క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday 3 March 2012

ప్రేమా -గీమా పక్కన పెట్టి ఆలోచిస్తే..

ముందు మాట:
మానవ జీవితంలోఎన్నోసమస్యలు ఉన్నాయి.ఉంటాయి.ఇక పై కూడా ఉంటాయి.వీటిని మనం విడి విడిగా చూస్తే ప్రతి సమస్య వేర్వేరుగా కనిపిస్తుంది. సమస్యలను వేర్వేరుగా చూసి అర్థం చేసుకోలేం. పరిష్కరించ లేం. ఒక వేళ పరిష్కరించ కలిగితే ఆ ఒక్క పరిష్కారంలోనుండి లక్షలాది సమస్యలు పుట్టుకొస్తాయి.

మూలాల్లోకి వెళ్ళి వెతికితే కాని అసలైన సమస్య ఏమిటో అర్థం కాదు. మనుషులను సతమతం చేసే ప్రధాన సమస్యలు మరణం - ప్రేమ – సెక్స్ – డబ్బు – అధికారం. మిగిలిన సమస్యలన్ని ఈ సమస్యల సైడ్ ఎఫెక్ట్ గా వచ్చే చిన్న చిన్న సమస్యలే.

హమ్మయ్యా! శత కోటి సమస్యలను నాలుగు హెడ్డింగ్స్ క్రిందకు తెచ్చేసాం. పోనీ ఇంకో మాట చెప్పనా? ఈ నాలుగు సమస్యలు కూడా ఒకే సమస్య యొక్క సైడ్ ఎఫెక్టే . అదేమంటే ప్రకృతికి దూరంగా ఉండటం, ప్రకృతిలో తనో విడదీయలేని అంతర్భాగమన్న సంగతి మరిచి పోయి తనను వేరుగా చూడడం.

మనిషిని వేదించే నాలుగు ప్రధాన సమస్యల్లో మొట్ట మొదటిదిగా మరణాన్ని పేర్కొన్నాను. కాని
మనుషులు స్థూలంగా ఏమి చేసినా దాని వెనుక్కున్న ప్రేరణ రెండే ఒకటి చంపటం రెండు చావడమని సైకాలజి చెబుతూంది.

ఇదెక్కటి పంచాయితిరా బాబు అని విసుక్కోకండి. సమాదానం తదుపరి పంక్తిలోనే ఉంది సుమండి!

చంపటం,చావడం అనే మాటను మీలాగే నేను సైతం తొలూత నిరాకరించాను. ప్రతి ప్రాణి ప్రతి క్షణం సర్వైవల్ కోసం తపిస్తుంటే ఇదేంటి చిత్రంగా అనుకునే వాడ్ని. కాని కాలక్రమంలో నా అనుభవాలు ఈ సత్యాన్ని అంగీకరించేలా చేసాయి. నూరు రూపాయలకు వారానికి పది రూపాయలు వడ్డీ వసూలు చేసే మని లెండర్స్ ఉన్నారు. వారు తమ వద్ద అప్పు తీసుకుంటున్న వారికి అప్పు ఇచ్చినట్టా చంపినట్టా? ఈ వడ్డీకి అప్పు చేసేవారూ ఉన్నారు. వారు అప్పు తీసుకున్నట్టా తమర్ని తాము చంపుకున్నట్టా?

జీవరాశుల్లో కేవలం ఈ చచ్చే చంపే కోరికలు మాత్రమే ఉన్నాయని చెప్పటం నా ఉద్దేశం కాదు. సర్వైవల్ instinct కూడ ఉంటుంది. ఒకే ఎలక్ట్ర్రాణిక్ పరికరంలో ఆన్ ఆఫ్ ఫెసిలిటి ఉన్నట్టే జీవరాశుల్లోను తమ ప్రాణాలను కాపాడుకోవాలన్న తపన ఉన్నట్టే ప్రాణాలు పోగొట్టుకోవాలన్న తపన కూడ ఉంటుంది. ఇది ఓకే.
మరి ఈ చచ్చే ,చంపే కోరికలు ఎందుకు పుట్టాయి. వీటి మూలం ఏది అని చాలా కాలం నాకర్థం కాలేదు.
ఇప్పుడు నేను చెప్పబోయే ( ఇది వరకే ఒక టపాలో ఈ విషయాన్ని ప్రస్తావించాననుకుంటా) విషయాన్ని సైకాలజి సరి కదా బాపలు ఆకాశానికి ఎత్తేసే పురాణాలు,వేదాల్లో సైతం లేదు. ఇది తనై నాకు స్ఫురించింది. ఇందుకు వీలు కల్పించిన నా సాధన మర్మాలను మరో టపాలోవివరిస్తా.

