క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Thursday, 25 March 2010

సహజీవనం చట్ట సమ్మతమే కావచ్చు గాని ...

సహజీవనం చట్ట సమ్మతమేనని సుప్రీం కోర్టు వ్యాఖ్యాణించటం అందరికి విదితమే. దీనిపై నవద్వారాల్లో మంట పుట్టినా కోర్టు వ్యవహారమని మత పెద్దలు, మత పార్టి పెద్దలు ఆచి తూచి వ్యాఖ్యాణిస్తున్నారు. ఇదే వ్యాఖ్యను నా బోటి యధార్థవాదులు మానవత్వంతో చెప్పియుంటే నా బ్లాగును నిషేదించి ఉండేవారు.

 సహ జీవనాన్ని చట్ట వ్యతిరేక చర్యలుగా భావించలేమన్న సుప్రీమ్ కోర్ట్ నీతిమాలిన చర్య అని విస్పష్ఠంగా   చెప్పింది.

సహజీవనం నీతిమాలిన చర్య ఎలా అవుతూందో ఒక సారి మీ అంత:కరణాన్ని ప్రశ్నించుకొండి. మానవుడు అడవుల్లో జీవించినప్పుడు పెళ్ళీళ్ళ్యు ఉండేవా? లేవు. ఎవడైతే భలవంతుడో వాడే ఆ గుంపుకు నాయకుడు. వాడు అనుభవించి వదిలి వేసిన స్త్ర్రీలతో ఇతరులు సర్దుకునేవారు. స్థిరవాసాలు ఎర్పడ్డా నాగరికత సాధించినా జరిగేది అదే. అయితే అప్పట్లో ర్యేష్ గా జరిగేవి ఇప్పట్లో పాలిష్డ్ గా జ్రుగుతున్నాయి.

Soft Ware Engineers,Doctors,ఇలా తన్నుకు పోయిన తరువాత మిగిలిన స్త్ర్రీలతో ఇతరులు సర్దుకుంటున్నారు. మానవుడు నాగరికత సాధించాడని చెప్పుకుంటున్నాము. కాని జరుగుతున్న భృణ హత్యలు, ర్యేప్స్,ఈవ్ టీజింగ్,లైంగిక వేదింపులు చూస్తుంటే అలా చెప్పగలామా?

మానవుడు భట్టలు దరించిన జంతువంతే.కాని సమాజం అతనిని మనిషిగా నమ్మ బలికి మ్యేనేజ్ చేస్తూంది. ఎంతగా మ్యేనేజ్ చేసినా  అతనిలో  కామవాంచ చలరేగినప్పుడు అతను జంతువుగా ఫీలయ్యి జంతువుగానే మారి పోతాడు.

ఇక్కడ మానవుడు అని పేర్కొన్నా ఇది స్త్ర్రీలకు సైతమ్ వర్తిస్తుంది. అయినా సెక్శ్ అన్నది మనిషి శరీరానికి మాత్రమే కాదు, భావాలకు సైతం కేంద్ర భింధువు. ఇది స్త్ర్రీకి సైతం వర్తిస్తుంది.మూడు ముళ్ళు వేసాడు అన్న ఏకైక కారణం చేత ఆమె పుంసత్వం లేని భర్తతో పతివ్రతగా కొనసాగాలా? అనగ త్రొక్క బడిన సెక్స్ కోరికలు హింసా ప్రవృత్తిగా ,దనవ్యామోహంగా ,అధికార దాహంగా పరిణితి చెంది భయిట పడుతుంటాయి.

వాటికి ఆమె బిడ్దలు బలికావచ్చు, చేతగాని భర్తే భలి కావచ్చు లేదా పనివారు ,లేదా పొరుగింటి యూత్ ఇలా ఎవరో ఎవరెవరో భలి అవుతుంటారు. విడాకులంటారా? మన విడాకుల చట్టం విడిపోవాలని వచ్చిన వారిని మళ్ళీ కలపడంలో చూపే శ్రద్దను వారి వ్యక్తిత్వాల పై, వ్యక్తిగత స్వేచ్చపై, ఆంతరంగిక సంకర్షణల పై , మానసిక వత్తిడిపై చూపడం లేదు. పైగా అడుసు త్రొక్క నేలా కాళ్ళు కడగనేల అన్నట్టుగా పెళ్ళి చేసుకోవడం ఎందుకు? అందులోనుండి విడిపడటం ఎందుకు?

మనుషులంతా ఒక్కటే అని గొప్పగా చెప్పుకున్నా లోకో భిన్న రుచి. ఏ కోవకు చెందినవారైనా సెక్స్ అన్నది స్థూలమైన కోరిక. దానిని కాదని బ్రతకడం అసాధ్యం.

