ఈ మాట ప్రతి ఒక్కరికి ఏదో సందర్భంలో స్పార్క్ అయ్యే మాటే. ఏమో ఈ భూ ప్రపంచం మీద నాకొక్కనికే అలా అనిపిస్తుందని నమ్మేటంత వెర్రి వెంగళప్పను కాను నేను.1992 నుంది 2007 ఏప్రల్ వరకు (మద్యలో ఒకటి రెండు సం.లు మినహ అడుక్కు తింటూ కాలం గడిపిన "బతకడం " తెలీని ఎదవను నేను. 2007 ఏప్రల్ మాసం దినతందిలో జాబ్ వచ్చింది. అప్పటికి నా వయస్సు 40. చేతి నిండా డబ్బు -హోదా -గౌరవం అన్నీ ఓకే.
కాని 2009 ఎన్నికల సమయంలో ఏవో పిచ్చి పిచ్చి ఊహలతో నేను ప్రచారం చెయ్యకుంటే వై.ఎస్. ఓడి పోతాడు. వై.ఎస్. ఓడిపోతే ఇంకే సి.ఎమ్ కూడ రైతు భాంధవుడుగా చెప్పుకునే ,నడుచుకునే సాహసం చెయ్యడనుకుని బతుక్కి నీళ్ళొదలి ప్రచారంలో దూకాను. అటు వై.ఎస్. గలిచాడు. ఇటు నేను సైతం బ్లాగరుగా గెలిచాను .బ్లాగరుగా గెలవడంతో నా ఖ్యాతి (జ్యోతిష్కునిగా) దేశ విదేశాలకు పాకింది. దినతంది ఇచ్చిన జీతంకంటే ఎక్కువే గిట్టుపాటైంది.
సర్లే ధర్మం గెలిపించిందని సరిపెట్టుకున్నాను. వై.ఎస్. పోయాడు. ఇక జగన్ కథ అందరికీ తెలిసిందే. బ్లాగుల్లో జగన్ ను ఆకాశానికి ఎత్తినంత మాత్రాన అతనికి ఒరిగేదేమీ లేదు. పైగా బ్లాగరుగా,జ్యోతిష్కునిగా నా సమయం -శక్తి యుక్తులు తమిళ పాఠకులు /జ్యోతిష్యాభిమానులకే సరిపోయింది.
నా మైండ్ ఎందుకిలా దొబ్బిందని ఎందుకనిపించిందో ఇంకా చెప్పలేదు. దాదాపుగా రెండేళ్ళు డబ్బులు బాగా వచ్చాయి. మని సీక్రెట్స్ కనుగొన్న వానిగా నాదో అతిముఖ్య సిద్దాంతం ఉంది.అదేమంటే డబ్బులు భాగా వచ్చినప్పుడు రెవిన్యూ ఎక్స్పెన్సెస్ తగ్గించేసుకునే పని పట్టాలి
కాని నేను రెండేళ్ళుగా హిపాక్రెటిక్ గా "నలుగురిలా బతకాలి" అన్న ఆలోచనతో ఉండి పోయాను. కేవలం బాడుగలు - విద్యుత్ బిల్లులు -నెలసరి ,రోజువారి ఖర్చులు పెట్టుకుంటూ వచ్చేసాను. ఇప్పుడేమో "మంచి ఆలోచనలన్ని" వస్తున్నాయి.కాని ఆదాయం "అంత"గా లేదు.
గత రెండేళ్ళలో బాగా ప్లాన్ చేసి ఉంటే ఈ పాటికి నెలసరి ఖర్చులు కనీసం "సగమై"పోయేవి. చూద్దాం. నా జీవితంలో అన్నీ రిపీట్ అవుతుంటాయి. గత రెండేళ్ళ యోగం కూడ రిపీట్ అవుతుందేమో? నా ప్లాన్ సక్సెస్ అవుతుందేమో?
నా కలల జీవితం చాల చౌకబారైనది. ఊరి భయిట 40/60 సైట్. చుట్టూ కాంపవుండ్. సైట్లో నైరుతి భాగాన చిన్న ఇల్లు - కేవలం ఒక్క గదే ఉంటుంది. డాబా పై గుడిసె, డాబా మీదికెళ్ళాలంటే మెట్లుండవు. కేవలం నిచ్చనే. నిచ్చెన ఎక్కే సత్తా ఉన్నవాడే నాతో ఎక్కువ సమయం గడప కలగాలి.
ఆపరేషన్ ఇండియా - అంబ పలుకు - నా రచనల కూర్పు - చిన్న హ్యాండి కామ్ పెట్టుకుని 30 నిమిషాలు ఆడే సినిమాలు షూట్ చెయ్యడం. ఇంకెన్నో..
చూద్దాం. రొటీన్ కి అలవాటు బడ్డానని చెప్పలేను. నాతో కేవలం పేదరికాన్ని మాత్రమే పంచుకున్నా నా భార్య- కూతురు కనీశం ఇప్పటికన్నా నలుగురిలా జీవించనీ అన్న ఆలోచన కారణంగా కూడ నా మైండ్ ఇలా దొబ్బినట్టుంది.
ఏదైతేనేం .. రెండేళ్ళు గడిచి పోయాయి. మరో రెండేళ్ళల్లో నా కలల జీవితానికి అంకురార్పణ చెయ్యాలి.
Wish You Good Luck.
ReplyDeletenee mind dobbindani neeku ippatiki gaani ardham kaaledaa..., naaku eppudo ardhamaindi, ippatikainaa naa chanka naakadam maanu.
ReplyDelete