క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Wednesday, 20 October 2010
బ్లాగులు - కొన్ని సాంకేతిక అనుభవాలు
మీ మీద ప్రేమతో కాకున్నా 2000 సం.నాటి నుండి కలిగిన అనుభవాలను నెముర వేసుకుని వాటి క్యేప్స్యూల్ రూపంలో స్టోర్ చేసుకోవడానికే ఈ టపా. నేను ఆంజనెయ స్వామి శిష్యుడ్ని.( నీ దుంప దెగ.. హెడర్ ఇమేజ్ చూసిన వారు ఉమ్మి పోరూ.. అని మీరు కసురుకోవడం వినిపిస్తూంది. గురువు గారు.. ఆ ఇమేజిని లోతుగా చూడండి. అది మానవ కన్య కాదు సుమండి.ప్రకృతి మాత.)
ఈ టపాలో నేను ప్రస్తావించ పోయే విషయాలను స్నాప్ షాట్స్ తో సహా సవివరంగా అందిస్తే ఇంకా బాగుండేది. కాని నేను ఆంజనేయ స్వామి శిష్యుడ్ని. నా భలం నాకు తెలీదు . ( నీ తోక ఇంతింత కాదయా స్వామీ.. అని నిట్టూర్చకండి)
చాలా చిన్న సమస్య . నేను మొదట బ్లాగు.కాం లో (ఇది వోర్డ్ ప్రెస్ వారి సౌజణ్యంతో నడుస్తూంది) సైట్ క్రియేట్ చేసాను. కనీశం ఆరు నెలలు భాగా కష్ఠపడి టపాలు వ్రాసాను.
కొన్నాళ్ళకి సైట్స్ యొక్క జాతకాలను చెప్పే అలెక్సా డాట్ కాం గురించి తెలిసి అందులో నా సైట్ పేరు కొట్టి ర్యేంకు కనుగొనాలని ప్రయత్నించాను .కాని అలెక్సా బ్లాగు డాట్ కామ్ ర్యేంకు తెలిపిందే కాని నా వ్యక్తిగత సైట్ గురించి పట్టించుకోలేదు
( చూడండి : ఇమేజ్ నెం. 1)
ఇదేందిరా బాబూ రాజకీయ పార్టిలో కార్య కర్త బతుకైపోయిందని నొచ్చుకుని (మన శ్రమ ఫలితం బ్లాగు వారికి అందుతుంది - మనకొచ్చే హిట్స్ వారి సైట్ పరపతిని పెంచటానికే ఉపయోగ పడుతూంది) స్వతంత్రించి రామన్న రాజన్న సైట్ వోర్డ్ ప్రెస్ లోనే ఏర్పాటు చేసుకున్నాను. దీంతో బ్లాగు డాట్ కాం లోని నా టపాలను రామన్నరాజన్న పేరిట ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర (వ్యక్తిగత) సైట్ కి తరలించటంలో సమస్య రాలేదు.
ఈ సైట్ గురించి అలెక్సా డాట్ కాంలో సెర్చ్ చేస్తే నా సైట్ ర్యేంకును చూపింది. దీంతో అదో "తుత్తి" ( అచ్చు తప్పు కాదండి ముర్రో!) చూడండి: Image No: 2
అప్పట్లో బ్లాగ్లోకం పై గుత్తాధిపత్యం చలాయిస్తున్న కూడలి,జెల్లడ వారు నా సైట్ బ్యేన్ చేసేరు. తమిళ బ్లాగ్లోకంలో లభించిన అనూహ్య స్పందన అక్కడే నన్ను కట్టి పడేసింది. రోజు వారి హిట్స్ డబుల్ గా ఉన్నా సభ్యుల సంఖ్య మాత్రం అందులో సగమైనా లేక పోవడంతో నొచ్చుకుని కొత్త టపాలు వ్రాయడం మానేసా. అయినా అది తన సత్తా చాటుతూనే ఉంది. (అలెక్సాలో వెతికి చూడండి - ఎండమూరి సైట్ కన్నా మనదే సూ.........పర్ ! మరీ లక్షల ర్యేంకు తేడా)
ఆ మద్యకాలంలో బ్లాగర్.కాంలో సాంబారుగాడు సైట్ నెలకొల్పాను. అయినా గుత్తాధిపత్యం కొనసాగడంతో ఏమీ చెయ్యలేక పోయాను. తమిళ బ్లాగు భాగా వేళ్ళూనుకోవడంతో తెలుగు బ్లాగు పై మళ్ళీ దృష్ఠి పెట్టాను. మాలిక, హారం రాకతో కాస్త కొత్త గాలి తోలుతుండడంతో కాస్త ఉత్సాహంగా రంగంలోకి దిగాను.