ఒక్కొక్కరి మానసిక స్థాయి ఒక్కో విదంగా ఉన్నప్పుడు మానవుని ప్రాథమిక అవసరమైన సెక్సుకు మాత్రం ఒకే విదమైన ఏర్పాటు ఉండటం తర్కం కాదు. పైగా వివాహాన్ని సెక్సుకు ఏర్పాటుకు చెప్పుకోవలసి రావడమే సిగ్గు చేటు. కాని నేటి పెళ్ళీళ్ళను చూస్తే నూటికి 70శాతం ఈ కోవకు చెందినవే.

పోనీ వివాహం అన్నది ఎన్నో నిభంధనలతో కూడుకున్నదై ఉంది. విద్య ఉండాలి, సంపాదన ఉండాలి,ఎర్రగా బుర్రగా ఉండాలి. మతం,కులం,ఎత్తు,పొడవు,భరువు ఇలా ఎన్నో ఎన్నెన్నో నిభందనలున్నాయి.

వీటన్నింటిని ఒక స్త్ర్రీ గాని పురుషుదు గాని పూర్తి చేసి వివాహానికి కావల్సిన అర్హతను పొందే లోపు పురుషుడైతే నపుంసత్వానికి, స్త్ర్రీ అయితే మెనోఫస్ కి గురై పోయే రోజులొచ్చాయి.

ఒక పిల్లవాడు లేదా ఒక చిన్నారి సెక్సు కు సంపూర్ణంగా ముస్తాబైన 20 సం.లకు గాని పెళ్ళి కుదరడం లేదు. అందాక ఆమె/అతను ఏమై పోవాలి.

నన్నడిగితే ప్రస్తుతం ఉన్న భార్యా భర్తలందరిని రెండు గ్రూపులుగా విడ కొడతాను. ఒకటి విడి పోయిన వారు . రెండవది విడిపోలేక చచ్చినట్టు కలిసి ఉన్నవారిని.

ఇదే సహజీవనమైతే ఆమె ఇల కట్న కానుకలు చెల్లించుకుని మరి వెట్టి చాకిరి చేయాల్సిన అవసరం ఉండదు. గర్భస్త శిశువు ఆడ పిల్ల అయితే కట్నం భయంతో అబార్షన్ చెయ్యించుకోరు.భాగా తిని  త్వ్రరగా మెచ్యూర్ అయితే త్వరగా పెళ్ళి ఖర్చులుంటాయని అమె కడుపు మాడ్చరు. ఎక్కువ చదివిస్తే దానికన్నా పెద్ద చదువువానికి ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్ళి చెయ్యాలని చదువులు ఆపరు.

ఇలా ఎన్నో విదాలుగా సహజీవనం స్త్ర్రీకి మేలే చేస్తుంది. ఎప్పుడైతే ఒక పని తప్పని సరి అవుతుందో ఆ పని మీద ఎవరికి ఆసక్తి కలగదు. ప్రేమించడం కూడ అంతే. వివాహ
భంధంలో భర్త భార్యను ప్రేమించడం తప్పనిసరి. భార్య భర్తను ప్రేమించటం తప్పని సరి అవుతుంది.

అందుకని సహజీవనం చెయ్యమంటావా? అతను వదిలేస్తే ఆమె గతి ఏంకావాలి అని ప్రశ్నిస్తారు.అసలు స్త్ర్రీని ఇంత నిస్సత్తువగా తయారు చేసింది వివాహ వ్యవస్థే. వివాహానికి పూర్వం మార్కెటింగ్ అవసరాలతో తనను  సుకుమారంగా మెయింటేయిన్ చేసే స్త్ర్రీ పెళ్ళి అనంతరం మార్కెటింగ్ పూర్తైన చందాన , సర్వీసింగ్ కి వచ్చిన కస్టమర్ పట్ల డీలర్లా బెహేవ్ చెయ్యడం మొదలు పెడుతుంది. తన మార్కెటింగ్ ఎత్తులు,ముస్తాబులు,అన్నింటికి స్వస్తి పలుకుతుంది.

అలాగే భర్త వివాహానికి పూర్వం  వయస్సులో పెద్ద వారిలో ఆడవారి పట్ల  ఏ చేష్ఠలను చూసి చికాకు పడేవాడో అవే చేష్ఠలు తాను చెయ్యడం మొదలు పెడతాడు. (అసహ్యంగా తేపడం, పిత్తడం, పల్లు సందులు లోడటం ..భార్యను ఒసే అనడం,ఇదిగో అనడం,గాడిద అనడం ఇల ఎన్నెన్నో)

ప్రేమ అనే ఉప్పు గుర్రమెక్కి సంసార సాగరంలో దిగిన దంపతులు ఆ ఉప్పు గుర్రం కరిగి పోగా ఆ సముద్రాన మునిగి అల్లాడుతుంటారు. ఎందుకంటే ఆ సాగరంలో దిగాక ఇవతలి ఒడ్దుకు చేరలేరు.అవతలి ఒడ్డా కంటికి కనబడదు.

