క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday 2 June 2012

జగన్ బెయిల్ నిరాకరణ: న్యాయ వ్యవస్థ పై మైండ్ గేమ్


సిబిఐ అదనపు జడ్జి కాసులకు కకృత్తి పడి గాలి కేసులో బెయిల్ ఇచ్చారు అన్నది ఒక అంశం. హై కోర్టు జగన్ కి బెయిల్ నిరాకరించడం , ఐదు రోజుల పాటు సి.బి.ఐ కస్టడికి అనుమతించడం వేరే అంశం. లాజికల్గా ఆలోచిస్తే ఇలానే అనుకోవాలి. అది సహేతుకమని కూడ అనిపిస్తుంది. ఈ రెండింటికి ఎక్కడా సంభంధం లేనట్టే అనిపిస్తుంది.

కాని కాంగ్రెస్ పార్టి గత చరిత్ర, సి.బి.ఐ పనితీరు, దాని పై కేంద్ర హోం శాఖకున్న ఆధిపత్యం ,కాంగ్రెస్ సి.బి.ఐని అయిన వారి విషయాల్లో కవచంగా, కాని వారి విషయాల్లో ఖడ్గంగా వాడుకుంటున్నా విదానాలను ఒక సారి పరిశీలించండి.

గాలి జనార్థన్ ఎవరు? బా.జ.ప నేత ,కర్నాటక మంత్రి. తన పార్టి అదిష్ఠానం పై తిరుగుబాటు చేసినతను. జైల్లో ఉంటూనే బా.జ.ప అభ్యర్దిని ఓడించిన సమర్థుడు. అతనికి బెయిల్ వస్తే - అతను భయిటకు వస్తే బా.జ.పా కు మరింత నష్ఠం - అక్కడ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్తుకు మరింత లాభం. జనార్థన్కు బెయిల్ రావాలని ప్రయత్నించింది కూడ ఒక కాంగ్రెస్ మంత్రియే. (ఏ.బి.ఎన్ కథనం ప్రకారం).

వారి ఉద్దేశం గాలి భయిటకొచ్చి బా.జ.పా అదిష్ఠానానికి మరింత తలనెప్పులు తేవాలన్నదే. బహుసా గాలిని కాంగ్రెస్ పార్టిలో కలుపుకునే ప్లాన్ కూడ ఉండి ఉండవచ్చు.

గాలి తొలూత ఈ ప్రపోజలుకు అంగీకరించి ఉండవచ్చు. ఒక కేసులో బెయిల్ రాగానే ఎలాగో ఒక కేసులో వచ్చింది కాబట్టి దాన్న్ ఆధారం చేసుకుని మరో కేసులో కూడ బయిట పడొచ్చులే అన్న అతివిశ్వాసంతో "వ్యూహాత్మకంగా" తాను ఇచ్చిన మాటను -అంటే కాంగ్రెసులో చేరడం -వెనక్కి తీసుకుని ఉండవచ్చు.

దీంతో వళ్ళు మండి పోయిన ఆ మంత్రియే ఈ భాగోతాన్ని సిబిఐ కి లీక్ చేసి ఉండవచ్చు. సి.బి.ఐ.వర్గాలు ఈ ఉదంతాన్ని ఏబిఎన్ కు లీక్ ( యధాప్రకారం) చేసి ఉండవచ్చు. గోరంత కొండంత చేసే ఏబిఎన్ తాటి కాయంత అక్షరాలతో - స్పెషల్ స్తోరీలతో సీన్ పండించింది.

నాకున్న అనుమానం ఏమంటే..

మే 12 న గాలికి ఇవ్వబడిన బెయిల్ అక్రమం - అన్న సంగతి సి.బి.ఐ కి కనీశం మే 18 లోపే నిర్ధారణ య్యుంటుంది. పోనీ మరో 6 దినాలు ఆలశ్యంగా అంటే మే 24 లోపన్నా రుడీ అయ్యుంటుంది.

ఈ విషయాలను హైకోర్టు దృష్ఠికి తీసుకెళ్ళడం -హై కోర్టు అధికారికంగా స్పందించడం - జడ్జి పై అఫిషియల్ దర్యాప్తుకు ఆదేశించడానికి మరో రెండ్రోజులు పట్టి ఉండేది. అంటే ఈ సెన్సేషన్ అంతా మే26 కే పూర్తి అయ్యుండాలి.

కాని జరిగిందేమి? మొన్న మర్డర్ కేసు నిందితుడు కె.ఎ.పాల్ కు అతను రాజకీయ పార్టి (?) అధ్యక్షుడు కాబట్టి, ప్రచారంలో పాల్గొనాలి కాబట్టి బెయిల్ వచ్చింది. నిన్న జగన్కు బెయిల్ ఇవ్వాలా వద్దా అనే విషయం పై హై కోర్టు తేల్చాల్సి ఉంది.

సరిగ్గా అదే రోజు ఎబిఎన్ ప్రత్యేక కథనాల జోరు - రోజంతటా కృత్రిమమైన ఆందోళన కరమైన డెవలప్ మెంట్స్ - పది నిమిషాల ముందు ఏబిఎన్ కథనం పై లగడపాటి స్పందించడం - మరో గంటకే విజయవాడలో దీక్షకు కూర్చోవడం.

ఇవన్ని చూస్తే జగన్ బెయిల్ పై తీర్పును ఇవ్వాల్సిన న్యాయ మూర్తి పై మానసిక వత్తిడి పెంచే ఎత్తుగడగానే కనిపిస్తున్నాయి. మైండ్ గేమ్.

లాజికల్గా ఆలోచిస్తే ఎన్నికల ప్రచారానికి అనుమతిస్తూ జగన్కు మద్యంతర బెయిల్ ఇవ్వడం వల్ల కొంపలు మునిగి పోవు. కత్రోచిలా జగన్ దేశం వదలి పారి పోడు. సిబి ఐ కస్టడికి ప్రచార గడువు పూర్తయ్యాక ఇచ్చినా అగ్రహారాలు కాలి పోవు.

కాని సతరు న్యాయ మూర్తిపై వత్తిడి తెచ్చేరు. "నువ్వు బెయిల్ ఇస్తే పట్టాభిరామ్లా నువ్వు కూడ కాసులకు కకృత్తి పడే బెయిల్ ఇచ్చావని ప్రజలు భావించే అవకాశం ఉంది" అని చెప్పకనే చెప్పేరు.

జగన్ తరపు న్యాయవాదులు ఈ అంశాలను క్రోడీకరించి సుప్రీం కోర్టులో మరో పెటిషన్ దాఖలు చేస్తే తప్పకుండా జగన్ కు ఇంటిరియం బెయిల్ వస్తుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన వచ్చు. వై.కా.పా విజయావకాశాలను ఇరుముడింప చెయ్యొచ్చు.






3 comments:

  1. కరడుగట్టిన క్రిమినల్ ముఠా ఆలోచనా సరళికి అద్దం పడుతోంది, మీ వ్యాసం.

    ReplyDelete
  2. మీరు నేరవిచారణా వ్యవస్థను, న్యాయవ్యాస్థను దేన్నీ వదలకుండా అన్నింటిమీదా మీ శైలి వింత రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు.

    వ్యవస్థలను కించపరచటం ద్వారా నేరస్థులను రక్షిద్దామని మీరు అనుకుంటూన్నట్లు తోస్తోంది. అది అసంగతం.

    విజ్ఞత ముఖ్యం.

    ReplyDelete