ కి ముందెలా ఉండేవారో? డైటింగ్ మానేస్తే మరెలా ఉంటారేమో?