క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday, 9 July 2011

తెలంగాణపై దాట వేసిన జగన్

గతంలో సమైఖ్యాంద్ర ప్లెకార్డులు పట్టుకున్న జగన్ ఈ రోజు " సెంటిమెంటును గౌరవిస్తున్నామని -ఇచ్చే శక్తి -ఆపే శక్తి తమకు లేదని " పెద్దరికం ప్రదర్శించడం లోపాయకారిగా ఉన్నా నా బోటివారిని ఎంతగానో నిరాశ పరచింది. సిద్దాంత ప్రాతిపదికన చూస్తే నేను ముమ్మాటికి సమైఖ్యవాదిని. అంతకంటే ముందు ప్రజస్వామ్యవాదిని . ప్రజాస్వామ్యంలోప్రజలే ప్రభువులు.తెలంగాన ప్రజలు ముక్త కంఠంతో తెలంగాన కోరుకుంటే ఆపాలనుకోవడం అప్రజాస్వామికమే అవుతుంది.మరి వారు అలా కోరుకుంటున్నారని ఎలా తెలుసుకోవడం . అందుకు తెలంగానా ప్రాంత ప్రజల మద్య ఓటింగ్ నిర్వహించాలి.

అయితే ఒక్క నిభంధన; సమైఖ్యవాదులు తెలంగాన ప్రాంతంలో పర్యటించి తెలంగాన ప్రజల మద్య ’కలిసి ఉంటే కలదు సుఖమ్’ అని ప్రచారం చేసుకునే విలు కల్పించాలి.

అడ్డుకుంటాం - అడ్డంగా నరుకుతామని అడ్డ దుడ్డంగా మాట్లాడేవారు అక్కడి ప్రజల మద్య తిరిగి విడిపోతే ఏం లాభమో చెప్పుకోని.

నేనీ విషయాన్ని ఏనాడో నా బ్లాగులో వ్రాసాను. కనీసం ఈ నిర్ణయాన్ని ప్రకటించి ఉన్నా బెటరుగా ఉండేది.

జీవితంలో ఒకదానిని పొందాలంటే మరోదానిని వదులుకోక తప్పదు.అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే ఎలా?

ఇంతకీ నేను ఏనాడో వ్రాసిన టపాను ఇక్కడ నొక్కి చదవండి.

0 comments:

Post a Comment