క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Wednesday 29 February 2012

బ్లాగ్లోకపు అయ్యోర్లకు విజ్నప్తి


నేను ఏది దాచలేదు.. నేను తమిళుడను. తెలుగు ఎన్.టి.ఆర్ సినిమాలు చేసి నేర్చుకున్నానని ఇది వరకే పలు మార్లు చెప్పియున్నాను.అయినా నా తెలుగు గురించి లొడ పెట్టడం దేనికి?

బాషన్నది భావాలను చెప్పుకోవడానికే. నేను రిసెర్చ్ ఎస్సే వ్రాయడం లేదు.బ్లాగ్ వ్రాస్తున్నానంతే. పేరు చెప్పుకునే దమ్ము సైతం లేని వారిని విమర్శించి నేను టపా వ్రాస్తే ..ఈ దుస్సాంప్రదాయం గురించిన తమ అభిప్రాయాలు తెలపడం మాని నాకు క్లాసు పీకాలని చూస్తున్నారు.

విద్య ఆంగ్ల మాద్యమంలో.. ఉధ్యోగం సధ్యోగం చేసినా అక్కడి వాతావరణంలో అన్నీ ఆంగ్లములోనే. యువత స్థితిగతులు ఇవి. పత్రికల్లోనే బాషా సరళి మారింది. మరీ ఇప్పటికీ పాత చింతకాయ పచ్చడి కావాలంటే ఎలా? (ఒక్క తెలుగే కాదు తమిళ పరిస్థితికూడ అంతే. )

ఎన్.టి.ఆర్ తెలుగును చంద్రబాబు తెలుగుతో పోల్చుకుని తెగ ఫీలై పోయే వాడ్ని. మరి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు విని బాబే బెటరని సర్దుకోవలసి వస్తుంది. ఇది పరిస్థితి.

కాబట్టి బ్లాగ్లోపు తెలుగు అయ్యోర్లూ .. మీ ఉచిత సలహాలు నాకవసరం లేదు. నన్ను నా మానాన వ్రాసుకోనివ్వండి

9 comments:

  1. Good post.

    భాష నిరంతర ప్రవాహం.దాన్ని ఆపడం ఎవరివల్ల కాదు.No one can stop the changes coming along. More over blogging is to express our views without hurting the feelings of co-bloggers.

    ReplyDelete
  2. భాస్కర రామిరెడ్డి గారూ..
    థ్యాంక్స్ అండి.. హమ్మయ్యా.. ఎక్కడ అనానీలు నానా బూతు పురాణాలు అందుకుంటారోనని భయపడ్డాను. నాతో ఏకీభవించే ఒక్క వ్యక్తినన్నా బ్లాగ్లోకంలో ఉంచిన దేవునికి థ్యాంక్స్.

    అన్నట్టు అనానీలంటే ఆకాశం నుండి ఊడి పడ్డవారు కాదండి. కొందరు ప్రముఖ బ్లాగర్లే ఇలా అక్కసు వెళ్ళ కక్కుతుంటారని నా అనుమానం+అనుభవం

    ReplyDelete
  3. మురుగున్: నీ మానసిక వికారాలు, శునకానందాం నీవు పెట్టే పిక్చర్లు చూపిస్తున్నాయ్. ఇట్లే ప్రొసీడైపో, ఒకనాటికి YSR అయిపోతావ్.

    ReplyDelete
  4. తమిళుసోదరు డొకరు వీలయినంత చక్కని తెలుగులో బ్లాగు వ్రాస్తున్నందుకు అభినందనలు.
    మరికొంచెం పరిశ్రమ చేస్తే తప్పులు బాగా తగ్గుతాయి.

    అవతలివాళ్ళకు అర్థం కావటం వరకే భాష ప్రయోజనం. కాబట్టి యెలావ్రాసినా ఫరవాలేదు అనుకునే వారికి యేమీ చెప్పలేను. కాని భాషకు కూడా ఒక ప్రతిపత్తి ఉంటుందని, ఆ భాషను తల్లి స్థానంలో ఉంచి గౌరవిస్తామని భావిస్తే నిర్లక్ష్యంతో తప్పుగా వాడటం ఉద్దేశ్యపూర్వకంగా అవమానించటమే అని భావించబడుతుంది.

