బ్రహ్మంగారు సిద్దయ్యను అడిగాడు "సిద్దా! లోకం ఎట్టా ఉందిరా?"
సిద్దయ్య చెప్పాడు " ఎవరిలోకం వారిది గురు దేవా
సైకాలజికి పునాది ఈ పోకడే. మనలో ఎవరికి వారం ఒక బుల్లి లోకాన్ని సృష్ఠించుకొని ఆ లోకంలోనె బతికేస్తున్నాం. మనం ఈ లోకంలో బతుకుతున్నం. ఈ లోకాన్ని ఉన్నదున్నట్టు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అలా అర్థం చేసుకున్నవారు ఎంత మంది?
Every man is an island అనీ అంటారు. Man is a social animal అనీ అంటారు. ఎంతటి వైరుధ్యం !
ఇందులో ఏది సత్యం? రెండూ సత్యాలే . మనిషి తన అవసరాలు తీరేంత వరకు సంఘ జీవిగా సర్దుకుంటాడు. తన వ్యక్తిగత అవసరాలు తీరాక ధీవిగా మారి పోతాడు.
ప్రాణి అన్నాక అది వ్యాప్తి చెందాలి. ( సెక్సు ద్వారా తన విత్తును వ్యాపింప చెయ్యడమే కాదు. )శారిరకంగా,మానసికంగా, సామాజికంగా వ్యాప్తి చెందాలి. స్వార్థం కృంగి పోవడానికి ప్రతీక. నిస్వార్థం వ్యాప్తి చెందడానికి ప్రతీక.
భలహీనులు కృంగి పోతారు. ఒక గూటిలో తమర్ని తామే భంధించుకుంటారు. (స్త్ర్రీలు వీకర్ సెక్స్ కాబట్టే వారికి రాజకీయాల పై, రాష్ఠ్ర్రం దేశం ,ప్రపంచ పోకడల పై ఆసక్తి ఉండదు. అస్తమానం కిచెన్లో కారుతున్న ట్యాప్ గురించి, పక్కింటి పద్మ గురించే ఆలోచిస్తారు.
కాని ఆధునిక జీవితం పురుషునిలోను భలహీనతను చొప్పించింది. అతనూ అభద్రతా భావంలోనే ఉన్నాడు. అందుకే వైవాహిక జీవితాలు చిక్కుల పాలవుతున్నాయి. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. స్త్ర్రీకి స్త్ర్రీ పై ఎటువంటి ఆసక్తి ఉండదు.
దగ్గర భందుత్వాల్లో , ఒకే కులంలో వధూ వరుల ఎంపిక జరుగుతూ వచ్చింది కాబట్టి పురుషుల్లో పుంసత్వం నశించి పోయింది. (ఇటీవలి సర్వేలు కూడ దీనినే ధృవీకరిస్తున్నాయి) దీంతో ఆడా మగా తేడా లేక ఎవరికి వారు వారి లోకంలో ఉండటం జరిగి పోతుంది.
గతంలో కనీశం తమ అవసరాలను నెరవేర్చుకోవడానికన్నా సమాజంతో కమ్యూనికేట్ చేసే ఓపిక తగ్గి పోతూంది. వీరి ఊహలకి నిజాలకి పొత్తు కుదరడం లేదు .కాని అనివార్యమైనప్పుడు మెజారిటి వారు సర్ధుకుంటారు. కాని కొందరు మానసిక రుగ్మతలకు గురై పోతారు.
నిజానికి మానవ మస్తిష్కం (మనస్సు) ఎంతో శక్తిమంతమైంది. జ్నాపకాలను సేఖరించుకునే న్యూరాన్లను ఇసుకంత పెద్దది చేస్తే ఒక లారి లోడుకు సరిపోతాయట. అయినా ఎందుకు మానసిక రుగ్మతలు భాధిస్తాయంటే.. వీరి మనోభలం వృధా అయి పోతూంది.
( నేనిక్కడ మానసిక రోగుల గురించి ప్రస్తావించడం లేదు సుమండి -మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నామన్న భ్రమలో ఉన్నవారి గురించే ప్రస్తావిస్తున్నాను)
అనుకోవడం ఒకటి - చెప్పడం మరొకటి - చేయడం మరొకటి- చేసినట్టుగా చెప్పుకోవడం మరొకటి.
ఈ అష్ఠావదానం శతావదానంగా మారినప్పుడు.. వీరి మనస్సు దేనినైతే బేస్ చేసుకుని ఇన్ని తంటాలు పడిందో అది చెదిరినప్పుడు, లేదా శారీరక భలహీనత మనస్సుకు సోకినప్పుడు, పరిస్థితి అడ్డం తిరిగినప్పుడు కుప్ప కూలి పోతారు.
