క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday 27 May 2012

జగన్ లోపలికి - కాంగ్రెస్ (రాష్ఠ్ర్రం) వెలుపలికి


గత ఆదివారం, రాత్రి 7.20 నిమిషాలు జగన్ను సిబిఐ అరెస్టు చేసినట్టుగా జూపూడి ప్రభాకర్ మీడియాలకు తెలిపారు. ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ,పార్టికి ఉన్న ఏకైక స్టార్ క్యేంపెయినర్ జగన్ "లోపలి" కి వెళ్ళడం పాలక ప్రతిపక్షాలకు ,ఎల్లో మీడియాకు మహదానందాన్ని కలిగించి ఉండవచ్చు.

కాని వారు గుర్తుంచుకోవలసిన సంగతి ఒకటుంది. యుద్దరంగంలో ఉండి -పోరాడి గెలవడం రొటీన్. తను స్థూలంగా ప్రక్కన లేకనే కేవలం తన సంకల్ప బలంతో తన సైనికుల రక్తనాళాల్లో నూతనోత్తేజాన్ని నింపి విజయం సాధింఛేలా చెయ్యడం చరితాత్మకం.

ఇది తమిళనాట ఒక్క ఎం.జి.రామచంద్రన్ కే సాధ్యమైంది. అతను న్యూయార్క్ లోని బ్రూక్లిన్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా అతని పార్టిని కార్యకర్తలే గెలిపించారు.

అదే తరహాలో వై.ఎస్.ఆర్ అభిమానులు జగన్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఇరుముడించిన కసితో పట్టుదలతో పని చేసి ఉప ఎన్నికల్లో పాలక ప్రతిపక్షాలను మట్టి కరిపిస్తారు.

జూన్ 17 వ నాడు జరుగనున్నది కేవలం సూర్యోదయం కాదు. నవోదయం.శుబోదయం. జగన్ లోపలికి వెళ్ళాడని వికట్టహాసం చేస్తున్న మూర్ఖులారా.. ఇక కాంగ్రెస్ పార్టి రాష్ఠ్ర్రం విడిచి వెలుపలికి వెళ్ళి పోతుందన్న విషయాన్ని కూడ మీ డైరోల్లో వ్రాసి పెట్టుకోండి.

1 comment:

  1. దొంగ జాతంలో కృష్ణజన్మస్థానం అంత స్పష్టంగా రాసి వుంటే, ఏడుస్తావెందుకోయ్ మురుగూ? నీ జాతకం ఫలిచింది, వేసుకో ఇంకో రెండిడ్లీలు బకెట్ సాంబార్.

    ReplyDelete