ఈ జీవరాశులన్నింటికి మూలం ఏక కణ జీవి అయిన అమీబా. అది బలిసి సెల్ కాపియింగ్ ద్వారా రెండుగా విడిపడింది. ఈ క్రమంలో కాపియింగ్ లో తారాసపడ్డ తప్పిదాల కారణంగా కొత్త జీవ రాశులు పుట్టుకొచ్చాయి. కోతి వచ్చింది. కోతినుండి మానవుడు వచ్చాడు.

ఒకే శరీరంగా, ఒకే ప్రాణంగా ఉన్నప్పుడు కాలం,దూరం, అబధ్రత, సమాచార లోపం వంటి ఏ సమస్యా లేదు. ఈ తియ్యని స్మృత్లులు సెల్ కాపియింగ్ ద్వారా సెల్ టు సెల్ కాపి అయ్యి ప్రస్తుతం మానవ మస్తిష్కంలోను ఆ స్మృతులు ఉన్నాయి.

సాటి జీవరాశులతో మమేకం అయితే కాని పునరేకీకరణ జరిగితే కాని తమలోని అబధ్రత పోదన్న తలంపు ప్రతి మానవుని మస్తిష్కపు పొరల్లోను దాగి ఉంది. ఇది మంచిదే. ప్రకృతిపరమైనదే.

అయితే ఇక్కడ చిన్న పొరభాటు జరిగి పోయింది . ఒకే ప్రాణం, ఒకే శరీరంగా ఉన్న తాము విడి పడడానికి, ఏకం కాలేక పోతుండటానికి తమ శరీరాలే కారణం అన్న అపోహ మనుషుల్లో వచ్చింది. ఈ శరీరాలనుత్యజిస్తే సాటి ప్రాణులతో ఏకం కావచ్చనే సబ్ కాన్షియల్ తపన మానవులను పై తెలిపిన చంపే చచ్చే కోరికల వైపుగా నెట్తింది.

జరుగుతున్న హత్యలు,ఆత్మ హత్యలను వార్తా పత్రికల్లో చదువుకుని .. షిట్.. ఇంత చిన్న విషయానికి హత్యా? షిట్.. ఇంత చిన్న విషయానికి ఆత్మ హత్యా అని ఎన్నో సార్లు ఆశ్చర్య పోయి ఉంటారు. అక్కడ కారణం అన్నది ఉత్తుత్తిదే. కేవలం ఒక సాకు మాత్రమే.

మనిషిలోని ప్రప్రథమ కోరికలు రెండే ఒకటి చంపటం రెండు చావడం.ఏ పని చేసినా ఇందులో ఏ ఒక్కటో నెరవేరాల్సిందే లేకుంటే ఆ పనే చెయ్యడు.

ఎన్నికల్లో గెలిచాక నియోజక వర్గ ప్రజలను పట్టించుకోకుంటే తదుపరి ఎన్నికల్లో తనను వారు రాజకీయంగా చంపుతారని ఎమ్.ఎల్.ఏ అభ్యర్దికి తెలియదా?

కేవలం ఒక చీర,మద్యం బాటిలు, ఐదొందలు తీసుకుని వాటిని ఇచ్చిన వానికి ఓటిస్తున్నామే అతను తమల్ని చంపుకు తింటాడని ఓటర్లకు తెలియదా?

మరి ఎందుకు ఇవి ఒకేలా జరిగి పోతున్నాయి. చచ్చే,చంపే కోరికలే వారిని ప్రేరేపిస్తున్నాయి. అందుకే వారిలా వ్యవహరిస్తున్నారు.

