క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday 3 June 2012

ఓపెన్ హార్ట్ విత్ ఆర్.కె : జగన్ సింహనాదం

మన వారు ఏం చేస్తున్నారు అనడానికన్నా మన శతృవు ఏం చేస్తున్నాడన్నదే ముఖ్యం కాబట్టి ఏబిఎన్ పై ఒక లుక్కేసా.

ఏబిఎన్ ఎం.డి వేమూరి రాధాకృష్ణ దుబాయిలో ఒక మాటన్నారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్కి జగన్ని ఇన్వట్ చేశాడట. జగన్ రాలేదట.

పోనిలే అతని ఆశ ఎందుకు కాదనాలి. అందుకే ఈ ఓపెన్ హార్ట్ విత్ ఆర్.కె

( 2012 , జూన్ ,17 అనంతరం వై.కా.పా అభ్యర్దులందరు బంపర్ మెజారిటితో గెలవడం - కాంగ్రెస్ క్యేంపు ఖాళి కావడం - అసెంబ్లి సమావేశాలు పెడితే ఎక్కడ విశ్వాసం కోరాల్సి వస్తుందోనని -అసెంబ్లికి తప్పించుకుని కిరణ్ తప్పించుకుని తిరుగుతున్న తరుణం - అసెంబ్లిని ఫ్రీజ్ చేసి -భేరసారాలు నడిపి -తగిన సంఖ్య వచ్చాక అసెంబ్లి సమావేశాలు పెట్టుకోవచ్చని అదిష్థానం ఆలోచిస్తున్న వేళ -ఏబిఎన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్ .కె లో జగన్ పాల్గొంటే అదెలా ఉంటుందో ఇక చదవండి)

ఆర్.కె : నమస్తే ..ఓపెన్ హార్ట్ విత్ ఆర్.కె.కు స్వాగతం

జగన్: నమస్తే

ఆర్.కె: ముందుగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మీ పార్టి ఘన విజయం సాధింఛినందుకు శుభాకాంక్షలు

జగన్: థ్యాంక్స్ !

ఆర్.కె: ఉప ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ ,తె.దే.పా ఎమ్మెల్యేలంతా మీ భాట పడుతున్నారు. మీ తదుపరి మూవ్ ఎలా ఉంటుంది?

జగన్: మన ఆయుధాన్ని నిర్ణయించేది శతృవే

ఆర్.కె: అసెంబ్లిని ఫ్రీజ్ చెయ్యడానికి కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. మీరేంచేస్తారు?

జగన్:మా మీడియా సంస్థల ఖాతాలనే వారం రోజులకు మించి ఫ్రీజ్ చెయ్యలేక పోయారు. అసెంబ్లిని ఎంతకాలం చేయగలరు. ఈ దేశాన ఇంకా ఏ కోశానో న్యాయం మిగిలే ఉంది

ఆర్.కె: మీ అక్రమాస్తుల కేసులో..

జగన్: అవి అక్రమమో సక్రమమో కోర్టు తేల్చే ముందే మీకెందుకింత తొందర

ఆర్.కె: (తటపటాయిస్తూ) ఇట్సాల్ రైట్.. మీ ఆస్తుల పై కేసుల్లో బెయిలొచ్చింది. తదుపరి మీ మూవ్ ఏమిటి?

జగన్:ఇంకో కొత్త చార్జి షీట్ వేసి - దాని మీద అరెస్ట్ చేస్తారుగా?

ఆర్.కె: బహుసా అలా జరగదనుకుంటా.. సి.బి.ఐ.జె.డి లక్ష్మి నారాయణా వి.ఆర్ .ఎస్ కు అప్లై చేసినట్టు సమాచారం.

జగన్: సి.బి.ఐ ఏలికల పాలేరుగా ఉన్నంత కాలం ఈ లక్ష్మి నారాయణ పోతే ఇంకో వ్యక్తి వస్తారు.ఆయన అదే పని చేస్తారు

ఆర్.కె: నిజం చెప్పండి మీ నాన్న ద్వార మేళ్ళు పొందిన వారెవ్వరు మీకు మేలు చెయ్యలేదా?

జగన్: నాన్న మేళ్ళు చేసారు అంటే మీ ఉద్దేశం?

ఆర్.కె: అదే భూ కేటాయింపులు -రాయితీలు

జగన్: అవన్ని ఇచ్చింది రాష్ఠ్ర్రంలోకి కొత్త పరిశ్రమలు రావాలనే. వారికి ఆ మాత్రం బరోసా ఇవ్వక పోతే పొరుగు రాష్ఠ్ర్రాలు తన్నుకు పోతాయి. మళ్ళి మీరే రాష్ఠ్ర్రం విడిచి వెళ్ళిన పరిశ్రమలంటూ పెద్ద లిస్ట్ వేస్తారు గా

ఆర్.కె: అంటే మీ నాన్న హయాంలో ఇచ్చిన జి.ఓలన్ని సక్రమమే అంటారా?

జగన్:అక్రమమై ఉంటే ఈ పాటికి కిరణ్ సర్కార్ రద్దు చేసి ఉండేది కదా?

ఆర్.కె: మీ కంపెనిల్లోకి వచ్చిన పెట్టు బడులంతా మీ నాన్న ద్వార మేళ్ళు పొందిన వారే పెట్టారని ఆరోపణలున్నాయి.

జగన్: అవి అవినీతి సొమ్ములంటారా? అలాగే అనుకున్నా ఎవడన్నా లంచాలకు డివిడెండ్లు ఇస్తారా?

ఆర్.కె: విదేశాల్లోనుండి మీ సొమ్మునే తెప్పించి మీ కంపెనీల్లో..

జగన్: విదేశాల్లో సొమ్మే ఉంటే దానిని మన దేశానికి తరలించే అవకాశమే ఉంటే దర్జాగా తెప్పించుకుని ఎంజాయి చేస్తాను కదా? నా డబ్బుతో షేర్ విలువతో ప్రిమియం కలిపి కొనాల్సిన ఖర్మ నా కేంటి

ఆర్.కె: ( ఎవరో ఎ.బి.ఎన్ ఉధ్యోగి తెచ్చిన స్లిప్ చూసి ) జగన్ ! మీకో శుభవార్త .. అసెంబ్లిని రద్దు చేసేరు. నాలుగైదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడ వెలుబడవచ్చు

జగన్: మంచిది. ఎని మోర్ క్వస్టియన్స్?

ఆర్.కె: నో..త్వరలో రాష్ఠ్ర ముఖ్యమంత్రి పదవిని కైవశం చేసుకో బోయే మీకు ఎ.బి.ఎన్ తరపున ముందస్తు శుభాకాంక్షలు

జగన్: థ్యాంక్స్

2 comments:

  1. బాగా వుంది. ఓపెన్ హార్ట్ విత్ ఆర్.కె: భారతమ్మ, షర్మిలమ్మ, విజయమ్మ, గాలి సింహంలను వూహిస్తూ రాయండి.

    ReplyDelete