    శరీరానికి కావలసినవి కాలరీలే కాబట్టి, శుచి, రుచి అవసరంలేదనుకుంటామా భుజించేందుకు? యెలాగు పొట్టలో కలకలిసేవే కదా అని అడ్డదిడ్డంగా గుచ్చేత్తుకు తింటామా విస్తట్లో పదార్థాలన్నీ? ఒక పధ్ధతి ఉంటుంది కదా? అలగా భాషను వాడటానికికూడా ఒక్ అందం చందం ఉండాలని భావించండి దయచేసి.

    ReplyDelete
  5. శ్యామలీయం గారూ !
    నా ఉద్దేశం తప్పులు వ్రాయొచ్చు అన్నది కాదు..ఒకప్పుడు ఋషి అని వ్రాసుకునేవారు. ప్రస్తుతం పేపర్లల్లో సైతం రుషి అనే వస్తూంది. ఇలా సరళీకృతం చేసుకుంటే తప్పేంటి అన్నదే నా ఉద్దేశం. అందుకని ప్రాథమిక పాఠశాల అయ్యోర్ల వలే "అచ్చు తప్పులు" మాత్రం చూసి "విషయాన్ని" గాలి కొదిలేస్తే ఎలా అనే ప్రశ్నించాను.

    బాష మరీ "డెన్స్" గా ఉంటే యువతరం పారి పోతారండి. అదే నా బాధ ..

    ReplyDelete
  6. అయ్యా ! అనానీ @ ప్రముఖ బ్లాగరూ ..

    మీ మాటల్లో తెలుగు మీద ప్రేమకంటే నా మీద ద్వేషమే ఎక్కువ కనిపిస్తూంది

    // మానసిక వికారాలు// సెక్స్ పట్ల హిప్పోక్రెటిక్ -ద్వంద్వ వైఖరి ఉన్నవారికే కలుగుతాయి. మనకా సీనే లేదు

    //శునకానందాం// ఆత్మ సాక్షిగా చెప్పండి "కుక్కనైనా కాకపోతి" అని మీకు ఏనాడూ అనిపించ లేదా?

    //నీవు పెట్టే పిక్చర్లు చూపిస్తున్నాయ్//

    పిక్చర్లు కేవలం మీ పోటి వారి దృష్ఠిని ఆకర్షించడానికే

    //. ఇట్లే ప్రొసీడైపో, ఒకనాటికి YSR అయిపోతావ్.//

    ఫార్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ .. చనిపోయిన వారు ఎన్నికల్లో పోటి చేసే వీలుంటే వై.ఎస్ ని ఓడించడం ఆ దేవుని తరం కూడ కాదు.. మైండ్ ఇట్..



    Reply

    ReplyDelete
  7. ఋషి బదులుగా రుషి అని పత్రికలు వాడుతున్నమాట నిజమే. అది సరళీకరణమే కాకపోవచ్చును.

    ఆంగ్లభాషలోని Q అన్న అక్షరాన్ని తీసివేయవచ్చని సవాలక్షకారణాలు చెప్పవచ్చును.
    మనవాళ్ళకు యెవరికీ అటువంటి వాదన తోచదు.

    తెలుగులో అక్షరమాలమీద మాత్రం తాము అధికారులమన్నట్లు మాట్లాడతారు!

    ఇంగ్లీషు లో ఇ-మెయిల్ వ్రాసి స్పెల్లింగ్ సరిజూస్తాము. గ్రామరు తప్పులు సరిజూస్తాము. అన్వయదోషాలు జాగ్రత్తగా సరిజేస్తాము. లేకపోతే యెదుటివారిముందు నామోషీ. వారితో "మీకు అర్థం అయింది కదా చాలు అనేసి పలుచబడలేము." అదే తెలుగులో యెలాగయినా ఫరవాలేదు. అంతేకదా! మన భాషలపై మనకెంత గౌరవం! ఇదేనా పధ్ధతి?

