క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday, 22 October 2010

బాబన్నా ! ప్రథాని స్యేడిస్ట్ కాదన్నా.. మసాకిస్టు


స్యేడిజానికి పెట్టింది పేరుగా పరిపాలించిన నువ్వు ఆ బిరుదును ప్రధానికి కట్ట పెట్టడం గొప్ప త్యాగమే అవుతుంది. ప్రధానిని తిట్టాలనుకుంటే ఎన్నో పద ప్రయోగాలున్నాయి. కీలు బొమ్మ ,చేతగాని వాడు, దద్దమ్మ,చవట.

పెద్ద సైకాలజిస్ట్ రేంజిలో మాట్లాడేవాడివి గా ( మైండ్ సెట్ మార్చుకో..etc) ఇతరులను హింసించే వాడే స్యేడిస్ట్. ఇతరులచే హింసింప పడే వాడు మసాకిస్ట్. సోనియా అండ్ కో చేత హింసకు గురయ్యే మన్మోహన్ స్యేడిస్ట్ ఎలా అవుతారు. మసాకిస్ట్ అనాలి బాబన్న!

నువ్వు ఎంత పెద్ద స్యేడిస్టో మరిచినట్టున్నావు .. చిన్న ఫ్లాష్ బ్యాక్ వేసుకుందామా?


వై.ఎస్. వెనుక రోశయ్య ఉన్నంత వరకు ఆయనగార్ని ఎలా పొగిడేవాడ్నో ఎన్.టి.ఆర్ వెనుక మీరున్నంత కాలం మిమ్మల్నీ అలాగే పొగిడే వాడ్ని.నా వారితో మాట్లాడుతున్నప్పుడు" మచ్చా(న్) మనోడు (ఎన్.టి.ఆర్) ఉత్త తిక్కలోడురా.. చంద్రబాబే ప్రక్కన లేదనుకో బాస్కర్ రావు సీనుతోనే సీన్ ఎండ్ అయ్యేది .సింహం పక్కన ఒక నక్క కూడా ఉండాల్రా. మనోడేమో సూర్యుడిలా భగ భగ మండేసి ఊరుకుంటాడు. దాన్ని సోలార్ పవర్ గా మార్చి పనులయ్యేలా చూడాల్రా ఆ పని బాబే చెయ్యగలడు"

మీరు కాంగ్రెస్ మంత్రిమండలిలో పావలా మంత్రిగా ఉన్నది - అదిష్ఠానం ఆజ్నాపిస్తే మామ పై పోటి చేస్తా అన్నది అన్నీ గుర్తున్నా ఆనాడు అలా అనిపించేది. అనిపించిందే చెప్పేవాడ్ని. కాని ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు భాస్క్తర్ రావు పాత్ర పోషించారు.

ఇప్పట్లో లాగే అప్పట్లో  కూడా నేను  మనుషుల మనస్తత్వాల పై పరిశీలన చేస్తుండేవాడ్ని. ప్రపంచం మనుషులు చేసే పనిని మాత్రమే చూస్తది. కాని నేను ఆ పనికి ప్రేరేపించిన వారి పుట్టు పూర్వోత్తరాలను సైతం పరిగణలోకి తీసుకునెవాడ్ని.

ఎన్.టి.ఆర్ చివరి సారి సి.ఎం అయినప్పుడు మిమ్మల్ని ఆర్థిక మంత్రి చేసారు. మీరు భవిష్యత్తులో అమలు చేసి రాష్ఠ్ర్రాన్ని దివాళా తీయించి మీరు మునిగిన అంశాలను ఆనాడే అమలు  చెయ్యాలని చూసేవారు. మీరు ప్రతిపాదించింది పెద్దాయన తిరస్కరించింది ఎన్నని నాకు తెలీదు. కాని మీరు తెచ్చిన సవరణలెన్ని - పెద్దాయన రద్దు చేసినవెన్ని అని నాటి దినపత్రికల్లోనే వచ్చాయి.

మీ అహం దెబ్బ తింది. తిరుగుభాటుకు సిద్దమయ్యేరు.లక్ష్మి పార్వతి అండ్ ఆల్ దట్ అంతా మీ సృష్ఠి మాత్రమే. నెంబర్ వన్ అంటే భిరుదు కాదు గురువా.. భాధ్యత. ఈ పాయింట్ నీకు హోల్సేల్ గా మునిగినా ఇంకా అర్థం కాలేదు.

పోనీ నెంబర్ వన్ అయ్యావు. వేషం కడితే చాలదు. నటించ గలగాలి. (ఈ పాయింటు తెలీకే ప్రొడ్యూసర్ల ఉంపుడు గత్తెల కొడుకులు,హీరోయిన్ల తమ్ముళ్ళు తెలుసుకోక అట్టర్ ప్లాఫ్ అవుతున్నారు.

తె.దేపాకున్న భలమంతా భీదవారు,రైతులు, బి.సిలు,ఎస్.సిలు. వీరికి కాసింత ఊరట కలిగించే ఏ చిన్న పనీ నువ్వు చెయ్యలేదు. వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడటం కూడ మానేసావు. పార్టిని దూరం చేసుకున్నావు. ఎమ్.ఎల్.ఏ ఎం.పీల మాటలకన్నా నీకు ఎస్.పి కలెక్టర్ల మాటే వేదవాక్కైయింది.తె.దేపాకు అధికారం తెచ్చి పెట్టిన రెండు రూపాయల  బియ్యం దర పెంచావు. మద్య పాన నిషేదానికి నీళ్ళొదిలావు. ఎన్.టి.ఆర్ వెన్ను పోటు ఉధంతంలో సహకరించిన  లిక్కర్ మాఫియా రుణం తీర్చుకున్నావు.

