
1.పార్టి కంటూ ఒక పత్రిక -ఒక టివి చానల్ ఏర్పాటు చేసుకోవాలి. సాక్షి దినపత్రిక/టివి చానల్లో పార్టి పత్రిక/చానల్ గురించిన ఒక యాడ్ తప్ప అవి తఠస్త మీడియాలుగా ప్రజల్లోకి వెళ్ళాలి. జగన్ జైల్లో ఉన్నప్పటికి ఖైదీలకు భయిటవారికి లేఖలు వ్రాసుకునే హక్కు ఉంటుంది కాబట్టి జగన్ కార్యకర్తలకు తన సందేశాలను లేఖల ద్వారా తెలియ చెయ్యాలి
2.పార్టి విధి విధానాలను - సిద్దాంతాలను పటిష్ఠంగా రూపొందించుకుని కార్యకర్తలకు నూరి పొయ్యాలి . ఏ సమస్యకన్నా -అది కాశ్మీర్ కావొచ్చు,తెలంగాణ కావచ్చు-ఏ సమస్యకన్నా పార్టి తరపున ఒక అల్టిమేట్ సొల్యూషన్ను చూపాలి -మా విదానం ఇదని స్పష్ఠం చెయ్యాలి. సతరు పరిష్కారం కోసం చర్యలు తక్షణం ప్రారంభం కావాలి
3.వై.కా.పా రాష్ఠ్ర్ర పార్టి అయినప్పటికి జాతీయ రాజకీయాల్లో తన స్టాండ్ ఏమిటో స్పష్ఠం చెయ్యాలి. యు.పి.ఏ కు ఏ మాత్రం దగ్గరైనా "యాంటి డిల్లి -యాంటి సోనియా - యాంటి కాంగ్రెస్" బెల్ట్ పార్టికి దూరం అవుతుంది. ఎన్.డి.ఏ కు దగ్గరైతే "మైనారిటి బెల్ట్" దూరమవుతుంది. కాబట్టి మూడో ప్రత్యామ్నాయం పై దృష్ఠి పెట్టాలి . ఆ దిశగా చురుగ్గా ప్రయత్నాలు మొదలు పెట్టాలి.
4.ప్రపంచీకరణ,సరళీకరణ,ప్రైవేటికరణవంటి వాటితో ప్రజానీకం విసిగి వేసారి ఉన్నారు. వీటికి ప్రత్యామ్నాయం ఏమిటి? వీటి జోలికి పోకుండా అబివృద్ది ,సంక్షేమాలు ఎలా సాధ్యం ? ప్రభుత్వ నిర్వహణా వ్యయాన్ని సగానికి తగ్గించి - ప్రభుత్వ ఆదాయ వనరులకు గండి కొట్టే అవినీతిని అంతం చేసి - రెడ్ టేపిజాన్ని రూపు మాపి జనరంజక పరిపాలన ఎలా సాధ్యమో ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి.
5. విద్యుత్, ఇందన కొరతలు ఆర్థిక వ్యవస్థనే కకావికలం చేస్తున్నాయి. వీటికి ప్రత్యామ్నాయ వనరులను ఎలా గుర్తించడం - ఎలా అభివృద్ది చెయ్యండం అనే అంశం పై పార్టికి క్లారిటి ఉండాలి
( ఇంకా ఉంది)
0 comments:
Post a Comment