"అబద్దము ఆడరాదు" అన్నారు.ఆడితే ఏం పోతుంది అని ప్రశ్నించవచ్చు. మీ మనస్సు రెండుగా చీలి పోతుంది. మీ మనోభలం సగమవుతుంది. మీరాడిన అబద్దం ఒక ట్రాక్లో వాస్తవం మరో ట్రాక్లో ప్లే అవుతుంటుంది. పైగా మీ మనస్సు ఎప్పటికప్పుడు ట్రాక్ మార్చటానికి మీ కాన్షియస్ అప్రమత్తంగా పని చెయ్యాలి. సూటిగా చెబితే మీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. బస్ స్టాండ్ అంటే ఒక సారి ఊహించుకొండి. టీ టీ .. బటాన్లే బటాన్లే.. ప్రయాణికులకు విజ్నప్తి.. ఇల సవా లక్షా వినవస్తూ కనవస్తూ ఉంటాయి.
అబద్ద్దాలు ఇతరులకు మాత్రం చెబుతూ వచ్చే వ్యక్తి ఒక దశలో ఆ అబద్దాలను తనకే చెప్పుకోవడం ప్రారంభించి , తనే నమ్మడం మొదలు పెడ్తాడు . అది మరింత జటిలమవుతుంది. ఇతరులు కూడ ..మరీ మేసస్ దానిని నమ్మడం మొదలు పెడితే వాడు మరో సత్య సాయి అవుతాడు.ప్రజలు ఎ.పూ అవుతారు.
ఈ గజి బిజిలో అతనికి అసలైన లోకం మీద అవగాహణ పోతుంది.ఆసక్తి పోతుంది. తనలోకంలో తను ఉంటాడు. ఆ లోకంలో వాన కురుస్తే వాస్తవ లోకాన గొడుగు పడతాడు. ఆ లోకంలో వరద వస్తే పెట్టా బేడా సర్దుకుంటాడు.
దీనిని జనం చూసి పిచ్చి అంటారు. కాని ఎవరి పిచ్చి వారికి ఆనందమేగా. ( కొన్ని కేసుల్లో కుటుంభ సభ్యులందరు ఒకేలా - అంటే ఎవరి లోకం వారివిగా ఉంటే ఇంకేముంది భూత వైద్యులు, కేరళ మాంత్రీకం, చేతబడి అంతా ఒక రౌండేసుకుని చివరికి సైక్రియాట్రిస్ట్ లేదా పిచ్చాసుపత్రే.
నా సలహా ఒక్కటే .. మీ లోకమంటూ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ( ఇది - మీ సెల్ఫ్ -యొక్క సృష్ఠి మాత్రమే) కాని దాని పరిమాణం వాస్తవలోకానికంటే పెద్దదై పోకుండా చూసుకొండి. రెండింటిలో వాస్తవలోకమే వాస్తవం అన్న సత్యాన్ని అనుక్షణం గుర్తుంచుకొండి.
లేకుంటే కొన్ని బ్లాగర్లవలే వారి లోకానికే పరిమితమై పోతారు. జన బాహుళ్యంతో అనుసంథానం కాకుంటే ప్రతి వ్యక్తి పిచ్చేవాడే అవుతాడు. (కాస్త ముందు వెనుక)
ఏమ్జేప్పినావు పోరగాడ..భలే సేప్పావు సిట్టూర్సిన్నోడా..అవుమల్లా..వోరిపిత్చ్చి వాళ్ళకు ఆనందం మరి.ఒకళ్ళకు బానామతులు,మరొకరికి సైబాబాలు[నువ్వు రాసిందే బిడ్డా],మీకేమో రాజన్నా,రామన్నాల భజనలు+వ్యక్తి పూజాలూనూ..మొత్తానికి నీ మనసులోని మర్మంబు వెళ్ళల్డి౦న్చితివా శిష్యా..
ReplyDeleteఏంది గురువా.. ఉన్నట్టుండి తెలంగాణ యాసకు జంపింగ్ అయిపోనావు?
ReplyDeleteరామన్న,రాజన్నలపై పిచ్చి కాదూ హ..నాకు పెజా స్వామ్యం అంటే ఇస్వాసం. నమ్మకం. పెజస్వామ్యంలో పెజలెన్నుకున్నవారే గొప్పోళ్ళ హ.
పెజలు మెచ్చినవోళ్ళని పెజల మనిశిగా నేను మెచ్చుకుంటా అంతే
(ఏం పెద్దయ్యా ఎట్టుంది మన యాస?
ఎన్ని తెలుగు సినిమాల్ సూడలా.)
మత పిచ్చికన్నా, కుల పిచ్చికన్నా, డబ్బు పిచ్చికన్నా, ఇదెంతో బెటరు గురువుగారూ..
vyakthi pooja srestam antaru..antenaa...sishyaa.
ReplyDeleteకరెక్టుగా నా పాయింటు క్యేచ్ చేసేరు. కాని వ్యక్తి పూజలో కొన్ని నిభందనలు కూడా ఉంటాయి. వారు నూరి పోసిన సిద్దాంతాలను వారే అతిక్రమించినప్పుడు వారిని సైతం ఎదుర్కొనే సత్తా ఉండాలి మరి .. ఆంజనేయస్వామిలా
ReplyDelete