మొదటి టెన్యూరన్నా ఫర్వాలేదు. 1999 ఎన్నికల్లో భా.జా.పాతో పొత్తు పెట్టుకుని వారు పొందిన రెండు శాతం ఓట్ల భలంతో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో నెగ్గావు.సి.ఎం అయ్యావు. అప్పుడెక్కింది నీ తలకు తిక్క.

ఆ నాడు నువ్వన్న మాటలన్ని ఇప్పటికీ నాకు గుర్తే . నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ నాకు గుర్తే. నీ పనులకన్నా మాటలు చిర్రెత్తించాయి. నాది చేతల ప్రభుత్వమన్నావు( అంటే ఎన్.టి.ఆర్ ది మాటల ప్రభుత్వమని నీ ఉద్దేశం) . నేను సి.ఎం కాదు సి.ఇ.ఓని అన్నావు. సి.ఇ.ఓ గాళ్ళు సంస్థ  లాభం కోసం పని చేస్తారు. వారు ఎం.డికి కొడుకో భావమరదో అయ్యుంటారంతే. వారిని ప్రజలు ఎన్నుకోరు. సి.ఎం అన్నవాడు ప్రజలచే ఎన్నుకోబడినవాడు. భవిష్యత్తులో ప్రజలకు సమాధానం చెప్పవలసిన వాడు.

వ్యవసాయ కుటుంభంలో పుట్టినప్పటికీ నీకు వ్యవసాయమంటే చిన్న చూపు. రైతు పిల్లలు వ్యవసాయం మానాలన్నావు. నష్ఠ పరిహారం కోసమే ఆత్మ హత్యలన్నావు. విద్యుత్ చార్జీలు రెట్టింతలుగాపెంచావు. ధర్మాసుపత్రిలో సైతం యూజర్ చార్జీలు వసూలు చెయ్యించావు. ఆర్.టి.సి చార్జీలు పెంచావు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే "ప్రతి దాన్ని రాజకీయం చేస్తున్నారన్నావు ఎన్నికలప్పుడే రాజకీయమన్నావు ( ఎన్నికలకు కొన్ని నెలల ముందు కోటి వరాలు ప్రసాదించావు. అయినా నిలువునా మునిగావు. మహా కూటమి కట్టావు.అయినా గట్టెక్క లేక  పోయావు.

నీది ఫెయిల్యూర్ ఫార్ములా. నువ్వో ఫెయిల్యూర్వి. నీ నక్క జిత్త్లు ఇక పారవు. నీ  యూస్ అండ్ త్రో టెక్నిక్ ఇక పారదు ( జూ.ఎన్.టి ఆర్) .  గతాన్ని సెలక్టివ్ అమ్నీషియాతో నువ్వు మరిచి పోయినా నా బోటి వారు గుర్తు చేస్తూనే ఉంటారు.  నీ మాటలు,చేతలు చరిత్ర పుటల్లోకి ఎక్కి పోయాయి. వాటిని వానిష్ చెయ్యడం నీ తరమూ కాదు. . నీ తాత తరమూ కాదు.

జగమెరిగిన వేశ్య పాతివ్రత్యం గురించి లెక్సర్ ఇచ్చినట్టు నేడు నువ్వు ఎంత గొంతు చించుకున్నా లాభం లేదు.  ప్రతిపక్షంగా ఎన్నో సార్లు శ్వేత పత్రం కోరావుగా. నువ్వు విడుదల చెయ్యి శ్వేత పత్రం. నీ పుట్టుక, తిండికి టికానా లేని బతుకు, కోట్లకు పడగలెత్తడం, ఎన్.టి.ఆర్ వెన్ను పోటు , నీ తొమ్మిది సం.ల సి.ఎం. బతుకు, గత ఆరు సం.ల ప్రతిపక్ష నేత బతుకులని భహిర్గతం చెయ్యి. ప్రజానీకానికి క్షమార్పన చెప్పు. పార్టిని ఎన్.టి.ఆర్ వారసులకు అప్ప చెప్పు,

2 comments:

  1. బాబు గారు వెధవన్నర వెధవ వాడి కి వాడి స్వార్థం తప్ప మరొటి పట్టదు.సింఘ్ గారిని అలాటి మాట అంటానికి ఈ సన్నాసిది నొరు అయితె గదా వీడిది తాటిపట్ట.మరలా వీడు ఆధికారం లొకి వచ్చాడా ప్రజల దురద్రుష్టం,దౌర్భాగ్యం,ఇంకా గట్టిగా చెపాలంటె మూర్ఖత్వం.

    ReplyDelete
  2. బాసు,
    మీ స్పందనకు థ్యాంక్స్. కాని మనలో మాట ఎన్.టి.ఆర్ వై.ఎస్ పోయిన తరువాత మన తెలుగోళ్ళంటేనే దిల్లి వారికి లోకువయ్యింది. బాబనే కాదు రోశయ్య బతుకూ ఇలానే ఏడ్చింది. చంద్రబాబు సైకాలజి నాకు భాగా తెలుసు. అతను భలహీనుడు. భలవంతుడిలా నటించాడు. ప్రజలు మరో సారి మోస పోయేలా లేరు. అంత మూర్ఖులెవ్వరూ ఇక్కడ లేరు. గీత గురించి మీరు వ్రాసిన టపా చదివాను. కాని గీత పై నాకు కొన్ని విమర్శలున్నాయి. వాటి గురించి ఇంకో సందర్భంలో వ్రాస్తా

    ReplyDelete