ఇటు రాష్ఠ్ర్ర్రంలో అటు కేంద్రంలో కొలువున్న యు.పి.ఏ మరియు కాంగ్రెస్ ప్రభుత్వాలు కుప్ప కూలనున్నాయి. ఈ ప్రభుత్వాలు ప్రజలను పెడుతున్ననరక యాతనలకు తెర పడనుంది. ఉప ఎన్నికలు జరుగనున్న 18+1 నియోజక వర్గాల్లో ఒకటి /రెండు శాసన సభ నియోజకవర్గాలు తప్ప 16+1 వై.ఎస్.ఆర్ సి.పి కైవశం చేసుకోవడం తద్యమైంది.
జగన్ అరెస్టు - ఇద్దరు కాంగ్రెస్ ఎమ్.ఎల్.ఏలు జగన్ పక్షాణ చేరడం -విజయమ్మ,షర్మిల ప్రచార హోరు -సి.బి.ఐ కస్టడి పొడిగింపు - మీడియా ద్వార ప్రచారానికి అనుమతి నిరాకరణ ( జడ్జిమెంట్ డిలేడ్ ఈజ్ జడ్జిమెంట్ డెనీడ్) వంటి పరిణామాలు వై.కా.పా విజయావకాశాలను మరింత పెంచాయి. రుడీ చేసాయి.
ఓటర్లు పూర్తి అవగాహణతో ఉన్నారు.
కేంద్రంలోని యు.పి.ఏ ప్రభుత్వ దూకుడుకు ముక్కుతాడు వెయ్యకుంటే తమ జీవితాలు కుదేలవుతాయన్న భావాన్ని బాహుటంగానే చెబుతున్నారు.
సామాన్య ప్రజకు మన్మోహన్ సింగ్ మాజి ప్రపంచ బ్యాంకు ఉధ్యోగస్తుడని -ఇప్పటికీ అతనికి ప్రపంచ బ్యాంకు పించను అంద చేస్తూందని తెలియకున్నా - అమెరికాకు దాసోహమంటూ దేశ సార్వ భౌమత్వాన్ని సైతం నైవేద్యమిచ్చిన మాట తెలియకున్నా మండుతున్న దరలే వారి కొలబద్దం.
కేవలం మన రాష్ఠ్ర్ర ప్రజలే కాదు ఇటీవల ప్రతి రాష్ఠ్ర్రంలో జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో కూడ ఓటర్లు ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
ఎన్.టి.ఆర్ నాడు తెలుగు ఆత్మ గౌరవ నినాదంతో ప్రజల్లోకి వెళ్తే ఎటువంటి స్పందన -భూం వచ్చిందో అదే స్థాయిలో "వేవ్" కనబడుతూంది.
అప్పట్లో సి.ఎంల మార్పిడి , కాంగ్రెస్ దివాళా కోరు విదానాలతో ప్రజలు ఎంతగా విసిగిపోయారో అంతగా విసిగి వేసారి ఉన్నారు. వై.ఎస్. ఉన్నంత కాలం అతనికున్న చరిస్మా కారణంగా సోనియా విదేశీయత, యుపిఏ వన్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి పెద్దగా వెళ్ళలేక పోయాయి. కాని నేటి సి.ఎం కిరణ్ కి అంత సీన్ లేదు.
అతనికి ప్రజల మద్య ఎటూ విశ్వసనీయత -గౌరవం లేదన్నది జగత్ప్రరిద్దం. కాని పార్టి వర్గాల్లో , అధికారుల మద్య , చివరిగా సహచర మంత్రుల మద్య కూడ కిరణ్ పట్ల ఏ మాత్రం నమ్మకమో గౌరవమో లేక పోవడం గమనార్హం.
జగన్ను ఎలాగన్నా అనగతొక్కాలని అదిష్టానం మొదలు పెట్టిన డ్రామా చివరికి రాష్ఠ్ర్ర కాంగ్రెస్ డ్రామా కంపెనికే పెనుముప్పై పరిణమించినా అదిష్ఠానానికి కిరణ్ పల్లెత్తి ఓ మాట చెప్పలేక పోయారు. ఆ ఉచ్చులో తగులుకున్న ఐ.ఏ.ఎస్లను మంత్రులనే వారి ఖర్మలకు వారిని వదిలేసిన తీరు ఒకటి చాలు.. కిరణ్లో నాయకత్వ లక్షణాలు ఎలా ఏడ్చాయో చెప్పటానికి.
ఇదీ కాక "మీ సేవ" ప్రారంభోత్సవంలో ఉధ్యోగస్తులందరిని లంచ కుండీలుగా అభివర్ణించడం వారి మద్య ఎనలేని అసహనాన్ని ఏర్పరచింది.అంతటి ప్రజాధరణ ఉన్న ఎన్.టి.ఆర్ సైతం ఎన్.జి.ఓల విషయంలో కంగు తినాల్సి వచ్చింది. కిరణ్ ఎంత?
మొత్తానికి మంగళవారం జరగనున్న ఉప ఎన్నికల్లో ఓటర్లు ఈ రెండు ప్రభుత్వాలకు మంగళం పాడనున్నారు.
కేంద్రంలోనైతే యుపిఏ ప్రధాన మిత్ర పక్షాలన్ని ఎడ మొఖం పెడ మొఖంగా ఉన్నాయి. డి.ఎం.కె అధినేత కరుణానిధి అగ్గి మీద గుగ్గిలమై ఉన్నారు. తన ముద్దుల కూత్రు కనిమోళికి ఒక నీతి -రాజాకు ఒక నీతి - చిదంబరానికి మరో నీతి అంటూ లో లోపల రగిలి పోతున్నారు. తాను గుడ్ బై చెబితే ఎక్కడ జయ ఎంట్రి అయిపోతుందోనన్నది ఆయనకున్న ఏకైక అనుమానం.
కాని జయతో ఏగడం నాడు వాజ్ బేయికే సాధ్యం కాలేదు. సోనియా ఆమెను భరించడం అసాధ్యం అన్న సంగతి అతనికి ఇంకా అవగతం కావడం లేదు.
అటు మమతా బ్యానర్జి , ఇటు శరత్ పవార్ యుపిఏను విడనాడడానికి కారణాలు వెతుకుతున్నారు. సి.బి.ఐ "వనుకు"తో మాయావతి - మాయావతి ప్రాధన్యతను తగ్గించడానికి ములాయం డ్రామాలు నడుపుతున్నారే కాని ఏ ఒక్కరు కూడ మనస్పూర్తిగా యుపిఏ కి మద్దత్తివ్వడం లేదు.
ఆంథ్రప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతైతే వీరంతా యుపిఏ పై మరింత ఒత్తిడి పెంచడం - యుపిఏ నుండి భయిట పడటానికి కారణాలు సృష్ఠించుకుని భయిట పడటం తప్పకుండా జరుగుతుంది.
బెస్ట్ ఆఫ్ లక్ జగన్ !
0 comments:
Post a Comment