క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Tuesday, 28 September 2010

సైక్రియాట్రిస్టును కలవాలనుకున్నాను



శీర్షిక చూడగానే " ఇటువంటి పిచ్చి వ్రాతలు వ్రాస్తుంటే  సైక్రియాట్రిస్టును కలవాలనుకోవడం ఏంది పిచ్చాసుపత్రిలో చేరాల్సి కూడ రావచ్చని కొందరు భావించ వచ్చు.  సైక్రియాట్రిస్ట్ను కలిసిన వారికి, కలవాలనుకున్న వారికి మాత్రమే మానసిక రుగ్మతలుంటాయనుకోవడం మూర్ఖత్వం. మనందరమూ ఏదో సమయాన,ఏదో విదమైన మానసిక రుగ్మతకు గురవుతూనే ఉంటాం.

శారీరకమైన రుగ్మతలు ఎదురైనప్పడు మాత్రం వెంటనే ఫిజిషియన్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంటాము గాని మానసిక రుగ్మతలు ఎదురైనప్పుడు మాత్రం ఒక సైక్రియాట్రిస్టును కలవాలని కనీశం అనుకోవడం కూడ కల్లే.

ఎందుకిలా అంటే మన భారత ,తెలుగు సంస్కృతే హిప్పాక్రటిక్ సంస్కృతి. మనవారికి నిజాలకంటే అందమైన అబద్దాలంటేనే మక్కువ. అందుకే మన పాలకులు ఇలా ఏడ్చారు.  బై ది బై మనిషిలోని శరీరం మనస్సులకు నడుమ ఉన్న సంభంధం విచిత్రమైంది.

వీటిలో ఏదైన ఒక్కటి దృడంగా ఉంటే మరో అంశం కాస్త నిలదక్కు కుంటుంది. రెండూ గోడ మీది పిల్లిలా ఉంటే రెండూ సర్వ నాశనమై పోతాయి. మనో భలం, శారీరక ధారుడ్యత రెండూ ఉంటే మానవుడు సాధించ లేనిదంటూ ఏమీ ఉండదు.

నిజానికి సైక్రియాట్రిస్టును కలవాలనుకున్నది నా మానసిక ఆరోగ్యం కోసం కాదు. అదృష్ఠవశాస్తూ నాకా అవసరం ఇందాకా రాలేదు . నేను కలవాలనుకున్నది ప్రముఖ సైక్రియాట్రిస్ట్ సుధాకర్ రెడ్డిగారినే. ఆయన గారు పాజిటివ్ థింకర్స్ క్లబ్ వారు నిర్వహించిన సెమినార్లో పాల్గొనడానికి చిత్తూరు వచ్చారు.


ఆయన గారి  సారథ్యంలో "జీవన వికాసం" సరి కొత్త  మాస పత్రిక గత ఆగస్ట్ నెలలో ప్రారంభమైంది. దినపత్రికలు, సైకాలజి టు డే మాస పత్రిక ఫాలో అయ్యేవారికి సుధాకర్ రెడ్డి సుపరిచితుడు. ఒక పాత్రికేయునిగా , సంపాదకునిగా ఆయనను కలిసి కొన్నిముందు జాగ్రత్తలు చెప్పాలనుకున్నాను .అందుకే ఆయనను కలిసే ప్రయత్నం చేసాను.

ఇంతకీ గతంలో నేను  పాజిటివ్ థింకర్స్ క్లబ్ వారు నిర్వహించిన సెమినార్లో పాల్గొని "మని సీక్రెట్స్" శీర్షికన ప్రసంగించినప్పుడు డా.సుధాకర్ రెడ్డిగారు సతరు సెమినార్ కు విచ్చేసి ప్రసంగించారు కూడా. ఎందుకో ఆయనను కలవలేక పోయాను.