    ఒక్ప్పుడు ఒక్ తెలుగు పత్రిక వారు ఒకానొక విఫల ప్రయోగం చెసారు. వత్తులెందుకు దండగ వాటి బదులు పొల్లు అక్షరాలు వాడాలీ అని. ఉదాహరణకు రాష్త్రపతి అనే మాటను వారు రాష్‌ట్‌రపతి అని వ్రాయాలన్నారు. జనామోదం లబించలేదు యీ ప్రతిపాదనకు. ఇది రోమన్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన అన్నమాట. అసలు తెలుగుకు వేరే లిపి యెందుకు రోమన్ లిపిలోనే వ్రాయవచ్చును అనికూడా కొందరు ప్రతిపాదించారు. మన అమ్మ మన అమ్మలాగా కాక వేరే యింటి అమ్మలాగా ఉండవచ్చును గదా అంటే యేమి చెప్పేది?

    మీకు తోడి బ్లాగర్లతో గల వివాదాల జోలికి నేను పోలేదు. ఇతరులు రెచ్చగొట్టినా దయచేసి మీరు హుందాతనం వీడకండి. వారితో బాటు అరచి మీరు పలుచన కానవుసరం లేదు.

    నేను మీ భాష గురించి మాత్రమే సలహా యిచ్చాను.

    ReplyDelete
  8. శ్యామలీయం గారు !
    తెలుగైనా -ఆంగ్లమైనా తప్పులు "పొట్టు కూటికి" దెబ్బ కొడతాయంటేనే స్పెల్ చెక్ గ్రామర్ చెక్స్ అన్నీ.

    జీవితం మరీ క్లీష్ఠంగా తయారైంది.స్పీడు పెంచితే గాని జీవన పోరాటంలో మనలేం.

    ఎన్.టి.ఆర్ "ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నాం "అనేవారు
    బాబు " ముందుకు పోతున్నాం" అని సింప్లిఫై చేసేరు.

    కిరణ్ కుమార్ రెడ్డి గారు "ముందరకు పోతున్నామని" బాషను హత్య చేస్తున్నారు.

    కాలానుగుణంగా మార్పులు వస్తుంటాయి. సహించాలి మరి.లేకుంటే ఇబ్బందే..

    ReplyDelete
  9. అమ్మకు కాస్త అన్నం పెట్టటానికి మనిషి జీవితంలోని కృత్రిమమైన వేగం అడ్డు కానవసరం లేదేమో. నాకు సంబంధించినంత వరకు నా మాతృభాష నా తల్లి. నా జీవితంలో, నాలో ఒక అవిభాజ్యమైన భాగం.

    మాతృభాషనే కాదు, యే భాషనైనా సగౌరవంగా చూడటం సంస్కారం అని నా భావన. ఏ భాషనైనా సరిగా వాడకుండా దానికి తగిన గౌరవం ఇస్తున్నామని చెప్పుకోవటం పాడి గాదు యెవరికైనా.


    కాలానుగుణం అన్నమాట గురించి ముందు చాలా చర్చించవలసి యుంది.
    అది అటుంచి, మన నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న అనర్థాలను కాలానుగుణం అని తప్పించుకో బూనటం బాధ్యతారాహిత్యమే.

    అమ్మకు కాస్త బుధ్ధినేర్పుదా మనుకొనే వాళ్ళకు నేను చెప్పగలిగింది యేమీ లేదు. మీకు తోచినట్లు తెలుగు గాని మరొక భాషను గాని వాడేయకుండా ఆపలేను గదా!. అందంగా చేస్తున్నామంటారా - కొన్నాళ్ళకు తెలుగే కనిపించకుండా పోయేంత అందంగా ఉన్నాయి మన చందాలు. స్వస్తి.

    ReplyDelete