సూటిగా ఎదుటి వారిని చంపే దమ్ము,సత్తా,ధైర్యం ఉన్నవారు ఒక్క సారిగా చంపేస్తారు. సూటిగా తమల్ని తాము చంపుకునే దమ్ము,సత్తా,ధైర్యం ఉన్నవారు ఒక్క సారిగా ఆత్మ హత్య చేసుకుంటారు.

దమ్ము,సత్తా,ధైర్యం లేని వారు ఏం చెయ్యాలి? ఒకటి వాయిదాల్లో చంపుకోవాలి, వాయిదాల్లో చావాలి.( దీనినే మెజారిటి ఆఫ్ ది పీపుల్ చేస్తున్నారు) లేదా ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాలి. అదేమిటి ప్రత్యామ్నాయం?తన ప్రాణాల మీదికి తెచ్చుకోవడం లేదా ప్రజల ప్రాణాల మీదికి తేవడం.
చావుతో చెలగాటం ఆడటం.

ఇదెలా సాధ్యమండి బాబూ ఎవరన్నా కావాలని తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారా అని తొందర పడకండి. వస్తున్నా..

బోపాల్ లీకు మీ అందరికి తెలిసిందే. అదెంతటి ప్రమాదకరమో పాలకులు తెలియదా? మరెందుకు అనుమతించారు. ( ఇంకా ఇంకా అణు విద్యుత్ మీద ఆధారపడాలంటూ లెక్చర్లు వేరే దంచేస్తున్నారు. నిర్వాహకులకు తెలియదా? మరెందుకు నెలకొల్పారు. మరెందుకు అంత అజాగ్రత్తగా ఉన్నారు?

ప్రప్రథమ కోరికలు వారిని ప్రేరేపించాయంతే. సాధారణ జ్వరం,తలనెప్పి వచ్చినా పావలా అర్ద రూపాయి మాత్రలు మింగుతున్నారు, పవర్ ఫుల్ యాంటి బయాటిక్స్ వాడుతున్నారు. వారికి తెలియదా దీంతో తమ వ్యాధినిరోధక వ్యవస్థే కుప్ప కూలి పోతుందని?

త్రాగి డ్రైవ్ చేస్తున్నారు. నిద్ర మాని డ్రైవ్ చేస్తున్నారు. సెల్ ఫోన్ లో మాత్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు, హై స్పీడులో డ్రైవ్ చేస్తున్నారు. వారి తెలియదా? చస్తామని?

చంపటంతో ఏకం కావడం ఎమిటి ?ఇందుకు ఆధారమేదని మీరు అడగొచ్చు. మాంసాహారులు ఉన్నారు. చలి ప్రదేశంలో, పైరు పచ్చలు కరువైన ప్రదేశాల్లో బతికేవారు మాంసాహారులైతే దానిని పర్యావరణ ప్రభావం అనుకోవచ్చు. మరి అన్నీ సవ్యంగా ఉన్నప్పటికి మాంసాహారులుగా ఎందుకు కొనసాగుతున్నారు?

తాము తినే కోళ్ళు,మెకలు, గొడ్డులను చంపిన తృప్తితో పాటుగా వాటి మాంసాలను తమ మాంసంతో కలుపుకుంతున్న ఆత్మ సంతృపితితోనే మాంసాహారులు కొనసాగుతున్నారు. నిజానికి మాంసం ఇచ్చే ప్రోటీన్లను ఎ మాత్రం కొవ్వు పథార్థాల్లేకుండా సేఫ్ గా పొందే ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉన్నాయి. పప్పు దాన్యాల్లోను ప్రోటీనే ఉంది. మరెందుకు వారు పప్పు దినుసులు వాడరు?

వీలైనంత కాలం జంతువులను చంపాలి , వాటి మాంసాన్ని తమ మాంసంతో ఏకం చేసుకోవాలి. తద్వారా జీవరాశుల సంఖ్యను భారిగా తగ్గించాలి. అప్పుడు అభద్రతా భావం పోతుందని ఒక అపోహ.
ఇటువంటి ఆలోచన తమ మస్తిష్కపు పొరల్లో దాగి ఉన్నాయన్న సంగతి కూడ తెలీదు పాపం.

సరే సెక్సుకి ఈ ప్రప్రథమ కోరికలకి ఏమిటి సంభంధమని మీరడగొచ్చు. చెబుతా..