డాక్టరుగారి  ప్రసంగాలు బాలుర నుండి వృద్దుల దాక, విథ్యావంతులనుండి, నిరక్షరాస్యుల దాక అందరిని ఆకట్టుకునేదని వేరే చెప్పక్కర్లేదు. ఆయన గారి ప్రసంగాలు గాని వ్యక్తిగత సంభాష్ణలు కాని ఒక తండ్రిని,ఒక అంకుల్ని, ఒక బ్రదర్ని,ఒక స్నేహితుడ్ని తలపిస్తాయి కాని ఆయనో సైక్రియాట్రిస్టని ,డాక్టరని అనిపించదు. వృత్తి పరంగా ఆయన ఇంతటి ప్రాచుర్యం పొందటానికే ఇవే కారణాలైయ్యుండొచ్చు.

పైగా మానవ సంభంధాలు,కుటుంభ వ్యవస్థ  ఎదుర్కొంటున్న సమస్యల  పై ,టీన్ ఏజ్ కుర్రాళ్ళ ఈవ్ టీజింగ్ ఇత్యాదుల పైన ఆయన చేస్తున్న యుద్దం, ఆ విషయాల పై ఆయనకున్న చిత్త శుద్ది ప్రశంసనీయం. మానవుల మనస్సుల  పై ప్రభావం చూపుతున్న  స్థూల అంశాలు ఎన్నో ఎన్నెన్నో?

గ్లోబలైజేషన్, ప్రైవటైజేషన్,లిబరలైజేషన్,  నిరుధ్యోగం,పని బధ్రత లేమి, అవినీతి, పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్, తారా స్థాయికి చేరుకుంటున్న రాజకీయ, ఆర్థిక అస్థిరత్వాలు , పాలకుల నిర్లక్ష్య, స్వార్థ పూరిత వైఖరి  ఇలా ఎన్నో ఎన్నెన్నో అంశాలు మానవులను మానసికంగా కృంగ తీస్తుంటాయి.

ఈ అంశాల పై ఆయన ఒక సైక్రియాట్రిస్టుగా చేసేది ఏమి లేక పోయినా ఆధునిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను, నేటి జీవన కురుక్షేత్రాన్ని  ఎదుర్కొనేందుకు ఆధునిక గీతను జన భాహుళ్యానికి  ఉపదేశిస్తున్న అభినవ కృష్టుడాయన.

ఆయన తలచుకుంటే ,ఆదాయమే పరమావధి అనుకుని ఉంటే కోట్లు సంపాదించుకునేవాడు. కాని ఆయనలోని పల్లటూరి అమాయకుడు జర భద్రంగా ఉండటంతో ఈ దుస్సాహసానికి తెగించినట్టుంది.  ఆయన యొక్క ఈ ప్రయత్నం సూపర్ సక్సెస్ కావాలని హృదయ పూర్వకంగా  కోరుకుంటున్నాను

మీరు సైతం మార్కెట్లో వెతికి మరి "జీవన వికాశం" పత్రికను కొని చదివి పది మందికి దాని ప్రాముఖ్యతను తెలపండి.ప్లీజ్ !

6 comments:

  1. మీకు, మీ తెలుగుకు ఒక పెద్ద నమస్కారం.. ముందు తప్పుల్లేకుండా తెలుగు రాయండి మహాప్రభో.. విషయం జీర్ణం అయితే కదా పదిమందికి చెప్పగలిగేది.

    ఇట్లు,
    ఒక తెలుగు అభిమాని..

    ReplyDelete
  2. "ఎందుకిలా అంటే మన భారత ,తెలుగు సంస్కృతే హిప్పాక్రటిక్ సంస్కృతి. మనవారికి నిజాలకంటే అందమైన అబద్దాలంటేనే మక్కువ. అందుకే మన పాలకులు ఇలా ఏడ్చారు."

    ఆహా! గొప్పగా సెలవిచ్చారు, సంతోషం.

    హిప్పోక్రసీకీ, అందమైన అబద్దాలంటేనే మక్కువ చూపించడానికీ, పాలకులు ఇలా ఏడవడానికీ మధ్య సంబంధం ఏంటో కొంచెం వివరిస్తే బావుండేది.

