క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Monday 22 August 2011

అవినీతే జరిగి ఉంటే తొలి ముద్దాయి సోనియా


వై.ఎస్.ఆర్ ఎవరు? ఒక జా..........తీయ పార్టియొక్క జా..........తీయ అధ్యక్షురాలు సొనియా కనుసన్నల్లో పని చేసిన ఒక సి.ఎం. కాంగ్రెస్ పార్టి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సోనియా ఇంటి డ్రైవరో -కుక్కో ( ఇది ఇంగ్లీష్ కుక్) తలచుకున్నా ఏకంగా సి.ఎంలు మారి పోతారు. సి.ఎల్పి సమావేశానికి డిల్లీ నుండి వై.ఎస్ పేరును సీల్డు కవర్లో పంపింది ఎవరు? సోనియా . వై.ఎస్. ని సి.ఎంగా ఎన్నుకొండని ఆదేశించింది ఎవరు ?సోనియా. వై.ఎస్.ను ఆకాశానికెత్తింది ఎవరు సోనియా.

వై.ఎస్. అవినీతి చేసారని - అందులో లబ్ది పొందినవారే జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారని - అదీ అవినీతి సొమ్మేనన్నది అభియోగం.

ఓకే. వై.ఎస్. అవినీతి పరుడే అనుకుందాం. అవినీతికి పాల్పడ్డాడనే అనుకుందాం. అదీ ఎంతకాలం? 2004 నుండి ఐదు సంవత్సరాలు . 2009 మే నుండి సెప్టెంబరు 2 దాక ..మొత్తం 60+ 4 అంటే 64 మాసాలు అవినీతి ఛేసాడు అనే అనుకుందాం.

మరి పార్టియొక్క జా..తీయ అధ్యక్షురాలిగా సోనియమ్మకు వై.ఎస్ అవినీతి గురించి తెలియదా? పార్టిలోని వై.ఎస్. ప్రత్యర్థి వర్గాలు తమ పుణ్యక్షేత్రంగా భావించే సొనియమ్మ ఇంటికెళ్ళి మరి - మోకరిల్లి మరి ఎన్నో సార్లు వై.ఎస్. అవినీతి (?) గురించి మొర పెట్టుకుని ఉంటారుగా?

సరే అదీ లేదనుకుందాం. మన్మోహన్ సింగ్ అనే కీలు బొమ్మను తెరమీదికి తెచ్చి తెరవెనుకనుండి యు.పి.యే ప్రభుత్వాన్ని ఆడించే అంభకు కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు ఉప్పందించలేదా?

పోని ఓ 6 నెలలో ..మరో 6 నెలలో సమాచర లోపం కారణంగా వై.ఎస్. అవినీతి తెలిసి రాలేదనే అనుకుందాం. మరీ 64 మాసాలు సైతం వై.ఎస్. అవినీతి గురించి తెలుసుకోలేదంటే ఇదేమన్నా నమ్మ సక్యంగా ఉందా?

వైఎస్. ఉన్నంత వరకు అతను పార్టి వర్గాలను అదరకొట్టో బెదరకొట్టో తన అవినీతి గురించి సొనియాకి తెలియకుండా మ్యేనేజ్ చేసాడనే అనుకుందాం. వై.ఎస్ పోయారు. ఆయన వారసుడ్ని కాదని సోనియా మాటే వేదంగా పాటించే ధైర్య సాహసాలు పార్టి ఎం.ఎల్.ఏలకు వచ్చాయి కదా?
అప్పుడన్నా వారు వై.ఎస్. అవినీతి గురించి ఉప్పందించలేదా? లేదని అంటే నవ్వి పోతారు.

