
జగన్ ఆస్తులు అక్రమమా? సక్రమమా? అంటూ సి.బి.ఐ చేస్తున్న దర్యాప్తులో చిరు,చిద్దు,సోనియాలను కూడ ప్రశ్నించాలి. ప్రభుత్వ జీ ఓలతో లబ్ది పొందినవారినుండి జగన్ లాబపడ్డారు అన్నదే సి.బి.ఐ వాదన. జీ.ఓలు క్యేబినెట్ (ప్రభుత్వ) నిర్ణయం. వై.ఎస్.ఆరే సి.ఎం , ప్రభ్తువాధినేత. కాదనను.
అయితే ఇక్కడ చిన్న చిక్కొకటి ఉంది. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి " వై.ఎస్ రాష్ఠ్ర్ర ప్రజల సొమ్మును సోనియాకు దోచి పెడుతున్నారు" అని ఆరోపించారు. మరి ఆ చిరంజీవినే కాంగ్రెస్ పార్టిలో కలుపుకున్నారు కదా. దానర్థం ఏమి?
చిరును బైయట ఉంచితే మళ్ళీ మళ్ళీ అదే ఆరోపణలు చేస్తారన్న భయమా? ఆ ఆరోపణల్లో నిజం లేకుంటే కనీశం అప్పుడే - ఆరోపింఛినప్పుడే అతని పై సోనియా పరువు నష్ఠ దావా వేసి ఉండాల్సింది. వెయ్యలేదు సరికదా పార్టిలో కలుపుకున్నారు.
కలుపుకుంటే కలుపుకున్నారు కనీశం అప్పట్లో నేను చేసిన ఆరోపణ అవాస్తవం అని ఒక్క ముక్క చెప్పించారా? లేదు. పోని చిరంజీవి అయినా స్వచ్చందంగా నేనా మాట చెప్పాను కాని అది అవాస్తవం అని చెప్పి ఉండాల్సింది. చెప్పారా? లేదు.
అతన్ని-అలానే - కలుపుకుంటే దానర్థం ఏమి? వై.ఎస్. దోచి పెట్టారు అని అంగీకరింఛినట్టేగా? దోచి పెట్టినవాటిలో చిరంజీవికి కూడ భాగం కల్పించారో ఏం ఖర్మో? ఇవన్ని తేలాలంటే సి.బి.ఐ చిరంజీవి,సోనియాలను సైతం ప్రశ్నించాలి మరి.
ఇక చిద్దు అంటే ఎవరబ్బా అని ఆలోచించి స్పార్క్ అవ్వక తలపట్టుకున్నారేమో? చిద్దు అంటే చిదంబరం అన్న మాట . మన మాజి కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు + ప్రస్తుత కేంద్ర హోం శాఖా మంత్రి.
సి.బి.ఐ కథనం మెరకు
1. పై జీ.ఓలతో లబ్ది పొందిన వారి వద్దనుండి జగన్ తన కంపెనిల్లోకి పెట్టుబడులు పొందారు
2.తమ సొమ్మునే ఉత్తుత్తి కంపెనీల ద్వార విదేశాల్లోనుండి తన కంపెని షేర్ల అమ్మకం ద్వారా స్వదేశానికి తెచ్చుకున్నారు.
మొదటి వాదనలో లాజిక్ కొరబడుతూంది. అవినీతి చేసేవాడు - లంచం గుంజే వాడు ఎంతో కొంత గుంజుకుని బ్లాక్ ను ఎలా వైట్ చెయ్యాలని తన బాధేదో తాను పడతాడు.
అలా కాక తనకు "బేకారుగా" రావల్సిన సొమ్మును పెట్టుబడిగా స్వీకరించి దానికి డివిడెండ్లు పాడు పరదేశం అంటూ కట్టుకోవడానికి ఇష్ఠపడడు.
పోని తమ సొమ్మునే ఉత్తుత్తి కంపెనీల ద్వార విదేశాల్లోనుండి తన కంపెని షేర్ల అమ్మకం ద్వారా స్వదేశానికి తెచ్చుకున్నారు అనే సి.బి.ఐ వాదనను పరిశీలిస్తే తన సొమ్ముతో తన కంపెని షేర్లను అధిక దరలకు
( ప్రిమియం?) ఎవరైనా కొంటారా?
