క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday 24 June 2012

మళ్ళీ సాక్షి మీడియా ఖాతాలు స్థంభన !


నిండా మునిగాక చలి ఏంటి అన్న చందంగా తన కుట్రలు ఒక్కొక్కటే భయిట పడుతున్న కొద్ది సి.బి.ఐ బరితహించి పోతూంది. ఒక సారి సాక్షి మీడియా ఖాతాలు స్థంభనకు పూనుకొన్నారు. హై కోర్టు చీవాట్లు పెట్టడంతో వెనక్కి తగ్గేరు.కాని ఏ పెద్దలు ఎటువంటి వత్తిడి పెట్టారో గాని .. మళ్ళీ ఖాతాల స్థంభనకు దిగేరు. ఈ విడత సాక్షి మీడియాకు జిల్లాల్లో ఉన్న ఖాతాలను స్థంభింప చేసేరు.

న్యాయ వ్యవస్థలో స్పీడు పెరిగాక సామాన్యుడికి సైతం కోర్టు పరిబాషలు ఇట్టే అర్థమై పోతున్నాయి. కొందరైతే ఐ.పి.సి సెక్షన్లను సైతం ఏకరవు పెట్టే పరిస్థితి ఉంది.

ఒక సారి హై కోర్టు కాదు ,కూడదన్న తరువాత మళ్ళీ అదే కార్యక్రమం పెట్టుకోవడం కోర్టు దిక్కారం కాదా అని వారు ప్రశ్నిస్తున్నారు. జగన్ నిర్ధోషిత్వాన్ని నిరూపించాల్సిన పని జగన్ తరపు లాయర్లది. జగన్ దోషి అని తేలితే శిక్షించాల్సింది కోర్టుల పని. ఎవరి పని వారు చేస్టే విమర్శలకు తావే లేదు.

సి.బి.ఐ అన్నది కేవలం ఒక దర్యాప్తు సంస్థ. దాని పని దర్యాప్తు చెయ్యడం. 9 నెలలుగా అదే పని చేస్తున్నారని మనమనుకుంటూ ఉంటే సి.బి.ఐ జె.డి ఆ పనిని గాలికొదిలేసి లీకు వీరుడై - ఒక రాజకీయ ప్రత్యర్దికంటే హీనంగా - జగన్ పరువును మంట కలపడమే పని అంటూ ఎంత కష్ఠించారో చూసాం.

ఎలాగూ సి.బి.ఐ గొంతుదాకా ఆరోపణల్లో ఇరుక్కుంది. కనీశం ఇప్పటికైనా ఓవర్ యాక్షన్ మాని -చేసేది తప్పుడు పనే అయినా -కనీశం అవి తప్పనిపించకుండా -ఒక పద్దతి ప్రకారం చేసుకునే ఉద్దేశం కూడ దానికి లేక పోయింది.

బహుసా సి.బి.ఐ కోర్టు ద్వారా ఆదేశాలు పొంది ఖాతాలు స్థంభింప చేస్తే ఇంతగా దానిని ఆడిపోసుకునేవారం కాదు కదా? ఎందుకీ తొందర పాటు? ఎందుకీ అత్యుత్సాహం? ఎవరిని సంతృప్తిపరచడం కోసం ఈ పాట్లు?

ఇప్పటికే జగన్ కేసును దర్యాప్తు చేసే నైతికత సి.బి.ఐ జె.డికి లేదంటూ గళం విప్పుతుంటే ఈ ఓవరాక్షన్ ఎందుకు?


ఎలాగూ సి.బి.ఐ "పెద్దల చేతిలో" ఆయుధంగా మారింది కాబట్టి ఆ పెద్దలనే సూటిగా ప్రశ్నిస్తున్నాను. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక - రాక్షసంగా జైల్లో పెట్టేరు. అయినా లాభం లెక పోయింది. భౌతికంగా అంతం చెయ్యాలనుకునేరు. కుట్రలు భహిర్గతం కావడంతో అదీ కాస్త అసంభవమైంది.

ఇప్పటికైనా నిజం తెలుసుకుని తోక ముడుస్తే కనీసం ప్రతిపక్ష హోదానన్నా మిగుల్తుంది. అలా కాక చేసిన తప్పులనే మళ్ళీ మళ్ళీ చేస్తూ పోతే ప్రజలు కాంగ్రెసుకు బొంత పెట్టడం ఖాయం.

ఇంతకీ ఓ పెద్దలారా !
మీ ఉద్దేశం కాంగ్రెస్ పార్టిని గట్టెక్కించడమా.. లేక జగన్ను గద్దెనెక్కించడమా? మీరేంచేస్తున్నారో కూడ మీకు తెలియడం లేదా? ఉప ఎన్నికల ఫలితాలు మీ మైండును బ్లాంక్ చేసి ఉన్నా ఫర్వాలేదు కాని సెప్టిక్ ట్యాంకు చేసినట్టుంది..

చంద్రబాల -జె.డి -ఆర్.కె కాల్ లిస్ట్:

ఒకటి రెండు రోజుల్లో తన/తమ కాల్ లిస్టులను భయిట పెట్టిన వారి పై పోలీసులకు ఫిర్యాదు చేస్తారట.. భయిట పడింది ఒక కుట్ర - భయిట పడింది ఒక నేరం.

నేరం గురించి -కుట్ర గురించి వివరణ ఇచ్చుకోవడం మాని దానిని భయిట పెట్టిన వారి పై ఫిర్యాదులు చేస్తే ఏమనుకోవాలి? రాజకీయ ప్రబుద్దులకు లంచాలు ఇచ్చి ట్రాప్ చేసే స్టింగ్ ఆపరేషన్లకే కోర్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్న సందర్భంలో వారికి కోర్టులో సైతం భంగ పాటు ఖాయం.



1 comment:

  1. eraa needenaa aa photo...?, jagan bhajana chesthunnanduku koradaa tho kottinchukodaaniki ninchunnattu undi. alaage undu koradaa thesthaa.

    ReplyDelete