    తెలుగు సంస్కృతిని వదిలేసి అరవ సంస్కృతిపైన మీ అమూల్యాభిప్రాయాల్ని మాతో పంచుకుంటే ఇంకా బావుండేది!
    !

    ReplyDelete
  3. దినకర్ గారూ,
    నా తప్పులు 3 రకాలు. ఒకటి కావాలని చేసినవి ఉ. దినకర్ గారూ అనడం. మరొకతి తెలియకుండా జరిగి పోవడం. మూడు సాంకేతిక పరమైనవి . అంటే షిఫ్ట్ సరిగ్గ్గా నొక్కక పోవడం వంటివి . ఏది ఏమైనా తెలుగు మీద మీకున్న అభిమానం ప్రశంసనీయం

    ReplyDelete
  4. తిరు గారూ,
    హిపాక్రసికి , పాలకులు ఇలా ఏడవడానికి చాలా దగ్గర సంభంధముంది. యదా ప్రజా తదా రాజా కదా. తమిళ సంస్కౄతిలో ఏవైనా లోపాలుంటే వాటిని అక్కడే తేల్చుకోవాలి కాని ఇక్కడ కాదు.

    నేనక్కడ మాట్లాడినప్పుడు తెలుగు వారి గొప్పతనాన్నే చాటుతా అది నాశ్టైల్ మాత్రం కాదు నా ధర్మం కూడా

    ReplyDelete
  5. ఆర్యా,

    సాక్షాత్తూ వాణీపుత్రనామధారులైన మీరు తెలుగును కావాలని తప్పుల తడకగా రాయొచ్చు, అది సమంజసం.

    తెలుగు, అరవ సంస్కృతులనుద్ధరించే కంకణం కట్టుకున్న మీకు ప్రతి సంస్కృతిలోనూ లోపాలుంటాయని తెలుసనుకోండి, ఐనా బాధేసి అలా రాసాను తప్ప మీ గొప్పతనాన్నీ, స్టైల్‌నీ కించపరచాలని కాదు.

    మీరింతకాలం రాజశేఖరుడికీ, జగన్‌కీ డప్పుకొడుతోంటే ఏమో అనుకున్నానుగానీ, మీ స్టైల్ (ధర్మం) ప్రకారం వాళ్ళని వాళ్ళ ఇంట్లో ఏకేస్తారన్నమాట!
    (నాకే పాపం తెలీదండోయ్, ఏదో సార్ గారి అవినీతి గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటేనూ...)

    యదా ప్రజా తదా రాజా కాదనుకుంటానండీ, కానీ మీరదే కరెక్ట్ అంటే సరే. మా చిన్ని బుర్రలకి తెలిసిందిదీ:

    యథా భూమిస్ తథా తోయం
    యథా బీజం తథాంకురః |
    యథా దేశస్ తథా భాషా
    యథా రాజా తథా ప్రజా ||

    (http://practicalsanskrit.blogspot.com/2010/01/like-father-like-son-yatha-raja-tatha.html)

    మర్చేపోయా, మీరా సంబంధం పైనో టపా రాస్తే చదివి తరిస్తాం

    మరి ఉంటానండి

    ReplyDelete
  6. తిరుగారు,
    ఆ అంస్కృత శ్లోకం వ్రాసిన నాడున్నది రాజరికం. అందులో రాజెలా ఉంటే ప్రజలు అలా ఉండే వారు. ప్రస్తుతం నడుస్తున్నది ప్రజా స్వామ్యం కదా. ప్రజలెలా ఉంటే రాజులు అలా ఉంటారని భావం. నేను వై.ఎస్. ఉత్తమోత్తముడని , జగన్ రుష్య శృంగుడని ఎక్కడా చెప్పలేదు. గుడ్డిలో మెల్ల రీత్యా ఉన్న అవకాశాల్లో మెరుగైన అవకాశమనే భావంతోనే వారికి మద్దత్తిస్తున్నా. మీరు చూపండి ది బెస్ట్ చాయిస్ ఎవరన్నా ఉంటే చూపండి. వారికి డప్పు కొడతా

    ReplyDelete