క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Tuesday, 9 March 2010

కడుపుబ్బా నవ్వండి !

1.ఇంటి యజమాని: ఇదేంటి .. మా ఇల్లంతా దోచేసి  వంటా వార్పు పుస్తకం ఇస్త్రున్నావు
దొంగ: నీ యబ్బా ఫ్రిడ్జిలో ఉన్న తిండి దరిద్రంగా ఉందేరా.. ఈ సారి ఈ పుస్తకం చూసి బాగా వండమను

2.ఇంటి యజమాని: ఏమండి దొంగ గారు.. ఇలానే నెలకో సారి మా ఇంటికి వచ్చి వెళ్ళండి
దొంగ: ఇదేమయ్యా వింతగా ఉంది నీ రిక్వెసు..
ఇంటి యజమాని:నా భార్య భయంతో వనకడం చూస్తుంటే బలే ముచ్చటేస్తుందోయి. ఆమెను ఇలా చూడడం ఇదే మొదటి సారి

3.భర్త: ఇల్లంతా ఊడ్చుకు పోతుంటే ఆ దొంగ ఎదవతో ఏమిటే గుస గుసలు
భార్య: మన పక్కింటి పంకజం కొత్తగా నెక్లెస్ కొన్న సంగతి అతనికి చెప్పానండి

4.డాక్టర్: ఏమయ్యా.. నేను ప్రాణాలు రక్షించే డాక్టర్ని..
దొంగ: అప్ప చా అబద్దం చెప్పినా అతికినట్టు చెప్పవయ్యా

5.లాయరు: ఏరా మా ఇంట్లోనే దొంగతనానికొచ్చావా.. నీ కథేంటో చూస్తా..
దొంగ: ముందు మంచి లాయరెవడన్నా దొరుకుతాడేమో చూడు

6.దొంగ: 1 అదేట్రా సెక్స్ యువ నటి  నళినా  ఇంటికైతే దొంగ తనానికి  రానంటున్నావు
దొంగ :2 ఆమె నా మనస్సు దొంగిలిస్తే

7.జడ్జి: ఏమిటయ్యా ఆ బ్యాంకునుండి దోచిన సొమ్ము అదే బ్యాంకులో డిపాజిట్ చేసి మర్సటి దినమే విత్ డ్రా చేసావు ఎందుకని?
దొంగ: డబ్బు ఉంచడానికి అది సురక్షిత స్థానం కాదని కాస్త ఆలశ్యంగా స్పార్క్ అయ్యింది సార్

8.ఎస్.ఐ: ఏరా మా రైటర్ గారి లూనా దొంగిలించావు?
దొంగ: నాకు గీర్ బండి త్రోలడం రాదు సార్

9.ఎస్.ఐ: నా ఇంట్లోనే ఒకడు దొంగ తనం చేస్తాడా? ఎలాగన్నా వాడ్ని పట్టుకుని
ఏ.ఎస్.ఐ: మామూలు గుంజేస్తాం సార్

10.నగల దుకానం యజమాణి: ఏరా నా అంగట్లో దొంగిలిచ్చిన నగ నా అంగడికే తెచ్చి అమ్ముతావా?
దొంగ: నన్నేంచెయ్యమంటావయ్యా! నీ అంగడి సీల్ చూసి ఎవ్వడు కొనడం లేదు

0 comments:

Post a Comment