
మీరు ఇదేదో వింతగా ఉందే-చదివి పెడతామని వచ్చి ఉంటే సారి. మీకా శ్రమ లేక విని పెట్టే ఏర్పాటు చేసా. బ్లాగ్ హెడర్ క్రింద ఉన్న ప్లేయర్లో ప్లే బటన్ నొక్కండి. మరి ఈ పని మీరూ చేయ దలుస్తే నేనెలా చేసానో చెబుతా ఆ వివరాలు మాత్రం చదివి పెట్టాలి మరి
ఒక్కో అక్షరంగా టైప్ చేసి బ్లాగ్ పోస్ట్ చెయ్యడం అందరూ చేసేదే. కాని ఆడియో బ్లాగింగ్ మరింత థ్రిల్లింగ్గా ఉంటుంది. అక్షరాల్లో మీ భావం,భావోద్రేకాలు కనబడవు. కాని మీ మాటల్లో ఇవన్నీ మెండుగా కనిపిస్తాయి. మరి ఆడియో బ్లాగింగ్ చెయ్యడమెలా?
మీ వద్ద సెల్ ఫోన్ ఉండి -దానికి మీ పి.సికి కనెక్టివిటి ఉంటే ఇది సాధ్యం. ముందుగా మీరు ఏం మాట్లాడ దలచారో దానిని మీ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసుకొండి.
దానిని పి.సిలోకి కాపి చేసుకొండి. ఈ ఆడియో ఫైలును www.archive.org సైట్లో అప్లోడ్ చెయ్యండి. దాని తాలూకు ఎంబ్డ్ కోడ్ తెచ్చి మీ బ్లాగర్లో డిసైన్/ యాడ్ ఎ విడ్జెట్/ ఆప్షన్ ద్వారా కాపి - సేవ్ చెయ్యండి. ఇక మీ బ్లాగు సైడ్ బారులో ఒక ప్లేయర్ కనిపిస్తుంది.
అందులో మీ ప్లే బటన్ క్లిక్ చేస్తే మీ వాణి వినిపిస్తుంది. రొటీన్ పోస్టులో ఈ విషయాన్ని మీ పాఠకులు తెలియ చేస్తే వారు ప్లే బటన్ క్లిక్ చేస్తే మీ వాణి వింటారు.
మరి నేను ఈ రోజు అందిస్తున్న ఆడియో పోస్ట్ ఏమంటే ఓవర్ నైట్లో పది కోట్ల మంది యువతకు ఉధ్యోగవకాశం -మరీ ప్రభుత్వ ఉధ్యోగవకాశం కల్పించే ప్లాన్.
మీకు బ్లాగ్ టైటిల్ క్రింద కనిపించే ప్లేయరులోని ప్లే బటన్ క్లిక్ చేసి వినండి. మీ అభిప్రాయాలు తప్పక వ్రాయండి
0 comments:
Post a Comment