పురుషుని కోణంలో:
వీర్య స్కలనం అయ్యేంత వరకు చంపే కోరిక నెరవేరుతుంది. స్కలనానంతరం చచ్చే కోరిక నెరవేరుతుంది
స్త్ర్రీ కోణంలో:
పురుషునికి వీర్య స్కలనం అయ్యేంత వరకు చచ్చే కోరిక నెరవేరుతుంది. స్కలనానంతరం చంపే కోరిక నెరవేరుతుంది

చచ్చే చంపే కోరికలు ఒకే చోట నెరవేరడం సెక్సులోనే సుసాథ్యం కాబట్టె మానవులకు సెక్సు పట్ల ఇంత మక్కువ ఏర్పడింది.

బుల్లి మరణం:
పైగా పురుషునికి వీర్య స్కలనం జరిగినప్పుడు శరీరంతో ఉన్న కనెక్టివిటి ఒక్క క్షణం పాటు కట్ అయి పూతుంది. ఈ స్థితిని ఆంగ్లంలో బ్లాక్ అవుట్ అంటారు. కాని నేను దీనిని బుల్లి మరణమనై వ్యవహరించ దలచాను. ( ఓషో పరిబాష ఇది)

చావడానికి ధైర్యం చాలని వారు సెక్సులో పాల్గొని బుల్లి మరణాన్ని పొందుతారు. పాము విషాన్ని సైతం తక్కువ మోతాదులో తీసుకుంటే కిక్ ఏర్పడుతుందట. అటువంటిదే ఇదీను. ఇక్కడ స్త్ర్రీ గురించి నేను ప్రస్తావించలేదు. ఎందుకంటే స్త్ర్రీకి వీర్య స్కలనం జరగదు. కాని భావప్రాప్తి కలిగినప్పుడు ఆమెకూ ఈ బుల్లిమరణం సుసాథ్యమే కాని స్త్ర్రీలలో అతి తక్కువ మంది మాత్రమే భావప్రాప్తి పొందుతారు. మరి బుల్లి మరణానికి సైతం అవకాశం లేని రతి పై
స్త్ర్రీకి ఎందుకు ఆసక్తి?

ఆమె గర్భవతి అయ్యే అవకాశం ఉన్నందున.. ఒకే శరీరంలో మరో పాణాన్ని అంటే రెండు ప్రాణాలు ఒకే శరీరంలో కలిగి ఉంటే వింత అనుభూతి కోసం భావ ప్రాప్తికి తావు లేని రతిని సైతం స్త్ర్రీ సహిస్తుంది. కనీశం నవమాసాల వరకైనా మరో ప్రాణాన్ని తనలో కలుపుకొని సంపూర్ణ ఏకీకరణలో ఒక్క అడుగు ముందుకేసిన ఆత్మ సంతృప్తి స్త్ర్రీకి కలుగుతుంది. అందుకే రతికి అంగీకరిస్తుంది.

ప్రేమ పేమ పేమ అని టైటిల్ పెట్టి ఇందాకా ప్రేమ ఊసే లేదని అలిగిపోకండి. సెక్సుకు డబ్బెలా ప్రత్యామ్నాయం అయ్యిందో మరో సందర్భంలో వివరిస్తా. ఇప్పుడు ప్రేమ కథకొద్దాం. ప్రేమతో రతి సంభవం. అదే ప్రేమ పై మానవావనికున్న ఆసక్తికి కీలక కారణం.

అందుకే తిండికి టికానా లేని వాడు, ప్లాట్ ఫారం ఎదవ, తలలో బుర్రలేని వాడు,అసలు తలే లేని వాడు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతి పనికిమాలిన వాడు సైతం ప్రేమించి తీరుతాడు. తానెందుకు ప్రేమిస్తున్నాడో కూడ తెలీదు పాపం. ఒకే శరీరం,ఒకే ప్రాణంగా ( అమీబా) నిశ్చింతగా ఉన్న స్థితిని మళ్ళీ పొందాలంటే అతను సాటి జీవరాశుల్తో కలవాలి. మానసిక ఆరోగ్యంతో ఉన్న పురుషునికి పురుషుని పై ఆకర్షణ కలగదు ( ప్రకృతి) దీంతో అతను స్త్ర్రీని ప్రేమిస్తాడు. కనీశం శారీరికంగానన్నా కలవ వచ్చని ఆ కలయక కొన్ని నిమిషాల పాటే అయినా వీర్య స్కలన సమయాన బుల్లి మరణం అతనికి సంభవిస్తుంది. పునరేకీకరణకు అడ్డంగా ఉన్న శరీరం గురించిన స్పృహ కొన్ని సెకండ్ల పాటన్నా అతనికి లేకుండా పోతుందిగా.

