క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Tuesday, 21 June 2011

వై.ఎస్. మరణం హత్యే ; సరి కొత్త ఆధారాలు

ఇటీవల స్పెక్ట్ర్రం జిని మించిన అవినీతి కాగ్ నివేదికతో భయిటపడటం విదితమే. కె.జి.బేసిన్ గ్యాస్ ఉత్పత్తి వ్యయం పెంపు,ధర పెంపు,ప్రభుత్వానికి (ప్రజలకు) ఇవ్వవలసిన గ్యాసు తగ్గింపు ద్వారా రిలైయన్స్ యజమాణ్యానికి కేంద్ర ప్రభుత్వం లాభం చేకూర్చిందని కాగ్ తెలిపింది. దీనర్థం ప్రభుత్వ బొక్కసానికి బొక్క పెట్టడమే -రిలైయన్స్ ద్వారా తమ బొక్కసాన్ని నింపుకోవడమేనని వేరే చెప్పక్కర్లేదు.

ఈ అవినీతి జరిగింది అనడానికి సాక్ష్యం కూడ లేక పోలేదు. నిన్నా మొన్నదాక తెలంగాణ విషయంలో అంటీ ముట్టనట్టు వ్యవహరించిన జైపాల్ రెడ్డి ... బొత్సా పదవీ స్వీకారం నాడు "జాతీయవాదుల"మని విర్రవీగిన జైపాల్ రెడ్డి - తన వ్యాఖ్య దుమారం రేపడంతో నాలుక కరచుకొని "కవర్" చెయ్యడనికి ప్రయత్నించినప్పుడు కూడ తాను కేంద్ర మంత్రి -మంత్రి మండలి కలెక్టవి రెస్పాన్స్ బిలిటి కలిగి ఉంటుందని -తానేమి చెప్పినా అది కేంద్ర ప్రభుత్వ మాటగా మారి పోయే ప్రమాదముందని డవులాగులు దంచిన జైపాల్ రెడ్డి కేంద్ర పెట్రోలియం మంత్రి అన్న మాట గుర్తుకు తెచ్చుకొండి.

ఇంత హూందాగా ప్రవర్తించిన జైపాల్ రెడ్డి గ్యాస్ సమాచారం గుప్పుమడంతో అభధ్రతతో వనికి పోయారు.డిఫెన్సులో  పడ్డారు. వెంటనే పల్టీ కొట్టి తెలంగాణ బ్యాడ్జు సైతం పెట్టుకునేసేరు. అవినీతికి పాల్పడ్డవారే సెల్ఫ్ డెఫెన్స్ కోసం ఇటువంటి నినాదాలు అందుకుంటుంటారు.

సరే రిలైయన్స్ కు కేంద్రంలోని యు.పి.ఏ ఫేవర్ చేసింది.ఓకే. మరి దీనికి వై.ఎస్. హత్యకు లింకేమిటని మీరు ప్రశ్నిస్తారు. చెబుతా..

అప్పట్లో అంబాని బ్రదర్స్ మద్య భాగ పరిష్క్రారంలో చిక్కులున్నవి. దీనిపై వారి మాత్ఱు మూర్తి పంచాయితీలు చేస్తున్నారు. ప్రెస్ వారు కె.జి.బేసిన్ గ్యాస్ విషయంలో నిర్ణయం పై అడిగితే ఆ విషయాన్ని మా అమ్మగారు పరిష్కరిస్తరని చెప్పేరు.

వెంటనే వై.ఎస్. కె.జి.బేసిన్ మీ అబ్బ సొత్తు కాదు. అది జాతీయ సంపద. దానిని పెంచి పెట్టడానికి మ్ అమ్మ సరికదా నాన్నమ్మకు సైతం హక్కులేదని కుండ బద్దలు కొట్టేరు.

వి.హెచ్, కె.కె,కాకా వంటి వారు ఈ మాటలు అని ఉంటే అంబానీలు అస్సలు పట్టించుకునేవారు కాదేమో? కాని వై.ఎస్. వంటి ప్రజా మద్దత్తు కలిగి ఉన్న నేత - మరి సోనియాను సైతం ప్రభావితం చెయ్యగల నేత నోట ఈ మాట రావడంతో బెంబేలెత్తి పోయేరు.

సాధారణంగా ఒకరి హెలికాప్టరులో మరొకొరు 'కిరి కిరి"చేసుకునే (చెయ్యించుకునే) అంబాని బ్రదర్స్ వై.ఎస్. భయలు దేరనున్న హెలికాప్టరులో కిరికిరికి ప్లాన్ చేసేరు.

ఇంటి నుండి పావు గంటలో విమానాశ్రయానికి చేరాల్సిన పైలట్ ముప్పావు గంట తరువాత గాని ఏయిర్ పోర్ట్ చేరుకోలేదు.  దుస్సంఘఠనకు కొన్ని రోజులకు ముందే అతని అకౌంటులోకి బారి మొత్తం డిపాజిట్ కావడం ఇలా ఎన్నో అంశాలు భయిట పడ్డాయి.

ఈ క్షణం నాకు కలిగే అనుమానం ఏమంటే ప్రస్తుతం అంబానీలకు కేంద్ర ప్రభుత్వం  చేసిన మేలు  విషయం పై ఆనాడే అవగాహణ ఉండేదేమో? ఈ తర్పణానికి వై.ఎస్. అడ్డమని భావించారేమో?  ఆ కుట్రలో ప్రభుత్వ పెద్దలు సైతం భాగస్వాములేమో?

పొరభాటుగా జగన్ సి.ఎమ్ అయితే ఈ వ్యవహారం అతనికి పొక్కితే ప్రమాదమనే 154 మంది ఎం.ఎల్.ఏలు మద్దత్తు పలికినా జగన్ను అధికారానికి దూరంగా ఉంచారేమో?

జగన్ పై ఇన్ని ఆరోపణలు వస్తున్నా - ఏ ఒక్క దాని పై కూడ ఎటువంటి విచారణకు ఆదేశించక పోవడం వెనుక ఈ అపరాధ భావమే కారణమేమో?

ఏమో?  ఏమో? అన్నీ ఒక రోజున భయిట పడతాయేమో?

1 comment:

  1. mari mee amma vijayamma assembly lo enduku matladad.mee anna jagan parliament lo enduku matladaledu. lal bahdur sastri chanipoyinappudu ilage aropanalu chesaru.kaani ippudu nijalu bayata paddayi.ayanadi hatya ani aropinchina valle ayanadi sahaja maranam ani oppukunnaru.kavalante kuladeep nayyer book chadavandi.idanta rajakeyam.neelaanti picchi vaalu vallanu pattukuni veladutaru.

    ReplyDelete