వోర్డ్ ప్రెస్ లోని టపాలను అక్కడ నుండి బ్లాగరుకు దిగుమతి చేసుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను. కాని "ఎరర్" చూపిస్తూ వచ్చింది. ఆప్షన్స్ నేపథ్యంలో చూస్తే బ్లాగర్ సముద్రం. వోర్డ్ ప్రెస్స్ పిల్ల కాల్వ. అయినా తప్పదుగా అంటూ మళ్ళీ వోర్డ్ ప్రెస్ లో సాంబార్ గాడు పేరిటే ఒక సైట్ నెలకొల్పి బ్లాగు డాట్ కాంలోని టపాలు,బ్లాగర్ డాట్ కాం లోని టపాలు అన్నింటిని ఒక గొడుగు క్రిందకు తేవడానికి తల ప్రాణం తోక్కొచ్చింది.
ఇందులో గూగుల్ వారి బెదిరింపులు వేరే. ఏమైతేనేం .నా రచనలంటిని మీరు ఒకే చోట చదువుకునే ఏర్పాటు చేసాను.
ఇంతకీ నా సలహా:
* బ్లాగు డాట్ కాంలో సైట్ ఏర్పాటు చెయ్యకండి - మీ శ్రమంతా వారికి ఫలితాన్నిస్తుంది కాని మీకు కాదు
* ఒక వేళ మీకు బ్లాగు డాట్ కాంలో సైట్ ఉంటే వెంటనే వోర్డ్ ప్రెస్ లో మరో బ్లాగ్ క్రియేట్ చేసి అక్కడి టపాలన్నింటిని కొత్త బ్లాగ్లోకి దిగుమతి చేసుకొండి
* మీరింత వరకు బ్లాగ్ క్రియేట్ చెయ్యలేదా? అదృష్ఠవంతులండి బాబు.వెంటనే బ్లాగర్ డాట్ కాంలో సైట్ ఏర్పాటు చేసుకోండి
Subscribe to:
Post Comments (Atom)
మీ హేద్దేర్ లోనిది ప్రకృతి కన్యా బాబూ.అవున్లే గనులు,రియల్ ఎస్తతెల పేరిట మీ రాజన్న ఆవిడని బాగానే లొంగదీసుకున్నాడు మరి.
ReplyDeleteగురువుగారూ,
ReplyDeleteనమస్తే ! ప్రకృతి వనరులు సద్వినియోగమయ్యేలా చూడటం ప్రకృతిమాతను లొంగ దీసుకోవడం ఎలా అవుతుంది? వై.ఎస్.ప్రతి పని "చట్ట బద్దంగానే" చేసారు. వాటిలో కొన్ని ధర్మ బద్దమైనవి కాక పోవచ్చు. వై.ఎస్ కేవలం ఒక రాజకీయ వేత్త. మహాత్ముడు కాదు సుమండి.. పొరభాటున చట్ట బద్దం కానివి చేసి ఉంటే ఆ రెండు పత్రికలు వదిలి పెట్టేవా?