పైగా జీవ రాశులకు ప్రకృతి ఇచ్చిన అజెండా ఒకటే అది సంతతిని పెంచడం. అందుకే అందుకే తిండికి టికానా లేని వాడు, ప్లాట్ ఫారం ఎదవ, తలలో బుర్రలేని వాడు,అసలు తలే లేని వాడు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతి పనికిమాలిన వానికి వీర్యోత్పత్తి కలుగుతుంది. మరణ సందర్భంలో కూడ కొందరికి వీర్య స్కలనం జరుగుతుంది. ఎయిడ్స్ రోగులకు, మేంగో రైస్డ్ , వికలాంగుడు,పిచ్చివానికి సైతం వీర్యోత్పత్తి కలుగుతుంది అంటే దీనిని అర్థం చేసుకోవచ్చు.ప్రకృతి జీవరాశుల వద్దనుండి ఎదురు చూసే ఒకే ప్రక్రియ సంతానోత్పత్తి, సంతతి అభివృద్ది మాత్రమే.

రతి,సంతానోత్పత్తే ద్యేయమనుకుంటే పెళ్ళి చేసుకోవచ్చుగా? మరి ఈ ప్రేమా దోమా ఎందుకు? మానవుడు ఈ భూమ్మీదకు వచ్చినప్పుడు స్వచ్చమైన ఆత్మతో వస్తాడు. కాని దానిని క్రమేణా సమాజం చొప్పించే ఈగో కప్పేస్తుంది. కాలక్రమంలో తన సహజ స్వరూపాన్ని పూర్తిగా మరిచి పోయి సమాజం చొప్పించిన ఈగోనే తానై పోతాడు.

ఇది కృత్రిమంగా చొరబడింది కాబట్టి ఇది మోయలేని భారంగా తయారవుతుందు. ఈ ఈగో తొలిగితే కాని అతని ఆత్మ సౌందర్యం దర్శనమివ్వదు. ప్రేమలో ఇగో పూర్తిగా కరిగి పోతుంది. ఒకరికొకరు నువ్వు లేనిదే నేను బ్రతక లేను అని చెప్పుకున్నప్పుడు ఇద్దరికి ఈగో బెడద కాసింత తగ్గుతుంది. విజమైన ప్రేమలో ఇది పూర్తిగా తుడిచి పెట్టుకు పోతుంది. ఈగో తొలగగానే ఆత్మ దర్శనమిస్తుంది.

అందుకే ప్రేమిస్తున్నారు. కాని కొన్నాళ్ళకే ప్రేమ మెటాష్ అయి పోతుంది ఎందుకంటే కేవలం ఈగోనే తానని బతికిన వాడు ఈగో లేనిదే తనను చచ్చిన శవంగా ఫీలవుతాడు. మళ్ళీ ఈగో తెలత్తి ప్రేమ నాశనం అవుతుంది.

పెళ్ళి చేసుకుంటే ఈగో పెరిగి విశ్వరూపం దాలుస్తుంది. అందుకే పెళ్ళీళ్ళన్ని పెటాకులై పోతున్నాయి.
భూప్రపంచంలో జనాభాలో దాదాపు సెరి సగం ఆడవాళ్ళే ఉండగా తాను ప్రేమిస్తున్న ఒక్క వ్యక్తినే తాను ప్రేమించటానికి కారణం ఏమిటో ఏ పింజారి ఎదవకీ తెలీదు. ( నేను ప్రేమించిన వయస్సులో నాకూ తెలీదు – ప్రస్తుతం నా వయస్సు 43)
ఈ ప్రశ్నకు జవాబును తదుపరి టపాలో చూద్దాం

(సశేషం)

0 comments:

Post a Comment