క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Tuesday, 27 September 2011

ఒక్క మగాడు : లగడ పాటి


విజయవాడ ఎం.పి. లగడపాటి రాజగోపాల్ వై.ఎస్. పై,వై.ఎస్. జగన్ పై అసత్య ఆరోపణలు చేసినప్పుడు ఎంతగా చిర్రెత్తిందో ఈ రోజు లగడపాటి సీమాంద్ర అధికారులను పరామర్శించటానికి హైదరాబాద్ రావడం చూస్తుంటే అంతగా ముద్దేస్తుంది. అటు చంద్ర బాబు,ఇటు జగన్ కేవలం సీమాంద్ర ప్రాంతాలకే పరిమితమవుతుంటే లగడపాటి సమైఖ్యవాదుల ప్రతినిధిగా అక్కడికి వెళ్ళడం నిజంగా అతని నాయకత్వ లక్షణాలకు ఆదర్శం.

భారతదేశం ఒక దేశం. ఒకే దేశం. ఆం.ప్ర ఒక స్టేట్ .ఒకే స్టేట్ . ఇందులో తెలంగాణ తమ జాగీరు అన్నట్టుగా కొందరు ప్రవర్తిస్తుంటే వారి ఓవర్ యాక్షన్ చూసి జగన్ వంటి అత్యంత ప్రజాధరణ గల నాయకులే జంకుతున్నా సాహాసోపేతంగా కదం తొక్కిన లగడపాటి..! హేట్స్ ఆఫ్ !!

లగడ పాటిని అరెస్ట్ చెయ్యడం నిజంగా కిరణ్ ప్రభుత్వంయొక్క చేతగానితనానికి సూచిక. అందుకే లగడపాటికి ఒక్క మగాడు అన్న భిరుధును ఇచ్చి సత్కరిస్తున్నా.

నేనైతే సవాలు చేసి చెబుతున్నా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కావాలో వద్దో ఓటింగ్ నిర్వహిస్తే " సఖల జనుల సమ్మె" దెబ్బకు నూటికి 70 % వద్దనే ఓటిస్తారు.

కేవలం 45 రొజుల పాటు తెలంగాణ ప్రజలకు నిజా నిజాలు చెప్పే అవకాశాన్ని సమైఖ్యవాదులకు కల్పిస్తే ఇదే జరుగుతుంది.

బ్లాగ్లోకంలోని తెలంగాణవాదులు ఈ మాటకేమంటారో చూద్దాం! వై.ఎస్. వంటి భలమైన నాయకత్వం లేకపోవడంతోనే ఈ దుస్థితి అన్న మాట ప్రతి నోట వినిపిస్తూంది.

వై.ఎస్సే బతికి ఉంటే ఈ కేసి ఆర్ అండ్ కో తోక తిప్పేవారేనా?

Dr.YSR speech on Telangana and KCR :

6 comments:

  1. సీయం కిరణ్ కుమార్రెడ్డికే ముఖ్యమంత్రి అయ్యుండి కూడా తెలంగాణాలో తిరిగేంత సీనులేదు. ఇంక లగడపాటికి ఏమిస్తాడు సెక్యూరిటీ?

    నలభై అయిదు రోజులేంటి? నలభై ఐదుకు పైగా సంవత్సరాలు సమైక్యవాదులే అధికారంలో వున్నారుగా? ఏం పీకారు?

    ReplyDelete
  2. నాన్నా అనానినమ్స్సు!
    కేవలం బ్లాగులో సైతం స్వంత పేరుతో కమెంటు వేసే దమ్ములేని నువ్వు బాలయ్య సినిమాల్లోలా భారి డవులాగులు దంచడం హాస్యాస్పదం
    //సీయం కిరణ్ కుమార్రెడ్డికే ముఖ్యమంత్రి అయ్యుండి కూడా తెలంగాణాలో తిరిగేంత సీనులేదు.//

    ఒక్క కిరణ్ కుమార్ రెడ్డిని పట్టి సమైఖ్యవాదులను అంచనా వేయకూడదు. ఒక్క వై.ఎస్. బతికి ఉంటేనా..
    //ఇంక లగడపాటికి ఏమిస్తాడు సెక్యూరిటీ?//
    లగడపాటికి కావల్సింది సెక్యూరిటి కాదు.సెక్యూరిటియే అవసరం అనుకోనుంటే గడప దాటే వాడు కాదు. కావల్సింది దమ్ము. అది అతనికి రొంబ అధిగం తంబి!

    //నలభై అయిదు రోజులేంటి? నలభై ఐదుకు పైగా సంవత్సరాలు సమైక్యవాదులే అధికారంలో వున్నారుగా? ఏం పీకారు? //

    అత్యంత ప్రజాధరణ పొంది ఉన్న ఒక్క ఎన్.టి.ఆర్ ,వై.ఎస్. హయాంలోనే కాదు వెన్ను పోటుకు పెట్టింది పేరైన చంద్రబాబు హయాంలో సైతం చెప్పు క్రింద తేలులా తెలంగాణా వాదాన్ని తొక్కి ఉంచ కలిగాం కదా. అది అసలైన పీకుడంటే

    ReplyDelete
  3. బ్లాగులొ పేరుతో కామెంటడం కూడా గొప్ప ధైర్యమే! అది నాకు లేదు మరి!

    తిరగమను లగడపాటిని తెలంగాణాలో! ఎందుకు తిరగడం లేదు? ప్రజలు మామూలుగా తిరుగుతూనే వున్నారుగా! ఎవరు అవకాశం ఇవ్వడం లేదు వారికి? తెలంగాణా ప్రజలా? ప్రభుత్వమా?

    తెలంగాణా వాదం మలిదశలో పుట్టిందే చంద్రబాబు హయాంలో, పెరిగింది రాజన్న హయాంలో! అది గుర్తుంచుకో తంబీ.

    బహుషా వీళ్ళిద్దరి పాలన సక్రమంగా వుంటే తెలంగాణా వాదం మళ్ళీ పుట్టేదే కాదేమో బహుషా.

    ప్రజల్లో నమ్మకం కలిగించడం వదిలేసి తొక్కివుంచడం కూడా గొప్పనుకుంటున్నావా తంబీ. ఎంత తొక్కితే ఉద్యమం అంత లేస్తుందని తెలియదా తమరికి?

    ReplyDelete
  4. >>చెప్పు క్రింద తేలులా తెలంగాణా వాదాన్ని తొక్కి ఉంచ కలిగాం కదా.
    మంచో చెడో, సిన్సియర్ గా జరుగుతున్న ఒక ఉద్యమం గురించి ఇలా వ్యాఖ్యానించడం భావ్యం కాదు. ఈ వాక్యాన్ని తీసేయమని మనవి.

    ReplyDelete
  5. ఆనాని, :)) మన మురుగు-సాంబారువాడు దగ్గర దమ్ములు కొలిచే మీటర్ వుంది, అది ఆయన హాబీ, జాగర్త.

    ReplyDelete
  6. హీ హీ హీ @karthik

    ReplyDelete