"నా సలహాల మెరకు టి.టి.డి ఉధ్యోగులకు డ్రెస్ కోడ్ " అన్న మాట మీలో చాలా మందికి హాస్యా స్పదంగా అనిపించొచ్చు.కాని ఇది అక్షరాల నిజం. నాకు మనుష్యులతో కమ్యూనికేషనే సమస్య . కొందరు భూతులని గగ్గోలు పెడతారు. కొందరు పిచ్చి కూతలని అరచి గీ పెడతారు. కాని ఆ దేవ దేవుడు మాత్రం నా మాటలను చక్కగా అర్థం చేసుకుంటాడు. ఒక వేళ తాను పలికించిన మాటలేగా అన్న ఉద్దేశం కూడ భగవంతుడ్ని ఇలా మార్చిందేమో?
తి.తి.దేవస్థానంలో నా సలహాలు అమలు కావడం ఇదే మొదటి సారి కాదు. ప్రస్తుతం అమలవుతున్న శ్రీవారి సేవ కాని, ఉచిత భోజన వసతికి సోలార్ పవర్ ను వినియోగించడం కాని నేనిచ్చిన సలహాలే. బ్లాగు డాట్ కామ్/స్వామి7867 బ్లాగు ఫాలో అయిన వారికి నా తిరుమల విజన్ 1900 సుపరిచితమే అనుకుంటా.
తిరుమల గిరి పై క్రీ.శ.1900నాటి పవిత్రతను నెలక్ప్ల్పడమే ద్యేయంగా తిరుమల విజన్ 1900 రూపొందించాను. విజన్ లోని ముఖ్యాంశాన్నిఈ టపా చివరన పేర్కొంటాను. నేనీ విజన్ రూపొందించి తితిదే ఈ.ఓ గారికి, నాటి చేర్మన్లకు, దేవాదాయ శాక మంత్రులకు పంపుతూనే వచ్చాను.
చివర నా విజన్ నాకు తిరిగి పంపండి అంటూ పోస్టేజి నిమిత్తం పది రూపాయల ఎమ్.ఓ కూడ పంపాను. ఎమ్.ఓ స్వీకరింఛ బడింది. దాని తాలూకు అక్నాలెడ్జ్మెంట్ కూడ నా వద్ద ఉంది. ఇవన్ని చేసింది విజన్ ను తిరిగి రాబట్టాలని కాదు .ఎలాగన్నా తి.తి.దే నా విజన్ పై దృష్ఠి సారించేలా చూడటానికే.
ఏమైతేనేమి నా విజన్ లోని పనికి మాలిన అంశమే అయినా ఈ డ్రెస్ కోడ్ కూడ విజన్ లో ఒక భాగమే. నా పూర్తి విజన్ చదవకోరే వారు ఇక్కడ నొక్కండి. నేను ప్రొఫెష్నల్ కన్సల్టెంట్ ని కాను. నాకేమి సలహా రుసుము చెల్లించవలసిన అవసరమూ లేదు. నా సలహాలు నాకు చెప్పకనే అమలు చేస్తున్నారని కోర్టుకెక్కను. కాబట్టి తితిదే చేర్మన్ గారికి, దేవస్థానం ఈ.ఓ గారికి నా మనవి ఏమంటే నా విజన్ ను పూర్తిగా అమలుచెయ్యండి. నాకు పేరు అవసరం లేదు. ఫీజుగా చిల్లి గవ్వ కూడ చెల్లించనవసరం లేదు.
శ్రీవారేమో కుభేరుని వద్ద అప్పు చేసారని, కలియుగాంతంలో దానిని సెటిల్ చెయ్యాలని స్థల పురాణం చెబుతూంది. పురాణాన్ని బట్టే ఆలయం. ఆలయాన్ని బట్టే భక్తులు. శ్రీ వారికి కానుకలుగా వచ్చే వాటిని వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నారు. కానుకలను గోల్డ్ కాయిన్స్ గా మార్చి కేంద్ర ప్రభుత్వ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే పురాణాన్ని గౌరవించినట్టూ ఉంటుంది. దేశ అభివృద్ది తోడ్పడినట్టూ అవుతుంది. ఈ రోజు డబ్బు ఎటువంటిది అన్న శీర్షికన కొన్ని నగ్న సత్యాలను మరో టపాలో పోస్ట్ చేసాను. దానిని చదవడానికి ఇక్క్డడ నొక్కండి.
0 comments:
Post a Comment