కాని సహజీవనమన్నది సరస్సు. అందులో దిగి ఉన్నప్పుడు ఆ ఒడ్డు ఈ ఒడ్డు రెండూ కనబదుతుంటాయి.

ఏ దృశ్యానికైనా ఒక కాల పరిమితి ఉండాలి. ఒకగానొక సమయంలో మూడున్నర గంటల సినిమాలు ఆడాయి. ఇప్పుడు?  అందుకే చెబుతున్నాను ప్రతి ఒక్కరు సహ జీవనాన్నే కోరుకునే రోజులు దగ్గర బడ్డాయి. కోర్టులు కూడ సమర్థించే రోజులొచ్చాయి. ఇదీ మంచికే.
ఎవరికైతే వివాహ వ్యవస్థ పట్ల నిజమైన విశ్వాసం,ఆసక్తి ఉంటుందో వారు మాత్రమే వెవాహిక జీవితంలో అడుగు పెడ్తారు.

ఏ విషయంలోనైనా ప్రత్యామ్నాయం ఉండాలి.  పోటి ఉండాలి.అప్పుడే క్వాలిటి పెరుగుతుంది.స్త్ర్రీకి పెళ్ళి తప్పా మరో ఆల్టర్ నేటివ్ లేదు. అందుకే ఆమె ఇలా పెళ్ళి మార్కెట్ లో చులకనై పోతుంది. అమెకో ఆల్టర్ నేటివ్ సహజీవనం.  వారు విడిపోతే అని కంఠం పెంచకండి.

ఎంతమంది దంపతులు విడిపోవడం లేదు. మరి పిల్లలు? అని ఆగ్రహించకండి ఇప్పట్లో ఎంతమంది పిల్లలు హాస్టల్స్ లో పెరగడం లేదు.

సహ జీవనం కూడ పెళ్ళికి ఒక మోతాదు తక్కువే అయినా సహజీవనంలో కూడ స్త్ర్రీ దోపిడికి గురవుతుంది. కాస్త నాజూగ్గా .. కాసింత సునితంగా. ఒకటి రెండు సం.ల్లో విడిపోతే పెద్దగా బాధ కలుగక పోవచ్చు. కాని ఏళ్ళ తరబడి కలిసి బ్రతికి విడిపోవాలంటే భాధ కలుగక మానదు. ఆ జంటలో ఒకరు ఆటాచ్ మెంట్ కారణంగా కలిసి ఉండాలని పట్టుపట్ట వచ్చు. మళ్ళీ పాత కథే..పాత రోతే. పెళ్ళికి ఆల్టర్ నేటివ్ సహజీవనమైతే  కొన్ని ఇరువురికి కొన్ని లాభాలు జరుగవచ్చు.

కాని సామాజికంగా భవిష్యత్తులో నష్థాలు తప్పవు.  ఇన్ని తంటాలు పడటం కన్నా వ్యభిచారానికి ( ద్విపక్ష)  చట్ట బద్దత కల్పిస్తే సమస్య సముసి పోతుంది. కొన్ని గంటల్లో ఆటాచ్ మెంట్ పెరగడం వంటివి జరుగవని విశ్వసిస్తున్నాను,

వివాహ వ్యవస్థ పటిష్ఠం కావాలంటే, ఆ వ్యవస్థ పై విశ్వాసం లేని వారు ,కేవలం శారిరక ఇచ్చలకు అవుట్ లెట్ గా భావించేవారు ఆ వ్యవస్థలోకి ఎంటర్ కాకుండా నిరోధించాలి. అందుకు మార్గం వ్యభిచారానికి (ద్వి లింగ) చట్త బద్దత కల్పించటమే. 

మరక్కడ ప్రేమ ఎలా బ్రతికి ఉంటుంది. ఇక పిల్లలంటారా? ప్రస్తుతం అందరి పిల్లలు వారి ఇంట్లోనే పెరుగుతున్నారా? లేదే .. ఆలోచించండి. నేడు సుప్రీమ్ కోర్టు వ్యాఖ్యాణించింది. రేపు సహ జీవనం చట్ట బద్దమే కావచ్చు. కాని సహ జీవనం పెళ్ళి లాంటి చిక్కులనే తెచ్చి పెడుతుంది. పైగా వివాహ వ్యవస్థలో ఉన్న కొద్ది పాటి మేలును  కూడ చద్రం చేస్తుంది. అందుకే ఇప్పటికైనా వ్యభిచారానికి చట్ట బద్దతకు గళం విప్పండి.

ఎవరు ఏ దారిలోకి వెళ్ళినా చివరికి రావల్సింది నా దార్లోకే.

0 comments:

Post a Comment