క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday 26 May 2012

జగన్ను వెంటాడుతున్న వెంటాడుతున్న ఎన్.టి.ఆర్ ఆత్మ




ఎన్.టి.ఆర్ బతికి ఉన్న రోజుల్లో ఎంతటి మొండి ఘటంగా ఉండేవారో అందరికి తెలిసు . ఆయన జీవితంలో అన్నీ నల్లేరు మీద నడకగా సాగాయి.

ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవాలకు ఆయన పెట్టింది పేరు. నాటి ఇందిరమ్మను సైతం ముప్పై చెరువుల నీళ్ళు తాగించారు ఆయన. కాని చివరి గట్టంలో చంద్రబాబు వెన్ను పోటు ఉధంతం తరువాత ఆయన తలపెట్టిన "సింహ గర్జణ" అతని మరణంతో ఆగి పోయింది.

1994 ఎన్నికల్లో ఎన్.టి.ఆర్ రెక్కల కష్ఠంతో వచ్చిన అధికారాన్ని సొమ్మొక్కడ్ది సోకొకడిది చందాన చంద్రబాబు అనుభవించారు. అనుభవించడమే కాక ఎన్.టి.ఆర్ పథకాలన్నింటిని తుంగలో తొక్కారు. పైగా 1999 ఎన్నిక్కల్లో సైతం బా.జ.ప యొక్క రెండు శాతం ఓట్లతో రెండు శాతం ఓట్ల వ్యత్యాసంతో గట్టెక్కారు.

ప్రజలు బుద్ది చెపుతారులే అని వేచి ఉన్న ఎన్.టి.ఆర్ ఆత్మ ప్రతీకారంతో రగిలి పోయింది. వై.ఎస్.ఆర్ పై ఆవహించింది. వై.ఎస్.ఆర్ ప్రజా ప్రస్తానం చేపట్టడం -ఉచిత విద్యుత్ హామి ఇవ్వడం - లక్ష కోట్లతో జలయజ్నం మొదలు పెట్టడం అంతా ఎన్.టి.ఆర్ ఆత్మ అందించిన స్ఫూర్తితోనే జరిగాయన్నది నా విశ్వాసం.

మామూలుగా కాంగ్రెస్ కల్చర్ ప్రకారమైతే సి.ఎం అనే అతను ఇప్పటి కిరణ్లా బాత్ రూమ్ వెళ్ళాలన్నా అదిష్ఠానాన్ని అడిగి వెళ్ళవలసిందే.కాని వై.ఎస్.ఆర్ అత్యంత స్వేచ్చతో వయహరించ కలిగారు.ఇవన్ని చూస్తే ఎన్.టి.ఆర్ ఆత్మ అతనికి వెను దన్నుగా నిలబడిందేమో అనిపిస్తూంది.

పొరభాటుగా వై.ఎస్.ఆర్ అకాలమరణానికి గురయ్యారు గాని .. బతికి ఉంటే మాత్రం 2009 ఎన్నికల్లో పార్టికి సీట్లు తగ్గిపోవడంతో సోనియా వై.ఎస్.. పై పెత్తనం చెలాయించాలని చూసి ఉంటుంది. నేడు జగన్ ఎలా తిరగబడి కొత్త్తపార్టి పెట్టి తెలుగు గౌరవం - తెలుగువారి ఆత్మాభిమానాలే ద్యేయంగా పోరాడుతున్నారో ఈ పోరాటాన్ని వై.ఎస్. చేయవలసి వచ్చేది. దీనిని ముందుగానే ఉహించారో ఏమో కాని చిరంజీవిని పార్టిలోకి తేవాలని -భలాన్ని పెంచుకోవాలని స్కెచ్ వేసారు.

ముఖ్యంగా జగన్ విషయానికొస్తే జగన్ యాంటి కాంగ్రెస్ స్టాండ్ తీసుకోవడానికి దారి తీసిన సంఘటనలన్ని ఎన్.టి.ఆర్ జన్మించిన మే నెలలోనే జరుగుతుండడం విశేషం.

తెలంగాణ పర్యటన కొరకు మెహబూదాబాద్ వెళ్ళింది మే 28న , కోర్టుకు హాజరు కావల్సి ఉండటమూ మే 28 నే.. వై.ఎస్.ఆర్ ఎలా ఎన్.టి.ఆర్ మానవీయ పథకాలన్నింటి మరింత పదును పెట్టి అమలు చేసి ప్రజారంజక పాలన అందించి ఎన్.టి.ఆర్ కి అసలు సిసలైన వారసుడ్ని తనేనని నిరూపించారో అలానే జగన్ కూడ నిరూపిస్తారు. అందుకు కావల్సిన ఆత్మభలాన్ని -ఆశిస్సులను ఎన్.టి.ఆర్ ఆత్మ ప్రసాదిస్తుందని నేను విశ్వసిస్తున్నా.

2 comments:

  1. Eraa nuvvu vaanee putrudivaa... vesavi kaalalam lo chali manta vesukune moham nuvvu.

    ReplyDelete