క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Monday 11 June 2012

జగన్ (ఇమేజ్) పై హత్యాయత్నం


తన తండ్రి వై.ఎస్ మరణంతో ఇక తమకు దిక్కెవరని ఆందోళన చెంది ఆత్మ హత్యలు చేసుకున్నవారి కుటుంభాలను - హఠాన్మరణానికి గురైన వారి కుటుంభాలను - ఓదారుస్తానని ప్రజల్లోకి వెళ్ళిన జగన్మీహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మ రథం పట్టేరు.

అదిష్ఠానం ఉలిక్కి పడింది. అగ్గి మీద గుగ్గిలమైంది. ఆంక్షలు విధించింది.ఇచ్చిన మట జవదాటలేనని జగన్ తెగేసి చెబితే రెయిడ్లు చెయ్యించేరు.

తన తండ్రి వై.ఎస్.ఆర్ సంక్షేమ పథకాలకు తూట్లు పొడవద్దంటే -పేద విథ్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ నిదులు కేటాయించమంటే వారికి ఎక్కడో కాలింది.

రైతుకు గిట్టుపాటు దర కల్పించమంటే వారి వంటి పై నిప్పులు పోసినట్టైంది. జగన్ జల దీక్ష చేస్తే యాసిడుతో స్నానం చేసినంతగా ఒళ్ళు మండింది.

వారే కోర్టుకు లేఖ వ్రాయించేరు -కోర్టు సి.బి.ఐ ని ప్రాథమిక విచారణ చెయ్యమంది. ఇక్కడే సి.బి.ఐ ఓవర్ యాక్షన్ మొదలైంది.డైరక్షనేమో "పై వారిది"

అడిగిందే తడవుగా రిపోర్టు ఇచ్చేరు -(ఎన్నో కేసులు దశాబ్ద కాలంగా ప్రగాడ నిద్రలో ఉన్నాయన్న మాట అందరికి విదితమే)

కోర్టు వారు లోతైన దర్యాప్తుకు ఉత్తర్వులు ఇచ్చేరు. సి.బి.ఐ వారు ఎనిమిది నెలల కాలం తూ తూ మంత్రగా దర్యాప్తు చేసేరు.

ఆ ఎనిమిది నెలల కాలంలో -ఏ రోజూ విచారణకు సైతం పిలవక కాలం గడిపేరు.ఉప సమరంలో జగన్ చక్రం తిప్పుతుంటే తమ బాక్సులు బద్దలవుతాయని పై వారు వనికి పోయేరు. జగన్ పై దాడికి తమ రథ,గజ,తురక పథాదులను సిద్దం చేసేరు.

మే 28 న కోర్టుకు హాజరు కమ్మని సమన్లు అందాయి. ఆ లోపే మే 27 నాడే పైవారి ఆదేశాలనుసారం జగన్ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించేరు.

దేశంలో ఎందరో బడా నాయకుల పై సిబిఐ కేసులు నడుస్తున్నాయి. దేశంలోని వందా యాబై మంది ఎమ్.ఎల్.ఏలు,ఎం.పిల పై కేసున్నాయి. కాని ఎవరిని అరెస్టు చేసిన పాపాన పోలేదు.

వారి దృష్ఠిలో కేసులంటే అవి ప్రతిపక్ష నేతలను కట్టిడి చేసే అస్త్ర్రాలే . జగన్ పైకి విసిరేరు. జగన్ లెక్క పెట్టలేదు. లొంగ లేదు.

జగన్ ఏ మాత్రం సర్దుకుని నాన్న సంక్షేమ పథకాలు ఉంటే నాకేంటి పోతే నాకేంటి - పేద విథ్యార్థులకు ఫీజులు అందితే నాకేంటి -అందకుంటే నాకేంటి అని నోరు మూసుకుని ఉంటే ఆజాద్ చెప్పినట్టుగా కేంద్ర మంత్రి అయ్యేవారు - ఇంకా చెప్ప బోతే రాష్ఠ్ర్ర్ర ముఖ్యమంత్రి అయ్యేవారు.

కాని జగన్ " ఎన్నాళ్ళు బతికామన్నది ముఖ్యం కాదు ..ఎలా బతికామన్నదే ముఖ్యమంటూ " అన్నింటికి తెగించి అన్నీ భరించేరు.

సోమవారం నాడు సరిగ్గా వై.ఎస్. పై జరిగిన అదే కుట్ర జగన్ పై జరిగింది. కొత్త అగస్తా చాపర్ ఉండగా డొక్కు చాపర్లో పంపించి అతన్ని పొట్టన పెట్టుకున్నట్టే - జడ్ క్యేటగిరి సెక్యూరిటిలో ఉన్న జగన్ను - అతని బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కాకుండా డొక్కు బస్సులో కోర్టుకు తరలింఛేరు. వారి ఉద్దేశం "మరొకటి" కాదు కాబట్టి సరిపోయింది. వారి ఉద్దేశం జగన్ని అవమాన పరచడమే కాబట్టి సరిపోయింది.లేకుంటే ?????

జగన్ ఓర్పు నశించింది - న్యాయస్థానం దృష్ఠికి తీసుకెళ్ళారు- అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని చెప్పేరు - న్యాయమూర్తి ఆదేశాలతో బుల్లెట్ పౄఫ్ వాహనం వచ్చి ఆగింది.

ఒక ఎం.పి -ఒక పార్టి అధ్యక్షుడు -పైగా 8 నెలల కాలం దర్యాప్తు చేసినా కించిత్తు ఆధారమైనా చూపలేని పరిస్థితిలో "విచారణ ఖైదిగా " ఉన్న జగన్ను క్యారక్టర్ అసాసినేషన్ చేయ చూసిన సి.బి.ఐ ఓవర్ యాక్షన్ పై - పై వారి డైరక్షన్ పై ఓటరు తీర్పిచ్చే రోజు ఇదే . పై వారి ఆటలకు అడ్డుకట్ట వేశే రోజు ఇదే .

పోలింగ్ బూతులోకి వెళ్ళంటి పైకి చూడండి సీలింగ్ ఫ్యాన్ కనిపిస్తుంది. బహుసా పవర్ కట్టుతో అది తిరక్క పోవచ్చు. వోటింగ్ మెషిన్లో ఫ్యాన్ గుర్తు ప్రక్కన ఉన్న మీట నొక్కండి .సీలింగ్ ఫ్యాన్ గుర్తుకే ఓటెయ్యండి. వై.ఎస్. స్వర్ణయుగపు అభివృద్ది సంక్షేమాలకు భాటేయ్యండి.








3 comments:

  1. Very Nice one..Yes,people have to teach a lesson to evil of the century (Sonia + Kiran + CBN + Ramoji)..I believe in Indians..they will teach a lesson to this italin and yellow mafia

    ReplyDelete
  2. హ హ హ..బాగుంది. స్టొరీ, జగన్ కి వినిపిస్తే వాడు తిన్నదానిలో మీకు కూడా కొంత పారేస్తాడు.
    :venkat

    ReplyDelete
  3. తన తండ్రి వై.ఎస్ మరణంతో ఇక తమకు దిక్కెవరని ఆందోళన చెంది ఆత్మ హత్యలు చేసుకున్నవారి కుటుంభాలను - హఠాన్మరణానికి గురైన వారి కుటుంభాలను - ఓదారుస్తానని ప్రజల్లోకి వెళ్ళిన జగన్మీహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మ రథం పట్టేరు

    పిచ్చి పరాకాష్టకు చేరింది జనాలకి.మంచి ఆస్పత్రిలో చూపించుకోండి.

    ReplyDelete