క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday, 29 January 2011

బహుజనులకు మాత్రమే!

శ్రీర్షిక చూసిన బహుజనుడు దీనిని చదువుతాడో లేదో దేవుడెరుగు.కాని ప్రతి బ్రాహ్మణోత్తముడూ తప్పక చదువుతాడు. పది,ఇరవై  సం.లకు పూర్వమైతే  ఎవరన్నా ఎవరినన్నా పరిచయం చేస్తే " ఏంటీడు" అని అడిగేవారు. ప్రస్తుతం ఆడు పోయాక పరిచయం చేసినోడ్ని అడుగుతారు. "అడు ఏంటోడు" అని. ఇది కులాలకున్న ప్రాధన్యత. గుణాన్ని పట్టి వర్ణమని చెబుతారు.

జ్యోతిషంలోనైతే ఏ గ్రహం భలీయంగా ఉండి లగ్నాన్ని, పంచమ భావాన్ని చూస్తే  ఆ గ్రహ జాతికి చెందిన గుణాలొస్తాయని చెప్పబడియున్నది. కులం లేదు గిలం లేదని మేధావులు చెబుతారు. కాని మనం అవునన్నా కాదన్నా కులం ఉంది. దాని ప్రభావం ఉంది. కులానికి పునాది వర్ణ బేధం. వర్ణ బేధానికి మూలం బ్రాహ్మనుల కుట్ర. వీరు ఆకాశంలోనుండి ఊడి పడలేదుగాని ఆఠవిక జీవితంనుండే ఒక "గృపు" ఇలా తయారైంది. ఇలా అంటే నేను పని చెయ్యను -నీకు సలహాలిస్తా -నీకోసం ప్రార్థిస్తా టైపులో పరాన్న జీవులుగా కొనసాగడం.

వీరు ఏలికలకు పాలకులు దగ్గర కావడంతో రాజ్యాలే వీరి కనుసైగల్లో నడిచే రోజులొచ్చాయి. ఇస్లాం,కైస్తవ ధండ యాత్ర వీరి పాత్రకు పాతర వేసింది. స్వతంత్ర భారత దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రత్యక్షంగా కాక పోయినా సెక్రెట్సీల రూపంలో వీరు అధికారం చలాయిస్తూనే ఉన్నారు. రిజర్వేషన్లో ఆర్థిక కొలబద్దం,మహిళా బిల్లు ఇలా ఒకటి కాదు ఎన్నో విదాలుగా తమ పట్టు భిగుస్తూనే వస్తున్నారు.

వీరికి వ్యతిరేకంగా ఉధ్యమించండి అనో , బహిష్కరించండి అనో ఉసికొలిపే నీచపు ప్రవృత్తి నాది కాదు. నేను మిమ్మల్ని కోరుకోవడమెల్లా చరిత్ర తెలుసుకొండి. వారి కుట్ర తెలుసుకొండి. నేటి నిజం తెలుసుకొండి. నేటి స్థితి గతులను జాగరూకతో పరిశీలించండి. అర్థం చేసుకొండి.

సమస్త శరీరాన్ని బుర్ర నియంత్రించినట్టే అన్ని వ్యవస్థలను నియంత్రించే వీలు, వెసలు బాటు కలిగి ఉన్న వీరు ఏదీ చెయ్యరు. చెయ్యిస్తారు. ఆడిటర్లుగా,డాక్టర్లుగా,లాయర్లుగా ఏదో రూపంలో ఏలికలకు దగ్గరవుతారు. తమ యంత్రాంగాన్ని చొప్పిస్తారు.

ఈ ప్రభావం పడని ఏ సంస్థ లేదీనాడు. ఏ పార్టి అయినా,ఏ ఉధ్యమమైనా చివరికి మావోయిస్టుల్లోనైనా బుర్రలా నియంత్రించే పొజిషన్లో వారే ఉంటారు. శ్రమ, కష్ఠం,త్యాగం బహుజనులది ప్రతిఫలం వారిది.