చిరంజీవి 2009 ఎన్నికల ప్రచారంలో వై.ఎస్. రాష్ట్థ్రాన్ని దోచి సోనియాకు పెట్టాడని ఆరోపించాడే.. మరి అతన్ని పార్టిలోకి అహ్వాణించారే .. అక్కన చేర్చుకున్నారే. ఆ రోజు ఆయన చేసిన ఆరోపణలు ఏమైనట్టు. వాటిని సోనియమ్మ అంగీకరించినట్టా? లేక వై.ఎస్. లేడు కాబట్టి నువ్వు దోచి పెట్టునాయనా అన్నట్టా?

ఇక శంకర్ రావు కథకొస్తాం. ఈయన గారు పాపం తిండికి టికానా లేని నిరుపేద . కోర్టు తెలియదు.కోర్టు సాంప్రదాయాలు తెలీవు. లాయరుకు ఫీజు ఇచ్చుకోలేడు. పాపం ఎవరో అసామి వద్ద పది రూపాయలు అప్పు చేసి లెటర్ వ్రాసారు. జడ్జిగారు కణికరించి దానిని సుమోటాగా స్వీకరించారు.

పైగా శంకర్ రావు అతి సామాన్యుడు. సామాన్య ఓటరు. అతను వై.ఎస్. నాయకత్వంలో జరిగిన పరిపాలనకు అతనికి ఏమాత్రం సంభంధం లేదు. పాపం అతనో ఎం.ఎల్.ఏ కాడు. పార్టిలోపావలా సభ్యుడు కూడ కాదు. అతనికి సెక్రట్రియేట్ తెలియదు.గవర్నర్ భవన్ తెలియదు. తెలిసి ఉంటే అక్కడకు వెళ్ళి ఫిర్యాదు చేసేవాడు.

నిజానికి అవినీతికి పాల్పడినవారికంటే ఆ అవినీతి గురించి 64 నెలలు కిమ్మనకుండా అదే పార్టిలో - అదే assembly లో కొనసాగినా శంకర్ రావు వంటి వారే ప్రప్రథమ దోషులు. జడ్జిగారు సానుభూతితో app-rover గా మారిపోయే అవకాశం కల్గించి ఉండ వచ్చు.

సి.బి.ఐ కథేంటో - ఆ కథకు కథకురాలు ఎవరో అందరికీ విధితమే. ఈ కథలు ఇంకెన్నాళ్ళో జరగవు. ఏనాడొచెప్పిన మాటలనే ఇక్కడ మళ్లీ ఉటంకిస్తా " రానున్న నవంబరు 8 కెల్లా సోనియా లేదు.యు.పి.ఏ లేదు .కాంగ్రెస్ లేదు .

3 comments:

  1. The Sonia nominated YSR who was neither driver, nor a peon but a faction leader of Pulivendula with 21 criminal cases on him.

    Sonia is corrupt, but who was her collection agent in the state?

    Every criminal would try to defend the same way, how Vijayamma and Jagan tried to defend. Accusing other criminals who were not yet caught. Best option for Jagan is to become approver and expose Sonia.

    ReplyDelete
  2. అంటే సోనెమ్మ కళ్ళలో వెలుగు చూడటానికే మన YSR ఆ దొంగ పని చేసి, అందులో బాగా నొక్కేశాడంటున్నావు. అదేదో దేశం కోసమో, సోనియాకోసమో, కొండా సురేఖకోసమో, గడ్డి తిన్నట్టు చెబుతున్నారు. ఇక్కడ ప్రశ్నేమంటే, జగన్ గడ్డి తిన్నారా లేదా అని మాత్రమే. వాడు తిన్నాడు, వీడు తిన్నాడు, అని బెట్టు చేస్తే కోర్టు, CBI వూరుకోవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని YSRS అన్నాడు, అదేగా జరుగుతోంది.

    ReplyDelete
  3. pai agnatalau iddaru kamma musti vedavalu, ee musti vedavalaki bolli gaadi ni naaki,aa kosta musti kammalu raastraanni mingalani choostunnaru, mee pappulu udakavuroy

    ReplyDelete