క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Monday 4 June 2012

ఆజాద్ బయ్యా ! ఇదేమిటయ్యా?


ఆజాద్ అంటే స్వతంత్రుడని అర్థం. ఏం చేద్దాం అయన పరిస్థితి సోనియా ఇంటి పెంపుడు కుక్క కన్నా దయనీయం.

ఆజాద్ మొఖం చూసి ఆంథ్రులు ఓటేస్తారని సోనియా అనుకుంటే అది ఆమె ఖర్మ.2004 ,2009 ఎన్నికల్లో ఆజాద్ అనే సున్న రాజన్న అనే నెంబర్ వన్ కి కుడి వైపుండే .కాసింత విలువ దక్కే.
ప్రస్తుతం గుండు సున్నలైన కిరణ్,బొత్సా,చిరంజీవిల ప్రక్కన నిల్చుంటే ఏమొస్తుంది నా బొంద.

రాష్ఠ్ర్రాల్లో బోని కాక -చెప్పు దెబ్బలు తిని డిల్లి చేరిన నేతలే సోనియా చెంత ఉంటారు. లేదా ఈడ్ని రాష్ఠ్ర్రంలో పెడితే పార్టికి దెబ్బనిపిస్తే అప్పుడు కేంద్ర రాజకీయాల్లోకి లాక్కుంటారు ఇది దిల్లి రాజకీయం.

ఆజాద్ ఏమన్నారో - సత్యం ఏమిటో ఈ టపాలో పాయింట్ టు పాయింట్ చూద్దాం. ఆజాద్ ప్రసంగ వార్త నమస్తే అమెరికా సౌజణ్యంతో http://namastheamerica.com/?p=13018

//జగన్‌ స్వార్థం వల్లనే ఉప ఎన్నికలు వచ్చాయి//
నీ ఎంకమ్మా! నువ్వేగా వాగావ్. జగన్ కాంగ్రెస్ ఉండి ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవాడని - సంవత్సరానికి ముఖ్య మంత్రి అయ్యేవాడని . మీ ఇవ్వ చూపిన పదవులను కాదని భయిటకు రావడం స్వార్థం ఎలా అవుతుంది

// కాంగ్రెస్‌ పార్టీ జగన్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందన్న జగన్ పార్టీ నేతల ఆరోపణల్లో నిజం లేదు//
నీ పాసు గాలా! దేశంలో 80 మంది ఎం.పిల మీద కేసులున్నాయి. వారందర్ని రేపు కోర్టుకు హాజరు కమ్మని సమ్మన్ ఇచ్చి ఈ రోజు అరెస్ట్ చేసారా? జగన్ మాత్రమే మీ దృష్ఠిలో దోషా? ఇది ప్రతికారం కాదా?

//తప్పు చేసిన వారందరినీ జైల్లో పెట్టాం//
అచ్చు తప్పు. సోనియాను పెట్టలేదుగా? స్పెక్ట్ర్రం కుంభకోణంలో 60 పైసల వాటా సోనియాకే దక్కిందని సుబ్రమణ్యం స్వామి చెబుతున్నారుగా?

//కేంద్రంలో, రాష్ట్రంలో మా మంత్రులను జైల్లో పెట్టాం//
మేడామ్ గారికి వాటా ఇవ్వకుండా అంతా మెక్కేసారని పెట్టారేమో? ఒక సారి మేడమ్ గార్ని అడిగి క్లియర్ చేసుకో

//తప్పులు చేసి కోట్లు దోచుకున్న జగన్ ను జైలుకు పంపాము//
మీ సి.ఎం ఏమో జగన్ అరెస్టుకు కాంగ్రెస్ పార్టికి సంబందం లేదంటున్నారు. నువ్వేమో ఇలా అంటున్నావు. జగన్ తప్పు చేసింది లేనిది ప్రజలు తేల్చాలి .లేదా కోర్టులు తేల్చాలి.

అయినవారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నది కాంగ్రెస్ సిద్దాంతం అని అందరికి తెలుసులే. కొత్తగా ఎందుకు చంకలు గుద్దుకుంటున్నావ్

// తండ్రి వైఎస్‌ శవం పక్కన పెట్టుకుని జగన్‌ సీఎం కావడం కోసం సంతకాలు సేకరించారు//
బొత్సా ఏమో తండ్రి వెళ్ళిన చాపర్ మాయం కాగానే అన్నారు. నువ్వేమో శవాన్ని పక్కన పెట్టుకుని అంటున్నావ్. ఏమిటి ఈ కాంట్రాడిక్శన్ కోర్టుకు వెళ్తే సాక్ష్యం కొట్టేస్తారు.

అసలు ఆ రోజు సంతకాలు సేకరించింది బొత్సానేకదా? బొత్సాను కూడ జైల్లో పెడ్తారా కొంప దీసి

// సీఎం కావడానికి జగన్‌కు ఏ అర్హత ఉందో చెప్పాలి//
నీ దుంప దెగ మీరు ఏరి కోరి సి.ఎం చేసిన రోశయ్య,కిరణ్లకు లేని అన్ని అర్హతలు జగన్ కున్నాయి. ఇంత ఏల మీ భావి పి.ఎం (?) రాహుల్కు లేని అన్ని అర్హతలు జగన్ కున్నాయి

//జగన్‌ అవినీతిపై ఎందుకు దర్యాప్తు చేయకూడదు//
ఇక్కడ మేమెవరము దర్యాప్తు చెయ్యకూడదని చెప్పడం లే. మీ జీవిత కాలమంతా దర్యాప్తు చేసినా పొడిచేది ఏముండదు . ఇంకా జగన్ నిర్దోషి అని తేలుతుందంతే. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననీయకుండా కుట్ర చేస్తున్నారనే ఆరోపిస్తున్నాం.

// తండ్రి తరువాత కొడుక్కి రాజ్యం రావడానికి ఇది రాజరికం కాదు//
అంటే రాహుల్ని ప్రధాని చేస్తామని రోజూ తెగ వాగేస్తుంటారే మీ నేతలు. కేంద్రంలో మాత్రం రాజరికం పెట్టుకున్నారే ఏమి?

//ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆదరిస్తేనే పదవులు వస్తాయని ఆయన చెప్పారు//

ఈ మాట చెప్పడానికి నువ్వేనా మొగోడు. మా జగన్కు ప్రజాధరణ మస్తుగుంది. అది మరీ ఎక్కువ కావడంతోనే మీరిలా ఆయన్ను జైల్లో పెట్టేరు

// దివంగత వైఎస్‌ హయాంలో అమలు చేసిన పథకాలన్నీ కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోనివే//
ఆజాదూ .. నీ జాదూలన్ని మాతో పని చెయ్యవు నైనా.. పథకాలు మీవే అయితే కాంగ్రెస్ పాలించిన అన్ని రాష్ఠాల్లోను అమలు చేసి ఉండాలిగా.
మీ మేడమ్ గారు అధ్యక్షురాలుగా ఉన్న ప్ర్ణణాళిక బోర్డు నెలకు మూడు సార్లు రైతులకు ఉచిత విద్యుత్ పీకెయ్యమని తాఖీదులిచ్చిన మాట మరిచామనుకున్నావేమో?

//ఆ మేనిఫెస్టోలోని పథకాలనే సీఎం కిరణ్‌ అమలు చేస్తున్నారు//
ఈ మాట మాకు తెలీదు కాని మా రాజన్న పథకాలన్నింటికి తూట్లైతే పొడిచారు. నువ్వేమి బెంగ పెట్టుకోకు నాయనా. డిల్లి వెళ్ళి చల్లగా ఉండు. ఇక జీవితంలో నీకు ఆంథ్రా టూర్ నై నై..

2 comments:

  1. మురుగన్న, ఆజాద్ జాతకంలో శని గ్రహాన్ని సాడేసాథ్ వచ్చేలా జరిపేయ్.

    ReplyDelete
  2. జగన్ కష్టాలన్నీ సెప్టెంబర్ 5 వరకే అన్నారు, ఏ సంవత్సరం వరకూ?

    ReplyDelete