పత్రికలు ప్రజల నాడిని ,ప్రజాభిప్రాయాన్ని REFLECT చెయ్యాలి, కాని మీడియా ఈనాడు ప్రజాభిప్రాయాన్ని సృష్ఠించే స్థితికొచ్చింది. దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.  పత్రికల్లో మేధావులుగా ఫోకస్ చేయబడుతున్న వారు తమ మేథస్సును చాటుకోవడానికి కొన్ని వాగుతుంటారు. ఉ: రిజర్వేషన్ల గురించి.

వారి వాదనలు చాలా సృజణాత్మకంగా,నిర్మణాత్మకంగా, తార్కికంగా కూడ ఉంటాయి. మనస్సుకు హత్తుకునేలా మనకే గిల్టి తెప్పించే రీతిలో ఉంటాయి. వీటి వెనుక పెద్ద కుట్రే ఉందన్న సంగతిని తెలుసుకొండి.

వారిని చీకొట్టాలని, వ్యతిరేకించాలని చెప్పను. కాని వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వారి మాటలు చేతలు వాటి వెనుక ఉన్న కుట్రలను పసి కట్టే మెళకువను పెంపొందించుకోవాలి.

వారికి సర్వైవల్ ఒక్కటే కావల్సింది. దాని కోసం ఏ పనన్నా చేస్తారు.చెయ్యిస్తారు.ఏ మాటలన్నా చెబుతారు. చెప్పిస్తారు.

కాని బహుజనులమైన మనం "మాట" పడలేం. మనకు సర్వైవల్ కన్నా "మర్యాదే" ముఖ్యం. మనలో కూడ కొంతమంది భాగుపడ్డాం. కాదనను. కాని యజ్న యాగాదుల పేర్లు చెప్పి,శాంతి పూజల వంకతో, గుళ్ళు,గోపురాలు,గో సంరక్షణలంటూ  మన రక్తం పీలుస్తారు. మన  జనులనుండి మనలనె వేరు చేస్తారు.

ఏదో వంకతో ,ఏదో సేవ అందిస్తామంటూ .. అది  ద్యానం, యోగం, జ్యోతిషం,వాస్తు,ఏదైనా కావచ్చు మనలను వారి చెప్పు చేతల్లో పెట్తుకుని మనవారే మనలను చీ కొట్టే విధంగా చేస్తారు.

వారి కుట్రలకు బలికాకండి. బహుజనులకు దూరం కాకండి. వారిలోను భీదా బిక్కి ఉన్నారు. మానవత్వంతో వారికి చేతనైన సాయం చెయ్యడం మానవులుగా మన కర్తవ్యం. కాని చింత చెడినా పులుపు చావలేదన్నట్టుగా వారిలోను "బ్రాహ్మణీయం"బతికే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.

చరిత్రను -రాజకీయాన్ని-ఉధ్యమాలను-సమాజాన్ని కొత్త కోణంలో చూడండి - నిజాలు నిగ్గు తేల్చండి. మనం ఎలా చెడి పోయామో తెలుసుకోవడం అందుకు కారకులను ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు. మనం ఎలా భాగుపడాలో ఆలోచించుకోవడానికే.

భగవంతుడు,భగవత్ కృప,పుణ్యం ఎవరో ఏదో పుచ్చుకుని దయ దలచి  ఇస్తే వచ్చేవి కావు ..తల్లి,తండ్రి,గురువు చివరికి దైవాన్ని సైతం నిలదీస్తే, పోరాడితే గాని కైవశం కానివి.

పాచి పోయిన సద్ది మూటలను వారే పారేసారు. ఇక మనకెందుకు. పండిద్దాం..

2 comments:

  1. http://saapaatusamagatulu.blogspot.com/2011/01/blog-post_28.html

    ReplyDelete
  2. మీకు బ్రాహ్మణులపై ఎందుకీ ద్వేషం?

    ReplyDelete