శాసన సభ సమావేశాలు పూర్తయ్యాక ఒక్క రోజన్నా విశ్రాంతి తీసుకోకుండా ప్రజల్లోకి వెళ్ళి దుర్మరణానికి గురైనా, ఆ షాక్ నుండి మా బోటి వారు ఇంకా తేరుకోలేక పోతున్నా ఆయన పై ఎందుకండి ఇంత కక్షా..
పోన్లే నేనూ ఆరోపణలు చేస్తా .. ఇందిర పై, రాజీవ్ పై కాచుకొండి
1 ప్రకృతి వనరులు సద్వినియోగమయ్యేలా చూడటం -evariki?ayana kutumbamloni vaallakaa?...........................
ReplyDelete2.శాసన సభ సమావేశాలు పూర్తయ్యాక ఒక్క రోజన్నా విశ్రాంతి తీసుకోకుండా -visranthy teesukunte anni lakshala kotlu+lakshala ekaraala bhoomi ettaa sampadisttadayyiaha..aa.
This comment has been removed by the author.
ReplyDeleteగురువు గారూ,
ReplyDeleteఎన్.టి.ఆర్,వై.ఎస్.ఆర్ వంటి వారంతా పవర్ ఫుల్ వ్యక్తులు. అందుకని వారు తప్పే చేసి ఉండరని కాదు నా ఉద్దేశం. వారి పేరు చెప్పుకుని కొందరు చేసి ఉండొచ్చు. లేదా వారు మెచ్చుకుంటారని కొందరు చేసి ఉండవచ్చు.
లిక్కర్ మాఫియాకు వ్యతిరేకంగా నిలబడ్డ ఏకైక కారణం చేత ఎన్.టి.ఆర్ జీవితం దుఖాంతమైంది.
గోదావరి బ్యేసిన్ లో దొరికిన గ్యేస్ నిక్షేపాన్ని పంచ వలసింది మీ అమ్మ కాదు సోనియమ్మ అని చెప్పిన ఏకైక కారణం చేత వై.ఎస్.ఆర్ జీవితం అలా ముగిసింది
మీలా ఆలోచిస్తే మహాత్ముని పై సైతం విమర్శలున్నాయి. నేను ఈ మహానేతల గురించి గొప్పగా వ్రాయడం వీరు మహాత్ములని కాదు. వారి సమ కాలీన నాయౌకులతో పోల్చుకుని ఇలా కీర్తించవలసి ఉంది.
పోనీ మీకు తెలిసిన గొప్పవారేవెరన్నా ఉంటే సూచించ రాదూ
నిజం చెప్పమంటార ?ఇన్ని అంశాలమీద అనర్గళంగా ,అప్రతిహతంగా,రోజుకు రెండు/మూడు బుల్లెట్స్ లాంటి పోస్ట్లను సంధించే మీరు గొప్పవారు కాదనా మీ ఉద్దేశ్యం?ఒక్కసారి మీరు ఆత్మపరిసీలన చేసుకోండి.మీరు చెప్పినట్టుగా వారి పేర్లను చెప్పుకొని చేస్తే,నిజంగా ఆటప్పు మీ రామన్నా,రాజన్నలు చేసినట్టే ..
ReplyDeleteగురువుగారూ,
ReplyDeleteమీ కమెంటులో సగ భాగాన్ని ఒక తల్లి తన బిడ్డను " నీకేరా ..మహరాజువి" అని ఓదార్చినట్టుగా భావించి మీకు థ్యేంక్స్ చెప్పేస్తున్నాను.
//మీరు చెప్పినట్టుగా వారి పేర్లను చెప్పుకొని చేస్తే,నిజంగా ఆటప్పు మీ రామన్నా,రాజన్నలు చేసినట్టే .. //
కరెక్టే గురువుగారూ. వారు తమ చరిస్మాకి ఇచ్చే ఖరీదులో ఇటువంటివి ప్రప్రథమమైనవి