క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Tuesday, 29 May 2012

అధినాయకుడ్ని ఉప ఎన్నికల జిల్లాల్లో నిషేదించాలి


బాలయ్య హీరోగా విడుదల కానున్న అధినాయకుడ్ని ఉప ఎన్నికలు జరుగునన్ను జిల్లాల్లో ఎన్నికల కమిషన్ నిషేదించాలి. బాలయ్య ఎన్నికల ప్రచారం గురించి మాట్లాడుతూ నేను వెళ్ళడం లేదు. అధినాయకుడ్ని పంపుతా అని చెప్పిన నేపథ్యంలో ఈ డిమాండు సహేతుకం -చట్టబద్దం.

ఎన్నికల్లో పార్టి అభ్యర్దులు ఖర్చు పెట్టే ప్రతి పైసాకి లెక్కలుండాలి. అది నిర్ణీత పరిమితిని మించకూడదన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. అధినాయకుడు సినిమాలో తె.దే.పా/ బాబులకు బాలయ్య భజన చేసి ఉంటారు. అలాంటప్పుడు ఆ సినిమాకు ఖర్చయిన సొమ్మును ఉప ఎన్నికల్లో పోటి చేస్తున్న తె.దే.పా అభ్యర్దుల ఎన్నికల వ్యయంగానే పరిగణించాలి.

ఈ విషయమై వెంటనే వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నేతలు స్పందించి ఎన్నికల కమిష్నర్ దృష్ఠికి తీసుకెళ్ళాలి.

(ఎన్.టి.ఆర్ అభిమానిని అయినప్పటికి ఆయన్ను దిక్కులేని చావుకు గురిచేసిన చంద్రబాబుకు వంతె పాడే బాలకృష్ణంటేనే పరమ చికాకు. బాలయ్య గురించిన నా అభిప్రాయాలను తెలుసుకోకోరితే ఇక్కడ నొక్కండి

3 comments:

  1. వాడిబొంద .. వాడికంత సీన్‌ లేదు. వాడు గొంతు చించుకున్నా రెండో రోజుకి బాక్సులు వాపసు. రండో చూడండో అని మొత్తుకుంటారు కొడుకులు. బాలయ్యని మామూలుగానే భరించడం కష్టం మళ్ళీ రాజకీయం తోడఒతే వామ్మో వాయ్యో .. జరిగే అనర్ధాన్ని ఎవరూ ఆపలేరు

    ReplyDelete
  2. వీడి బొంద, ఈ బండ వాడి గురించి ఒక టపా దండగా..నా కామెంట్ అంతకన్నా దండగా.వీడు, వీడి సినిమా YSR కాంగ్రెస్స్ కి కాలి మీద దుమ్ముతో సమానం. వాళ్ళసలు పట్టించుకోరు.మీకు ఎందుకు ఈ బాధ..

    ReplyDelete
  3. మీ అభిప్రాయాలను ఆఫర్ చేసినందుకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా తెలుసుకోవాలని కుతూహలం లేదు.
    అధినాయకుడు సినిమాని నిషేధించినా ఆశ్చర్యపో నవుసరం లేదు.
    ఒకప్పుడు 'Wheel' వాషింగ్ పౌడర్ వాళ్ళ packets మీద చక్రం గుర్తు ఉందికాబట్టి దాని advertisements ని నిషేధించింది కాంగ్రెస్ పార్టీ. పాపం అలా యెందులంటే జనతాపార్టీ గుర్తు చక్రం అనో ఆ గుర్తులో చక్రం ఉందో అని అట.

    ReplyDelete