క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday 17 November 2012

ప్రెమ విజయవంతం కవాలంటే

1. ప్రేమికులు శారీరక దారుఢ్యత, మనోవికాసం, బుద్ధి కుశలత, ఆత్మలో పవిత్రత గల వారుగా వుండాలి.

2. కనిసం ఇద్దరిలో ఎవరో ఒకరికన్నా పై తెలిపిన అంశాలుంతే ఆ ప్రేమ విజయవంతం అవుతుంది.

3. వారి ఎంపిక సరైనదై వుండాలి. అంటే ఇద్దరు విభిన్న గుణగుణాలు గలవారై వుండాలి. ఒకే కోవకు చెందిన వారు సామాన్యంగా ప్రేమించరు. అలా ప్రేమించినా వారు పెళ్ళి చేసుకోవచ్చుకాని, కాలమంతా కలిసి జీవించవచ్చుకాని వారి మధ్య ప్రేమ మాత్రం మృగ్యమే

4. "లోకోభిన్నరుచి" అంటారు. వేర్వేరు రుచులు, అభిరుచులుగల వారు ప్రేమిస్తే, వారి మధ్య కీచులాటలు  వస్తూ వున్నప్పటికి  వారి మధ్య ప్రేమ మాత్రం భలంగా ఉంటుంది. (అయితే, ఒకరు మరొకరి మీద, వారి రుచులు, అభిరుచుల మీద కొద్దోగొప్పో గౌరవమన్నా కలిగి వుండాలి).

5. జీవితమంలో దేన్ని పొందాలన్నా  మరి దేనినొ పోగొట్టుకోవాలి. నేనేది పోగొట్టుకోను, నాకు అన్నీ కావాలి అనుకుంటే మీరు దేనిని పొందలేరు. అన్నీ పోగొట్టు కొవడానికి సిద్దమయితే అన్నీ పొందగలరు.ఈ సూత్రాన్ని అర్థం చేసుకుంటే కాని ప్రేమ విజయవంతం కాదు.

6. స్త్రీ శారీరకంగా బలహీనురాలు కాబట్టి, సదా వర్థమానాన్ని- సమీప భవిష్యత్తును మాత్రమే  దృష్ఠిలో పెట్టుకొని బ్రతుకుతుంది. పురుషుడు శారీరకంగా బలవంతుడు కాబట్టి వర్థమానాన్ని నిర్లక్ష్యం చేస్తూ  సుదూరపు భవిష్యత్తు కొసం పోరాడుతుంతాడు. (కొందరి విషయంలో ఇది భిన్నంగా వుంటుంది. అందుకు స్త్రీలో పుంసత్వశాతం అధికంగా వుండడం పురుషునిలో స్త్రీత్వశాతం అధికంగా వుండడమే కారణం.)

__________

7. శ్రీ బ్రహ్మంగారు ఒకసారి తన ప్రియశిష్యుడు సిద్దయ్యను అదిగాడట......"సిద్దా ! లోకం ఎట్టా వుందిరా?" అందుకు సిద్దయ్య "ఎవరిలోకం వారిది గు రుదేవా: అన్నాడుట.

ఈ ఆదునిక జీవితంలో  నిజంగానే ఎవరిలోకం వారిది. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చాలామంది పట్టించుకోరు. అలాగే స్త్రీ ప్రపంచం వేరు. పురుషుల ప్రపంచం వేరు.

స్త్రీ ప్రపవంచంలోని కేంద్ర బింధువు ఆవిడే. అన్ని తన చుట్టూ తిరగాలి. తన కోసమే జరగాలి. తన కోరిక ప్రకారం జరగాలి అనుకుంటుంది.

పురుషుల ప్రపంచంలో పురుషుడు కేంద్ర బింధువు కాడు. అతను సమాజంలోని ఎందరితోనో వ్యవహారాలు నడుపుతుంటాడు. అతని దైనందిన కార్యక్రమాలను వారి కనుగుణంగా సవరించుకోవలసి వస్తుంది.

ఈ సత్యాన్ని స్త్రీ అర్థం చేసుకుంటే ప్రేమ జీవితం-వైవాహిక జీవితం రెండూ బాగుపడతాయి.

8. ఎవరికోసమూ ఎవరూ బ్రతకరు బ్రతకలేరు. ఇది మానవ నైజానికే విరుద్దం.  ప్రకృతికి విరుద్దం. సృష్టికి విరుద్దం. అలా నమ్మ పలకడం, నమ్మడం రెండూ అహేతుకమే.  ఎవరి స్వార్ధం వారికి వుంటుంది. బ్రమల్లో  బ్రతక్క, యధార్థాన్ని జీర్నించుకునే మెచ్యురిటిని సాధించాలి. అప్పుడే ప్రేమ విజయవంతం అవుతుంది.

9. ఈ భూమి మిద ఎవరూ - 24 గంటలూ - అందరికీ మంచివారుగా వుండరు. కొందరు - కొన్ని గంటలు కొందరికి మంచివారుగా వుండడమే కష్టం. తక్కిన గంటల్లో - వారు ఎందరికో చెడ్డవారుగా కూడా వుంటారు. ఎవరూ 100% మంచివారు కారు, ఎవరు 100% చెడ్డవారూ కారు. ఇది అక్షర సత్యం. ఈ సత్యాన్ని గ్రహించి జీర్నించుకుంటే ప్రేమ విజయవంతం అవుతుంది.

10. ఎంత కాదన్నా మానవ జీవితం పై ఆర్థిక స్థితిగతులు ఎనలేని ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి, ప్రేమికులు తమ ఆర్థిక స్థితిగతుల పై కూడా అవగాహనతో ప్రేమలోకంలోకి ప్రవేశించేది మంచిది .

0 comments:

Post a Comment