ఈ టెక్నికల్ గొడవ మనకెందుకు గాని.. చిద్దు వారి కథకొస్తాం. అప్పట్లో ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్న చిదంబరం గారి అనుమతులు లేనిదే -కేంద్ర ఆర్థిక శాఖ అనుమతులు లేనిదే విదేశాల్లోనుండి పెట్టుబడులు స్వీకరించడం అసాధ్యం - అసంభవం.
జగన్ ఉత్తుత్తి కంపెనిలు సృష్ఠించి మని లాండరింగ్ చేసుకుంటుందే ఆర్థిక శాఖ నిద్రపోయిందా? చిదంబరం గారు కళ్ళు మూసుకున్నారా? లేక అలా ఉండి పొమ్మని ఎవరైనా ప్రత్యేక సూచనలేమైనా ఇచ్చారా? ఈ విషయాలు తేలాలంటే సి.బి.ఐ చిదంబరం గారిని ప్రశ్నించాల్సిందే..
మంచిది.
ReplyDeleteమీరు న్యాయవ్యవస్థను ఆశ్రయించి మీ ఆరోపణ(ల)ను విన్నవించుకోండి.
మీ ఆరోపణలు సమంజసమైనవని న్యాయవ్యవస్థ భావిస్తే మీరు కోరినట్లే అవినీతిపరులని మీరనుకొంటున్నవారి పైనా తప్పక విచారణ జరుగుతుంది.
ఊరికే వీధినబడి వీరంగం వేయటం వలన యేమీ లాభం ఉండదు.
మీరు ఊరికే గందరగోళం సృష్టించి లాభం పొందాలనుకుంటే బోర్లాపడతారు.
మీ ధోరణి మీరు పెట్టుకున్న బొమ్మలలోని వ్యక్తులమీద అభిమానాన్ని చాటు తోంది కానీ ఒక భాధ్యతాయుత పౌరుడిలా మీరు వ్రాయటం లేదు.
ReplyDeleteమొత్తానికి మీ బ్లాగ్ మసాల ఎక్కువైనా సాంబారులా రుచి తక్కువై ఘాటేక్కువైంది. ఎగతాళిగా చెప్పట్లేదు చాలా ఎక్కువ విశ్లేషించి వ్రాసిన అంశాల్లో త్రాసు ఒకే వైపు తూగుతోంది.
జగన్ అర్రెస్ట్ సబబే, మీరు కోరుకున్నట్లు గడ్డి తిన్న ప్రతీ వెధవ ని అర్రెస్ట్ చేసి కక్కించాలి.
జీవితం లో మళ్ళీ తినకుండా నోరు కుట్టేయాలి.
బాసూ !
ReplyDeleteఇంతగా నేను / నా త్రాసు ఒక పక్క తూగడానికి కారణం ౯ నెల్ల విచారణలో ఏనాడూ పలుకరించని సి.బి.ఐ ఉప ఎన్నికల సమయాన జగన్ను అరెస్ట్ చెయ్యడం వల్లే.
విచారణ ప్రారంభించిన ఏ ౩ నెల్లకో అరెస్ట్ చేసి ఉన్నా లేదా ఉప ఎన్నికల ప్రచారం -పోలింగ్ పూర్తయ్యాక అరెస్ట్ చేసి ఉంటే ఇంతగా ఇరిటేట్ అయ్యి స్టాండ్ తీసుకునేవాడ్ని కానేమో?
ఈ దేశంలో ఇంకా మిగిలి ఉందంటే అది ప్రజాస్వామ్యమే దానిని కాపాడుకోవడం అవినీతి నిర్మూలణా తంతుకన్న ముఖ్యం.
అంటే ఇప్పుడు అరెస్ట్ చేయ్యోద్దంటే
ReplyDeleteఅవినీతి సొమ్ము క్వార్టర్లలో , పలావ్ పొట్లాలుగా మార్చి,వెయ్యినోట్లుగానూ చిల్లర విరజిమ్మి ఇంకో పది సీట్లు గెల్చుకొని, ప్రజలకి వాడి అవినీతిమీద మరింత అబిమానమున్నదని భ్రమ పడ్డాక అప్పుడా..?
చేతిలో అధికారమున్న ఏ వెధవా అర్రెస్ట్ కాడు. అందుకే వరసగా ప్రభుత్వాలు మారి కౌరవ సంతతి అంతా నాశనమవ్వాలని ఒక సామాన్య పౌరుడుగా కోరుకుంటున్నా.. నువ్వు కూడా కోరుకో బాసు !!