క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday 15 June 2012

ముందుంది మరో సమరం !


ఉపఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి.పి ఘన విజయం ఒక ఎత్తైతే -తిరుపతి -ఆళ్ళగడ్డ విజయం బోనస్ వంటిది. పిల్లి సుబాష్ చంద్రబోస్ ఓటమికన్నా సురేఖమ్మ అపజయం (పదాల్లో తేడా చూడండి) ఇంకా మింగుడు పడటం లేదు. నెల్లూరు పార్లెమంటరి ఎన్నికల్లో విజయం సోనియాకు చంపె పెట్టు. తిరుపతిలో చిరంజీవికన్నా 3000+ మెజారిటి సాధించడం గొప్పే. ఇదిలా ఉంటే వై.ఎస్.ఆర్ .సి. పి వెను వెంటనే మరో సమరానికి సిద్దం కావల్సి ఉంది. అదే రాష్ఠ్ర్రపతి ఎన్నికలు.

గతంలో ఒక రాష్ఠ్ర్రపతి ఎన్నికలతో కాంగ్రెస్ ఇందిరా ఫ్యేమిలి గుప్పిట్లోకి వెళ్ళి పోయింది (కాంగ్ర్స్ సీనియర్ నాయకుల్ని కాదని వి.వి.గిరిని ఇందిర గెలిపించుకోవడంతో)

ఈ రా.ఎన్నికల్లో సోనియా అభ్యర్ధి అయిన ప్రణబ్ ముకర్జిని ఓడించ కలిగితే ఈ దెబ్బకి కాంగ్రెస్ ఇందిరా ఫ్యేమిలి చేతులనుండి పూర్తిగా భయిటపడినట్టే.

ఈ టార్గెట్టును రీచ్ అవ్వాలంటే విజయమ్మ,షర్మిల తరం కాదు. యు.పి.ఏ ,ఎన్.డి.ఏ కూటమి పార్టిలతో సంబంధం లేకుండా పై కూటముల్లో ఉన్న అసమ్మతి వర్గాలను ఏకతాటి పై నడిపింఛాలి అంటే అది ఒక్క జగన్ మాత్రమే చెయ్యగలరు.

కాబట్టి ఈ క్షణం నుండి జగన్ను జైల్లోనుండి భయిటకు తేవడమే ప్రప్రథమ కర్తవ్యం. వెంటనే వై.ఎస్.ఆర్.సి.పి ప్లీనరి సమావేశం ఏర్పాటు చేసి జగన్ విడుదలకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. దానికి అనుగుణంగా క్యేడరు మొత్తం పని చెయ్యాలి.

అలాగే ఆ లోపు ఈ విషయమై ( రా.ఎన్నికలు) జాతీయ /ప్రాంతీయ పార్టీలతో చర్చలు సంప్రదింపులు జరపడానికి ఒక చిన్న పాటి కమిటిని వేసుకుని ఆ కమిటి వెనువెంటనే టూర్ మొదలు పెట్టాలి. జగన్ విడుదలై వచ్చేంత వరకు జగన్ అందించే బ్లూ ప్రింటుతో చర్చలు సంప్రదింపులు చెయ్యాలి. కృషి ఫలించి జగన్ విడుదలైతే ఆ పనేదో జగన్ చేసుకు పోతారు. కమిటి అతనికి చేదోడు వాదోడుగా ఉంటే సరిపోతుంది.

ఆరు నూరైనా నూరు ఆరైనా సోనియా ప్రతిపాదించే అభ్యర్దిని ఓడించి తీరాలి. ఇది సాధ్యమైతే యు.పి.ఏ ప్రభుత్వం కూలడం -ఆటోమెటిగ్గా ఇక్కడి తొట్టి సర్కారు మట్టి కొట్టుకు పోవడం ఖాయం.



0 comments:

Post a Comment